విజయసాయికి వైవీతో చెక్? జగన్ రెడ్డితో అక్కడే చెడిందా?   

Publish Date:Jun 24, 2021

Advertisement

విజయసాయి రెడ్డికి చెక్ పడినట్టేనా?  ఆ నేతను ఢిల్లీ పంపబోతోంది అందుకేనా? ఇదే చర్చ వైసీపీతో పాటు ఏపీ రాజకీయాల్లో జోరుగా సాగుతోంది.ఏపీ సీఎం జగన్ అక్రమాస్తుల కేసులో ఏ2గా ఉన్న విజయసాయి రెడ్డి.. వైసీపీలో నెంబర్ టూ స్థానంలో ఉన్నారని చెబుతారు. ఏపీ నుంచి వైసీపీ గెలిచిన తొలి రాజ్యసీటును విజయసాయికి ఇచ్చారంటే ఆతనికి జగన్ రెడ్డి.. ఎంత ప్రాధాన్యత ఇచ్చారో ఊహించవచ్చు. ఢిల్లీలో వైసీపీ వ్యవహారాలు, కేంద్రం పెద్దలతో డీలింగ్స్ అన్ని ఆయనే చూస్తారని చెబుతారు. కాని ఇప్పుడు సీన్ మారినట్లు కనిపిస్తోంది. కొంత కాలంగా జగన్.. విజయసాయి రెడ్డిని దూరం పెట్టారనే ప్రచారం జరుగుతోంది. ఎప్పుడూ జగన్ వెనుక ఉండే సాయిరెడ్డి.. ఇటీవల తాడేపల్లికి రాకపోవడంతో ఈ అనుమాలకు బలం చేకూరుతోంది.  విశాఖలోనూ గతంలో ఉన్నంతగా సాయిరెడ్డికి ప్రస్తుతం పట్టు లేదంటున్నారు. 

సీఎం జగన్ తనను దూరం పెట్టడం వల్లే విజయసాయి రెడ్డి ఇటీవల రెచ్చిపోయి ప్రకటనలు చేస్తున్నారనే టాక్ ఉంది. టీడీపీ నేతలను టార్గెట్ చేసి మళ్లీ జగన్ కు దగ్గర కావాలని సాయిరెడ్డి చూస్తున్నారని వైసీపీలోనే చర్చ జరుగుతోంది. అయితే ఇటీవల జరిగిన మాన్సాస్ ట్రస్ట్ విషయంలో విజయసాయి రెడ్డి చేసిన ప్రకటనలు, కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతి రాజును దొంగ అంటూ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. రాజుపై సాయిరెడ్డి చేసిన  కామెంట్లపై వైసీపీ నేతల్లోనూ అసంతృప్తి వ్యక్తమైందట. సాయిరెడ్డి వల్ల పార్టీకి చెడ్డపేరు వచ్చిందని కొందరు మంత్రులు అంతర్గత సంభాషణల్లో అంగీకరిస్తున్నారు. విజయసాయి రెడ్డి తీరుపై జగన్ కూడా గుర్రుగా ఉన్నారని తెలుస్తోంది. అందుకే ఆయనకు చెక్ పెట్టాలని డిసైడ్ అయ్యారని అంటున్నారు. అందుకోసమే ఆయనకు చెక్ పెట్టేలా మరో నేతను ఢిల్లీకి పంపించబోతున్నారని చెబుతున్నారు. 

ఢిల్లీలో రాష్ట్ర వ్యవహారాలు చక్కబెట్టేందుకు బలమైన వ్యక్తిని నియమించాలని సీఎం జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు ఈ బాధ్యతను వైసీపీ పార్లెమంటరీ పార్టీ నేత విజయసాయి రెడ్డి చూడగా.. ఆయన ప్లేస్ లో మరొకరిని నియమించబోతున్నారని చెబుతున్నారు. తన సొంతబాబాయి వైవీ సుబ్బారెడ్డిని ఢిల్లీకి పంపాలని జగన్ యోచిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. టీటీడీ ఛైర్మన్ గా ఉన్న ఆయన పదవీ కాలం ఇటీవలే ముగిసింది. పాలకమండలి స్థానంలో స్పెసిఫైడ్ అథారిటీని కూడా ప్రభుత్వం నియమించింది. తొలుత వైవీ సుబ్బారెడ్డి పదవీ కాలం మరో ఏడాది పొడిగిస్తారన్న ప్రచారం జరిగింది. కానీ స్పెసిఫైడ్ అథారిటీ ప్రకటనతో..  వైవీ సుబ్బారెడ్డిని రాజ్యసభ పదవిని కట్టబెట్టి ఢిల్లీకి పంపడం ఖాయమని తెలుస్తోంది. 

