వేసవి ప్రణాళిక.. చంద్రబాబు సమీక్ష

Publish Date:Mar 25, 2025

Advertisement

రోళ్లు పగిలే ఎండలు మార్చిలోనే జనాలను బెంబేలెత్తిస్తున్నాయి. సాధారణంగా మే 2, 3 వారాలలో భారీగా ఉష్ణోగ్రతలు నమోదౌతాయి. అటువంటిది ఈ ఏడాది మార్చి నుంచే భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఆంధ్రప్రదేశ్ లో చాలా ప్రాంతాలలో అప్పుడే 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదౌ తున్నాయి. ఈ నేపథ్యంలో వేసవిలో తాగునీటి ఎద్దడి రాకుండా తీసుకోవలసిన చర్యలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు సచివాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. సోమవారం (మార్చి 24) నాడు సచివాలయంలో జరిగిన ఈ సమీక్షా సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఏ ప్రాంతంలో కూడా తాగునీటి ఎద్దడి తలెత్తకుండా అన్ని చర్యలూ తీసుకోవాలని  ఆదేశించారు.

వేసవి ప్రణాళిక విషయంలో చాలా పకడ్డందీగా వ్యవహరించాలన్నారు.  అలాగే ఉష్ణోగ్రతలకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు మొబైల్ అలర్ట్ ల ద్వారా ప్రజలకు చేరవేయాలని సూచించారు.  అలాగే అవసరమైన అన్ని ప్రాంతాలలోనూ  చలివేంద్రాలు, మజ్జిగ కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అదే విధంగా స్వచ్ఛందంగా చలివేంద్రాలు ఏర్పాటు చేసేవారికి ప్రభుత్వపరంగా సహకారం అందించాలన్నారు.  

ముఖ్యంగా రాయలసీమ, ప్రకాశం జిల్లాలలో  తాగునీటి, పశుగ్రాసం కొరత లేకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పశువుల కోసం రూ.35 కోట్లతో 12,138 నీటి తొట్ల నిర్మాణం చేపట్టాలని చెప్పారు.   పాఠశాలల్లో విద్యార్థులకు ‘వాటర్‌ బెల్‌’ విధానం అమలు చేయాలన్నారు.  మునిసిపాలిటీల్లో నీటి సమస్య పరిష్కారానికి రూ.39 కోట్లు విడుదల చేయనున్నట్లు తెలిపారు. గ్రామాల్లో ఉపాధి పథకం కింద నీటి కుంటల నిర్మాణం, చెరువుల్లో పూడికతీత పనులు చేపట్టాలన్నారు. 

