శ్రీవారి పవిత్రతను కాపాడడమే ప్రథమ లక్ష్యం : సీఎం చంద్రబాబు

Publish Date:Mar 21, 2026

Advertisement

 

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి దివ్యక్షేత్రమైన తిరుమల పవిత్రతను కాపాడుతూ భక్తుల మనోభావాలకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ సేవలందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. శనివారం తిరుమలలో టీటీడీ ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి సమీక్షించారు. భక్తుల విశ్వాసాన్ని చూరగొనేలా, సాంకేతికతను జోడించి అత్యున్నత ప్రమాణాలతో కూడిన సేవలందించాలని అధికారులను దిశానిర్దేశం చేశారు. 


లడ్డూ ప్రసాదం నాణ్యత విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడొద్దని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఇక టీటీడీ ద్వారా పేదలకు అందిస్తున్న సేవలకు చెందిన వివిధ కార్యక్రమాలపై సీఎం ప్రత్యేకంగా సమీక్షించారు. తిరుమల కొండపై శ్రీవారి సేవకుల సేవలను పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలన్నారు. ఇక టీటీడీ చేపట్టే ధర్మ ప్రచారంలో భాగంగా పెద్ద ఎత్తున ఆలయాల నిర్మాణలపై దృష్టి సారించాలని సీఎం ఆదేశించారు. 

ఆధునిక ల్యాబ్ ఏర్పాటుతో కల్తీకి చెక్

ప్రసాదాల తయారీలో వాడే నెయ్యి, ఇతర ముడి పదార్థాల నాణ్యతను పరీక్షించేందుకు ఏర్పాటు చేసిన అత్యాధునిక ల్యాబ్‌ను ఎలాంటి లోటుపాట్లు లేకుండా నిర్వహించాలని, కల్తీకి ఏమాత్రం ఆస్కారం ఉండకూడదని ముఖ్యమంత్రి అధికారులకు స్పష్టం చేశారు. తాను స్వయంగా భక్తులను కలిసినప్పుడు వారు ప్రసాదం నాణ్యతపై సంతృప్తి వ్యక్తం చేశారని, ఆ నమ్మకాన్ని నిరంతరం కాపాడాలని అధికారులను ఆదేశించారు. ఇక క్యూలైన్లలో సామాన్య భక్తులు పడుతున్న ఇబ్బందులను తొలగించేందుకు ఏఐ టెక్నాలజీ వినియోగించాలని సూచించారు. 

టెక్నాలజీ సాయంతో రద్దీని క్రమబద్ధీకరించి, వేచి ఉండే సమయాన్ని తగ్గించి, సామాన్య భక్తుడికి సులభంగా స్వామివారి దర్శనం కల్పించాలన్నారు. టీటీడీ అనుబంధ వైద్య సంస్థలైన SVIMS, BIRRD, SPCHCలలో అందుతున్న వైద్య సేవలపై సమావేశంలో ముఖ్యమంత్రి చర్చించారు. SVIMS, BIRRD, SPCHCలలో చికిత్స పొందే అరుదైన కేసుల కోసం టీటీడీ బడ్జెట్‌లో నెలకు మరో రూ. 1 కోటి నిధులను ప్రాణదానం ట్రస్ట్ ద్వారా సమకూర్చుతున్నామని టీటీడీ ఉన్నతాధికారులు సీఎం దృష్టికి తెచ్చారు.

భక్తులకు అన్నప్రసాద విస్తరణ - శ్రీవారి సేవకుల సేవల వినియోగం

టీటీడీ సహా దాని పరిధిలోని 57 దేవాలయాల్లో అన్న ప్రసాదం జరుగుతోందని, మరో 4 దేవాలయాల్లో త్వరలోనే అన్నదానాన్ని ప్రారంభించోతున్నామని సమీక్షలో అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చారు. ఎన్టీఆర్ హయాంలో అన్నదాన కార్యక్రమం ప్రారంభమైందని... దీన్ని సమర్థవంతంగా నిర్వహించాలన్నారు. టీటీడీ దేవాలయాల్లోనే కాకుండా... రాష్ట్రంలోని వివిధ ప్రముఖ దేవస్థానాల్లో కూడా అన్న ప్రసాద వితరణ జరిగేలా చూస్తున్నట్టు ముఖ్యమంత్రి తెలిపారు. తిరుమల కొండపై శ్రీవారి సేవకుల సేవలను పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారు. 

ఇప్పటివరకు 17.12 లక్షల మంది సేవకులు తమ సేవలను అందించారని, సాధారణ రోజుల్లో 3000 మంది, రద్దీ రోజుల్లో 4000 మంది వరకు సేవకులు భక్తులకు సేవలందిస్తున్నారని అధికారులు చెప్పారు. వీరు అన్నదానం, క్యూలైన్ల నిర్వహణలో భాగస్వాములవుతున్నారని అధికారులు సీఎం దృష్టికి తెచ్చారు. వారి సేవలను మరింత సమర్థవంతంగా వినియోగించుకోవాలని సీఎం సూచించారు. 

అలాగే ధర్మ ప్రచారంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా రూ.750 కోట్లతో 5,000 నూతన ఆలయాల నిర్మాణం చేపడుతున్న ప్రణాళికలపై సీఎం చంద్రబాబు జరిపిన సమీక్షలో అధికారులకు కొన్ని సూచనలు చేశారు. దేశంలోని ప్రతి రాష్ట్ర రాజధానిలోనూ తిరుమల శ్రీవారి ఆలయం తరహాలో ఉండేలా నిర్మాణ ప్రతిపాదనలపై దృష్టి సారించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ సమీక్షలో మంత్రి అనగాని సత్యప్రసాద్, పలువురు ప్రజా ప్రతినిధులు, టీటీడీ ఉన్నతాధికారులు, తిరుపతి జిల్లా కలెక్టర్, ఎస్పీ పాల్గొన్నారు.
 

