క్వాంటం కంప్యూటింగ్‌లో ఏపీదే పైచేయి : సీఎం చంద్రబాబు

Publish Date:Feb 20, 2026

Advertisement

 

ఢిల్లీలో నిర్వహిస్తున్న ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్‌లో పాల్గొన్న సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. విశాఖపట్నం త్వరలోనే గూగుల్ వంటి సంస్థల రాకతో గ్లోబల్ ఏఐ డేటా హబ్‌గా మారుతుందని ధీమా వ్యక్తం చేశారు. అమరావతిలో నిర్మిస్తున్న క్వాంటం వ్యాలీ గురించి ప్రపంచమంతా మాట్లాడుకునే రోజు వస్తుందని ముఖ్యమంత్రి అన్నారు. ప్రపంచానికి అవసరమైన క్వాంటం కంప్యూటింగ్ పరికరాలను ఏపీలో తయారు చేసేలా ఎకోసిస్టమ్‌ను తీర్చిదిద్దుతుమన్నామని తెలిపారు. 

రాష్ట్రాన్ని సాంకేతిక హబ్‌గా తీర్చిదిద్దటమే లక్ష్యంగా పలువురు పారిశ్రామికవేత్తలతో చంద్రబాబు సమావేశం అయ్యారు. యూఎన్ఐసీసీ డైరెక్టర్ సమీర్ చౌహాన్‌తో  ముఖ్యమంత్రి భేటీ అయి..యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ కంప్యూటింగ్ సెంటర్ తో ఏపీ ఒప్పందం చేసుకుంది.  అమరావతిలో క్వాంటం వ్యాలీని ఏర్పాటు చేసి, దానికి జాతీయ, అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావడమే ఈ ఒప్పందాల ప్రధాన ఉద్దేశం. 

ఈ ఒప్పందాలు రాష్ట్రంలో ఏఐ, క్వాంటం రంగాల్లో నైపుణ్యాభివృద్ధి, మౌలిక వసతుల కల్పనకు మార్గం సుగమం చేయనున్నాయి. విద్యార్థులు, యువతకు అత్యాధునిక సాంకేతికతలో శిక్షణ ఇవ్వడం, ప్రభుత్వ శాఖల్లో ఏఐ వినియోగాన్ని పెంచడం, తద్వారా పాలనను సులభతరం చేయడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఆంధ్రప్రదేశ్‌ను భవిష్యత్ టెక్నాలజీ కేంద్రంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం వరుస కీలక ఒప్పందాలు కుదుర్చుకుంది. 

ఐక్యరాజ్యసమితికి చెందిన ఇంటర్నేషనల్ కంప్యూటింగ్ సెంటర్ (యూఎన్ఐసీసీ)తో   కలిసి అమరావతి క్వాంటం వ్యాలీలో ఏఐ-క్వాంటం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేయనుంది. దీనిని డిజిటల్ ఎంబసీగా అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రపంచ టెక్ దిగ్గజం ఐబీఎంతో ఒప్పందం ద్వారా లక్ష మంది యువతకు క్వాంటం, ఏఐ, సైబర్ సెక్యూరిటీ రంగాల్లో శిక్షణ ఇవ్వనున్నారు.

 డీమ్డ్ యూనివర్సిటీని ఏపీలో ఏర్పాటు చేసేందుకు నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ (నీలిట్)తో ఒప్పందం కుదిరింది. అలాగే నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ (నీలిట్)తో ఒప్పందం కుదిరింది  దక్షిణ భారతదేశంలో తొలి ఏఐ-క్వాంటం డీమ్డ్ యూనివర్సిటీని ఏపీలో ఏర్పాటు చేయనున్నారు.స్వదేశీ ఏఐ స్టాక్ నిర్మాణం, 50 విద్యాసంస్థల్లో ఏఐ అకాడమీలు, అమరావతిలో మరో నైపుణ్య కేంద్రం స్థాపన వంటి చర్యలు చేపడుతున్నారు. అదనంగా ఐఐటీ మద్రాస్‌తో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది.  
 

By
en-us Political News

  
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న అధికార యంత్రాంగాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభినందించారు.
మే డే(మే 1వ తేదీ) సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి కార్మిక వర్గానికి ప్ర‌త్యేకంగా అంతర్జాతీయ కార్మిక దినోత్సవ శుభాకాంక్ష‌లు తెలిపారు.
కుప్పం నియోజకవర్గ ప్రజల చిరకాల స్వప్నమైన విమానాశ్రయ నిర్మాణానికి ఉన్న అతిపెద్ద న్యాయపరమైన అడ్డంకి ఎట్టకేలకు తొలగిపోయింది.
అమెరికా మాజీ అధ్యక్షుడు, ప్రస్తుత అధ్యక్ష రేసులో ఉన్న డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌పై మరోసారి విరుచుకుపడ్డారు.
కృష్ణా జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రేపు (మే 1) శుక్రవారం పర్యటించనున్నారు.
తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజారోగ్య పరిరక్షణే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది.
ప్రపంచవ్యాప్తంగా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, సెమీకండక్టర్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు, రక్షణ రంగ పరికరాల తయారీలో రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ పాత్ర అత్యంత కీలకం. ప్రస్తుతం ఈ ఖనిజాల ఉత్పత్తిలో చైనా ప్రపంచ దేశాలను శాసిస్తోంది. అయితే.. ఆంధ్రప్రదేశ్ తీరప్రాంతంలో ఈ అరుదైన ఖనిజాలు అపారంగా నిక్షిప్తమై ఉన్నాయనీ.. వీటిని సమర్థవంతంగా వెలికితీస్తే చైనాపై ఆధారపడటాన్ని భారత్ పూర్తిగా తగ్గించుకోవచ్చని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక వ్యూహాత్మక ప్రణాళికను సిద్ధం చేస్తున్నారు.
బెంగళూరు శివార్లలో వెలుగుచూసిన ఒక విషాద ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది.
హైదరాబాద్ నగరానికి గర్వకారణమైన వైద్య విజయం నమోదైంది.
వైసీపీ అనుకూలుడిగా పలు అక్రమాలకు పాల్పడి .. పనిష్మెంట్‌లో ఉన్న సీఐ తన అరాచక బుద్ది మాత్రం మార్చుకోలేదు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో బుధవారం జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ముగిసింది.
కరాచీ వంటి ప్రధాన నగరాల్లో ప్రస్తుతం గ్యాస్ సిలిండర్ల కొరత వేధిస్తోంది. దీంతో స్థానికులు భారీ పరిమాణంలో ఉన్న ప్లాస్టిక్ బెలూన్లను అంటే సంచులను ఇంధనాన్ని నిల్వ చేసుకోవడానికి ఉపయోగిస్తున్నారు. గ్యాస్ సరఫరా చేసే ప్రధాన పైపుల నుంచి ఈ బెలూన్లలోకి నేరుగా గ్యాస్‌ను నింపుతున్నారు. చిన్నపాటి లీకేజీ లేదా నిప్పు రవ్వ తగిలినా క్షణాల్లో పేలిపోయే ప్రమాదం ఉన్నప్పటికీ.. గత్యంతరం లేని స్థితిలో ప్రజలు ఈ పద్ధతిని అనుసరిస్తున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.