సిద్దం సిద్దం అన్నారు... అసెంబ్లీకి వచ్చేందుకు సిద్దమా!

Publish Date:Sep 1, 2025

Advertisement

 

సిద్ధం సిద్ధం అని నినాదాలు చేసిన వారికి ఓ సవాల్ విసురుతున్నాను. వైసీపీని సూటిగా అడుగుతున్నాను. అసెంబ్లీకి వచ్చేందుకు వైసీపీ సిద్ధమా ?అసెంబ్లీకి రండి  ఎవరిది అభివృద్ధో.. సంక్షేమం ఎవరు అందించగలరో చర్చకు నేను సిద్ధం. వైసిపి వేసే ప్రశ్నలకు సమాధానం చెప్పేందుకు నేను సిద్ధం. చర్చించడానికి వైసిపి సిద్ధమా అంటూ తెలుగుదేశం పార్టీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వైసీపీపై ఫైర్ అవుతూ సవాలు విసిరారు .

అంతేకాదు పులివెందుల,ఒంటిమిట్ట ఎన్నికైపైనా చర్చకు సిద్ధం, బాబాయి హత్య పైనా చర్చకు సిద్ధం, దళిత డ్రైవర్ ను  డోర్ డెలివరీ చేసిన ఘటన  పైనా చర్చకు సిద్ధం ,కోడి కత్తి డ్రామా.. గులకరాయి డ్రామాల పైనా సిద్ధిమంటూ సవాల్ విసిరారు. ప్రజల సేవలో కార్యక్రమంలో భాగంగా పింఛన్లు పంపిణీ ,బంగారు కుటుంబాలు ,తదితర కార్యక్రమంలో పాల్గొనేందుకు సోమవారం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నమయ్య జిల్లా రాజంపేటకు వచ్చారు. ఈ సందర్భంగా పలు కార్యక్రమాలు చేపట్టిన  అనంతరం ఆయన ప్రజా వేదికపై నుంచి మాట్లాడుతూ వైసిపి పలు అంశాలపై చర్చించేందుకు సిద్ధమా అంటూ సవాల్ విసిరారు.ఇందుకోసం వైసీపి వారు అసెంబ్లీ కి వచ్చి చర్చించాలన్నారు.

ఏనాడు విశ్రాంతి తీసుకోలేదు 

   రాజకీయ జీవితంలో నేను ఏనాడూ విశ్రాంతి తీసుకోలేదు. పిల్లలకు బంగారు భవిష్యత్తు అందించాలనేదే నా ఆశయంమని, ఎవరైనా పింఛను తీసుకోకున్నా వచ్చే నెల అందిస్తున్నామని పేదవాడి జీవితాల్లో వెలుగులు నింపాలనేదే మా లక్ష్యంమని అన్నారు .అభివృద్ధి జరగాలి.. ఆదాయం పెరగాలి - ఆర్థిక సంస్కరణలు అమలు చేస్తేనే మార్పులు వస్తాయిని పేర్కొన్నారు .రాయలసీమ ఇకనుంచి రాళ్ల సీమ కాదు, రతనాల సీమను చేస్తామన్నారు. 2014-19 మధ్య దేశంలో ఎక్కడా జరగని అభివృద్ధిని చేసి చూపించామని,కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రజలకు మళ్లీ స్వేచ్ఛ వచ్చిందన్నారు.మొన్నటి ఎన్నికల్లో ప్రజలు కూడా ఎంతో విజ్ఞత  చూపించాన్నారు.

*గత పాలకు రక్తం పాలించారు.

గత పాలకులు రాయలసీమలో రక్తం పారించారని,మేం వచ్చాక రాయలసీమలో సాగునీరు పారిస్తున్నామని అన్నారు.కష్టాల్లో ఉన్న మామిడి రైతులను మేం ఆదుకున్నామని మామిడికాయలు రోడ్డుపై పోసి వైసీపీ నేతలు డ్రామాలు ఆడారని అన్నారు. సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టేముందు పదిసార్లు ఆలోచించాలని,మహిళల ఆత్మగౌరవం దెబ్బతిస్తే కఠిన చర్యలు తప్పవని ఆడవాళ్ళు పై అఘాయిత్యాలకు పాల్పడితే అదే మీకు చివరి రోజని హెచ్చరించారు.

