LATEST NEWS
దేవాన్ష్ తో మోడీ ఫోటో ప్రెజంట్ సోష‌ల్ మీడియాలో  తెగ వైరల్ అవుతోంది. ఎందుకంటే ఫ్యూచ‌ర్ ఆఫ్ తెలుగుదేశం దేవాన్ష్ అన్న భావనే.   అరే బుడ్డోడా.. ఇప్ప‌టికే మీ తాత‌ను చూశాన్నేను.. మీ నాన్న‌తో కూడా  ప‌రిచ‌య‌మే. ఇక పోతే  నువ్వు,  రేప‌టి  రోజున నేను లేని రోజులు పార్టీలో ఎదురు కావ‌చ్చు. నువ్వు మాత్రం బీజేపీతో ఇలాగే క‌ల‌సి  న‌డువు. మా వాళ్ల‌తో మంచిగా ఉండు.. అంటూ మోడీ దేవాన్ష్ తో ముచ్చట్లు పెట్టినట్లు నెట్టింట్ బోలెడు పోస్టులు దర్శనమిస్తున్నాయి.  మాములుగా మోడీ  లోకేష్ తో క్లోజ్ గా ఉండే  ఫోటోల‌కే లెక్క‌లేన‌న్ని కామెంట్లు వ‌స్తుంటాయి. అలాంటిది లోకేష్ త‌న‌యుడికి కూడా మోడీ  ప్రాధాన్యత ఇస్తూ ప్రత్యేకంగా ముచ్చటించడం ప్రాథాన్యత సంతరించుకుంది. చంద్రబాబు, లోకేష్ తో పాటు నారా వారి ఇంట మూడో తరం పిల్లవాడు దేవాన్ష్ కు కూడా ప్రధాని మోడీ ఇంత ప్రాధాన్యత ఇవ్వడానికి కారణాలేంటంటూ.. నెటిజనులు పలు విధాలుగా స్పందిస్తున్నారు.   బేసిగ్గా మోడీ ప్ర‌స్తుత ప్ర‌భుత్వం తెలుగుదేశం 16 సీట్ల సాయంతో న‌డుస్తున్న సంగతి తెలిసిందే . అందుకే ప్రధాని మోడీ ఇప్ప‌టికే ఏపీకి ఎన్నో వ‌రాలు కురిపించేశారు.   తాజాగా గ‌త ప్రొటోకాల్ ను పక్కన పెట్టి మరీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ల నివాసాలకువెళ్లి మరీ వారి కోసం విలువైన సమయాన్ని వెచ్చించారు.  కాగా చంద్రబాబు నివాసానికి వెళ్లిన సమయంలో మోడీ చంద్రబాబు మనవడు, లోకేష్ కుమారుడైన  దేవాన్ష్ భుజంపై చేయి వేసి మ‌రీ ఫోటోల‌కు పోజులు ఇచ్చారు. ఇదంతా కూడా ఒక ఎమోష‌న్  బిల్డ‌ప్ లో భాగంగానే పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. మోడీ  ఒక ప్ర‌ధాన మంత్రి మాత్ర‌మే కాదు.. బీజేపీ ప్ర‌స్తుత అగ్ర‌నాయ‌కుల్లోనే  అగ్ర‌గామి. అలాంటి నేష‌న‌ల్ ట‌వ‌రింగ్ ప‌ర్స‌నాల్టీ.. ఒక బాలుడిని ఇంత‌గా ద‌గ్గ‌ర‌కు చేర్చుకోవ‌డం వెన‌క చాలానే అర్ధ‌తాత్ప‌ర్యాలున్నాయంటున్నారు.   ఇటు తెలంగాణ‌కు సంబంధించి.. రేవంత్ ని మా పార్టీలోకి వ‌చ్చేయ‌వ‌చ్చు క‌దా? అని చ‌మ‌త్క‌రిస్తూనే..  అటు ఏపీ పాలిటిక్స్ లో భాగంగా.. దేవాన్ష్ తో  ఫోటోలకు పోజులు ఇవ్వ‌డం వెనుక ఎంతో గూడార్థముందంటున్నారు.  ద‌క్షిణాదిలో నానాటికీ ప‌డిపోతున్న బీజేపీ గ్రాఫ్ ఇప్పుడు ఆ పార్టీ కేంద్ర నాయ‌క‌త్వంలో తీవ్ర చ‌ర్చ‌నీయాంశంగా మారింది. మోడీ ఇప్ప‌టి వ‌ర‌కూ ప్ర‌ధాన‌మంత్రి ప‌ద‌విలోకి వ‌చ్చి.. మొత్తం తొమ్మిది కొత్త రాష్ట్రంల్లో అధికారంలోకి తేగ‌లిగారు కానీ.. దక్షిణాదిలో మాత్రం బీజేపీ పరిస్థితి ఎక్కడ వేసిన గొంగటి అన్న చంద్రంగానే ఉంది.  పాండిచ్చేరి త‌ప్ప‌.. ఇక్క‌డ ఏ  రాష్ట్రంలోనూ బీజేపీ పెద్ద బలంగా లేదు.  ఏపీలో కేవ‌లం కూట‌మితో క‌ల‌సి అధికారంలో  భాగం పంచుకుంటోందంతే. ఈ రాష్ట్రంలో బీజేపీది చాలా చాలా చిన్న పాత్ర అయినా స‌రే అది త‌మ‌కెంతో విలువైన‌ది అని చాటడానికే ప్రధాని మోడీ దేవాన్ష్ తో చనువుగా ఉన్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
డీఎంకే  శాసనసభాపక్ష నేతగా ఆ పార్టీ యువజన విభాగం కార్యదర్శి, ఎమ్మెల్యే, మాజీ ఉపముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శాసనసభ్యుల ప్రమాణస్వీకారానికి ఒకరోజు ముందు అంటే నిన్న డీఎంకే ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. ఇక  డీఎంకే శాసన సభాపక్ష  ఉపనేతగా పార్టీ సీనియర్ నాయకుడు   కేఎన్ నెహ్రూ, పార్టీ విప్‌గా ఈవీ వేలు నియమితులయ్యారు.  అంతకు ముందు  డీఎంకే అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అధ్యక్షతన ఎమ్మెల్యేల  సమావేశం జరిగింది. కూటమిని వీడిన కాంగ్రెస్‌ను విమర్శిస్తూ  ఈ సమావేశం తీర్మానం చేసింది.  భవిష్యత్తులో పార్టీకి సంబంధించి అన్ని రాజకీయ నిర్ణయాలు తీసుకునే అధికారాన్ని స్టాలిన్‌కు అప్పగిస్తూ మరో తీర్మానాన్ని ఆమోదించింది. ఈరోజు నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానుండటంతో, ప్రతిపక్షంలో ఉన్న డీఎంకే తమ శాసనసభాపక్ష కార్యవర్గాన్ని ప్రకటించింది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు  ఢిల్లీ, అసోంలలో  పర్యటించనున్నారు. ఈ రెండు రోజుల పర్యటనలో భాగంగా ఆయన పలు కీలక సమావేశాల్లో పాల్గొంటారు.  ఇందు కోసం చంద్రబాబు సోమవారం (మే 11) ఉదయం ఢిల్లీకి బయల్దేరి వెళ్లారు.  ఆయన అక్కడ  కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో  భేటీ అయ్యారు.  తర్వాత పలువురు కేంద్ర మంత్రులతో సమావేశమై రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. ఇక సాయంత్రం   4 గంటలకు హోటల్ తాజ్ ప్యాలెస్‌లో  సీఐఐ వార్షిక సమావేశంలో పాల్గొని ప్రసంగిస్తారు. ఇక తరువాత  ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి ఛైర్మన్  మహేంద్రదేవ్, నీతి ఆయోగ్ సభ్యులతో కూడా ఆయన భేటీ  అవుతారు. రాత్రి హస్తినలోనే బస చేస్తారు. ఇక మంగళవారం (మే 12) ఉదయం హస్తిన నుంచి నేరుగా అసోం రాజధాని   గువాహటికి వెళ్తారు. అక్కడ అస్సాం నూతన ముఖ్యమంత్రిగా హిమంత బిశ్వ శర్మ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి చంద్రబాబు హాజరవుతారు.  ఈ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం చంద్రబాబు అమరావతికి తిరిగి వస్తారు. 
