మరో ఉద్యమానికి కాక్రోచ్ లు రెడీ.. ఎందుకంటే?

Publish Date:Jul 29, 2026

Advertisement

కాక్రోచ్ జనతాపార్టీ మరో సారి ఉద్యమించడానికి రెడీ అవుతోంది. నీట్ ప్రశ్న పత్రం లీకేజీ వ్యవహారంలో కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో జరిగిన ఉద్యమానికి దేశ వ్యాప్తంగా వెల్లువెత్తిన మద్దతుకు దిగి వచ్చిన మోడీ సర్కార్.. ధర్మేంద్ర ప్రధాన్ చేత రాజీనామా చేయించిన సంగతి తెలిసిందే. కాగా ఆ ఉద్యమ సమయంలో శాంతియుతంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులపై నమోదైన కేసులన్నిటినీ తక్షణమే ఎత్తివేయాలని కాక్రోచ్ జనతా పార్టీ డిమాండ్ ను కేంద్రం అంగీకరించింది. అయితే రోజులు గడుస్తున్నా కేంద్రం ఆ హామీని నెరవేర్చకపోవడంతో.. దేశవ్యాప్తంగా మళ్లీ  ఆందోళనలు ప్రారంభిస్తామని కాక్రోచ్ జనతా పార్టీ అల్టిమేటమ్ ఇచ్చింది.  

ప్రముఖ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కాక్రోచ్ జనతా పార్టీ అధికార ప్రతినిథి సౌరవ్‌ దాస్.. నీట్ వివాదంపై నమోదైన ప్రజాహిత వ్యాజ్యాలపై సుప్రీంకోర్టు సమగ్ర విచారణ జరిపిన తర్వాత కేంద్ర ప్రభుత్వ ధోరణిలో స్పష్టమైన మార్పు వచ్చిందన్నారు.  మొదట చర్చల సందర్భంగా, నిరసనల్లో పాల్గొన్న విద్యార్థులు, యువతపై   కొత్త ఎఫ్ఐఆర్ లు నమోదు చేయబోమని,  ఇప్పటికే నమోదైన పాత కేసులను కూడా పూర్తిగా ఉపసంహరిస్తామని ప్రభుత్వం  హామీ ఇచ్చిందని గుర్తు చేసిన ఆయన ఇప్పుడు..  వ్యవహారం న్యాయస్థానం పరిధిలో ఉందంటూ ఆ హామీ అమలుపై వెనక్కు తగ్గిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

సుప్రీంకోర్టు కూడా శాంతియుతంగా నిరసన తెలిపిన విద్యార్థులపై ఎలాంటి  కఠిన చర్యలు తీసుకోవద్దని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిందన్న  సౌరవ్ దాస్, గతంలో ఎటువంటి నేరచరిత్ర లేని, నిర్బంధంలో ఉన్న విద్యార్థులను తక్షణమే విడుదల చేయాలని కూడా సుప్రీంకోర్టు పేర్కొందని గుర్తు చేశారు. అయితే..  ఇప్పటికే నమోదైన ఎఫ్ఐఆర్ లపై దర్యాప్తు అధికారులు విచారణ కొనసాగించవచ్చని కోర్టు పేర్కొన్న ఒకే ఒక్క అంశాన్ని ప్రభుత్వం తనకు అనుకూలంగా మలుచుకుంటూ హామీ అమలుపై వెనక్కు తగ్గిందని ఆరోపించారు.  

న్యాయస్థానం ఎక్కడా కేసులను ఎత్తివేయకూడదని ఆదేశించలేదని, నమోదైన కేసులను ఉపసంహరించుకునే పూర్తి అధికారాలు, చట్టపరమైన హక్కులు ప్రభుత్వానికి ఉంటాయని  స్పష్టం చేశారు.  నీట్ ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఒక్క విద్యార్థికి పూర్తి స్థాయి రక్షణ కల్పించడమే కాకుండా, వారిపై మోపిన అక్రమ కేసులన్నింటినీ ఎటువంటి నిబంధనలు లేకుండా ఎత్తివేయాలని డిమాండ్ చేసిన ఆయన ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేయకపోతే..  మళ్లీ క్షేత్రస్థాయిలో వీధుల్లోకి వచ్చి పోరాటాన్ని ఉధృతం చేస్తామని  హెచ్చరించారు.

CJP to agitate again,  Cockroach Janata Party, CJP ultimatum, student protest cases, FIR withdrawal demand, Supreme Court NEET ruling

