జిల్లాలను ప్రమోట్ చేయండి...పెట్టుబడులను ఆకర్షించండి : సీఎం చంద్రబాబు

Publish Date:Mar 12, 2026

Advertisement

 

పెట్టుబడులు రాబట్టడం ఆయా శాఖలకు సంబంధించిన అంశంగా కాకుండా... జిల్లా కలెక్టర్లు కూడా బాధ్యతగా తీసుకోవాలని సీఎం చంద్రబాబు దిశా నిర్దేశం చేశారు. ఈ మేరకు పెట్టుబడులు రాబట్టుకునేలా సమావేశాలు నిర్వహించాలని కలెక్టర్లను ఆదేశించారు. జిల్లాల్లో పెట్టబుడులను రాబట్టేలా కలెక్టర్లు కమిట్మెంట్‌తో పెట్టుబడిదారులను అన్వేషించి... పెట్టుబడులు పెట్టేందుకు కన్విన్స్ చేసి... ముందుకు వచ్చిన వారికి పూర్తిగా కో-ఆపరేట్ చేయాలంటూ జిల్లా కలెక్టర్లకు 3C ఫార్మూలను ముఖ్యమంత్రి నిర్దేశించారు. 6వ జిల్లా కలెక్టర్ల సమావేశం రెండో రోజున ముఖ్యమంత్రి వివిధ అంశాలపై సమీక్షించారు. 

పెట్టబుడి, టూరిజం శాఖలపై జరిగిన చర్చలో సీఎం కీలకాంశాలు ప్రస్తావనకు వచ్చాయి. ఈ సందర్బంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ...”రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులను వేగంగా గ్రౌండ్ అయ్యేలా చర్యలు చేపట్టాలి. పెట్టుబడులను ఆకర్షించేలా జిల్లా కలెక్టర్లు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలి. పెట్టుబడులు వస్తే... స్థానికంగా యువతకు ఉపాధి, ప్రజల తలసరి ఆదాయం పెరుగుతాయి. విశాఖ, అమరావతి, తిరుపతి ప్రాంతాలను ఎకనామిక్ రీజియన్ డెవలప్మెంట్ పేరుతో అభివృద్ధి చేస్తున్నాం. విశాఖ రీజిజయన్ కు పరిశ్రమల శాఖ కార్యదర్శి యువరాజ్, అమరావతికి పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి సురేశ్, తిరుపతి రీజియన్ కు ముఖేష్ కుమార్ మీనా బాధ్యత వహిస్తారని తెలిపారు. 

రీజియన్ల వారీగా పరిశ్రమలు, పెట్టుబడులు, ఆయా ప్రాంతాల ఆర్థికాభివృద్ధి బాధ్యతను ఈ అధికారులు తీసుకుంటారు. పెట్టుబడులపై ఎప్పటికప్పుడు కలెక్టర్లు సమీక్షించి ప్రాజెక్టులు గ్రౌండ్ అయ్యేందుకు తక్షణం చర్యలు చేపట్టాలి. అనుమతులు వేగంగా ఇవ్వటంతో పాటు భూ కేటాయింపులు కూడా యుద్ధ ప్రాతిపదికన జరిగేలా చూడాలి. పరిశ్రమలకు నీటిని ఇస్తేనే వేగంగా ఉత్పాదన ప్రారంభిస్తారు. ఓర్వకల్లులో పారిశ్రామిక క్లస్టర్ రూపకల్పన చేశాం. ఇప్పుడు ఎయిర్ పోర్టు లాంటి మౌలిక సదుపాయాలు కూడా వచ్చాయి. ఇప్పుడు భవిష్యత్తులో ఓ మేజర్ పారిశ్రామిక హబ్ గా మారుతుంది. కడప జిల్లాలో కొప్పర్తి కూడా ఆ పారిశ్రామిక క్లస్టర్ గా తయారు కావాలి.”అని ముఖ్యమంత్రి చెప్పారు.