ప్రధాని నరేంద్ర మోడీ హైదరాబాద్ పర్యటన సందర్భంగా ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నివాసానికి నిన్న వెళ్లిన సంగతి తెలిసిందే.  ఇటీవల శస్త్రచికిత్స చేయించుకుని విశ్రాంతి తీసుకుంటున్న పవన్ కల్యాణ్ ను ఆయన పరామర్శించి,  ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్రధాని పవన్ కల్యాణ్ కుటుంబంతో కొద్ది సేపు భేటీ అయ్యారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అయ్యాయి. కాగా ప్రధాని మోడీ తమ నివాసానికి వచ్చిన సందర్భంగా ఆయనతో కుటుంబం దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్టు చేసిన పవన్ కల్యాణ్ సతీమణి అన్నా లెజినోవా.. దానికి ఒక భావోద్వేగ వ్యాఖ్యను జోడించారు. మా ఆయన్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటానని ప్రధానికి ప్రామిస్ చేశానని పేర్కొన్నారు.  ఇక పోతే  ప్రధాని మోడీ కూడా పవన్ ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నాననీ, . ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాననీ పేర్కొంటూ సోషల్ మీడియాలో పోస్టు చేశారు.  అలాగే  పవన్ కల్యాణ్ కూడా ప్రధాని వ్యక్తిగతంగా తమ ఇంటికి  వచ్చి మరీ తనను పరామర్శించడంపై కృతజ్ఞతలు తెలిపారు.   ప్రధాని తమ కుటుంబంతో గడిపిన  విలువైన సమయం జీవితాంతం గుర్తుండిపోతుందంటూ ట్వీట్ చేశారు. 
ప్రధాని నరేంద్ర మోదీ  హైదరాబాద్ పర్యటన సందర్భంగా ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ఈ పర్యటనలో భాగంగా మోడీ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో వేదిక పంచుకున్నారు. ఆ వేదికపై నుంచి ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా సంచలనం సృష్టించాయి. పెద్ద ఎత్తున చర్చకు దారి తీశాయి. ఇంతకీ ఆయనేమన్నారంటే..  తాను ప్రధాని హోదాలో తెలంగాణకు అన్ని విధాలుగా సహకరిస్తాననీ, అయితే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనతో చేతులు కలపాలనీ అన్నారు. మోడీ వ్యాఖ్యలకు అదే వేదికపై ఉన్న రేవంత్ రెడ్డి చిరునవ్వు నవ్వారు. మోడీ కూడా ఈ మాటలు నవ్వుతూనే అన్నప్పటికీ.. రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది. తెలంగాణ సీఎం తనతో చేతులు కలపితే.. పూర్తి స్థాయిలో సాయం చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానంటూ ప్రధాని రేవంత్ కు ఇచ్చిన ఆఫర్ సంచలనం రేపింది. రేవంత్ ను బీజేపీలో చేరమని ప్రధాని కోరుతున్నారా? అంటూ నెటిజనులు ప్రశ్నిస్తున్నారు.  అయితే  చాలా క్యాజువల్ గా ప్రధాని బహిరంగ వేదికపై నుంచి చేసిన ఈ వ్యాఖ్యలకు పెద్ద ప్రాధాన్యత లేదని పరిశీలకులు అంటున్నారు. మోడీ ఉద్దేశం దేశ సమగ్రాభివృద్ధిలో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి తనకు మద్దతుగా నిలవాలనీ, అందుకు ప్రతిగా తెలంగాణ అభివృద్ధికి తాను పూర్తిగా సహకరిస్తాననీ చెప్పడమే ఆయన ఉద్దేశమని అంటున్నారు.  తెలంగాణలో కాంగ్రెస్‌ను తొలిసారిగా అధికారంలోకి తీసుకువచ్చిన  రేవంత్ రెడ్డికి కాంగ్రెస్‌లో ఉజ్వల భవిష్యత్తు ఉంది. ఆయన ఇప్పటికే కాంగ్రెస్‌లో  ఒక బలమైన నాయకుడిగా గుర్తింపు పొందారు. అలాగే కాంగ్రెస్ హైకమాండ్ విశ్వాసాన్నీ చూరగొన్నారు.  ఈ నేపథ్యంలో  రేవంత్ తన విధేయతను బీజేపీవైపు మార్చుకుంటారనడం పూర్విగా నిర్హేతుకం అని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
ALSO ON TELUGUONE N E W S
తెలుగు సినీ పరిశ్రమలో కొరియోగ్రాఫర్‌గా తనదైన ముద్ర వేసిన జానీ మాస్టర్‌(Jani Master)కు సంబంధించి గత కొన్ని ఏళ్లుగా కోర్టులో కొనసాగుతున్న ఒక వివాదానికి తెరపడింది. అసోసియేషన్ వ్యవహారాలకు సంబంధించి 2014లో నమోదైన ఒక కేసులో మేడ్చల్ కోర్టు ఈరోజు (మే 11) కీలక తీర్పు వెలువరించింది. సరైన సాక్ష్యాధారాలు లేని కారణంగా ఈ కేసును కొట్టివేస్తూ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. అసోసియేషన్ కార్యకలాపాలపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో గత 11 సంవత్సరాలుగా ఈ కేసు విచారణలో ఉంది. 2014లో మొదలైన ఈ న్యాయ వివాదం అనేక వాయిదాల తర్వాత నేటితో ఒక ముగింపుకు వచ్చింది. ఇన్నేళ్ల పాటు సంయమనం కోల్పోకుండా, చట్టంపై గౌరవంతో జానీ మాస్టర్, ఇతర సభ్యులు ఈ పోరాటాన్ని కొనసాగించి విజయాన్ని సాధించారు. కేసు కొట్టివేతపై స్పందిస్తూ, "న్యాయం గెలవడానికి సమయం పట్టవచ్చు, కానీ చివరకు ధర్మమే గెలుస్తుంది" అన్న మాట మరోసారి నిరూపితమైందని జానీ మాస్టర్ పేర్కొన్నారు. ఇన్ని ఏళ్లుగా ఎన్నో మానసిక ఇబ్బందులను, ఒత్తిడిని ఎదుర్కొన్నప్పటికీ, అసోసియేషన్ శ్రేయస్సు కోసం ఓర్పుతో నిలబడ్డారు. జానీ మాస్టర్‌తో పాటు ఈ కేసులో అసోసియేషన్ కోసం పోరాడిన వారిలో రమేష్ మాస్టర్, వేణు మాస్టర్, ప్రకాష్ మాస్టర్, ధన్ శ్యామ్ మాస్టర్, ఎస్.వి. రాముడు ఉన్నారు. సుదీర్ఘ కాలంగా సాగిన ఈ పోరాటంలో సత్యమే జయించడంతో కొరియోగ్రాఫర్ల అసోసియేషన్ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. న్యాయవ్యవస్థపై ఉన్న నమ్మకం వమ్ము కాలేదని వారు తెలియజేశారు.  
తెలుగు చిత్ర పరిశ్రమలో నటుడిగా, రచయితగా తనికెళ్ల భరణి(Tanikella Bharani)కి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆధ్యాత్మికతపై అపారమైన గౌరవం ఉన్న ఆయన, తాజాగా దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ(Narendra Modi)ని కలిసిన అనుభవాన్ని పంచుకుంటూ పెట్టిన పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది. మోడీని కలవడంతో తన జన్మ ధన్యమైందని ఆయన పేర్కొన్నారు. ప్రధాని మోడీని కలిసిన ఫోటోను షేర్ చేస్తూ భరణి రాసిన మాటలు ఆసక్తికరంగా ఉన్నాయి. పురాణ పురుషులను, ఆధ్యాత్మిక గురువులను మనం నేరుగా చూడలేమని, కానీ వారి అంశలను మోడీలో చూశానని ఆయన తెలిపారు. "నేను రాముణ్ణి చూడలేదు, కృష్ణుణ్ణి చూడలేదు, ఆదిశంకరుల్ని చూడలేదు, వివేకానందుణ్ణి చూడలేదు. అంటే చూడలేము కూడా. కానీ వాళ్లందరి అంశలతో ఉన్న మోడీ గారిని చూశాను, ముట్టుకున్నాను, చేతిని ముద్దెట్టుకున్నాను. నా జన్మ ధన్యం." అంటూ తనికెళ్ల భరణి ఎమోషనల్ పోస్ట్ చేశారు. తనికెళ్ల భరణికి మొదటి నుంచీ శివభక్తి ఎక్కువ. మోదీ కూడా ఆధ్యాత్మికతను, భారతీయ సంస్కృతిని ప్రపంచ స్థాయికి తీసుకువెళ్లే వ్యక్తి కావడంతో, ఆయన పట్ల భరణి గారికి ఉన్న గౌరవం ఈ పోస్ట్ ద్వారా స్పష్టమవుతోంది. ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. "ఒక గొప్ప నటుడు, దేశ నాయకుడి పట్ల చూపిన గౌరవం అద్భుతం" అని కొందరు అంటుంటే, మరికొందరు భరణి ఆధ్యాత్మిక కోణాన్ని ప్రశంసిస్తున్నారు. 