By
en-us Political News

  
ఒక టీవీ ఛానెల్ ఇంటర్వ్యూలో ఖవాజా ఆసిఫ్ తాను పీఓకేలో నిరసనలు చేస్తున్న వారిని భారత్‌తో సమానమైన వర్గంలో చేరుస్తున్నానని పేర్కొన్నారు. వారిని కూడా భారతదేశం లాంటి శత్రువులుగానే పరిగణిస్తున్నాననీ, అందుకే ఆ ఆందోళనకారులతో చర్చిందేదే లేదనీ, వారు పాకిస్థాన్ శత్రువులని చెప్పారు.
మూడు దశాబ్దాల భవిష్యత్ ను ముందుగానే చూడగల విజనరీ అయిన చంద్రబాబు నాయుడు 1997లో ఉత్తరాంధ్రకు అంతర్జాతీయ విమానాశ్రయ ఆవశ్యకతను గుర్తించారు. ఆ దిశగా అడుగులు వేశారు. ఇక హుద్‌హుద్ తుఫాను అనంతరం.. సురక్షిత, ఆధునిక విమానాశ్రయం ప్రతిపాదనను ఆయన మరింత గట్టిగా ముందుకు తీసుకువెళ్లారు. ఓ వైపు సముద్ర తీరం, మరొకవైపు మన్యప్రాంతాల నడుమ వ్యూహాత్మక ప్రదేశంగా భోగాపురాన్ని అయిన ఎంపిక చేశారు.
మిసిర్ బేస్రాపై ఝార్ఖండ్, బిహార్, ఒడిశా, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాల్లో పోలీసులపై దాడులు, నరమేధాలు, ఐఈడీ పేలుళ్లు, వసూళ్లు సహా ఏకంగా 150కి పైగా కేసులు నమోదయ్యాయి. 2007లో ఖుంటీ పోలీసులు ఇతడిని అరెస్ట్ చేసినప్పటికీ, 2009లో బిహార్‌లోని లఖిసరాయ్ కోర్టు సముదాయంపై మావోయిస్టులు దాడి చేసి అతడిని విడిపించుకుపోయారు. ఆ సంఘటన తర్వాత దాదాపు రెండు దశాబ్దాల అజ్ఞాతంలోనే ఉన్నారు.
వర్షాల తీవ్రత వల్ల పలు జిల్లాల్లో పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. కామరూప్, ధుబ్రి, లఖింపూర్, దిబ్రూగఢ్ వంటి ప్రధాన ప్రాంతాల్లో నదులు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో వందలాది గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. రహదారులు, వంతెనలు కొట్టుకుపోవడంతో రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది.
ఇన్ స్పెక్టర్, బాధిత మహిళ కొంత కాలం పాటు సహజీవనం చేసినట్లు కూడా విచారణలో వెలుగులోకి వచ్చింది. అనంతరం ఈ పరిణా మాల నేపథ్యంలో బాధిత మహిళ ఫిర్యాదుపై ఉన్నతాధి కారులు చేపట్టిన విచారణలో ప్రాథమిక ఆధారాలు ఉన్నట్లు తేలడంతో శాఖాపరమైన చర్యల్లో భాగంగా ఆయనను సస్పెండ్ చేస్తూ హైదరా బాద్ పోలీస్ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు.
హైదరాబాద్ లోని పలు ప్రాంతాలలో రహదారులు జలమయమయ్యాయి. వాతావరణ శాఖ వెల్లడించిన వివరాల మేరకు రెండు గంటల వ్యవధిలోనే నగరంలోని అనేక ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది.
రోజురోజుకూ పెరిగిపోతున్న ఈ సైబర్ ముఠాల దందాను అరికట్టడానికి సాధారణ చట్టాలు సరిపోవనీ, అందుకే ఇకపై డిజిటల్ అరెస్టు మోసాలను పాతకాలపు ఐటీ చట్టాల కింద కాకుండా, వ్యవస్థీకృత నేరాల నియంత్రణ చట్టం కింద నమోదు చేసి, దర్యాప్తు జరపాలని పోలీసు ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేసింది.
ఫార్వార్డ్ సీమెన్స్ యూనియన్ ఆఫ్ ఇండియా సామాజిక మాధ్యమ వేదికగా షేర్ చేసిన నివేదిక వీడియోతో ఈ ఉదంతం వెలుగులోకి వచ్చింది. నౌక పరిసర ప్రాంతాల్లో నిరంతరం పేలుళ్లు జరుగుతుండటం, దట్టమైన నల్లటి పొగ ఆకాశాన్ని కమ్మేస్తుండటం ఎఫ్సీయూ ఐవిడుదల చేసిన వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది.
మీ పుస్తకాల అభిరుచికి సరిపోయే సరైన నవలల కోసం వెతుకుతున్నారా? నా లైబ్రరీలోని పుస్తకాలతో ఛాట్‌జీపీటీ చేసిన అద్భుత ప్రయోగం, 30 నిమిషాల్లో అది అందించిన పర్సనలైజ్డ్ బుక్ రికమండేషన్ల రహస్యాలు ఇక్కడ చదవండి.
వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ తాజా నివేదిక ప్రకారం బంగారం ధరలు త్వరలోనే దిగివచ్చే అవకాశం ఉంది. పసిడి మార్కెట్ పరిస్థితులు, తగ్గుదలకు గల కారణాలు మరియు తాజా ధరల పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
కాలిఫోర్నియాలోని 330 MW డేటా సెంటర్ కూలింగ్ కోసం 287 మిలియన్ గాలన్ల వ్యవసాయ నీటిని మళ్లించే ప్రయత్నాన్ని వాటర్ డిస్ట్రిక్ట్ అడ్డుకుంది. $10 బిలియన్ల ప్రాజెక్ట్ చుట్టూ రేగిన చట్టపరమైన పోరాటం మరియు రైతు ఆందోళనల పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
3D టీవీలు కనుమరుగవుతున్న వేళ, బ్లూ రే నుండి ఆపిల్ విజన్ ప్రో స్పేషియల్ వీడియోల వరకు అన్ని 3D ఫార్మాట్లను ప్లే చేసే ఉచిత SyLC 3D ప్లేయర్ గురించిన పూర్తి వివరాలు తెలుసుకోండి.
విరాట్ కోహ్లీ ఫిట్‌నెస్ డైట్ అడిగి తెలుసుకుని, ఏడాదిన్నర పాటు పాటించిన సంజూ శాంసన్ ఆ తర్వాత ఎందుకు గివ్ అప్ ఇచ్చాడో ఓపెన్‌గా చెప్పేశాడు. పూర్తి వివరాలు ఇక్కడ చదవండి!
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.