2014 ఎన్నికల్లో ఒంగోలు ఎంపీగా గెలిచిన  వైవీ సుబ్బారెడ్డి.. 2019 ఎన్నికల్లో తన సీటును వదులుకున్నారు. జగనే ఆయనను పక్కన పెట్టి.. కొత్తగా పార్టీలో చేరిన మాగుంటకు టికెట్ ఇచ్చారని అంటారు. ఎంపీ టికెట్ ఇవ్వకపోవడంతో అలకబూనిని వైవీకి.. వైసీపీ విజయం సాధించిన తర్వాత టీటీడీ ఛైర్మన్ గా నియమించారని చెబుతారు. ఇటీవలే ఆయన పదవి కాలం ముగిసింది. సీఎం జగన్ తనకు మరోసారి అవకాశమిస్తే పనిచేస్తానని.. లేదంటే లేదని  వైవీ సుబ్బారెడ్డి వ్యాఖ్యానించారు. అయితే విజయసాయి రెడ్డికి చెక్ పెట్టాలని భావిస్తున్న జగన్.. వైవీని రాజ్యసభకు పంపాలని దాదాపుగా నిర్ణయించారని సమాచారం. వైవీకే వైసీపీ పార్లమెంటరీ పార్టీ పగ్గాలు అప్పగించి.. విజయసాయి రెడ్డిని ఉత్తరాంధ్రకే పరిమితం చేయాలని జగన్ చూస్తున్నారట. జగన్ జైలుకు పోతే సీఎం కావాలనే ఎత్తులు వేస్తున్నారని ప్రచారం ఉన్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో విజయసాయి రెడి టచ్ లో ఉన్నారన్న విషయం కూడా జగన్ .. అతన్ని దూరం పెట్టడానికే కారణమనే వాదన కూడా వినిపిస్తోంది. 

మరోవైపు సీఎం జగన్ ఢిల్లీ పర్యటన ప్రతిసారి గందరగోళంగానే మారుతోంది.  ఆయన ఢిల్లీ వెళ్లడం వరకు అంతా బాగానే సాగుతున్నా.. కేంద్ర పెద్దలతో అపాయింట్ మెంట్ విషయంలో క్లారిటీ ఉండటం లేదు.  గతంలో ఓసారి ఢిల్లీ వెళ్లిన సమయంలో చివరి నిముషం వరకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పర్యటన ఖరారు లేదు. హస్తినలో వైసీపీ వ్యవహారాలు చూస్తున్న ఎంపీలు బలమైన లాబీయింగ్ చేయకపోవడం వల్లే ఈ పరిస్థితి వస్తుందనే భావనలో కూడా వైసీపీ పెద్దలు ఉన్నారంటున్నారు.  వైవీ సుబ్బారెడ్డితో ఈ సమస్య కూడా గాడిన పడవచ్చని జగన్ భావిస్తున్నారని చెబుతున్నారు.  