Raj Tarun and Amrutha Chowdary play the lead roles in the film Tortoise, produced under the banners of SK Golden Arts, Prashvitha Entertai9ment, NVL Creations, and Madhupala Maha Movies. Directed by Rithvik Kumar, the movie features Srinivas Avasarala and Dhanya Balakrishna in key roles.  Producers Vijay Chowdary, Sasidhar Nalla, Ramisetti Rambabu, and Madhupala Suresh have jointly bankrolled this project. On the occasion of Raj Tarun's birthday today, the film team conveyed their wishes and released the first look poster. Speaking on this occasion, the unit members said that they wish their hero Raj Tarun a very happy birthday. They shared that the film's shooting has been completed and it is currently busy with post-production work. Anup Rubens has composed the music for this film. The team further added that Tortoise will be very fresh with a different story. They believe this 25th film of Raj Tarun will be the best in his career. The characters played by Srinivas Avasarala, Dhanya Balakrishna, and heroine Amrutha Chowdary are said to be very strong. It is a different thriller with a new screenplay. The movie is filmed with a concept where the hero has a habit of sleepwalking, and while in that state, he commits some murders. The plot revolves around what happens next. With the shooting finished, the team plans to complete post-production and release the movie soon.   Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
    మలయాళ చిత్రాలకి తెలుగు ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ తెలిసిందే. అక్కడి కథల్లో ఉండే సహజత్వం, భావోద్వేగాలు మన ప్రేక్షకులని కూడా కట్టిపడేస్తుంటాయి.ఆ కోవలోనే  గత నెల ఏప్రిల్ 23 న విడుదలైన మధువిధు (Madhuvidhu)క్లీన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ గా ప్రేక్షకుల మన్ననలు అందుకుంది. షరాఫుద్దీన్, కల్యాణి పణిక్కర్ జంటగా చేయగా విష్ణు అరవింద్ తెరకెక్కించాడు.  ఇప్పుడు ఈ మూవీ ఓటీటీ ప్రియుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది.  ఈ నెల 22 న సోని లైవ్(Sony Live)వేదికగా స్ట్రీమింగ్ కానుంది. సదరు స్ట్రీమింగ్ విషయాన్నీ సోని లైవ్ సంస్థ అధికారకంగా ప్రకటించడంతో పాటు మళయాళంతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో అందుబాటులో ఉన్నట్టుగా తెలిపింది. 'ఆంజలమూడు' అనే ఫ్యామిలీలో  కేవలం ఐదుగురు పురుషులు మాత్రమే ఉంటారు. మహిళా సభ్యులు లేని ఈ కుటుంబంలోకి కోడలిగా రావడానికి ఏ అమ్మాయి కూడా ఇష్టపడదు. ఈ క్రమంలో కథానాయకుడు అమృత్ రాజ్ (షరాఫుద్దీన్) పెళ్లి సంబంధాలు ఏకంగా 28 సార్లు ఫెయిల్ అవుతాయి. చివరకు స్నేహ మార్కోస్ (కల్యాణి పణిక్కర్) అతని జీవితంలోకి ప్రవేశిస్తుంది.ఆ  తర్వాత ఆ ఇద్దరి క్యారెక్టర్స్  ఎలాంటి మలుపులు తిరిగాయి? కామెడీ మరియు ఎమోషన్స్ కలగలిపిన ఈ ప్రయాణమే 'మధువిధు'. Also read: Trisha: త్రిష ఒక పరన్నాజీవి.. గాయని సుచిత్ర షాకింగ్ కామెంట్స్ ఇంతకీ మధువిధు అంటే హనీమూన్. మరి మలయాళ చిత్రాలని ఇష్టపడే వాళ్ళు ఈ నెల 22 న సోనీ లైవ్ లో మధువిధు చూసి సినీ ఆనందాన్ని పొందండి.    
Suriya has been trying hard to score a massive theatrical blockbuster to regain his strong market in Telugu states and Tamil Nadu. His upcoming movie, Viswanath and Sons, directed by Venky Atluri, is carrying decent buzz as a pure family entertainer. With the teaser already getting a good response, fans and trade circles are eagerly waiting for the official release date.   Currently, the hot gossip in the industry is about the film's release plans. The makers initially locked a July release but due to delays, they are planning to cash in on the long Independence Day weekend and lock August 14th. However, the August weekend is getting heavily crowded, especially with strong buzz that Superstar Rajinikanth's biggie, Jailer 2, is firmly targeting the exact same date. Going head-to-head with Rajinikanth in Tamil Nadu will definitely divide screens and impact opening revenues. While the clash might be 50-50 in Telugu States, facing Jailer 2 in Tamil Nadu is a massive risk. To avoid this, producer Sithara Entertainments seems to be planning a Dasara release instead. Dasara is always considered a golden time since families step out in large numbers. But during that time, Megastar Chiranjeevi's Vishwambhara could release, provided UV Creations finishes the post-production work involving heavy VFX. Vishwambhara might be a film that has been in production for a long time, but being a children-friendly fantasy movie, it holds a massive advantage. If it gets positive word of mouth, then the Suriya film might become the least probable choice for audiences due to his recent dip in the market, unless the movie is as exceptionally good as the director's previous hit, Lucky Baskhar. So, it definitely looks like a tough situation for the makers to move ahead with clear release plans.   Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
ఈ వేసవిలో పెద్ద సినిమాల సందడి లేకపోయినా, చిన్న సినిమాలు ప్రేక్షకులను థియేటర్లకు రప్పిస్తున్నాయి. ఆ కోవలోకే వస్తుంది 'గోదారి గట్టుపైన' (Godari Gattupaina). గ్రామీణ నేపథ్యం, స్వచ్ఛమైన భావోద్వేగాలతో తెరకెక్కిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబడుతోంది. కేవలం మూడు రోజుల్లోనే ఈ సినిమా సాధించిన కలెక్షన్లు ఇప్పుడు ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరుస్తున్నాయి. సుమంత్ ప్రభాస్, నిధి ప్రదీప్ జంటగా సుభాష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన 'గోదారి గట్టుపైన' సినిమా బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. మేకర్స్ ప్రకటించిన దాని ప్రకారం, ఈ మూవీ విడుదలైన కేవలం మూడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.3.06 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. ఒక చిన్న చిత్రానికి ఈ స్థాయిలో వసూళ్లు రావడం విశేషమనే చెప్పాలి.  "Coolest Summer Entertainer" అనే ట్యాగ్‌లైన్‌తో వచ్చిన ఈ చిత్రం, ప్రేక్షకులకు నిజంగానే మంచి రిలాక్సేషన్‌ ఇస్తోంది. ప్రేమ, స్నేహం, భావోద్వేగాలు, గోదావరి పరిసరాల అందాలు, సహజమైన నటన ఈ సినిమా విజయానికి ప్రధాన కారణాలుగా నిలుస్తున్నాయి.  ప్రస్తుతం థియేటర్లలో పెద్ద పోటీ లేకపోవడం 'గోదారి గట్టుపైన' చిత్రానికి ప్లస్ పాయింట్‌గా మారింది. వీక్ డేస్ లో కూడా ఇదే జోరు కొనసాగిస్తే, ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించడమే కాకుండా, నిర్మాతలకు మంచి లాభాలను తెచ్చిపెట్టే అవకాశం ఉంది. 
  దక్షిణాది సినీ పరిశ్రమలో 'సుచీ లీక్స్' పేరుతో ఒకప్పుడు సంచలనం సృష్టించిన గాయని సుచిత్ర(Suchitra)మరోసారి వార్తల్లో నిలిచారు. గతంలో సెలబ్రిటీల వ్యక్తిగత ఫోటోలు, వీడియోలను లీక్ చేసి ఇండస్ట్రీని షేక్ చేసిన ఆమె, తాజాగా ఒక యూట్యూబ్ ఛానెల్‌కి  ఇచ్చిన ఇంటర్వ్యూలో స్టార్ హీరోయిన్ త్రిష,దళపతి విజయ్‌లపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. తాజాగా ఒక ఇంటర్వ్యూలో సుచిత్ర మాట్లాడుతు త్రిష(Trisha)ఒక 'పరాన్నజీవి'. నాకు ఆమె అంటే అస్సలు ఇష్టం లేదు. కానీ విజయ్ అంటే చాలా ఇష్టం. అందుకే నా అభిప్రాయాన్ని నిష్పక్షపాతంగా చెబుతున్నా. ప్రస్తుతం విజయ్(Vijay)తన కుటుంబానికి దూరంగా ఒంటరిగా ఉంటున్నాడు. ఇలాంటి సమయంలోనే 'పరాన్నజీవుల' వంటి వ్యక్తులు విజయ్ జీవితంలోకి ప్రవేశిస్తున్నారు. ఒంటరితనాన్ని ఆసరాగా చేసుకుని  అతన్ని వాడుకుంటూ భారంగా మారుతున్నారు అంటు చెప్పుకొచ్చింది. Also read: Manchu Manoj: బండి భగీరథ్ వ్యవహారం.. స్పందించిన  మంచు మనోజ్  సుచిత్ర వ్యాఖ్యలపై త్రిష అభిమానులు మరియు విజయ్ రాజకీయ  మద్దతుదారులు సోషల్ మీడియా వేదికగా  స్పందిస్తు ఆధారాలు లేకుండా సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడటం సంస్కారం కాదని హితవు పలుకుతున్నారు. మరి సుచిత్ర విషయంలో త్రిష ఎలా స్పందిస్తుందో అన్నది ఆసక్తికరంగా మారింది.  
