ఫైళ్ల క్లియరెన్స్‌పై మంత్రులకు సీఎం చంద్రబాబు రేటింగ్

Publish Date:Mar 12, 2026

Advertisement

 

పాలనలో వేగం పెంచే లక్ష్యంతో మంత్రుల ఫైళ్ల క్లియరెన్స్‌పై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రేటింగ్స్ ప్రకటించారు. కలెక్టర్ల సమావేశంలో మంత్రుల పనితీరును విశ్లేషిస్తూ, ఎవరు ఎంత వేగంగా ఫైళ్లను పరిష్కరిస్తున్నారో గణాంకాలతో సహా వివరించారు.

ఫైళ్ల క్లియరెన్స్ విషయంలో వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు మొదటి స్థానంలో నిలిచారు. ఆయన తర్వాతి స్థానాల్లో వరుసగా నిమ్మల రామానాయుడు, కొండపల్లి శ్రీనివాస్ నిలిచారు. ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ జాబితాలో నాలుగో స్థానంలో ఉన్నారు.

మరోవైపు, హోంమంత్రి వంగలపూడి అనిత ఫైళ్ల క్లియరెన్స్ విషయంలో చివరి స్థానంలో ఉండటం గమనార్హంగా మారింది. మంత్రులు ఫైళ్లను పెండింగ్‌లో ఉంచకుండా నిర్ణీత సమయంలోగా క్లియర్ చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. పరిపాలనలో వేగం ఉంటేనే ప్రజలకు మెరుగైన సేవలు సకాలంలో అందుతాయని ఆయన స్పష్టం చేశారు.

ఇదిలా ఉండగా, కలెక్టర్ల సమావేశం రెండో రోజు కూడా పలు కీలక అంశాలపై చర్చ జరగనుంది. వైద్య ఆరోగ్య శాఖ పనితీరుపై ప్రత్యేక ప్రజెంటేషన్, రాష్ట్ర ఆదాయాన్ని పెంచే మార్గాలపై సమీక్ష జరగనుంది. విద్యా రంగంలో మార్పులు, యువతకు ఉపాధి అవకాశాల కల్పనపై కూడా చర్చించనున్నారు. సాయంత్రం కలెక్టర్లు, ఎస్పీలతో ముఖ్యమంత్రి ప్రత్యేకంగా సమావేశమై రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణ, చట్ట వ్యవస్థ బలోపేతంపై కీలక దిశానిర్దేశం చేయనున్నారు.
 

By
en-us Political News

  
తమిళనాడు రాజకీయాలు మరోసారి హీటెక్కాయి.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు మరో కీలక లంచం కేసును బయటపెట్టారు.
ఉప్పల్ స్టేడియంలో లేడీ బౌన్సర్ హంగామా సృష్టించింది.
మెుహాలీలోని ఖరార్‌ ప్రాంతంలో ఈడీ దాడులు చేస్తుండగా సోదాలు జరుగుతున్న ప్రాంగణంలో నోట్ల కట్టలతో నిండిన బ్యాగులు దొరకడం హాట్ టాపిక్‌గా మారింది.
అదృష్టాన్ని నమ్ముకున్న ఆ అమెరికా దంపతులు దీర్ఘకాలంగా లాటరీ టికెట్లు కొంటూనే ఉన్నారు.
ప్రభుత్వ ఏర్పాటు విషయంలో టీవీకే అధినేత విజయ్‌కు ఎందుకు ఆలస్యం చేస్తున్నారంటూ సినీ నటుడు విశాల్ ప్రశ్నించారు.
కరీంనగర్ పీఎంజే జ్యువలరీ షాప్ లో దోపిడీ చేసిన కేసులో మరో ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది.
కరీంనగర్ జిల్లాలో రాజకీయ ఉద్రిక్తతలు తారస్థాయికి చేరుకున్నాయి.
చిత్తూరు జిల్లా పలమనేరు పరిధిలోని కౌండిన్య ఎలిఫెంట్ శాంక్చువరీలో ఉన్న కుంకీ ఏనుగులకు.. ఈ ప్రత్యేక గుర్తింపు కార్డులు జారీ చేయాలని నిర్ణయించింది. మనుషులకు ఉండే ఆధార్ తరహాలోనే ఈ కార్డులను రూపొందించనుంది
మోదీ తన ఎక్స్ ఖాతా డీపీగా ఆపరేషన్ సిందూర్ ఫోటోను పెట్టుకొని సైన్యానికి గౌరవం ప్రకటించారు. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం ఈ మెరుపు దాడిని చేపట్టిన సంగతి తెలిసిందే.
​చెన్నూరుకు చెందిన యోగేంద్ర కుమార్ వర్మ, హేమశ్రీ చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు. కాలక్రమేణా ఆ స్నేహం ప్రేమగా మారింది. వారి మధ్య ఉన్న అనుబంధం ఎంతో బలమైనది. అయితే.. గత కొద్దిరోజులుగా వీరిద్దరి మధ్య చిన్నపాటి వివాదాలు తలెత్తినట్లు సమాచారం.
కుటుంబ సభ్యులతో మాట్లాడిన అల్లు అరవింద్, ప్రమాదం వల్ల వారికి కలిగిన బాధను పంచుకుంటూ ధైర్యం చెప్పారు. బాలుడి చికిత్సకు అవసరమైన సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. అదే సమయంలో శ్రీతేజ్ సోదరి చదువుల బాధ్యతను తాను తీసుకుంటానని అల్లు అరవింద్ ప్రకటించారు.
బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమష్టిగా రాణించిన ఆరెంజ్ ఆర్మీ.. పంజాబ్‌పై 33 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ కోల్పోయి తొలుత బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 235 పరుగుల భారీ స్కోరు చేసింది. ఆరంభం నుంచే సన్ రైజర్స్ బ్యాటర్లు పంజాబ్ బౌలర్లపై విరుచుకుపడి సిక్సర్లు, ఫోర్లతో పరుగుల వర్షం కురిపించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.