*రాజంపేట మీదుగా కోడూరు కు నీళ్ళు

కడప, రాజంపేట మీదుగా కోడూరుకు నీళ్లు తీసుకెళ్తామని, రాజంపేటలో వ్యవసాయం తగ్గి ఉద్యానపంటలు పెరిగాయని అన్నారు .రాజంపేటలో డెయిరీ, పశుసంపద బాగా పెరిగిందని అన్నారు. ఒంటిమిట్టను టిడిపి దత్తత తీసుకుందని, అనే కార్యక్రమాలు చేపడతామని, మా దృష్టిలో అభివృద్ధి వేరు రాజకీయాలు వేరని అన్నారు.

*నదులు అను సంధానం 

గంగానది నుంచి కావేరి వరకు నదుల అనుసంధానం జరగాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. వంశధార నుంచి గోదావరి, కృష్ణా, పెన్నా నదులు అనుసంధానం చేస్తామని తెలిపారు. మీరు ఆశీర్వదిస్తే చాలు కొండలనైనా పిండి చేస్తామని అన్నారు.

*ప్రజల ఆరోగ్యం కోసం సంజీవిని

సంజీవని పేరుతో ప్రాజెక్టు తెస్తున్నామని,ప్రజలంతా ఆరోగ్యంగా ఉండాలనే సంకల్పంతో ఈ ప్రాజెక్టు తీసి కొలుస్తున్నారు.

*అనర్హులకు పించన్లు సరైనదేనా!

అవయవాలన్నీ సక్రమంగా ఉన్న వారికి కూడా గత ప్రభుత్వం దివ్యాంగుల పెన్షన్ ఇచ్చిందని,అలాంటి వారికి వారికి పెన్షన్లు ఇవ్వడం సరైందేనా...? ప్రజలు ఆలోచించాలని చంద్రబాబు కోరారు. అనర్హులకు పెన్షన్ తీసేయండని చెప్పే ధైర్యం ప్రజలకు రావాలని అన్నారు. వైసీపీ వాళ్ళు పెన్షన్లు ఇవ్వకుండా అడ్డుపడతారు, పోలవరం, అమరావతిని ఆపేస్తున్నారు. రోడ్లకు గుంతలు పెట్టారని అన్నారు. వాళ్ల కారుతోనే సింగయ్యను తొక్కించి చంపేశారని,తిరిగి మనపైనే నెపాన్ని నెడుతున్నారని,మామిడి రైతుల విషయంలోనూ డ్రామాలు ఆడారని అన్నారు.

*సీమకు నీళ్ళిచ్చే దారి చూపిన ఎన్టీ ఆర్ 

రాయలసీమకు నీళ్లిచ్చే దారి చూపిన నాయకుడు ఎన్టీఆర్ అని,రాయలసీమకు నీళ్లు తెస్తామని,నిన్ననే కుప్పానికి నీళ్లు తీసుకెళ్లానని  భవిష్యత్తులో రాజంపేట, కోడూరుకు నీళ్లు తెస్తామని,రాయలసీమకు కరవు లేకుండా చేస్తామని బరోసా ఇచ్చారు. కరవు జిల్లా అనంతపురానికి కియా తెచ్చాని,ఇవాళ ఆ జిల్లా రూపు రేఖలు మారిపోయాయని అన్నారు. రాయలసీమకు పెద్ద ఎత్తున పెట్టుబడులు తెస్తున్నాం. సూపర్ సిక్స్ సూపర్ హిట్ అయిందన్నారు.
సంక్షేమానికి సాటి లేదు, అభివృద్ధికి అడ్డు లేదు, సుపరిపాలనకు పోటీ లేదని అన్నారు.నా బలం బలగం ప్రజలే అన్నారు. స్త్రీ శక్తి ఏంటో ప్రపంచానికి చూపుతాం లక్ష మంది మహిళలను పారిశ్రామిక వేత్తలుగా చేస్తామని అన్నారు.