By
en-us Political News

  
నాలుగేళ్ల కిందట కరోనా మహమ్మారి ప్రపంచాన్ని గడగడలాడించింది. 2019లో మొదలై 2021 వరకూ ప్రజలకు, ప్రభుత్వాలకు కంటి మీద కునుకు లేకుండా చేసింది. మూడు దశలుగా విస్తరించి, వ్యాపించి లక్షల మంది ఉసురు తీసింది.
పాకిస్ధాన్ తీరు మారలేదు. పుల్వామా ఉగ్రదాడి అనంతరం భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ లో ఆ దేశం ఉగ్రవాదానికి దన్ను గా ఉన్నదన్న సంగతిని ప్రపంచానికి చాటిన భారత్.. ఆ తరువాత తన సైనిక సత్తాను చాటి పాక్ ను మోకాళ్ల మీద నిలబెట్టింది.
బూతుల నానిగా గుర్తింపు పొందిన కొడాలి నాని వైసీపీ పరాజయం నుంచి నోరెత్తడానికే భయపడు తున్నారా అన్నట్లుగా మారిపోయారు. పరాజయం తరువాత ఆయన నియోజకవర్గం ముఖం చూసిన పాపాన పోలేదు. నియోజవర్గం అనేమిటి అసలు బహిరంగంగా బయటకు వచ్చిన సందర్భాలను వేళ్లపై లెక్కించవచ్చు
తిరుమలలో శ్రీవారి భక్తుల రద్దీ కొనసాగుతోంది. వారాంతం సమీపిస్తుండటం, వేసవి సెలవులు కలిసి రావడంతో తిరుమలేశుని దర్శనానికి భక్తులు పోటెత్తుతున్నారు.
జగన్ విమర్శలపై విజయసాయి స్పందన కూడా అంతే తీవ్రంగా ఉంటుందని అంటున్నారు. గతంలో తనను విశ్వసనీయత లేని వ్యక్తిగా జగన్ విమర్శించినప్పుడు విజయసాయి సీరియస్ గా రియాక్టైన విషయాన్ని గుర్తు చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణంలో జగన్ అరెస్టు విషయంలో ఇప్పటి వరకూ ఊహాగాన సభలే జరిగాయి. జగన్ అరెస్టవుతారా? చంద్రబాబు హస్తిన పర్యటన అందుకేనా అంటూ మీడియాలో.. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌కు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత రాసిన లేఖ తెలంగాణ రాజకీయాల్లో సంచలనం రేపుతోంది. వరంగల్‌ సభ సక్సెస్‌ అయ్యిందంటూనే లేఖ పార్టీలో జరుగుతున్న పరిణామాలపై కేసీఆర్‌కు ఆరు పేజీల లేఖలో పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు.
వేసవి దృష్ట్యా పెరుగుతున్న నీటి అవసరాలను పరిగణలోకి తీసుకుని, తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు కృష్ణా జలాలను విడుదల చేయడానికి కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) నిర్ణయం తీసుకుంది.
కరోనా మహమ్మరి మరో సారి దాడి చేస్తున్నదా? ఇక మళ్లీ మాస్కులు లేకుండా బయటకు రాలేని, రాకూడని పరిస్థితులు ఏర్పడుతున్నాయా? అంటే ఔననే అంటున్నారు వైద్య నిపుణులు.
గంటా రవితేజ తాజాగా భీమిలి నియోజకవర్గంలో జరిగిన మినీ మహానాడులో తన తండ్రితో పాటు నియోజకవర్గంలోని కీలకమైన రాజకీయ నాయకుల సమక్షంలో క్యాడర్‌ని ఉత్సాహపరచడానికి మాట్లాడుతూ నోరు జారి జోహార్ సీఎం సార్, జోహార్ లోకేష్ అన్నయ్య అంటూ నినాదాలు చేశారు.
పాకిస్థాన్ సహా ప్రపంచంలో ఏ మూల నక్కినా ఉగ్రవాదులను వదిలే ప్రశక్తే లేదని విదేశాంగ మంత్రి జైశంకర్ అన్నారు. ప్రస్తుతం నెదర్లాండ్ లో పర్యటిస్తున్న జైశంకర్ అక్కడి మీడియాతో మాట్లాడారు.
బీఆర్ఎస్ లో ఏం జరుగుతోంది? కెసిఆర్ స్థానంలో పార్టీపై పెత్తనం కోసం కేటీఆర్, కవిత, హరీష్ రావుల మధ్య ట్రయాంగిల్ ఫైట్ నడుస్తున్నట్టు ప్రచారం జరిగింది. కల్వకుంట్ల అన్నాచెల్లెళ్లకు తల్లిదండ్రుల్లో తలా ఒకరు సపోర్ట్ చేస్తున్నారన్న టాక్ కూడా వినిపించింది.
ఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుమార్తె, తెలంగాణ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పార్టీ తీరు పట్ల, పార్టీలో తనకు ప్రాముఖ్యత దక్కక పోవడం పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్నారా? పార్టీని వీడి సొంత కుంపటి పెట్టుకునే నిర్ణయానికి వచ్చేశారా? అంటే ఇటీవలి పరిణామాలకు తోడు తాజాగా ఆమె పార్టీ అధినేత, తన కన్న తండ్రి అయిన కేసీఆర్ కు రాసిన ఘాటు లేఖ చూస్తుంటే ఔనని అనక తప్పడం లేదంటున్నారు విశ్లేషకులు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.