టాలీవుడ్‌లో కామెడీ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ డైరెక్టర్ అనిల్ రావిపూడి (Anil Ravipudi). ఆయన సినిమాల్లో విక్టరీ వెంకటేష్ (Venkatesh) ఉంటే ఆ హంగామానే వేరుగా ఉంటుంది. ఇప్పటికే వీరిద్దరి కాంబోలో వచ్చిన ఎఫ్2, ఎఫ్3, సంక్రాంతికి వస్తున్నాం సినిమాలు బాక్సాఫీస్ వద్ద విజయం సాధించాయి. ఇప్పుడు ఈ హిట్ కాంబోలో రావిపూడి ఫస్ట్ మూవీ 'పటాస్' హీరో నందమూరి కళ్యాణ్ రామ్ (Kalyan Ram) కూడా తోడవ్వడంతో ఈ ప్రాజెక్ట్ టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ సినిమాకి సంబంధించిన కీలక అప్‌డేట్స్ వచ్చాయి. జూలై నుండి షూటింగ్ ప్రారంభం ప్రస్తుతం ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్‌ను జూలై నుంచి ప్రారంభించనున్నారు. అప్పటి నుండి గ్యాప్ లేకుండా షూటింగ్ జరిపి, కేవలం ఐదు నెలల్లోనే అంటే.. నవంబర్ లేదా డిసెంబర్ కల్లా మొత్తం షూటింగ్‌ను పూర్తి చేయాలని చిత్రబృందం ప్లాన్ చేస్తోంది. స్క్రిప్ట్‌లోనే ఫుల్ ఫన్! ఈ సినిమా గురించి వినిపిస్తున్న ఆసక్తికరమైన విషయమేమిటంటే.. అనిల్ రావిపూడి ఈసారి ఒక అదిరిపోయే హిలేరియస్ స్క్రిప్ట్‌ను సిద్ధం చేశారట. ప్రతి పాత్రను చాలా విభిన్నంగా డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. పేపర్ మీద ఉన్న కామెడీని యధాతథంగా స్క్రీన్ పైకి తీసుకువస్తే, థియేటర్లలో నవ్వుల జాతర ఖాయమని అంటున్నారు. వెంకటేష్ టైమింగ్, కళ్యాణ్ రామ్ ఎనర్జీకి అనిల్ రావిపూడి మార్క్ కామెడీ తోడైతే బాక్సాఫీస్ వద్ద లెక్కలు మారిపోవడం ఖాయం. సంక్రాంతి బరిలో ముగ్గురు మొనగాళ్లు అనిల్ రావిపూడి సినిమాలకు సంక్రాంతి సీజన్ ఎప్పుడూ కలిసొస్తుంది. అందుకే ఈ సినిమాను 2027 సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని ఫిక్స్ అయ్యారు. సంక్రాంతి పండుగ అంటేనే ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు క్యూ కడతారు. ఇలాంటి సమయంలో ఒక ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్టైనర్ రావడం ఈ సినిమాకు పెద్ద ప్లస్ కానుంది. ఈ చిత్రానికి జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తుండటం మరో విశేషం. వెంకటేష్, కళ్యాణ్ రామ్ వంటి ఇద్దరు హీరోలు ఒకే ఫ్రేమ్‌లో కనిపించడం అభిమానులకు నిజంగా ఐ ఫీస్ట్. అనిల్ రావిపూడి తన గత చిత్రాల కంటే మిన్నగా ఈ సినిమాను తెరకెక్కించే ప్రయత్నంలో ఉన్నారు. మరి ఈ త్రయం (వెంకటేష్-కళ్యాణ్ రామ్-అనిల్) సంక్రాంతికి ఎలాంటి మేజిక్ చేస్తారో చూడాలి!  
సెల్యులాయిడ్ పైనే కాదు, నిజ జీవితంలోను హీరో అనిపించుకునే వ్యకి మంచు మనోజ్(Manchu Manoj). ఇందుకు ఉదాహరణలు చెప్పమంటే మేమంటే మేము చెప్తామంటూ చాలా మంది ముందుకొస్తారు. అంతలా సమాజంలో జరిగే సంఘటనలపై తన గళాన్ని విప్పుతూ ఉంటాడు. ఈ కోవలోనే రీసెంట్ గా ఇండియా వైడ్ గా సంచలనం సృష్టిస్తున్న కేంద్ర మంత్రి బండి సంజయ్(Bandi sanjay)కొడుకు భగీరథ్ పై నమోదైన పోస్కో కేసుపై మనోజ్ స్పందించాడు. మనోజ్ మాట్లాడుతు  పదవి, అధికారము, హోదా ఎటువంటి పరిస్థితుల్లోను న్యాయానికి అడ్డుకాకూడదు. ప్రతి బాలికకి  రాజ్యాంగం ప్రకారం సమాన న్యాయం దక్కాలి అంటు చెప్పాడు. దీంతో సినీ ఇండస్ట్రీ నుంచి స్పందించిన వారిలో మొదటి వ్యక్తిగా  మనోజ్ నిలిచాడు. భగీరథ్ పై నమోదైన పోస్కో  కేసు ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. కేసు విషయానికి వస్తే 17 ఏళ్ల మైనర్ బాలికని  భగీరథ్ లైంగికంగా వేధించారనీ, మోయినాబాద్‌లోని ఒక ఫామ్‌హౌస్‌లో ఈ ఘటన జరిగిందని బాలిక తల్లి పెట్‌బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు భగీరథ్‌పై పోక్సో చట్టంతో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. డిసెంబర్ 31న జరిగిన పార్టీలో బాలికపై అత్యాచారం జరిగిందని ఆ తర్వాత ఆమె రెండుసార్లు ఆత్మహత్యాయత్నం చేసిందని ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు. అయితే.. ఈ కేసు నమోదు కావడానికి కొద్ది గంటల ముందే భగీరథ్ కరీంనగర్ పోలీసులకు ఓ  ఫిర్యాదు చేశారు. ఆ బాలిక కుటుంబం తనను తప్పుడు కేసులతో బ్లాక్‌మెయిల్ చేస్తూ ఐదు కోట్లు డిమాండ్ చేస్తున్నారని ఆయనా ఫిర్యాదులో పేర్కొన్నారు.  ఇప్పటికే భయంతో రూ.50వేలు చెల్లించానని..  అయినా వారి వేధింపులు పెరిగిపోయాయని ఆ ఫిర్యాదులో ఆరోపించారు బండి బగీరథ్.  తాను పెళ్లికి నిరాకరించినందుకే ఈ కుట్ర పన్నారని అంటున్నారాయన.  ఈ కేసు బయటకు వచ్చినప్పటి నుంచి సోషల్ మీడియాలో భారీ స్థాయిలో ట్రోలింగ్ న‌డుస్తోంది. బీజేపీ బేటీ బచావో నినాదంపై నెటిజనులు ఓ రేంజ్ లో సెటైర్లు వేస్తున్నారు. గతంలో ఇతర పార్టీల నేతలపై ఇటువంటి ఆరోపణలు వచ్చినప్పుడు బండి సంజయ్ తీవ్రంగా స్పందించేవారు. ఇప్పుడాయన కుమారుడిపైనే కేసు నమోదు కావడంతో.. ప్రతిపక్షాలు..  నెటిజన్లు  బేటీ బచావో కాదు.. బేటా బచావో.. అంటే కొడుకును ముందు కాపాడుకో అంటూ ఎద్దేవా చేస్తున్నారు.  ప్రధాని మోడీని ఉద్దేశించి..  మీ శిష్యుడి కొడుకు అరాచకాలు చూడండి అనేలా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అవి తెగ వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా రాజకీయ శత్రువులు బండి సంజయ్‌ను నైతికంగా దెబ్బతీయడానికి ఈ కేసును వాడుకుంటున్నారు. ఇక‌ బీఆర్ఎస్ నేతలు, ఇత‌ర‌ మహిళా సంఘాలు భగీరథ్‌ను వెంటనే అరెస్ట్ చేయాలని, బండి సంజయ్ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నాలు చేస్తున్నారు.  ప్రస్తుతానికి పోలీసులు రెండు ఫిర్యాదులను వేర్వేరుగా దర్యాప్తు చేస్తున్నారు. Also read: Dimple Hayathi: వాళ్ళకి అందం కావాలి కానీ మనసుతో పని లేదు.. వైరల్ గా మారిన డింపుల్ హయాతి తీరు   పోలీసుల వెర్షన్ ఏంటంటే..  ఇది కేంద్ర హోం శాఖ స‌హాయ మంత్రి కుమారుడి  కేసు కావ‌డంతో సునిశిత‌మైన వ్య‌వ‌హారం. బాలిక మైనర్ అని తేలడంతో ప్రాథమికంగా అయితే ఎలాంటి  సందేహాలకూ తావు లేకుండా.. పోక్సో కేసు నమోదు చేశామని, అయితే బ్లాక్‌మెయిలింగ్ ఆరోపణలపై కూడా విచారణ జరుపుతున్నామని తెలిపారు. డిజిటల్ ఆధారాలైన చాటింగ్స్, ఫోన్ కాల్స్ కేసులో కీలకం కానున్నాయంటున్నారు.  
