రాయలసీమకు నీరిచ్చానన్న తృప్తి చాలు : సీఎం చంద్రబాబు

Publish Date:Jul 17, 2025

Advertisement

 

నంద్యాల జిల్లా మల్యాల పంపింగ్ స్టేషన్‌లో హంద్రీనీవా కాలువలకు నీటిని విడుదల చేసిన అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతు నందికొట్కూరులో ఉండే హంద్రీ-చిత్తూరులోని నీవాని కలపాలి అనుకున్నాప్పుడు అసాధ్యం అన్నారు. ఆ కల కనింది నందమూరి తారక రామారావు అయితే దాన్ని మేము సాకారం చేశామని చంద్రబాబు తెలిపారు.  రాయలసీమ నీరిచ్చానన్న తృప్తి  నాకు చాలు. హంద్రీనీవాతో 6లక్షల ఎకారాలకు నీరు అందుతుంది. సీమ చరిత్రను మార్చాలని హంద్రీనీవా, గాలేరునగరి, తెలుగుగంగకు శ్రీకారం చుట్టింది. ఎన్టీఆరే అని సీఎం చంద్రబాబు తెలిపారు. వైసీపీ ఫేక్ పార్టీ అని ఐదేళ్లలో రూ. 2 వేల కోట్లు కూడా సీమ కోసం జగన్ ఖర్చు చేయలేదని ఆయన తెలిపారు. 

 వైసీపీ ప్రాజెక్టులను నిర్వీర్యం చేసింది. రాయలసీమ గురించి మాట్లాడే అర్హత ఆపార్టీకి లేదు అని ముఖ్యమంత్రి తెలిపారు. ముఖ్యమంత్రి పని చేసిన వ్యక్తి రౌడిషీటర్లు, గంజాయి బ్యాచ్‌ను పరామర్శించేందుకు వెళ్తారా? ఇలాంటి వారు రాజకీయల్లో ఉండాలా? అని ముఖ్యమంత్రి ప్రశ్నించారు. అన్నదాత కష్టపడి పండించిన మామిడి కాయలను రోడ్లపై తొక్కించారు. ఐదేళ్లలో రాష్ట్రంలో విధ్వంసం సృష్టించారు. రౌడీలు తోక జాడిస్తే కట్ చేస్తాం మీరు ఏం చేసిన నిఘా ఉంచుతాం అని ముఖ్యమంత్రి హెచ్చరించారు. రాయలసీమ కరవు, కష్టాలు, ప్రజల బాధలు నాకు తెలుసు. నేను ఇక్కడే పుట్టాను. ఇక్కడే పెరిగాను. అనంతపురంలో కరవు వస్తే గడ్డి తెచ్చి పశువులను కాపాడిన పార్టీ మాది. రాయదుర్గం ఎడారిగా మారకుండా చర్యలు తీసుకున్నాం. సీమ చరిత్రను తిరగరాయాలని ఎన్టీఆర్‌ తొలిసారి ఆలోచించారు. 

హంద్రీనీవా నీరు 550 కి.మీ ప్రవహించి చిత్తూరు, కుప్పం వరకు వెళ్తోంది. ఈ ప్రాజెక్టు ద్వారా 6 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది. మల్యాల ద్వారా సుమారు 4 టీఎంసీల నీరు తీసుకెళ్లవచ్చు. కృష్ణగిరి, పత్తికొండ, జీడిపల్లి, పీఏబీఆర్‌, మారాల, గొల్లపల్లి, చెర్లోపల్లి, మదనపల్లె, చిత్తూరుకు నీరిచ్చే అవకాశం వస్తుంది. సమస్య ఎదురైతే సవాలుగా తీసుకొని పనిచేసే మనస్తత్వం నాది.  గత వైసీపీ ప్రభుత్వం పింఛను రూ. వెయ్యికి పెంచేందుకు ఐదేళ్ల సమయం తీసుకుంది. కూటమి ప్రభుత్వం వచ్చాక ఒకేసారి రూ. వెయ్యి పెంచి పింఛను ఇచ్చాం. దివ్యాంగుల పింఛను ఒకేసారి రూ.6 వేలకు పెంచిన ఘనత మాదే. పేదవాడికి అన్నం పెట్టే క్యాంటీన్లు మూసేశారు. మేం వచ్చాక మళ్లీ అధికారంలోకి వచ్చాక 207 అన్న క్యాంటీన్లు ప్రారంభించామని తెలిపారు. రాష్ట్రంలో 21 దేవాలయాల్లో అన్నప్రసాదం ప్రారంభించాం’’ అని చంద్రబాబు అన్నారు.

