చంద్రబాబు ప్రకటన.. కొన్ని ముఖ్యాంశాలు...
Publish Date:Sep 4, 2014
Advertisement
ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని, ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ధికి సంబంధించిన 20 పేజీల ప్రకటనను రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం శాసనసభలో విడుదల చేశారు. ఈ ప్రకటనలోని కొన్ని ముఖ్యాంశాలు.. * భూ సేకరణ ద్వారా రాజధానిని నిర్మించాలని భావిస్తున్నాం. * శివరామకృష్ణన్ కమిటీ నివేదిక ప్రజాభిప్రాయాన్ని బలపరిచింది. * రాష్ట్ర ప్రగతి సాధన, ప్రజల సంక్షేమం కోసమే ఈ నిర్ణయం. * ప్రతి జిల్లాలో ఒక ఫుడ్ పార్క్. * భూ సేకరణ విధి విధానాలపై ఉపసంఘం. * రాబోయే రోజుల్లో ఒక్కో సంవత్సరం ఒక్కో జిల్లాలో స్వాతంత్ర్య వేడుకలు. * ఏపీ అభివృద్ధికి ఏడు మిషన్లు, 5 గ్రిడ్ల ఏర్పాటు. * విజయవాడ, తిరుపతి విమానాశ్రయాలు అంతర్జాతీయ విమానాశ్రయాలుగా అభివృద్ధి. * అనంతపురం కరవు నివారణకు బిందు, తుంపర సేద్యాలకు ప్రాధాన్యం * శ్రీకాకుళంలో విమానాశ్రయం, స్మార్ట్ సిటీగా అభివృద్ధి. * వీసీఐసీ కారిడార్ పరిధిలో కాకినాడ. * తూర్పు గోదావరి జిల్లాలో పెట్రోలియం కారిడార్, తెలుగు విశ్వవిద్యాలయం ఏర్పాటు. * తూర్పు గోదావరి జిల్లాలో కొబ్బరి పీచు ఆధారిత పారిశ్రామిక కాంప్లెక్స్. * విజయనగరంలో గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం.
http://www.teluguone.com/news/content/cm-chandra-babu-speech-in-assembly-on-development-39-37942.html





