మహిళను కింద పడేసి కాలితో తన్నిన బీజేపీ ఎమ్మెల్యే
Publish Date:Jun 3, 2019
Advertisement
బీజేపీ పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఓ మహిళ పట్ల అమానుషంగా ప్రవర్తించారు. సమస్యల పరిష్కారం కోసం వచ్చిన మహిళపై నడిరోడ్డులో చేయిచేసుకున్నారు. గుజరాత్లోని నరోదా ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. తమ ప్రాంతంలో నీటి కొరత తీర్చాలని కోరుతూ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) మద్దతుదారు అయిన నీతూ తేజ్వానీ మరికొందరు మహిళలతో కలిసి బీజేపీ ఎమ్మెల్యే బలరామ్ తవానీ ఆఫీస్ వద్దకు వెళ్లారు. తమ సమస్యను వెంటనే పరిష్కరించాలని లేదంటే ఆందోళన చేపడతామని నీతూ ఎమ్మెల్యేను హెచ్చరించారు. దీంతో ఆగ్రహానికి గురైన బలరామ్ తవానీ, ఆయన తమ్ముడు ఆమెపై దాడికి దిగారు. ఎమ్మెల్యే ఆఫీసు బయటే నీతూపై వారు చేయిచేసుకున్నారు. ఆమె కిందపడిపోతే కాలితో తన్నుతూ అమానుషంగా ప్రవర్తించారు. నీతూ భర్తపైనా దాడి చేశారు. దీంతో నీతూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనలో ఆమె స్వల్పంగా గాయపడగా.. చికిత్స నిమిత్తం ఆసుపత్రిలో చేర్చారు. అయితే ఎమ్మెల్యే మహిళపై అమానుషంగా దాడి చేసిన ఘటనకు సంబంధించిన వీడియో.. ప్రస్తుతం సోషల్మీడియాలో వైరల్ అవడంతో బలరామ్పై విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో సదరు ఎమ్మెల్యే క్షమాపణలు చెప్పారు. ‘నేను భావోద్వేగాలను ఆపుకోలేను. ఘటనలో తప్పు నాదే. అయితే నేను ఉద్దేశపూర్వకంగా చేయలేదు. నా 22 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి ఘటన ఎప్పుడూ జరగలేదు. ఆ మహిళకు క్షమాపణలు చెబుతాను’ అని బలరామ్ తెలిపారు.
http://www.teluguone.com/news/content/bjp-mla-balram-thawani-thrashes-ncp-woman-leader-39-87199.html





