చంద్రబాబు విజన్ కు మరో ప్రత్యక్ష నిదర్శనం భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు.!

Publish Date:Jul 29, 2026

Advertisement

గతంలో భోగాపురం వద్ద ప్రతిపాదించిన విమానాశ్రయంపై వైసీపీ ఎకసెక్కాలు చేసింది.  భోగాపురానికి ఎర్రబస్సే రాదు.. అలాంటిది ఏకంగా ఎయిర్ బస్ తీసుకువస్తారట అంటూ  ఎగతాళి చేశారు. అంతే కాకుండా విశాఖపట్నంలో అంతర్జాతీయ విమానాశ్రయం ఉండగా, భోగాపురంలో మరో విమానాశ్రయం ఎందుకంటూ విమర్శలు గుప్పించారు.  ఆ విమర్శలకూ, ఎకసెక్కాలకూ  దీటైన జవాబుగా ఇప్పుడు భోగాపురం  భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని సాకారం చేసి చూపింది తెలుగుదేశం కూటమి ప్రభుత్వం.  తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక భోగాపురం విమానాశ్రయ పనులు వాయువేగంతో ముందుకు సాగాయి.  నిర్దేశిత గడువు కన్నా ముందే ఈ విమానాశ్రయాన్ని అందుబాటులోకి వచ్చింది.  ఇటీవల విజయవంతంగా నిర్వహించిన ట్రయల్ రన్ ద్వారా ఎయిర్‌బస్ తరహా భారీ విమానాలు ఇక్కడ సునాయాసంగా దిగవచ్చని రుజువైంది.
ఇక మరో నాలుగు రోజుల్లో.. అంటే వచ్చే నెల 1న ఈ విమానాశ్రయాన్ని ప్రధాని నరేంద్రమోడీ ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నారు. 

ప్రస్తుతం విశాఖపట్నంలో అందుబాటులో ఉన్న అంతర్జాతీయ విమానాశ్రయం భారత నౌకాదళం నియంత్రణలో నడుస్తోంది.  దీని వల్ల పౌర విమానాల రాకపోకలపై పరిమితులు  ఉన్నాయి. నేవీ వర్గాలు అనుమతించిన సమయాల్లో మాత్రమే విశాఖ విమానాశ్రయంలో పౌర విమానాలు ల్యాండ్ అవ్వాల్సి ఉంటుంది. టేకాఫ్ అవ్వాల్సి ఉంటుంది.  ఆ పరిమితులు, నిబంధనల కారణంగా  రాత్రి 11 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు సాధారణ విమానాల రాకపోకలకు అవకాశం ఇసుమంతైనా లేదు. దీనికితోడు విశాఖ తూర్పు నావికాదళం తన రక్షణ కార్యకలాపాలను, సైనిక శిక్షణను విస్తరించ తలపెట్టిన కారణంగా ముందు ముందు విశాఖ నుంచి  పౌర విమానాలకు కేటాయించే సమయం మరింత తగ్గిపోతుంది.

ఈ కారణంగా విశాఖ పేరుకు అంతర్జాతీయ విమానాశ్రయమే అయినా..  పరిమితుల కారణంగా ఇక్కడ నుంచి విమానయాన సంస్థల సర్వీసులు లిమిటెడ్ గానే ఉన్నాయి. ముందు ముందు మరింత తగ్గిపోయే అవకాశాలు కూడా ఉండటంతో..   ఉత్తరాంధ్రకు సంపూర్ణ పౌర విమానయాన సర్వీసుల కోసం  మరో  అంతర్జాతీయ విమానాశ్రయం అనివార్యం. అయితే వైసీపీయులు.. ఈ అనివార్యతలను, అవసరాలను ఇసుమంతైనా పట్టించుకోకుండా భోగాపురం ఎందుకంటూ ఊరూ వాడా ఏకం చేస్తూ విమర్శలు గుప్పించారు. వాస్తవానికి.. భోగాపురం విమానాశ్రయఆలోచనకు ఎప్పుడో 1997లోనే నాంది పడింది. 