Thalapathy Vijay made a massive statement when he launched his Tamilaga Vettri Kazhagam (TVK) party, loudly declaring that his direct political war was against MK Stalin led DMK and his government. He projected himself as the ultimate alternative to Dravidian rule but in political game of thrones, he needed the rival support. Interestingly, after the recent TN elections, Vijay managed to take the oath as the Leader of the House today in the assembly and form the government, officially. However, he could not achieve this power on his own. To reach the magic number, he desperately needed the backing of DMK's alliance parties. In a major political twist, except for the Congress, all the other alliance parties sought direct permission from MK Stalin before extending their official support to Vijay's TVK. Acknowledging this crucial help, Vijay, right after taking his oath, visited Stalin’s residence to meet MK Stalin and Udhayanidhi Stalin. The man who started his campaign with a fierce "What Uncle It is Wrong Uncle" attitude towards the DMK leadership ultimately had to rely on their green signal to secure CM position. This dramatic shift looks like he is saying, "Thanks Uncle" post elections and after all the high drama. It is nothing short of a Vijay blockbuster film and Tamil people seem to be clearly noticing all political moves of Vijay with magnifying glass.  It is heartening to see, how AIADMK led by MGR and Jayalalitha hated to even acknowledge existence of DMK and conduct dramatic mid-night arrests and put pressure on other with criminal charges, money laundering cases, to Vijay, personally going to MKS residence. Change is here but how honest question political experts.    Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
  నేటి కాలంలో ఫిట్‌నెస్‌పై అవగాహన పెరుగుతోంది. ముఖ్యంగా జిమ్ వెళ్లేవారు తమ ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఈ క్రమంలో "పంచదారకు బదులుగా బెల్లం వాడటం మంచిదా?" అనే సందేహం చాలా మందిలో ఉంటుంది. దీనిపై ప్రముఖ న్యూట్రిషనిస్ట్ మరియు హెల్త్ కోచ్ ఈ వీడియోలో వివరించారు. పంచదార vs బెల్లం: ఏది బెటర్? చాలా మంది పంచదార కంటే బెల్లం ఆరోగ్యకరమని భావిస్తారు. అయితే, వాస్తవానికి పంచదార మరియు బెల్లం రెండింటికీ దాదాపు ఒకే రకమైన లక్షణాలు ఉంటాయి. గ్లైసీమిక్ ఇండెక్స్: పంచదార నేరుగా రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను పెంచుతుంది. జీర్ణం కావడం: బెల్లంలో మొలాసిస్ (Molasses) ఉండటం వల్ల, ఇది పంచదార కంటే కొంచెం నెమ్మదిగా జీర్ణమవుతుంది. కానీ, శరీరానికి అందే క్యాలరీలు మరియు ప్రభావం విషయంలో రెండూ దాదాపు సమానమే. సలహా: మీరు ఆరోగ్యంగా ఉండి, గ్లూకోజ్ లెవల్స్ సాధారణంగా ఉంటే పరిమితంగా ఏదైనా తీసుకోవచ్చు. కానీ రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉన్నవారు రెండింటికీ దూరంగా ఉండటమే మంచిది. స్వీట్నెస్ మరియు ఆరోగ్యం ప్రకృతిలో లభించే పండ్లు మొదలైనవి మనకు అలవాటైన స్వీట్లంత తీపిగా ఉండవు. బ్రాండ్లు మరియు కంపెనీలు మనకు ఈ అధిక తీపిని అలవాటు చేశాయి. పిసిఒఎస్ (PCOS), హార్మోన్ల అసమతుల్యత, ఇన్ఫెర్టిలిటీ వంటి అనేక సమస్యలకు చక్కెర ప్రధాన కారణం. డయాబెటిస్ మరియు హైపోగ్లైసీమియా వంటి సమస్యలు రాకుండా ఉండాలంటే చక్కెరను డైట్ నుండి వీలైనంత వరకు తొలగించాలి. ప్రత్యామ్నాయాలు ఏవి? చక్కెరకు బదులుగా సహజసిద్ధమైన స్వీట్నర్లను వాడవచ్చు: మొంక్ ఫ్రూట్ (Monk Fruit): ఇది తక్కువ క్యాలరీలను ఇస్తుంది మరియు ఇన్సులిన్ స్థాయిలను వేగంగా పెంచదు. స్టీవియా (Stevia): దీనిపై కొన్ని వివాదాలు ఉన్నప్పటికీ, మితంగా వాడితే ఇది సురక్షితమేనని పరిశోధనలు చెబుతున్నాయి. అయితే బాడీ సెన్సిటివిటీని బట్టి దీనిని ఎంచుకోవాలి. బయటికి సన్నగా ఉన్నా లోపల ప్రమాదమేనా? కొందరు ఎంత తిన్నా లావు అవ్వరు (Metabolism వల్ల). కానీ వారు జంక్ ఫుడ్ లేదా అధిక చక్కెర తీసుకుంటే, అది బయటికి కనిపించకపోయినా లోపల లివర్ ఇన్ఫ్లమేషన్ (Liver Inflammation) కు దారితీస్తుంది. శరీరంలో కొవ్వును కరిగించే లేదా పెంచే ఎంజైమ్స్ లోపం వల్ల కొందరు లావు అవ్వకపోవచ్చు, కానీ వారి రక్త నాళాల్లో అడ్డంకులు (clogging) ఏర్పడే ప్రమాదం ఉంది. ఒకరి శరీరం స్పందించే తీరు మరొకరికి భిన్నంగా ఉంటుంది. కాబట్టి ఇతరులను చూసి బ్లైండ్‌గా ఫాలో అవ్వకూడదు. ముగింపు: ఫిట్‌నెస్ అంటే కేవలం బరువు తగ్గడం లేదా పెరగడం మాత్రమే కాదు, లోపల అవయవాలు ఎంత ఆరోగ్యంగా ఉన్నాయనేది ముఖ్యం. సరైన పోషకాహారం మరియు మితమైన తీపి మీ ఆరోగ్యానికి మేలు చేస్తాయి. మరిన్ని ఆసక్తికరమైన ఆరోగ్య చిట్కాల కోసం మా యూట్యూబ్  "TeluguOne Health" ఛానెల్ ను సందర్శించండి. (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)
మీ జుట్టు మీ అందానికి ఒక కిరీటం వంటిది. కానీ నేటి ఒత్తిడితో కూడిన జీవనశైలి, కాలుష్యం మరియు రసాయనాల వాడకం వల్ల జుట్టు ఆరోగ్యం దెబ్బతింటోంది. మీ జుట్టును ఒత్తుగా, పొడవుగా మరియు ఆరోగ్యంగా ఎలా ఉంచుకోవాలో ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం. మీ జుట్టు - మీ ఆత్మవిశ్వాసం జుట్టు రాలడం లేదా చిట్లిపోవడం అనేది కేవలం శారీరక సమస్య మాత్రమే కాదు, అది మన ఆత్మవిశ్వాసాన్ని కూడా దెబ్బతీస్తుంది. మనలో చాలా మంది జుట్టు పొడవుగా పెరగాలని రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే, జుట్టు పెరుగుదల అనేది ప్రధానంగా మన జెనెటిక్స్ (Genetics) మీద ఆధారపడి ఉంటుంది. అయినప్పటికీ, సరైన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఉన్న జుట్టును ఆరోగ్యంగా కాపాడుకోవచ్చు. మనం జుట్టు పట్ల ఎందుకు జాగ్రత్త వహించాలి? (Why Should We?) సహజ సౌందర్యం: మీ జుట్టు కర్లీగా ఉన్నా లేదా స్ట్రెయిట్‌గా ఉన్నా, అది మీ ప్రత్యేకత. దాన్ని ప్రేమించడం వల్ల మీకు మానసిక సంతృప్తి లభిస్తుంది. శాశ్వత నష్టాన్ని నివారించడానికి: జుట్టు ఒకసారి తీవ్రంగా దెబ్బతింటే (పర్మనెంట్ డామేజ్), అది మళ్ళీ పూర్వస్థితికి రావడం కష్టం. ఆరోగ్యకరమైన పెరుగుదల: క్రమం తప్పకుండా ట్రిమ్ చేయడం వల్ల జుట్టు చిట్లిపోకుండా (Split ends) చూడవచ్చు, దీనివల్ల జుట్టు చూడటానికి స్మూత్‌గా మరియు ఆరోగ్యంగా కనిపిస్తుంది. ఇవి అస్సలు చేయకండి! (What Not To Do) అధిక వేడి (High Heat): హెయిర్ స్టైలింగ్ కోసం 180°C కంటే ఎక్కువ వేడిని ఎప్పుడూ వాడకండి. ఇది మీ జుట్టును శాశ్వతంగా దెబ్బతీస్తుంది. బిగుతైన కేశాలంకరణ (Tight Hairstyles): జుట్టును చాలా గట్టిగా వెనక్కి లాగి ముడి వేయడం లేదా పోనీటైల్ వేయడం వల్ల ట్రాక్షన్ అలోపేషియా (Traction Alopecia) అనే సమస్య వస్తుంది. దీనివల్ల