స్వరూపానందస్వామిని కలవనున్న జగన్.. కారణం?
Publish Date:Jun 3, 2019
Advertisement
విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానంద స్వామిని ప్రత్యేకంగా కలవాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ నిర్ణయించారు. ఈ నెల 4వ తేదీన జగన్ విశాఖ పర్యటన ఖరారైందని సీఎం కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. రేపు సీఎం విశాఖ చేరుకొని స్వరూపానంద స్వామిని ప్రత్యేకంగా కలవనున్నారు. అనంతరం తిరిగి అమరావతి చేరుకోనున్నారు. మంత్రివర్గ విస్తరణపై కసరత్తు చేస్తున్న జగన్.. ముహూర్తంపై స్వరూపానంద సలహాలు, సూచనలు తీసుకోనున్నారని తెలుస్తోంది. దీంతో పాటు అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన తరువాత జగన్, స్వరూపానందను కలవలేదు. జగన్ ప్రమాణ స్వీకారానికి ముహూర్తాన్ని కూడా స్వరూపానంద పెట్టారు. ఈ నేపథ్యంలో ఆయన్ను కలిసి కృతజ్ఞతలు తెలియజేయాలని జగన్ నిర్ణయించుకున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/cm-jagan-to-fly-vizag-to-meet-swami-swaroopananda-39-87195.html
http://www.teluguone.com/news/content/cm-jagan-to-fly-vizag-to-meet-swami-swaroopananda-39-87195.html
Publish Date:Nov 27, 2026
Publish Date:Nov 27, 2026
Publish Date:Nov 25, 2026
Publish Date:Nov 25, 2026
Publish Date:Nov 25, 2026
Publish Date:Nov 24, 2026
Publish Date:Nov 24, 2026
Publish Date:Nov 23, 2026
Publish Date:Nov 23, 2026
Publish Date:Nov 23, 2026
Publish Date:Nov 23, 2026
Publish Date:Nov 22, 2026
Publish Date:Nov 21, 2026