 మూడు దశాబ్దాల భవిష్యత్ ను ముందుగానే చూడగల విజనరీ అయిన  చంద్రబాబు నాయుడు 1997లో ఉత్తరాంధ్రకు అంతర్జాతీయ విమానాశ్రయ ఆవశ్యకతను గుర్తించారు. ఆ దిశగా అడుగులు వేశారు. ఇక   హుద్‌హుద్ తుఫాను అనంతరం..  సురక్షిత,  ఆధునిక విమానాశ్రయం ప్రతిపాదనను ఆయన మరింత గట్టిగా ముందుకు తీసుకువెళ్లారు.  ఓ వైపు  సముద్ర తీరం, మరొకవైపు మన్యప్రాంతాల నడుమ వ్యూహాత్మక ప్రదేశంగా భోగాపురాన్ని అయిన ఎంపిక చేశారు.  ఆ దిశగా ముందుకు సాగే క్రమంలో వైసీపీ అడుగడుగునా అడ్డంకులు సృష్టించింది.  కేసుల మీద కేసులతో అవాంతరాలు సృష్టించారు. 2019లో రాష్ట్రంలో వైసీపీ అధికారపగ్గాలు చేపట్టిన తరువాత భోగాపురం పురోగతిని పూర్తిగా పక్కన పెట్టేసింది. అయితే 2024 ఎన్నికలలో అఖండ మెజాజరిటీతో తెలుగుదేశం కూటమి   అధికారంలోకి వచ్చిన తరువాత భోగాపురం విమానాశ్రయ నిర్మాణానికి అమరావతి, పోలవరంలతో సమ ప్రాధాన్యత ఇచ్చి పనులను పరుగులు పెట్టించింది చంద్రబాబు ప్రభుత్వం.     

భోగాపురం గ్రీన్‌ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రాజెక్టును 4 వేల 750 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించారు.   తొలి దశలో  ఏడాదికి 60 లక్షల మంది ప్రయాణికులకు సేవలు అందించే ఈ విమానాశ్రయం  భవిష్యత్తులో దశలవారీగా దీని సామర్థ్యాన్ని నాలుగు కోట్ల మంది ప్రయాణీకులకు సేవలందించేందుకు వీలుగా విస్తరించనున్నారు. ఈ ఆధునిక గ్రీన్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు నుంచి రోజూ 200కు పైగా విమానాల రాకపోకలకు వీలుగా మౌలిక సదుపాయాలు కల్పించారు.  ప్రపంచంలోనే అతిపెద్ద ప్రయాణికుల విమానాలను కూడా ఈ విమానాశ్రయంలో సునాయాసంగా ల్యాండ్ అయ్యేలా రన్ వేల రూపకల్పన చేశారు.  

ఉత్తరాంధ్ర తీర  తరచూ తుఫానులు, ఈదురుగాలులకు గురయ్యే అవకాశం ఉన్నందున, భోగాపురం విమానాశ్రయ భద్రతా ప్రమాణాలకు పెద్ద పీట వేసి నిర్మించారు.    హుద్‌హుద్ వంటి  పెను తుపానులను సైతం తట్టుకునేలా సాంకేతిక హంగులతో ఈ విమానాశ్రయ నిర్మాణం జరిగింది. గంటకు 275 కిలోమీటర్ల వేగంతో   గాలులు వీచినా   టెర్మినల్,  రన్‌వే నిర్మాణాలు చెక్కుచెదరవు.    భారీ వర్షాలు కురిసినా ఎయిర్‌పోర్ట్ ప్రాంగణంలో నీరు నిల్వ ఉండకుండా..   డ్రైనేజీ వ్యవస్థను రూపొందించారు. 