జుట్టు ఊడిన చోట మళ్ళీ మొలవదు. అతిగా కెమికల్ ట్రీట్‌మెంట్స్: కెరాటిన్, స్మూతనింగ్ లేదా పర్మింగ్ వంటివి తరచుగా చేయించుకోవడం వల్ల జుట్టు బలహీనపడి విరిగిపోతుంది. నిరంతరం షాంపూలు మార్చడం: షాంపూ అనేది కేవలం జుట్టును శుభ్రం చేసే సోప్ వంటిది మాత్రమే. ఇది జుట్టు పెరుగుదలను ఆపలేదు లేదా పెంచదు. కేవలం అలర్జీలు ఉంటే తప్ప, పదే పదే షాంపూలు మార్చడం వల్ల పెద్దగా ఉపయోగం ఉండదు. జుట్టు సంరక్షణ కోసం చిట్కాలు (How To Take Care) సహజమైన మాస్క్‌లు: ఇంట్లోనే లభించే అవిసె గింజల జెల్ (Flaxseed gel), కలబంద (Aloe vera), మెంతులు మరియు మందార ఆకులను వాడండి. ఇవి జుట్టుకు మంచి స్మూతనింగ్ ఏజెంట్స్‌గా పనిచేస్తాయి. సరైన వేడి వద్ద స్టైలింగ్: మీరు తప్పనిసరిగా స్టైలింగ్ చేయాలనుకుంటే, వేడిని 140°C నుండి 160°C మధ్య మాత్రమే ఉంచండి. రెగ్యులర్ ట్రిమ్మింగ్: జుట్టు చివర్లు చిట్లకుండా ఉండటానికి ప్రతి 6 వారాలకు లేదా కనీసం రెండు నెలలకు ఒకసారి కొద్దిగా ట్రిమ్ చేయించుకోండి. లూజ్ హెయిర్ స్టైల్స్: జుట్టును వదులుగా ఉండేలా చూసుకోండి. స్లీక్ స్టైల్స్ (Sleek styles) కంటే సహజమైన జుట్టును ప్రదర్శించడం ఎంతో మంచిది. ప్రశ్నలు - సమాధానాలు (Q&A) ప్ర: చివర్లు కట్ చేస్తే జుట్టు వేగంగా పెరుగుతుందా?  జ: లేదు. జుట్టు చివర్లు కట్ చేయడం వల్ల జుట్టు చూడటానికి స్మూత్‌గా ఉంటుంది కానీ, పెరుగుదల అనేది రూట్ (స్కాల్ప్) నుండి జరుగుతుంది. ప్ర: హెయిర్ బోటాక్స్ (Hair Botox) సురక్షితమేనా?  జ: ఇది ఒక మార్కెటింగ్ జిమిక్ మాత్రమే. ఇది పర్మనెంట్ కాదు, కేవలం మూడు నెలల వరకు మాత్రమే ఉంటుంది. దీనికంటే సహజ పద్ధతులు పాటించడం ఉత్తమం. ప్ర: షాంపూ మార్చడం వల్ల హెయిర్ ఫాల్ అవుతుందా?  జ: షాంపూ మార్చడం వల్ల నేరుగా హెయిర్ ఫాల్ అవ్వదు. కొన్నిసార్లు అందులోని కొత్త కాంపోనెంట్స్ పడకపోతే అలర్జీ రావచ్చు, కానీ హెయిర్ ఫాల్ అనేది ఇతర కారణాల వల్ల (జెనెటిక్స్ లేదా ఒత్తిడి) జరగవచ్చు. జుట్టు ఆరోగ్యం అనేది మీరు దాన్ని ఎంత ప్రేమగా చూసుకుంటారు అనే దానిపై ఆధారపడి ఉంటుంది. రసాయనాలకు దూరంగా ఉంటూ, సహజ పద్ధతులను అనుసరించడం ద్వారా మీ జుట్టును మెరిసేలా ఉంచుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఆరోగ్యకరమైన అలవాట్లే మీ జుట్టుకు నిజమైన బలం. మరిన్ని హెల్త్ టిప్స్ మరియు హెయిర్ కేర్ రహస్యాల కోసం మా TeluguOne Health యూట్యూబ్ ఛానెల్‌ని సందర్శించండి! సబ్‌స్క్రైబ్ చేసుకోండి.
ప్రేమించిన వారిని వదిలి వేరొకరిని పెళ్లి చేసుకుంటున్నారా? మీ జీవితం మరియు మీ భాగస్వామి భవిష్యత్తు కోసం ఈ విషయాలు తప్పక తెలుసుకోండి. పరిచయం: ప్రేమ అనేది ఒక అందమైన అనుభూతి, కానీ అందరి జీవితాల్లోనూ ప్రేమించిన వారితోనే ప్రయాణం సాధ్యం కాకపోవచ్చు. ఇంటి సభ్యుల ఒత్తిడి వల్లో లేదా ఇతర పరిస్థితుల వల్లో ప్రేమించిన వ్యక్తిని వదిలేసి, వేరొకరిని పెళ్లి చేసుకోవడం అనేది మానసిక సంఘర్షణతో కూడుకున్న విషయం. ఇలాంటి సమయంలో కేవలం మీ బాధనే కాకుండా, మీ జీవితంలోకి కొత్తగా వచ్చే వ్యక్తి జీవితాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవడం చాలా ముఖ్యం. ఈ వెబ్‌సైట్ కంటెంట్ ద్వారా అటువంటి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నవారికి ఒక స్పష్టమైన మార్గదర్శకాన్ని అందించబోతున్నాం. మనం వాస్తవాన్ని ఎందుకు అంగీకరించాలి? (Why should we accept the reality?) జీవితంలో మార్పులు సహజం. మీరు ఒక బంధం నుండి బయటకు వచ్చి మరొక బంధంలోకి అడుగు పెడుతున్నప్పుడు వాస్తవాన్ని అంగీకరించడం ఎందుకు ముఖ్యమో ఇక్కడ చూడండి: అవతలి వ్యక్తి జీవితం మీ బాధ్యత: మీ జీవితం అనుకున్నట్లు జరగలేదని, మీతో నూతన జీవితాన్ని ప్రారంభించిన వ్యక్తి జీవితాన్ని పాడు చేసే హక్కు మీకు లేదు. కొత్త ఆశలు మరియు కలలు: పెళ్లి చేసుకున్న కొత్తలో ప్రతి ఒక్కరికీ ఎన్నో ఆశలు, అందమైన ప్రపంచాన్ని చూడాలనే కలలు ఉంటాయి. మీ గత బాధతో వారి కలలను చిధ్రం చేయకూడదు. మానసిక ప్రశాంతత: గతాన్ని పట్టుకుని వేలాడటం వల్ల మీకు కానీ, మీ కుటుంబానికి కానీ ఎలాంటి ఉపయోగం ఉండదు. నిజాన్ని అంగీకరించినప్పుడే మీరు వర్తమానంలో జీవించగలరు. ముఖ్యంగా చేయకూడని పనులు (What NOT to do?) కొత్త జీవితంలోకి అడుగుపెట్టిన తర్వాత ఈ పొరపాట్లు అస్సలు చేయకండి: నిరాసక్తత చూపడం: భాగస్వామితో మాట్లాడకుండా ఉండటం, కుటుంబ సభ్యులతో కలవకుండా ముభావంగా ఉండటం వల్ల అవతలి వారి జీవితం కూడా నాశనమవుతుంది. మూడ్ స్వింగ్స్‌ను ప్రదర్శించడం: మీ పాత జ్ఞాపకాల వల్ల వచ్చే కోపాన్ని లేదా బాధను మీ భాగస్వామిపై చూపించడం ఎథికల్ గా (నైతికంగా) సరైనది కాదు. అబద్ధాలు చెప్పడం: మీ గత బంధం చాలా బలమైనది అయితే, ఆ విషయాన్ని దాచిపెట్టి మోసం చేయడం భవిష్యత్తులో పెద్ద సమస్యలకు దారితీయవచ్చు. పరిస్థితిని ఎలా చక్కదిద్దుకోవాలి? (How to handle the situation?) ఈ క్లిష్ట పరిస్థితి నుండి బయటపడటానికి కొన్ని సూచనలు: సమయం తీసుకోండి: పాత బంధం నుండి పూర్తిగా బయటకు వచ్చిన తర్వాతే పెళ్లికి సిద్ధపడాలి. ఒకవేళ పెళ్లి ఫిక్స్ అయితే, మానసికంగా మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోవడానికి తగినంత సమయం తీసుకోండి. నిజాయితీగా ఉండండి: ఒకవేళ మీ గతం చాలా లోతైనది అయితే, మీ కాబోయే భాగస్వామికి ఆ విషయం చెప్పి, వారిని ఒప్పించి లేదా వారి అభిప్రాయం తెలుసుకుని ముందుకు వెళ్లడం మంచిది. కొత్త బంధానికి ప్రాధాన్యత ఇవ్వండి: పెళ్లయిన తర్వాత ఇది మీ జీవితం అని గుర్తించి, పాత కథలను పక్కన పెట్టి కొత్త జీవితం అనే సముద్రంలో ప్రయాణించడం ప్రారంభించాలి. ప్రశ్నోత్తరాలు (Q&A) ప్రశ్న 1: ప్రేమించిన వ్యక్తిని మర్చిపోలేక పోతున్నాను, అప్పుడు పెళ్లి చేసుకోవడం సరైనదేనా?  సమాధానం: పాత బంధం నుండి మీరు పూర్తిగా బయటకు రాకుండా పెళ్లి చేసుకోవడం వల్ల మీతో పాటు మీ భాగస్వామి జీవితం కూడా ఇబ్బందుల్లో పడుతుంది. ముందుగా ఆ ఆలోచనల నుండి బయటపడటానికి సమయం తీసుకోవడం చాలా ముఖ్యం. ప్రశ్న 2: పెళ్లయిన తర్వాత భాగస్వామితో ఎలా ప్రవర్తించాలి?  సమాధానం: మీ భాగస్వామికి కొత్త కలలు ఉంటాయి. వారితో కలిసిమెలిసి ఉండటం, కుటుంబంతో మమేకం అవ్వడం ద్వారా మీ బాధను తగ్గించుకోవచ్చు. మీ లోపల బాధ ఉన్నా, దాన్ని భాగస్వామిపై చూపించకూడదు. ప్రశ్న 3: గత రిలేషన్ షిప్ గురించి భాగస్వామికి చెప్పాలా?  సమాధానం: అది చాలా బలమైన బంధం అయితే ఖచ్చితంగా చెప్పాలి. నిజం దాచి పెళ్లి చేసుకుంటే, రేపు ఏదైనా తెలిసినప్పుడు అది మోసంగా మారుతుంది మరియు బంధం దెబ్బతింటుంది.  జీవితం అంటే ఎప్పుడూ ఒకేలా ఉండదు. గతాన్ని తలచుకుంటూ కూర్చుంటే మీ వర్తమానం మరియు భవిష్యత్తు రెండూ నాశనమవుతాయి. జరిగిన దాన్ని అంగీకరించి (Accept the reality), మీకు తోడుగా వచ్చిన వ్యక్తికి అన్యాయం జరగకుండా చూసుకోవడమే నిజమైన మానవత్వం. మీ జీవితాన్ని బాధ్యతాయుతంగా మలుచుకోండి. మరిన్ని ఆసక్తికరమైన మరియు జీవితానికి ఉపయోగపడే విషయాల కోసం మా "Naveena Column" యూట్యూబ్ ఛానెల్‌ని సందర్శించండి..  సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!
