పోలీసింగ్ లో స్పష్టమైన మార్పు.. హోంశాఖపై సమీక్షలో చంద్రబాబు

Publish Date:Aug 21, 2024

Advertisement

రాష్ట్రంలో పోలీసు శాఖ పనితీరులో స్పష్టమైన మార్పు కనిపించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. హోంశాఖపై బుధవారం సమీక్ష నిర్వహించిన చంద్రబాబు నాయుడు.. నేరం చేస్తే శిక్ష తప్పదన్న భావన కలిగేలా పోలీసు శాఖ పని చేయాలని అధికారులకు దిశా నిర్దేశం చేశారు. రాజకీయ ముసుగులో ఎవరైనా అరాచకాలకు పాల్పడితే కఠినంగా వ్యవహరించాలని సీఎం అన్నారు. శాంతి భద్రతలు కాపాడే విషయంలో, నేరాల విచారణ, నేరస్తులకు శిక్షల విషయంలో అధికారులు ఫలితాలు కనిపించేలా పనిచేయాలని సూచించారు.  హోంమంత్రి వంగలపూడి అనిత, డీజీపీ ద్వారాకా తిరుమల రావుతో పాటు పోలీసు శాఖలోని ఉన్నతాధికారులు ఈ సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు.   

ఈ సమీక్షా సమావేశంలో గత పదేళ్లలో పోలీసు శాఖలో నెల‌కొన్న‌ పరిస్థితులపై అధికారులు వివరించారు.  2014-19 పోల్చితే  2019-24లో  క్రైం రేట్ 46 శాతం పెరిగిందని అధికారులు వివరించారు.  2014-19 తో పోల్చుకుంటే 2019-23 మధ్యకాలంలో మహిళలపై నేరాలు 35.91 శాతం, మహిళల అదృశ్యం కేసులు 84.83 శాతం, సైబర్ నేరాలు 134.43 శాతం పెరిగాయని  తెలిపారు. అలాగే గంజాయి, డ్రగ్స్ కేసులు 107.89 శాతం, చిన్న పిల్లలపై నేరాలు 151.88 శాతం పెరిగాయని వెల్లడించారు.  గత ప్రభుత్వ తీరుతో పోలీసు శాఖ ఎలా నిర్వీర్య‌మైందో ప‌వ‌ర్ పాయింట్  ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. పోలీసు శాఖలో ఆయా విభాగాలకు ఇవ్వాల్సిన చిన్న చిన్న ఆర్థిక మొత్తాలను కూడా చెల్లించకపోవడం వల్ల పోలీసులు, పోలీసు శాఖ ఎదుర్కొన్న ఇబ్బందులను కూడా   ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు.  

పోలీసు శాఖ వద్ద 143 డ్రోన్లు  ఉంటే  అందులో కేవలం 88 మాత్రమే పని చేస్తున్నాయంటే పోలీసు శాఖ ఎంత నిర్లక్ష్యానికి గురైందో అర్ధం చేసుకోవచ్చు. బాడీ వోర్న్ కెమేరాలు 1250 ఉంటే  444 మాత్రమే పనిచేస్తున్నాయని వివరించారు. లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టంలో 1180 కెమేరాలకు గాను కేవలం 317 మాత్రమే పనిచేస్తున్నాయని, రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో ఉన్న 14,712 సీసీ కెమేరాల్లో 2371 కెమేరాలు పనిచేయడం లేదని వివరించారు. ఆటోమేటెడ్ ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ సిస్టం కూడా పనిచేయడం లేదని తెలిపారు. వీటన్నింటినీ తిరిగి వాడుకలోకి తెచ్చేందుకు అవ‌స‌ర‌మైన‌ రూ. 30 కోట్లు నిధులు  కూడా గత ప్రభుత్వం ఇవ్వలేదని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. యాన్యువల్ మెయింటనెన్స్ ఛార్జీలు చెల్లించకపోవడం వల్ల చాలా సేవలు అందుబాటులో లేకాండా పోయాయని....వీటి వల్ల నేర విచారణలో తీవ్ర ఇబ్బందులు త‌లెత్తుతున్నాయ‌ని తెలిపారు. పోలీసు విభాగంలో 2014-19 మధ్య  5215 వాహనాల కొనుగోలుకు రూ.221.8 కోట్లు ఖర్చు చేస్తే వైసీపీ ప్రభుత్వం కేవలం రూ.67.3 కోట్లు మాత్రమే ఖర్చు చేసిందన్నారు. కాలం చెల్లిన వాహనాలతో పోలీసు శాఖ ఇబ్బంది పడుతోందని...ప్రస్తుతం 2812 వాహనాల కోసం రూ.281 కోట్లు బడ్జెట్ అవసరమ‌ని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. పోలీసు శాఖను గాడిలో పెట్టేందుకు అవసరమైన అన్ని చర్యలూ తీసుకుంటామన్న చంద్రబాబు నాయుడు దీక్షకాలంగా పెండింగ్ లో ఉన్న పది కోట్ల రూపాయలను వెంటనే విడుదల చేస్తున్నట్లు చెప్పారు. 

అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ పోలీసు శాఖను మళ్లీ గాడిలో పెట్టేందుకు అవ‌స‌ర‌మైన‌ అన్ని చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఆయా వ్యవస్ధల్లో పరికరాల నిర్వహణ ఖర్చులకు ఎప్పటి నుంచో పెండింగులో ఉన్న రూ.10 కోట్లు  వెంటనే విడుదల చేస్తున్నట్లు తెలిపారు. అలాగే  సీసీ కెమేరాల ఏర్పాటులో పెండింగ్ లో ఉన్న రూ.11 కోట్ల  బిల్లులు కూడా మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు.  పోలీస్ శాఖను ఆధునికీక‌రించే  కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వాటాగా రూ.61 కోట్లు విడుద‌ల చేయ‌డానికి  కూడా సీఎం ఆమోదం తెలిపారు.  గత ప్రభుత్వం పోలీసులను క్షక్ష సాధింపులకు, ప్రజల, రాజకీయ పార్టీల అణిచివేతకు ఉపయోగించుకుందన్న చంద్రబాబు తమ ప్రభుత్వంలో ఆ పరిస్థితి ఉండదని విస్పష్టంగా చెప్పారు, 

మహిళలపై హింస విషయంలో చాలా కఠినంగా ఉండాలి. ఆడబిడ్డల జొలికి వస్తే అదే చివరి రోజు అనేది నేరస్తులకు అర్థం కావాలి అని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. ఆంధ్రప్రదేశ్ ను గంజాయి రహిత రాష్ట్రంగా మార్చాలని అధికారులను ఆదేశించారు.  వచ్చే నెలలో రాష్ట్రంలోని 26 జిల్లాల్లో గంజాయి, డ్రగ్స్ కు వ్యతిరేకంగా ర్యాలీలు నిర్వహించాలనీ, ఆ  కార్య‌క్ర‌మంలో తాను కూడా పాల్గొంటానని చంద్రబాబు చెప్పారు. 

By
en-us Political News

  
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ అక్టోబర్ 13న ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించే అవకాశం ఉందన్న వార్తలు రాజకీయ, జలవనరుల వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.
జాతీయ రాజధాని ఢిల్లీలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
దేశ రాజధాని ఢిల్లీలో తీవ్ర రాజకీయ ఉద్రిక్తతలు నడుస్తున్న వేళ, కాక్రోచ్ జనతా పార్టీ (CJP) వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.
ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది.
శ్రీవారికి జైపూర్ దంపతులు రూ.51.55 లక్షల ఆభరణాల కానుక.!
గోల్డ్ కొనాలన్న ఆశ.. బిడ్డను కోల్పోయిన విషాదం.!
ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్సీ సి. రామచంద్రయ్యకు హైదరాబాద్‌లో భూమి పేరుతో మోసం జరిగిన ఘటన వెలుగులోకి వచ్చింది.
దేశ రాజధాని దిల్లీలో రాజకీయంగా ఉత్కంఠ నెలకొంది.
కన్నవారిని చూడాలని.. స్వస్థలానికి చేరుకోవాలని ఎన్నో ఆశలతో రైలు ఎక్కిన ఓ యువతి ప్రయాణం విషాదాంతమైంది.
దేశ రాజధాని దిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) తలపెట్టిన నిరసన కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.
భారతీయ రాజకీయ రంగంలో మరోసారి తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.
దసరా పండుగ సెలవులు ప్రారంభం కావడంతో భాగ్యనగరంలో ప్రయాణికుల రద్దీ తారాస్థాయికి చేరింది.
దేశ రాజధాని న్యూఢిల్లీలో రాజకీయ వేడి తారాస్థాయికి చేరింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.