పెట్టుబడులపై జిల్లాల్లోనూ సమావేశాలు పెట్టాలి

“పెట్టుబడులపై జిల్లాల్లో కూడా సమావేశాలు నిర్వహించాలి. పెట్టుబడులు రాబట్టేందుకు కలెక్టర్లు చొరవ తీసుకోవాలి. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానంపై జిల్లాల వారీగా ర్యాంకులిస్తాం. 2019-24లో రాష్ట్రానికి పెట్టుబడులు పెట్టడానికి ఎవ్వరూ ముందుకు రాలేదు. అమర్ రాజా కంపెనీ తిరుపతిలో కార్పోరేట్ ఆఫీస్ పెట్టింది... వారినీ గత పాలకులు పారిపోయేలా చేశారు. 2014-19లో పరిశ్రమలకు ఇచ్చిన భూములను గత ప్రభుత్వం వేరే అవసరాలకు వాడేసింది. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఏపీని బెంగళూరుకు పోటీగా తీర్చిదిద్దాం. మోస్ట్ లివబుల్ సిటీగా హైదరాబాద్ ను తీర్చిదిద్దాం... ఎకో సిస్టం కల్పించాం. ఇప్పుడు ఆ ఫలితాలు హైదరాబాద్ అనుభవిస్తోంది. 

ఇప్పుడు రాష్ట్రం మొత్తం అదే తరహా ఎకో సిస్టం ఏర్పాటు చేస్తున్నాం. ఏదైనా జిల్లాల్లో పరిశ్రమలు రాకుంటే ఆ జిల్లాల్లో టూరిజం ప్రమోట్ చేయాలి... లేదా ఐటీని ప్రమోట్ చేయాలి... ఎంఎస్ఎంఈలు ప్రమోట్ చేయాలి.. అగ్రికల్చర్ ప్రమోట్ చేయాలి. ఇలా ఏదో ఒక రంగంలో ఆయా జిల్లాలకున్న ప్రత్యేకతలను, అనుకూలతలను దృష్టిలో పెట్టుకుని ఆయా రంగాల్లో అభివృద్ధి చేయాలి. జిల్లాలకున్న అడ్వాంటేజీలను ప్రమోట్ చేసి పెట్టుబడులను ఆకర్షించాలి. పెట్టుబడులు పెట్టేవారందరూ తమ దగ్గరకే రావాలని జిల్లా కలెక్టర్లు... మంత్రులు అనుకోకూడదు. 

పెట్టుబడులు పెట్టే వారెవరో గుర్తించి వారిని కలెక్టర్లు, మంత్రులు సంప్రదించే పరిస్థితి రావాలి. ఇదే విధంగా హైదరాబాద్ ను ప్రమోట్ చేయడం వల్లే ISB వచ్చింది. జిల్లాల్లో వచ్చిన పెట్టుబడులు, ఉద్యోగాలు, తలసరి ఆదాయం ఎంతమేర పెంచాం అన్నదానిపై జిల్లా కలెక్టర్లు దృష్టి పెట్టాలి. తదుపరి సమావేశం నుంచి ఏ జిల్లా కలెక్టర్ ఎంతమేర పరిశ్రమల్ని ప్రోత్సహించారన్న దానిపై సమీక్షిస్తాం. పోర్టులు, ఎయిర్ పోర్టులు, రైల్వే లాంటి ఇన్ఫ్రా ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. హిందుపూర్ సమీపంలో ఎలక్ట్రానిక్స్ సిటీని ఏర్పాటు చేయాలని ఆలోచన చేస్తున్నాం.”అని సీఎం చంద్రబాబు చెప్పారు.

ఆతిథ్య రంగంలో అభివృద్ధికి ఆస్కారం

“ఏపీలో ఆతిథ్య రంగానికి పెద్ద ఎత్తున అవకాశాలు ఉన్నాయి. అందుకే పర్యాటకానికి పారిశ్రామిక హోదాను కల్పించాం. ఏమీ లేని ప్రాంతాల్లోనే కొన్ని దేశాల్లో టూరిజం అభివృద్ధి చేస్తున్నారు. ఏపీలో అనేక చరిత్రాత్మక ప్రాంతాలు.. ఎన్నో పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. వాటిని అభివృద్ధి చేసే అంశంపై ఫోకస్ పెట్టాలి. పురాతన కట్టడాలు చాలా ఉన్నాయి.. వాటికి ఎంతో చరిత్ర ఉంటుంది.. వాటిని ఎంకరేజ్ చేయాలి. రాష్ట్ర వ్యాప్తంగా 50 వేల హోటల్ గదులు సిద్ధం కావాలి. వివిధ ప్రాంతాల్లో హోమ్ స్టేలు పెద్ద ఎత్తున రావాలి. కన్వెన్షన్ సెంటర్లు, మైస్ సెంటర్లు నిర్మాణం చేయాలి. యుద్ధ ప్రభావాల నేపథ్యంలో విదేశాల కంటే స్థానికంగా ఉండే పర్యాటకానికి పెద్దఎత్తున ఆకర్షణ పెరుగుతుంది. దేవాలయాలు పవిత్రమైన ఆధ్యాత్మిక క్షేత్రాలతో పాటు... మానసిక ఉల్లాసాన్ని కలిగించే ప్రాంతాలు వాటిని అభివృద్ధి చేయాలి. 