  ఖచ్చితంగా, లైపోసెక్షన్ మరియు టమ్మీ టక్ గురించి మీ వెబ్‌సైట్ కోసం పాఠకులను ఆకట్టుకునేలా మరియు భావోద్వేగాలను స్పృశించేలా రూపొందించిన సమాచారం ఇక్కడ ఉంది: మీ కలల రూపం మీ సొంతం: లైపోసెక్షన్ మరియు బాడీ కాంటౌరింగ్ గురించి పూర్తి అవగాహన మనలో చాలా మందికి అద్దంలో చూసుకున్నప్పుడు కొన్ని శరీర భాగాలు నచ్చవు. ముఖ్యంగా ఎంత వ్యాయామం చేసినా, ఎంత కఠినమైన డైట్ పాటించినా తగ్గని మొండి కొవ్వు మన ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుంది. పదిమందిలోకి వెళ్ళినప్పుడు మనకు నచ్చిన దుస్తులు వేసుకోలేక, బాడీ షేప్ సరిగ్గా లేదని ఇబ్బంది పడే పరిస్థితులు ఎందరికో ఎదురవుతుంటాయి. మీ ఈ ఆవేదనను అర్థం చేసుకుని, మీకు సరైన ఆకృతిని ఇచ్చే అద్భుతమైన ప్రక్రియే 'లైపోసెక్షన్'. మనం ఈ చికిత్స ఎందుకు చేయించుకోవాలి? (Why Should We?) లైపోసెక్షన్ అనేది కేవలం కొవ్వును తీసేయడం మాత్రమే కాదు, అది మీ శరీరానికి ఒక కొత్త రూపాన్ని, మీకు కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది. మొండి కొవ్వు నుండి విముక్తి: వ్యాయామంతో తగ్గని లవ్ హ్యాండిల్స్, డబల్ చిన్, మరియు చేతుల దగ్గరి కొవ్వును ఇది సులభంగా తొలగిస్తుంది. ఆత్మవిశ్వాసం పెరుగుదల: ముఖ్యంగా యువతలో గైనకోమాస్టియా (పురుషులలో ఛాతి పెరగడం) వంటి సమస్యల వల్ల కలిగే మానసిక ఇబ్బందులను ఇది దూరం చేస్తుంది. సరైన శారీరక ఆకృతి: హై డెఫినిషన్ లైపోసెక్షన్ ద్వారా జిమ్‌కు వెళ్లినప్పుడు వచ్చే సహజమైన బాడీ లైన్స్‌ను కూడా పొందవచ్చు. ఆరోగ్యపరమైన ప్రయోజనాలు: పొట్ట భాగం కిందకు సాగిపోవడం వల్ల వచ్చే అలర్జీలు, రాషెస్ మరియు అల్సర్ల నుండి ఉపశమనం లభిస్తుంది. లైపోసెక్షన్ ఎలా చేస్తారు? (How it works?) ఇది చాలా సరళమైన మరియు సురక్షితమైన ప్రక్రియ. చిన్న గాటు: కేవలం 1.5 నుండి 2 mm వరకు ఉండే అతి చిన్న రంధ్రం ద్వారా ఈ ప్రక్రియ జరుగుతుంది. ఫ్యాట్ సక్షన్: ఒక చిన్న ట్యూబ్ సహాయంతో శరీరంలోని అదనపు కొవ్వును బయటకు సక్ (Suck) చేస్తారు. త్వరిత కోలుకోవడం: సర్జరీ జరిగిన రోజే లేదా మరుసటి రోజే ఇంటికి వెళ్ళిపోవచ్చు. రెండు రోజుల తర్వాత మీ సాధారణ పనులు కూడా చేసుకోవచ్చు. టమ్మీ టక్ (Tummy Tuck): పొట్ట భాగం మరీ ఎక్కువగా సాగిపోయిన వారికి ఆ అదనపు చర్మాన్ని తీసేసి, బొడ్డును కూడా సరిచేసి మంచి షేప్ ఇస్తారు. ఏం చేయకూడదు? (What Not to Do?) లైపోసెక్షన్ చేయించుకోవాలని నిర్ణయించుకున్నప్పుడు ఈ క్రింది విషయాలలో జాగ్రత్తగా ఉండాలి: బరువు తగ్గడానికి కాదు: లైపోసెక్షన్ అనేది బరువు తగ్గడానికి చేసే చికిత్స అని నమ్మవద్దు; ఇది కేవలం శరీర ఆకృతిని (Body Shaping) మార్చడానికి మాత్రమే. ధూమపానం వద్దు: సర్జరీకి 2-3 వారాల ముందు మరియు తర్వాత ఖచ్చితంగా స్మోకింగ్ మానేయాలి. అన్-సర్టిఫైడ్ డాక్టర్లు వద్దు: అనుభవం లేని వారితో కాకుండా, కేవలం బోర్డ్ సర్టిఫైడ్ ప్లాస్టిక్ సర్జన్ ద్వారానే ఈ చికిత్స చేయించుకోవాలి. నియమాలను అతిక్రమించవద్దు: డాక్టర్ సూచించిన లిమిట్స్ కంటే ఎక్కువ ఫ్యాట్ తీయమని ఒత్తిడి చేయకూడదు, అది ప్రమాదకరం కావచ్చు. సాధారణ సందేహాలు - సమాధానాలు (Q&A) ప్ర: లైపోసెక్షన్ సురక్షితమేనా?  జ: అవును, అర్హత కలిగిన ప్లాస్టిక్ సర్జన్ ద్వారా నియమిత పరిమితుల్లో చేయించుకుంటే ఇది 100% సురక్షితం. ప్ర: సర్జరీ తర్వాత మచ్చలు కనిపిస్తాయా?  జ: లైపోసెక్షన్ రంధ్రాలు చాలా చిన్నవి కాబట్టి మచ్చలు తెలియవు. టమ్మీ టక్ చేసినా ఆ గీత మీ ఇన్నర్ వేర్ లైన్ లోపలికే ఉంటుంది కాబట్టి బయటకు కనిపించదు. ప్ర: సర్జరీ తర్వాత మళ్ళీ కొవ్వు చేరుతుందా?  జ: సర్జరీ తర్వాత హెల్దీ డైట్ పాటించడం మరియు డాక్టర్ సూచించిన విధంగా 4-6 వారాల పాటు కంప్రెషన్ గార్మెంట్స్ ధరించడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. అందంగా కనిపించాలనే కోరిక ఎవరికైనా ఉంటుంది. ఆధునిక వైద్య శాస్త్రం అందించిన ఈ అద్భుత చికిత్సలతో మీ కలల రూపాన్ని పొందడం ఇప్పుడు సులభం. భయపడాల్సిన అవసరం లేదు, సరైన నిపుణులను సంప్రదించి మీ కొత్త జీవితాన్ని ప్రారంభించండి. మరిన్ని వివరాల కోసం మా TeluguOne Health యూట్యూబ్ ఛానల్ చూడండి. ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి.
