సీఎం రేవంత్ క్షమాపణలు చెప్పాలి.. లేదంటే లీగల్ నోటీసు పంపిస్తా : కేటీఆర్
Publish Date:Jul 23, 2026
Advertisement
వరంగల్‌లో మీడియా రిపోర్టర్లతో నిర్వహించిన చిట్‌చాట్ సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. గ్లోబ్ ఏరినా సంస్థ తన బినామీ సంస్థ అని ముఖ్యమంత్రి చేసిన ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని కేటీఆర్ పేర్కొన్నారు. ఈ ఆరోపణలపై ఇప్పటికే పరువు నష్టం (డిఫమేషన్)కు సంబంధించి లీగల్ నోటీసు పంపినట్లు వెల్లడించారు. ఆరోపణలను రుజువు చేయాలని, లేకపోతే ముఖ్యమంత్రి బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. గ్లోబ్ ఏరినా నిజంగానే తన బినామీ సంస్థ అయితే, అదే సంస్థతో కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు ఒప్పందాలు చేసుకుందని ప్రశ్నించిన కేటీఆర్... మీ ప్రభుత్వమే ఆ సంస్థతో ఒప్పందాలు చేసుకుని, ఇప్పుడు అది తన బినామీ సంస్థ అని చెప్పడం ఎంతవరకు సమంజసమని నిలదీశారు. కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన ముఖ్యమంత్రి ఒక్కసారి కూడా ప్రధాని నరేంద్ర మోదీ పేరును ప్రస్తావించడం లేదని విమర్శించారు. రాజ్‌భవన్ ముందు ధర్నా చేయాల్సింది పోయి కొడంగల్‌లో ధర్నా చేయడం రాజకీయ నాటకమేనని అన్నారు. ఒకవైపు పాత కేసుల భయం, మరోవైపు అమృత్ పథకం సహా ఇతర కాంట్రాక్టుల ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వంతో రాజీ రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. రేవంత్ రెడ్డి పగలు కాంగ్రెస్‌తో, రాత్రి బీజేపీతో ఉంటారని, "కాంగ్రెస్‌కు ఒక మూట... బీజేపీకి రెండు మూటలు... ఇదే రేవంత్ రెడ్డి పాలన" అని వ్యాఖ్యానించారు. తాను సీఐడీ విచారణకు సిద్ధమని, రేవంత్ రెడ్డి కుటుంబ అవినీతి అంశంపై సిట్ లేదా సీఐడీ విచారణకు ముఖ్యమంత్రి సిద్ధమా అని ప్రశ్నించారు. అవసరమైతే లై డిటెక్టర్ పరీక్షకు కూడా తాను సిద్ధమేనని, ముఖ్యమంత్రి కూడా అందుకు ముందుకు రావాలని సవాల్ విసిరారు. KTR, Warangal, Media Chit-Chat, Globe Arena, Defamation Notice, Legal Notice, Binami Allegations, CM Revanth Reddy, Congress Government, BJP, PM Narendra Modi, Raj Bhavan Protest
http://www.teluguone.com/news/content/ktr-36-226877.html