By
en-us Political News

  
దేశవ్యాప్తంగా నీట్ పరీక్షల నిర్వహణ, ప్రశ్నాపత్రాల లీకేజీ ఆరోపణలు తీవ్ర స్థాయిలో దుమారం రేపుతున్నాయి.
రాజకీయం గురించి కాదు. పార్టీ గురించి కాదు.ఒక నాయకుడి గురించి కూడా కాదు....ఒక తరం గురించి. విజృంభించిన లాఠీల్లో రక్తం చిందించిన ఈ తరం గురించి.
గతంలో అంటే వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు, దూషణలతో చెలరేగిన వల్లభనేని వంశీ తాజా లేఖలో మాత్రం చంద్రబాబుకు గౌరవం ఇస్తూ అయ్యా చంద్రబాబుగారూ అని మర్యాదగా సంభోధించారు. అంతే కాకుండా చంద్రబాబు చొరవను, రైతుల పట్ల ఆయనకు ఉన్న అక్కరనూ ప్రశంసలతో ముంచెత్తారు.
అధికారాన్ని అడ్డుపెట్టుకుని నిబంధనలకు తిలోదకాలిచ్చి.. ఇష్టారాజ్యంగా వ్యవహరించిన వైసీపీ ఇప్పుడు కేసుల చిక్కుల్లో నిండా ఇరుక్కుంది. అధికారంలో ఉండగా చట్టాలకు మనం అతీతులం అన్నట్లుగా వ్యవహరించిన వైసీపీ నేతలకు ఒక్కరొక్కరుగా పోలీసు కేసులను, సీఐడీ విచారణలను ఎదుర్కొంటూ, అరెస్టులు, బెయిళ్లు అంటూ న్యాయస్థానాల చుట్టూ తిరగాల్సి పరిస్థితిలో ఉన్నారు.
ఆయన రాజీనామాకు యువత పట్టుబడుతోంది. అయితే ప్రధాని నరేంద్ర మోడీ మాత్రం ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్న యువత డిమాండ్ ను పట్టించుకోవడం లేదు. నీట్ పై తొలి సారిగా స్పందించి, సోషల్ మీడియా వేదికగా న్యాయం చేస్తాననీ, లీకేజీ బాధ్యులను కఠినంగా శిక్షిస్తామనీ, అందుకోసం ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేస్తామనీ చెప్పిన మోడీ.. ధర్మేంద్ర ప్రధాన్ రాజీమానా చేయాలన్న యువత డిమాండ్ ను ఇసుమంతైనా పరిగణనలోకి తీసుకోలేదు.
గత ప్రభుత్వ హయాంలో ముంబైకి చెందిన నటిని, ఆమె కుటుంబ సభ్యులను అక్రమంగా అరెస్టు చేసి ఆంధ్రప్రదేశ్‌కు తీసుకురావడంపై విచారణ వేగం పుంజుకుందన్న ఆయన.. గతంలో ఎన్నికల కోడ్ అమలులోకి రావడానికి సరిగ్గా రెండు నెలల ముందు ముంబైలో ఉన్న కాదంబరి జత్వానీని, ఆమె తల్లిదండ్రులను ఏపీ పోలీసులు అరెస్ట్ చేసి.. ఫోర్జరీ భూలావాదేవీల కేసు సాకుగా చూపి దాదాపు 40 రోజుల పాటు జైలులో ఉంచారన్నారు.
గత ఎన్నికల్లో మంగళగిరి స్థానం నుంచి నారా లోకేష్ సాధించిన చారిత్రాత్మక విజయం ఆయనకు రాజకీయంగా పెద్ద మైలేజీని ఇచ్చింది. గతంలో ఓటమిని చవిచూసిన చోటే ఐదేళ్ల పాటు నిరంతరం ప్రజల్లో ఉంటూ, సమగ్ర ప్రచారంతో విజయం సాధించడం ఆయన రాజకీయ ప్రస్థానంలో ఒక కీలక మలుపుగా మారింది.
ఢిల్లీ పోలీసులు రాహుల్ గాంధీ పట్ల దురుసుగా వ్యవహరించి గాయపరచడాన్ని ఖండిచిన ఆయన రక్త గాయమైనా రాహుల్ గాంధీ వెనక్కు తగ్గకుండా పోరాట పటిమ చూపారని కొనియాడిన రేవంత్ రె్డి.. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే ప్రాథమిక హక్కులపై కేంద్రం ప్రత్యక్ష దాడికి పాల్పడిందని విమర్శించారు.
తోపులాటలో రాహుల్ గాంధీ గాయపడ్డారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ ముక్కు నుంచి రక్తం కారింది. పోలీసులు ఆయనను బలవంతంగా నిలువరిస్తున్న సమయంలో ఆయన ముక్కుకు గాయమై రక్తం కారుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో కనిపించాయి. దీనిపై సర్వ్రతా తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతోంది.
మద్యం కుంభకోణంలో ఈడీ విచారణ.. ప్రధాన లబ్ధిదారుడికి చేరువ అవుతోందనీ, ఈ నేపథ్యంలోనే జగన్ పేరు ప్రచారంలోకి వచ్చిందని అంటున్నారు. మద్యం కుంభకోణం కేసులో ఈడీ తనకు నోటీసులు పంపే అవకాశం ఉందన్న సమాచారంతోనే మోడీ, అమిత్ షాల అప్పాయింట్ మెంట్ కోసం జగన్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్లు పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
కాపు సామాజికవర్గ నేత, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు పార్టీ లైన్ ను ఇసుమంతైనా ఖాతరు చేయకుండా కాపు ఐక్యత జెండాను భుజానకెత్తుకోవడం పార్టీలో కలకలం రేపింది. ఒక వైపు వైసీపీ అధినేత జగన్.. అంబటి రాంబాబును పార్టీలో కాపు సామాజికవర్గ ఐకాన్ గా ప్రమోట్ చేస్తుంటే.. తోట త్రిమూర్తులు ముద్రగడ పద్మనాభం సంస్మరణ సభలను వేదిక చేసుకుని పార్టీలతీతంగా కాపు నేతలందరూ ఐక్యం కావాలని పిలుపునివ్వడం పార్టీలో కలకలం రేపింది.
ఎన్డీయేలో కీలక భాగస్వామిగా ఉన్న తెలుగుదేశం పార్టీ అధినేతగా, చంద్రబాబు ఇప్పుడు హస్తిన పర్యటనలో పార్లమెంటులో ఈ బిల్లుల ఆమోదానికి అవసరమైన మెజారిటీ కూడగట్టడం కోసం.. వివిధ పార్టీల నాయకులతో చర్చలు జరిపేందుకు ఆయన హస్తినకేగుతున్నారన్న చర్చ రాజకీయవర్గాలలో జోరుగా సాగుతోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.