By
en-us Political News

  
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత.. రాష్ట్రానికి పెట్టుబడుల ప్రవాహం పెరిగింది. నెలరోజులలోనే రెండు లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులకు ఆమోదం తెలపడం నిజంగా చారిత్రాత్మకమని చెప్పవచ్చు.
సత్యవేడులో ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ రాయల్ ఎన్‌ఫీల్డ్ తన యూనిట్‌ను ఏర్పాటుకు ముందుకు వచ్చింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ చంద్రబాబు సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్ లో చేసిన ఆసక్తికర పోస్టు ఇప్పుడు తెగ వైరల్ అయ్యింది.
మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజా భవన్‌లో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అధ్యక్షతన శుక్రవారం జరిగిన కేబినెట్ సబ్ కమిటీ సమావేశంలో మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ప్రాజెక్టుకు సంబంధించిన సమగ్ర ముసాయిదా నివేదికను (డీపీఆర్) ఈ సందర్భంగా అధికారులు మంత్రుల ముందు ఉంచారు.
మనుషులు, స్తంభాలు, ఇతర నిటారుగా ఉన్న వస్తువుల నీడలు వాటి పాదాల కిందకే పరిమితమై.. బయటకు కనిపించవు. ఈ పరిస్థితి ఒకటి రెండు నిముషాల పాటు ఉంటుంది.
ఈ కాల్పుల విరమణ ఒప్పందం విషయాన్ని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ స్వయంగా తన సామాజిక మాధ్యవ మేదిక ట్రూత్ ద్వారా ప్రకటించారు. ఈ ఓప్పందం యుద్ధం ముగింపు దిశగా కీలక పురోగతి అని ఆయన పేర్కొన్నారు.
Fin Allen Sixers Fest in Delhi, easy, win, over, dc, ipl2026, 4th, concicutive
ఘటన సమయంలో ఇంటి పై అంతస్తులో ఇద్దరు పిల్లలు ఉండగా, తనూజ గ్రౌండ్ ఫ్లోర్‌లో ఒంటరిగా ఉన్నారు. ఇంట్లో పని చేసే కల్పన అనే మహిళ బయట వ్యక్తులతో సంప్రదింపులు జరిపి ఈ నేరానికి సహకరించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
అమెరికాలో నివసించే ఎన్ఆర్ఐ ధర్మేంద్ర అనే వ్యక్తిని ప్రేమ, పెళ్లి పేరుతో మోసం చేసి సుమారు రూ.కోట్లు తీసుకున్నారంటూ.. బాధితుడి తండ్రి ఫిర్యాదు ఆధారంగా సీసీఎస్ పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దీంతో ఈ కేసు సినీ, సోషల్ మీడియా వర్గాల్లో చర్చనీ యాంశంగా మారింది.
హైకోర్టులో ఒక పిటిషన్ విచారణ సందర్భంగా జూనియర్ న్యాయవాది వాదనలు వినిపిస్తున్నారు. ఆ సమయంలో జడ్జి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆయన కొంత అసహనానికి గురయ్యారు. ఆ క్రమంలో న్యాయవాది తన గౌరవానికి భంగం కలిగించేలా ప్రవర్తించారంటూ జడ్జి ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే కోర్టు ధిక్కరణ కిందకు వస్తుందని హెచ్చరిస్తూ.. అక్కడే ఉన్న పోలీసులను పిలిచి ఆ జూనియర్ అడ్వకేట్ ను 24 గంటల పాటు కస్టడీలోకి తీసుకోవాలని ఆదేశించారు.
ఏపీలో పెట్టుబడుల వాతావరణం పండుగలా సాగుతోందన్న ఆయన రాయల్ ఎన్‌ఫీల్డ్ సంస్థ ఆంధ్రప్రదేశ్‌లో తమ యూనిట్‌ను ఏర్పాటు చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందనీ, తద్వారా రాష్ట్ర యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలను లభించే అవకాశాలు దండిగా ఉంటాయన్నారు.
తనపై నమోదైన మోసం కేసులో దర్యాప్తును నిలిపివేయాలని, స్టే మంజూరు చేయాలని ఆమె దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయస్థానం తిరస్కరించింది. మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికీ, కఠిన చర్యలు తీసుకోకుండా పోలీసులను ఆదేశించడానికీ తిరస్కరించింది.
అమెరికాకు చెందిన యుఎస్ఎస్ బాక్సర్ అనే యుద్ధనౌక హోర్ముజ్ జలసంధి గుండా ప్రయాణిస్తుండగా.. ఇరాన్‌కు చెందిన ఒక డ్రోన్ ప్రమాదకర రీతిలో నౌకకు అత్యంత సమీపంలోకి వచ్చింది. సుమారు వెయ్యి గజాల దూరంలోకి వచ్చిన ఆ డ్రోన్.. నౌకలోని సిబ్బందికి, నౌక భద్రతకు ముప్పుగా మారుతుందని గుర్తించిన అమెరికా దళాలు వెంటనే అప్రమత్తమయ్యాయి.
వేద పండితులు ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి పెన్నా నది తీరం నుండి పుట్టిమట్టి తీసుకొచ్చి అమ్మవారి ప్రతిబింబాన్ని ప్రతిష్టించి జలాలతో అభిషేకాలు చేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.