ప్రస్తుత రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా చాలా మంది మహిళలను వేధిస్తున్న అతిపెద్ద సమస్య పి.సి.ఓ.డి (PCOD). అసలు ఈ సమస్య ఎందుకు వస్తుంది? ఇది గర్భధారణపై ఎలాంటి ప్రభావం చూపుతుంది? అనే విషయాలపై ప్రముఖ వైద్యులు డాక్టర్ సి. జ్యోతి (Dr. C. Jyothi) గారు ఈ VIDEO లో స్పష్టమైన అవగాహన కల్పించారు. ఈ వీడియోలో మీరు తెలుసుకోబోయే ముఖ్యాంశాలు: PCOD అంటే ఏమిటి?: అండాశయాల్లో నీటి బుడగలు ఎందుకు ఏర్పడతాయి? గుర్తించడం ఎలా?: నెలసరి క్రమం తప్పడం, ముఖంపై మొటిమలు, జుట్టు రాలడం వంటి లక్షణాల విశ్లేషణ. ముఖ్య కారణాలు: హార్మోన్ల అసమతుల్యత, ఆహారపు అలవాట్లు మరియు ఒత్తిడి పాత్ర. శాశ్వత పరిష్కారం: ఆహార నియమాలు మరియు వ్యాయామం ద్వారా PCOD ని ఎలా జయించవచ్చు? మహిళల ఆరోగ్యానికి సంబంధించిన ఈ అత్యంత ముఖ్యమైన సమాచారాన్ని తెలుసుకోవడానికి TeluguOne లోని ఈ వీడియోని పూర్తిగా చూడండి. మరిన్ని ఆరోగ్య సూచనలు మరియు పరిష్కారాల కోసం మా యూట్యూబ్ ఛానెల్ "TeluguOne Health" ను సందర్శించి (సబ్‌స్క్రైబ్ చేయండి!)
ఈనాటి వేగవంతమైన జీవనశైలిలో మనకు తెలియకుండానే మనం అనేక ఆరోగ్య సమస్యలను కొనితెచ్చుకుంటున్నాము. ముఖ్యంగా, నేటి యువతలో సెక్స్ పట్ల ఆసక్తి తగ్గడం అనేది ఒక ప్రధాన సమస్యగా మారుతోంది. డబ్బు సంపాదన, కార్పొరేట్ ఒత్తిడి, మరియు మారుతున్న సామాజిక విలువల మధ్య మన వ్యక్తిగత జీవితం చితికిపోతోంది. ఈ VIDEO ద్వారా మీకు సెక్స్ ఆరోగ్యం పట్ల సరైన అవగాహన కల్పించడమే మా లక్ష్యం. మనం ఎందుకు శ్రద్ధ వహించాలి? (Why Should We?) సెక్స్ అనేది కేవలం శారీరక కలయిక మాత్రమే కాదు, అది మన జీవితంలో ఒక అత్యంత ముఖ్యమైన భాగం. మానసిక ప్రశాంతత: మనం సుఖంగా, ఆనందంగా ఉండాలన్నా, మన మెదడు చురుగ్గా పనిచేయాలన్నా సెక్స్ ఎంతో ఉపయోగపడుతుంది. ఆరోగ్యకరమైన మెదడు: ఇది ప్రాథమిక అవసరాలలో ఒకటి. పశుపక్షాదులు కూడా తమ కుటుంబంతో సమయాన్ని గడుపుతూ ఆనందాన్ని పొందుతాయి, కానీ మనిషి మాత్రమే కంప్యూటర్ల ముందు కూర్చుని ఈ బేసిక్ ఫండమెంటల్స్‌ను మర్చిపోతున్నాడు. సంతానోత్పత్తి: సరైన హార్మోనల్ సెక్రేషన్ (ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రోన్) ఉండటం వల్ల సంతానోత్పత్తి మరియు నెలసరి సక్రమంగా ఉంటాయి. ఏమి చేయకూడదు? (What Not to Do?) చాలా మంది తమకు తెలియకుండానే చేసే చిన్న చిన్న పొరపాట్లు పెద్ద సమస్యలకు దారితీస్తాయి: ఆఫీస్ టెన్షన్లను ఇంటికి తీసుకురావద్దు: ఆఫీసు ఆలోచనలు ఇంటికి తీసుకురావడం వల్ల భాగస్వామిపై ధ్యాస తగ్గుతుంది, ఇది జడత్వానికి (Inertia) దారితీస్తుంది. సొంత వైద్యం వద్దు: ఎటువంటి అవగాహన లేకుండా పిల్స్ లేదా పీరియడ్స్ ఆపుకోవడానికి టాబ్లెట్లు వాడటం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. లక్షణాలను నిర్లక్ష్యం చేయవద్దు: హార్మోన్ల మార్పుల వల్ల గడ్డం దగ్గర వెంట్రుకలు రావడం వంటి సమస్యలు కనిపిస్తే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి, అంతేకానీ కేవలం బ్యూటీ పార్లర్లకు వెళ్లి తాత్కాలిక పరిష్కారాలు వెతకకూడదు. జనరిక్ మందుల పట్ల అపోహలు: జనరిక్ మందులు తక్కువ నాణ్యత గలవి అని అనుకోవద్దు; అవి కూడా అదే ఫార్ములాతో పనిచేస్తాయి. సమస్యను ఎలా అధిగమించాలి? (How to Improve?) జీవనశైలి మార్పులు: పిజ్జాలు, పాస్తాల వంటి వెస్ట్రన్ ఫుడ్ కంటే మన స్వచ్ఛమైన ఆహారానికి ప్రాధాన్యత ఇవ్వండి. ఫోర్ ప్లే (Foreplay) ప్రాముఖ్యత: భాగస్వామితో అనుబంధాన్ని పెంచుకోవడానికి మరియు ప్రేరేపించబడటానికి ఫోర్ ప్లే అనేది చాలా అవసరం. సరైన రోగ నిర్ధారణ: ఏదైనా సమస్య ఉన్నప్పుడు సీనియర్ ఫిజీషియన్‌ను కలిసి కనీసం అరగంట పాటు మీ కేస్ హిస్టరీని వివరించండి. సరైన డయాగ్నోసిస్ ద్వారా ఎటువంటి సుఖవ్యాధినైనా 15-20 రోజుల్లో నయం చేయవచ్చు. డైరీ నిర్వహణ: రోజూ పడుకునే ముందు ఆ రోజు మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి, ఎక్కడ లోపాలు ఉన్నాయి అనేది ఒక డైరీలో రాసుకోవడం వల్ల మానసిక స్థితి మెరుగుపడుతుంది. ప్రశ్నోత్తరాలు (Q&A) ప్ర: సెక్స్ పట్ల కోరికలు తగ్గడానికి ప్రధాన కారణం ఏమిటి?  జ: అధిక పని ఒత్తిడి (24 గంటలు పనిచేయడం), హార్మోన్ల అసమతుల్యత, మరియు వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల మారిన మానసిక స్థితి ప్రధాన కారణాలుగా ఉన్నాయి. ప్ర: యువతులలో కనిపిస్తున్న హార్మోన్ల సమస్యల లక్షణాలు ఏమిటి?  జ: 18-19 ఏళ్లకే నెలసరి ఆలస్యం కావడం, ముఖంపై (గడ్డం దగ్గర) దట్టమైన వెంట్రుకలు రావడం వంటివి హార్మోన్ల లోపానికి సంకేతాలు. ప్ర: ఎయిడ్స్ (HIV) సోకితే నయం కాదా?  జ: ఒకప్పుడు అది మహమ్మారిగా ఉండేది, కానీ ఇప్పుడు దానికి రెట్రోవర్టెడ్ ట్రీట్మెంట్ అందుబాటులోకి వచ్చింది. ఇమ్యూనిటీ లెవెల్స్ పెంచే మందుల ద్వారా దానిని కూడా నియంత్రించవచ్చు. ప్ర: సహజీవనం (Living Together) సెక్స్ జీవితంపై ఎలాంటి ప్రభావం చూపుతుంది?  జ: సహజీవనం వల్ల ఒకరి పట్ల ఒకరికి ఇంట్రెస్ట్ తగ్గే అవకాశం ఉంది. పెళ్లి అనే బంధంలో ఉండే ఆకర్షణ, గౌరవం ఇక్కడ లోపించవచ్చు. డబ్బు వెనకాల పరిగెత్తే క్రమంలో మన శరీరానికి భగవంతుడు ప్రసాదించిన వరాన్ని (సెక్స్ మరియు ప్రేమ) నిర్లక్ష్యం చేయకండి. సమస్య చిన్నదైనా, పెద్దదైనా సరైన నిపుణులను సంప్రదించి సంతోషకరమైన జీవితాన్ని గడపండి. మరిన్ని ఆరోగ్య సూత్రాలు మరియు నిపుణుల సలహాల కోసం మా TeluguOne Health యూట్యూబ్ ఛానెల్‌ని సందర్శించండి.. (సబ్స్క్రైబ్ చేసుకోండి)