పాపికొండలు, గండికోట భారత్ కే గ్రాండ్ కాన్యన్, సూర్యలంక మరో గోవాగా తయారవుతుంది. జిల్లాల వారీగా ఆయా ప్రాంతాల్లో ఉన్న పర్యాటక కేంద్రాలను అభివృద్ధి చేయాలి. టూరిజం ఎక్స్ పీరియన్స్ సెంటర్లను ఏర్పాటు చేయటంతో పాటు మాన్యుమెంట్లను కూడా అభివృద్ధి చేయాలి. తిమ్మమ్మ మర్రిమాను వద్ద మౌలిక సదుపాయాలు కల్పిస్తే మంచి పర్యాటక ప్రాంతంగా మారుతుంది. కంభం చెరువు ఆసియాలోనే అతిపెద్ద మానవ నిర్మిత నీటి వనరు. పులికాట్ సరస్సులో పర్యాటక ప్రాజెక్టును ప్రతిష్టాత్మక కంపెనీలకు అప్పగించి అభివృద్ధి చేయాలి. స్థానికుల్ని ఈ ప్రాజెక్టుల్లో భాగస్వామ్యం చేయటం ద్వారా వేగంగా అభివృద్ధి జరుగుతుంది. 

జాతీయ రహదారులపై వే సైడ్ అమెనిటీస్, ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు, నైట్ హాల్ట్ కోసం గదులు నిర్మాణం చేపడితే పెట్టుబడులు వస్తాయి. ఏపీఐఐసీ ద్వారా చేసే ల్యాండ్ అలాట్మెంట్ లో 5 ఎకరాల వరకూ కేటాయింపులు చేసేలా జిల్లా కలెక్టర్లకు ఆథరైజేషన్ ఇచ్చేలా చర్యలు తీసుకోవాలి. విజయవాడలోని డిస్నీల్యాండ్, భవానీ ఐ ల్యాండ్ లను పర్యాటకంగా అభివృద్ధి చేద్దాం. అమరావతిలో క్రియేటివ్ సిటీ ఏర్పాటు చేస్తాం. అమరావతిలో కంటెంట్ క్రియేషన్ చేసే వారిని ప్రొత్సహిస్తాం. ఏఐ, ఫిలిం, కంటెంట్ క్రియేషన్ పరిశ్రమలకు పెద్ద పీట వేస్తాం. రాష్ట్రంలో క్రియేటివ్ ఎకానమీ పెరిగేందుకు వీలుగా ప్రత్యేక చర్యలు చేపడుతున్నాం.”అని ముఖ్యమంత్రి వివరించారు. ఈ సమావేశంలో మంత్రులు, వివిధ శాఖల ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్లు పాల్గొన్నారు.