భోగాపురం గ్రీన్ ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయం కేవలం విమానాల రాకపోకలకు మాత్రమే కాకుండా యావత్  ఉత్తరాంధ్ర ఆర్థిక స్వరూపాన్ని మార్చే ప్రధాన చోదక శక్తిగా నిపుణులు చెబుతున్నారు. విమానాశ్రయం రావడంతో.. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో పారిశ్రామికాభివృద్ధి, ఐటీ రంగాలు వేగంగా విస్తరించే అవకాశం ఉంది. అంతర్జాతీయ ప్రయాణికులకు నేరుగా కనెక్టివిటీ దొరకడం వల్ల విదేశీ పెట్టుబడులు ప్రవాహంలా వచ్చే అవకాశాలు ఉన్నాయి. రవాణా సౌకర్యాలు పెరగడం ద్వారా స్థానిక యువతకు  ఉపాధి అవకాశాలు పుష్కలంగా లభిస్తాయి. తీరప్రాంత పర్యాటకంతో పాటు ఆధ్యాత్మిక, వైద్య పర్యాటకం కూడా విశేషంగా అభివృద్ధి చెందుతుందనడంలో సందేహం లేదు. 

Bhogapuram International Airport, Visakhapatnam Greenfield Airport, Bhogapuram Airport Construction Details, Airbus Landing Bhogapuram, North Andhra Infrastructure Development