By
en-us Political News

  
ఢిల్లీలో ఒక్క కుక్క కూడా రోడ్లపై క‌నిపించ‌కూడ‌దు. ఎనిమిది వారాల్లోగా వాటిని షెల్ట‌ర్ల‌కు చేర్చండి అంటూ సుప్రీం కోర్టు ఆదేశాల జారీ వెన‌క అస‌లు స్టోరీ ఏంటి? ఎందుక‌ని సుప్రీం కోర్టు అంత క‌ఠిన‌మైన ఆదేశాలు జారీ చేసింది? అని చూస్తే ఢిల్లీలో నానాటికీ కుక్క‌ల బెడద తీవ్ర స్థాయిలో పెరిగిపోతున్న దృశ్యం క‌నిపిస్తోంది.
మూడేళ్ల‌య్యింది మాకు జీతం పెంచి అని కార్మికులు అంటుంటే, మీక‌స‌లు టాలెంటే లేదు. మేం ఐటీ ఎంప్లాయిస్ క‌న్నా ఎక్కువ వేత‌నాలిస్తున్నాం అని నిర్మాత‌లంటున్నారు.
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సెగ పుట్టిస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టార్గెట్ గా రోజుకో ట్వీట్ పెడుతూ కాకరేపుతున్నారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తనకు మంత్రి పదవి ఇస్తాని ఇప్పడు మోసం చేశారని రగిలిపోతున్నారు.
వైసీపీకి హైకోర్టులో భారీ షాక్ తగిలింది. పులివెందుల జడ్పీటీసీ ఎన్నికలలో పోలింగ్ బూత్ ల మార్పుపై వైసీపీ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ మార్పు వల్ల ఓటర్లు సమీపంలోని బూత్ లలో కాకుండా నాలుగు కిలోమీటర్ల దూరంలోని బూత్ కు వెళ్లి ఓటు వేయాల్సి వస్తున్నదని పేర్కొంటూ వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి హైకోర్టులో సోమవారం అత్యవసర పిటిషన్ దాఖలు చేశారు.
పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల పోలింగ్ సాగుతోంది. మంగళవారం (ఆగస్టు 12) ఉదయం ఏడు గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం ఐదు గంటల వరకూ పోలింగ్ కొనసాగుతుంది. పులివెందులలో 15, ఒంటిమిట్టలో 30 పోలింగ్ కేంద్రాలను ఏరపాటు చేశారు.
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావును పోలీసులు మంగళవారం హౌస్ అరెస్ట్ చేశారు. రామచందర్ రావు హౌస్ అరెస్టును బీజేపీ నేతలు ఖండించారు.
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. తిరుమల శ్రీవారి దర్శనం కోసం పెద్ద సంఖ్యలో భక్తులు పోటెత్తుతున్నారు.
పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికలో విజయం కోసం వైసీపీ ఓటర్లను ప్రలోభపెట్టేందుకు దాదాపు వంద కోట్లు ఖర్చు చేసిందని తెలుగుదేశం నాయకుడు, మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి ఆరోపించారు.
పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. పోలింగ్ సందర్భంగా శాంతి భద్రతలకు విఘాతం కలుగకుండా ముందు జాగ్రత్త చర్యగా పోలీసులు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని అదుపులోనికి తీసుకుని కడపకు తరలించారు.
రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ నెలకొన్న పులివెందుల జడ్పీటీసీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో పోలింగ్ బూత్‌ల మార్పుపై జోక్యం చేసుకోవాలంటూ వైసీపీ నేత, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను సోమవారం ఏపీ హైకోర్టు విచారణకు స్వీకరించింది. అయితే.. ఈ ఉప ఎన్నికల్లో పోలింగ్ బూత్‌ల మార్పు విషయంలో జోక్యం చేసుకోబోమంటూ స్పష్టం చేసి వైసీపీకి షాక్ ఇచ్చింది.
తెలుగు సినీ పరిశ్రమ తీరు అడ్డగోలుగా ఉంది. పన్నులన్నీ తెలంగాణ ప్రభుత్వానికి కడతాం.. మా సమస్యలన్నీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పరిష్కరించాలంటూ దబాయిస్తున్నట్లుగా కనిపిస్తోంది.
పులివెందుల తీర్పు పై రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నిక పోలింగ్ ప్రారంభం కావడానికి ఇక కొన్ని గంటలే ఉంది. ఈ నేపథ్యంలో పులివెందులలో పోలింగ్ హీట్ పీక్స్ కు చేరింది. పోలింగ్ నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం కోసం ఓ వృద్దురాలు తన వంతుగా విరాళం అందజేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.