By
en-us Political News

  
అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ లతో యోగభ్యాసం చేయించిన రామ్ దేవ్ బాబా
ఆంధ్రప్రదేశ్‌లో తీవ్ర సంచలనం సృష్టిస్తున్న రౌడీషీటర్ గాదె సాయికృష్ణ అదృశ్యం, అలాగే పోలీసుల కస్టడీలోనే అతను మరణించాడంటూ వస్తున్న ఆరోపణలపై రాష్ట్ర ప్రభుత్వం అత్యంత కీలక నిర్ణయం తీసుకుంది.
యోగా గురు  బాబా రామ్‌దేవ్‌తో కలిసి ఆయన ఈ వేడుకల్లో పాలుపంచుకున్నారు. ఇక్కడి ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం  జరిగిన ఈ  కార్యక్రమంలో వేలాది మంది   పాల్గొని రికార్డు సృష్టించారు.
ఈ నెల 26వ తేదీ వరకు మధ్యం తర బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కోర్టు ఆదేశాల మేరకు బండి భగీరథ జైలు నుంచి మధ్యంతర బెయిల్‌ పై విడుదలయ్యారు.
. ఆ అంగన్వాడీ కేంద్రంలో పిల్లల కోసం అందుబాటులో ఉన్న వసతులు, గర్భిణులు, బాలింతలకు అందుతున్న పోషకాహార సేవలపై ఆరా తీశారు. కేంద్రంలోని నిల్వల రిజిస్టర్లను పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అక్కడి సిబ్బంది సరికొత్త ఇండక్షన్ స్టవ్‌పై తయారు చేసిన రాగి జావను సీఎంకు అందించగా.. ఆయన చిన్నారుల పక్కనే కూర్చుని దానిని సేవించారు. పర్యావరణ పరిరక్షణను ప్రోత్సహించేలా అంగన్‌వాడీ ఆవరణలో ఒక మొక్కను నాటారు.
2027 వన్డే ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకుని అతని వర్క్‌లోడ్‌ను మేనేజ్ చేయడానికే బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుందని సమాచారం. ప్రస్తుతం హార్దిక్ బౌలింగ్ చేసేందుకు పూర్తిగా ఫిట్‌గా లేడని సమాచారం. ప్రస్తుతం శుభ్‌మన్ గిల్ సారథ్యంలో అఫ్గానిస్థాన్‌తో జరుగుతున్న వన్డే సిరీస్‌లో కూడా హార్దిక్ ఆడటం లేదు.
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తన పల్నాడు జిల్లా పర్యటనలో ఒక సామాన్య గృహస్థుడిగా మారిపోయారు. స్థానిక రైతు క్షేత్రంలో ప్రకృతి సిద్ధంగా తయారు చేసిన కోల్డ్‌ప్రెస్డ్ వేరుశనగ నూనెను కొనుగోలు చేసే క్రమంలో ఆయన తన సతీమణి భువనేశ్వరికి ఫోన్ చేశారు. చేసి వేరుశనగ నూనె కొనమంటావా అని అడిగారు.
సౌతాంప్టన్‌లోని రోజ్ బౌల్ మైదానంలో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 123 పరుగులు చేసింది. కెప్టెన్ నిగర్ సుల్తానా 36 పరుగులు, శోభన మోస్తరీ22 పరుగులతో రాణించారు. ఇక చివరి ఓవర్లలో షోర్నా అక్తర్ కేవలం 22 బంతుల్లోనే 5 ఫోర్ల సాయంతో అజేయంగా 39 పరుగులు సాధించడంతో బంగ్లా జట్టు ఆ మాత్రం స్కోరైనా చేరగలిగింది. పాకిస్థాన్ బౌలర్లలో ఫాతిమా సనా రెండు వికెట్లు పడగొట్టింది.
ఆ తర్వాత అజ్మతుల్లా ఒమర్జాయ్ వేసిన ఇన్నింగ్స్ మొదటి ఓవర్‌లో భారత యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ బౌండరీలతో విరుచుకుపడ్డాడు. అంపైర్ ఇచ్చిన పెనాల్టీ రన్స్ తో కలిసి టీమ్ ఇండియా తొలి ఓవర్ లో ఏకంగా 23 పరుగులు సాధించింది. దీంతో 2004లో బంగ్లాదేశ్‌పై తొలి ఓవర్లోనే 22 పరుగులు సాధించి నెలకొల్పిన పాత రికార్డు కనుమరుగైపోయింది.
ఇందులో సబ్జెక్టు పరిజ్ఞానంతో పాటు ఆధునిక ప్రపంచానికి అవసరమైన ప్రాథమిక డిజిటల్ నైపుణ్యాలపై కాలేజీలోనే ప్రత్యేక శిక్షణ ఇస్తారు. ఆ తర్వాత డిగ్రీ చివరి సంవత్సరం అంటే మూడో ఏడాదిలో విద్యార్థులు నేరుగా క్షేత్రస్థాయి పరిశ్రమలతో అనుసంధానమైన ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్‌లోకి అడుగుపెడతారు.
అయితే బస్సును సీజ్ చేసిన తర్వాత ప్రయాణికుల గమ్యస్థానానికి వెళ్లేందుకు ప్రత్యామ్నాయ బస్సు ఏర్పాటు చేయడంలో అధికారులు విఫలమయ్యారు. దీంతో మహిళలు, చిన్నారులు, వృద్ధులతో సహా ప్రయాణికులందరూ రాత్రంతా సీజ్ చేసిన బస్సులోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.
నగరంలోని వీఆర్సీ సెంటర్ సమీపంలో, అలాగే రూరల్ పరిధిలో ఆమె ఒక పక్కా ప్లాన్ ప్రకారం నెట్‌వర్క్ ఏర్పాటు చేసుకుని తన దందా సాగించింది.
బడ్జెట్ ధరలో బెస్ట్ ఎలక్ట్రిక్ కారు కోసం చూస్తున్నారా సిట్రోయెన్ ఈసీ3ఎక్స్ మరియు టాటా టియాగో ఈవీ కార్ల ధర, మైలేజ్ రేంజ్, బ్యాటరీ సామర్థ్యం మరియు సేఫ్టీ ఫీచర్ల పూర్తి వివరాలు మీకోసం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.