By
en-us Political News

  
మద్యం విధానం పేరుతో గత ప్రభుత్వ హయాంలో జరిగిన భారీ అవకతవకలు, అక్రమాలపై సమగ్ర విచారణ జరుపుతున్న విచారణాధికారులు, ఈ కేసులో మాజీ మంత్రి పాత్రపై కీలక ఆధారాలు సేకరించారు. ఈ నేపథ్యంలో అరెస్టు ముప్పు నుంచి తప్పించుకునేందుకు, ఆయన సుప్రీం కోర్టులో యాంటిసిపేటరీ బెయిల్ పిటిషన్‌ను దాఖలు చేశారు.
ఒక టీవీ ఛానెల్ ఇంటర్వ్యూలో ఖవాజా ఆసిఫ్ తాను పీఓకేలో నిరసనలు చేస్తున్న వారిని భారత్‌తో సమానమైన వర్గంలో చేరుస్తున్నానని పేర్కొన్నారు. వారిని కూడా భారతదేశం లాంటి శత్రువులుగానే పరిగణిస్తున్నాననీ, అందుకే ఆ ఆందోళనకారులతో చర్చిందేదే లేదనీ, వారు పాకిస్థాన్ శత్రువులని చెప్పారు.
మొదట చర్చల సందర్భంగా, నిరసనల్లో పాల్గొన్న విద్యార్థులు, యువతపై కొత్త ఎఫ్ఐఆర్ లు నమోదు చేయబోమని, ఇప్పటికే నమోదైన పాత కేసులను కూడా పూర్తిగా ఉపసంహరిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందని గుర్తు చేసిన ఆయన ఇప్పుడు.. వ్యవహారం న్యాయస్థానం పరిధిలో ఉందంటూ ఆ హామీ అమలుపై వెనక్కు తగ్గిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మిసిర్ బేస్రాపై ఝార్ఖండ్, బిహార్, ఒడిశా, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాల్లో పోలీసులపై దాడులు, నరమేధాలు, ఐఈడీ పేలుళ్లు, వసూళ్లు సహా ఏకంగా 150కి పైగా కేసులు నమోదయ్యాయి. 2007లో ఖుంటీ పోలీసులు ఇతడిని అరెస్ట్ చేసినప్పటికీ, 2009లో బిహార్‌లోని లఖిసరాయ్ కోర్టు సముదాయంపై మావోయిస్టులు దాడి చేసి అతడిని విడిపించుకుపోయారు. ఆ సంఘటన తర్వాత దాదాపు రెండు దశాబ్దాల అజ్ఞాతంలోనే ఉన్నారు.
వర్షాల తీవ్రత వల్ల పలు జిల్లాల్లో పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. కామరూప్, ధుబ్రి, లఖింపూర్, దిబ్రూగఢ్ వంటి ప్రధాన ప్రాంతాల్లో నదులు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో వందలాది గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. రహదారులు, వంతెనలు కొట్టుకుపోవడంతో రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది.
ఇన్ స్పెక్టర్, బాధిత మహిళ కొంత కాలం పాటు సహజీవనం చేసినట్లు కూడా విచారణలో వెలుగులోకి వచ్చింది. అనంతరం ఈ పరిణా మాల నేపథ్యంలో బాధిత మహిళ ఫిర్యాదుపై ఉన్నతాధి కారులు చేపట్టిన విచారణలో ప్రాథమిక ఆధారాలు ఉన్నట్లు తేలడంతో శాఖాపరమైన చర్యల్లో భాగంగా ఆయనను సస్పెండ్ చేస్తూ హైదరా బాద్ పోలీస్ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు.
హైదరాబాద్ లోని పలు ప్రాంతాలలో రహదారులు జలమయమయ్యాయి. వాతావరణ శాఖ వెల్లడించిన వివరాల మేరకు రెండు గంటల వ్యవధిలోనే నగరంలోని అనేక ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది.
రోజురోజుకూ పెరిగిపోతున్న ఈ సైబర్ ముఠాల దందాను అరికట్టడానికి సాధారణ చట్టాలు సరిపోవనీ, అందుకే ఇకపై డిజిటల్ అరెస్టు మోసాలను పాతకాలపు ఐటీ చట్టాల కింద కాకుండా, వ్యవస్థీకృత నేరాల నియంత్రణ చట్టం కింద నమోదు చేసి, దర్యాప్తు జరపాలని పోలీసు ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేసింది.
ఫార్వార్డ్ సీమెన్స్ యూనియన్ ఆఫ్ ఇండియా సామాజిక మాధ్యమ వేదికగా షేర్ చేసిన నివేదిక వీడియోతో ఈ ఉదంతం వెలుగులోకి వచ్చింది. నౌక పరిసర ప్రాంతాల్లో నిరంతరం పేలుళ్లు జరుగుతుండటం, దట్టమైన నల్లటి పొగ ఆకాశాన్ని కమ్మేస్తుండటం ఎఫ్సీయూ ఐవిడుదల చేసిన వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది.
మీ పుస్తకాల అభిరుచికి సరిపోయే సరైన నవలల కోసం వెతుకుతున్నారా? నా లైబ్రరీలోని పుస్తకాలతో ఛాట్‌జీపీటీ చేసిన అద్భుత ప్రయోగం, 30 నిమిషాల్లో అది అందించిన పర్సనలైజ్డ్ బుక్ రికమండేషన్ల రహస్యాలు ఇక్కడ చదవండి.
వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ తాజా నివేదిక ప్రకారం బంగారం ధరలు త్వరలోనే దిగివచ్చే అవకాశం ఉంది. పసిడి మార్కెట్ పరిస్థితులు, తగ్గుదలకు గల కారణాలు మరియు తాజా ధరల పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
కాలిఫోర్నియాలోని 330 MW డేటా సెంటర్ కూలింగ్ కోసం 287 మిలియన్ గాలన్ల వ్యవసాయ నీటిని మళ్లించే ప్రయత్నాన్ని వాటర్ డిస్ట్రిక్ట్ అడ్డుకుంది. $10 బిలియన్ల ప్రాజెక్ట్ చుట్టూ రేగిన చట్టపరమైన పోరాటం మరియు రైతు ఆందోళనల పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
3D టీవీలు కనుమరుగవుతున్న వేళ, బ్లూ రే నుండి ఆపిల్ విజన్ ప్రో స్పేషియల్ వీడియోల వరకు అన్ని 3D ఫార్మాట్లను ప్లే చేసే ఉచిత SyLC 3D ప్లేయర్ గురించిన పూర్తి వివరాలు తెలుసుకోండి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.