*ఎన్నో వడిదుడుకులు ఎదుర్కొన్నా

ముఖ్యమంత్రిగా మొదటిసారి ప్రమాణ స్వీకారం చేసిన సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ చంద్రబాబు నాయుడు సమైఖ్య రాష్ట్రంలో నేనే ఎక్కువ కాలం ముఖ్యమంత్రిగా ఉన్నానని చెప్పారు. 30 ఏళ్ల కాలంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నానని,అయినా పేదల సంక్షేమం కోసం పని చేస్తున్నాని,పేదల అభ్యున్నతి కోసం నిరంతరం పని చేస్తూనే ఉంటానని అన్నారు. ఈ 30 ఏళ్ల కాలంలో సంపద సృష్టించి,సంక్షేమం చేయడమే నాకు తృప్తి కలిగిందన్నారు.

అప్పులు చేసి బాగుపడ్డ వారు లేరని,అప్పు చేసి పప్పు కూడు తింటే... చిప్పే మిగులుతుందని అన్నారు.ఆదాయాన్ని పెంచిపేదలకు సంక్షేమం అందించాలి.. అదే నేను చేస్తున్నానన్నారు.
ఐటీ, హైటెక్ సిటీ అంటే ఎగతాళి చేశారని,కానీ చాలా కుటుంబాలను ఆర్థికంగా ఎదిగేలా చేసింది ఐటీనే అని,
ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వాళ్లు విస్తరించడానికి కారణం ఐటీనే కారణమన్నారు.హైదరాబాద్ విశ్వనగరంగా మారిందని,బాగా అభివృద్ధి జరిగిందని అన్నారు. టీడీపీ ప్రభుత్వాలు చేసినవి గుర్తు పెట్టుకోండి.. అభివృద్ధి వైంకుఠపాళి కాకూడదని అన్నారు. 

2019-24లో ప్రభుత్వం మారిందిని, రాష్ట్రంలో విధ్వంసం జరిగిందని, పవన్ కళ్యాణ్ సహకారంతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు కలిసి పోటీ చేశామని అన్నారు. ఎమ్మెల్యేలు తప్పు చేస్తే నిలదీయగలుగుతున్నారని ఇదీ మేం ఇచ్చిన స్వేచ్ఛ అని అన్నారు . రాజంపేట చంద్రబాబు పర్యటనలో అన్నమయ్య జిల్లా ఇన్చార్జి మంత్రి బిసి జనార్ధన్ ,రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, రాజంపేట నియోజకవర్గ ఇన్చార్జి  జగన్మోహన్ రాజులతో పాటు జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి ఇతర అధికారులు, అనధికారులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు

By
en-us Political News

  
పార్లమెంట్‌లో మహిళా రిజర్వేషన్ బిల్లు పాసైనా, అవ్వకపోయినా, తెలుగుదేశం పార్టీ తరఫున మహిళలకు 33 శాతం సీట్లు కేటాయించి తీరుతాం అని మహానాడు వేదికగా లోకేష్ ప్రకటించారు.
ఈ రెండు రోజుల వేడుకలో వివిధ అంశాలపై మొత్తం 20 తీర్మానాలను ప్రవేశపెట్టి ఆమోదించనున్నారు. కాగా మంత్రి నారా లోకేష్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తరువాత జరుగుతున్న తొలి మహానాడు కావడంతో ఇప్పుడు అందరి దృష్టీ ఆయనపైనే ఉంది.
ప్రధాని మోదీతో జరిగే ఈ సమావేశంలో రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలు చర్చించే అవకాశం ఉన్నాయని అంటున్నారు. ముఖ్యంగా పారిశ్రామిక రంగ అభివృద్ధి, సంక్షేమ పథకాలు, మౌలిక వసతుల విస్తరణకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ సహకారాన్ని సీఎం విజయ్ కోరే అవకాశం ఉందని అంటున్నారు. ప్రధాని మోదీతోనే కాకుండా విజయ్ తన హస్తిన పర్యటనలో కేంద్ర విత్త మంత్రి నిర్మలా సీతారామన్‌తో కూడా భేటీ కానున్నారు.
ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తన ఢిల్లీ పర్యటనను ఎక్స్ టెండ్ చేసుకున్నారు. గురువారం( మే 28) ఉదయం బెంగళూరులోని ముఖ్యమంత్రి అధికారిక నివాసంలో సిద్ధరామయ్య ఏర్పాటు చేసిన బ్రేక్‌ఫాస్ట్ మీటింగ్‌కు ఆయన హాజరుకావలసి ఉంది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ, కర్ణాటకకు చెందిన అగ్ర నాయకుల మధ్య సుమారు ఏడు గంటల పాటు సాగిన సుదీర్ఘ సమావేశం తర్వాత ఈ పరిణామాలు చోటుచేసుకున్నాయి.
కర్ణాటక తదుపరి సీఎం ఎవరనే ఉత్కంఠకు తెరదించుతూ, కాంగ్రెస్ ట్రబుల్ షూటర్, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌కు కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంకా గాంధీ వాద్రా పూర్తి మద్దతు ప్రకటించినట్లు ప్రచారం సాగుతోంది. 2023 మేలో జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించిన సంగతి తెలిసిందే.
తమిళనాడులో అన్నాడీఎంకేకు వరుస షాక్‌లు తగులుతున్నాయి.
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పార్టీ అంతర్గత వ్యవహారాల్లో సంచలన నిర్ణయాలు తీసుకోవడం ప్రారంభించారు.
దక్షిణాది సినీ రంగంలో తిరుగులేని చక్రవర్తిగా వెలిగి
తమిళనాడు రాజకీయ ముఖచిత్రం ఒక్కసారిగా మారిపోయింది. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల అనంతరం ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
పేటీఎం బ్యాచ్, రూ.5 బ్యాచ్.. ఇవి గత కొన్నేళ్లుగా ఉన్నా, ఇప్పటికీ ఫుల్ ట్రెండింగ్‌లో ఉన్న పదాల్లో కొన్ని. ఒక పార్టీకి మద్దతుగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడానికి, ట్రోల్స్ చేయడానికి డబ్బులు తీసుకునే వారిని, మరీ ముఖ్యంగా వైసిపి సోషల్ మీడియా వింగ్‌ను, టిడిపి, జనసేన శ్రేణులు పేటీఎం బ్యాచ్ అని పిలుస్తుంటారు. ప్రతి పోస్టుకు ఐదు రూపాయలు ఇస్తారనే ప్రచారంతో ఐదు రూపాయల బ్యాచ్ అని కూడా అంటారు.
సీఎం, మంత్రుల హెలికాప్టర్ పెద్దగుట్టపై ల్యాండ్ అయినప్పటికీ.. అక్కడ వారిని రిసీవ్ చేసుకోవడానికి కనీసం ఒక్క జిల్లా ఉన్నతాధికారి కూడా అందుబాటులో లేకపోవడం తీవ్ర కలకలం రేపింది. వేద పాఠశాల శంకుస్థాపన ప్రాంగణమైన పెద్ద గుట్టపై సీఎం హెలికాప్టర్ ల్యాండ్ అయినా, అధికారుల మధ్య కమ్యూనికేషన్ గ్యాప్, సమన్వయ రాహిత్యం కారణంగా ముఖ్యమంత్రికి స్వాగతం పలికేందుకు కలెక్టర్ గానీ, ఎస్పీ గానీ, ఇతర ప్రోటోకాల్ అధికారులు గానీ సమయానికి అక్కడకు చేరుకోలేకపోయారు.
రాయలసీమ అభివృద్ధిపై ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని తీవ్రస్థాయిలో ఎండగట్టారు మంత్రి నారా లోకేష్. గత ఐదేళ్లలో సీమ ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేస్తూ జగన్ ఈ ప్రాంతానికి క్యాన్సర్ గడ్డలా మారారని విమర్శించారు.
ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు ప్రొఫెసర్ కె. నాగేశ్వర్‌పై ఆంధ్రప్రదేశ్‌లో కేసు నమోదైంది. టీవీ డిబేట్‌లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఏపీ డిఫ్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌లపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో జనసేన ఫిర్యాదుతో పోలీసులు ఈ చర్య తీసుకున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.