ప్రాణహాని ఉంది.. కస్టడీకి ఇవ్వొద్దు.. కోర్టుకు సీఐ నాగరాజు

Publish Date:Jul 1, 2026

Advertisement

ఆంధ్రప్రదేశ్‌లో తీవ్ర సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ లాకప్ డెత్ కేసు మరో   మలుపు తిరిగింది. ఈ కేసులో అరెస్టై రిమాండ్ లో ఉన్న సర్కిల్  సీఐ నాగరాజు  న్యాయమూర్తి ముందు  సంచలన వ్యాఖ్యానాలు చేశారు. తన  ప్రాణాలకు తీవ్ర ముప్పు ఉందనీ, ఈ కేసును బలవంతంగా ఒప్పుకోవాలంటూ   ఒత్తిడి తెస్తున్నాని అన్నారు. ఒక పోలీసు అధికారి అయి ఉండి, తోటి విభాగాల నుంచే తనకు ప్రాణభయం ఉందంటూ ఆక్ష్న న్యాయస్థానంలో మొరపెట్టుకోవడం సంచలనం రేపింది.  

విచారణలో భాగంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టు ముందుకు వచ్చిన సీఐ నాగరాజు..  ఈ కేసులో తనను  ఇరికించేందుకు తెరవెనుక పెద్ద కుట్ర జరుగుతోందని ఆరోపించారు.  ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) చేపట్టిన విచారణకు తాను మొదటి నుంచి పూర్తిగా సహకరిస్తూనే ఉన్నానని చెప్పిన నాగరాజు..  ఇప్పుడు కొత్తగా తన వద్ద అదనంగా చెప్పడానికి ఏమీ లేదనీ,ఇప్పుడు  తనను మళ్లీ పోలీస్ కస్టడీకి ఇస్తే.. తన ప్రాణాలకే   ప్రమాదమని ఆందోళన వ్యక్తం చేశారు.  దీనిపై స్పందించిన కోర్టు..  నాగరాజు లేవనెత్తిన అభ్యంతరాలు,  ఆరోపణలపై   లిఖితపూర్వక నివేదిక  సమర్పించాలని పోలీసు ఉన్నతా ధికారులను ఆదేశించింది.  

By
en-us Political News

  
ఎన్టీఆర్ ఆత్మగౌరవ నినాదమే తెలుగు జాతికి ప్రత్యేక గుర్తింపు తెచ్చింది...
తెలంగాణ రాష్ట్ర ప్రగతి రథాన్ని మరింత వేగంగా పరుగులు తీయించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సరికొత్త వ్యూహాలతో రంగంలోకి దిగారు.
రాష్ట్రాభివృద్ధితో పాటు ప్రపంచవ్యాప్తంగా తెలుగువారికి గుర్తింపు తీసుకురావడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.
మావిగన్‌కు కట్టుబడి ఉన్నాం..3 అటకెక్కినట్లేనా?
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతాంగ సమస్యలు మరింత జటిలంగా మారాయని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
ఝార్ఖండ్‌లో ఇటీవల చోటుచేసుకున్న ఒక అసాధారణ ఉదంతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల అనంతరం అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న వ్యూహాత్మక వైఖరి
రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలోని కుర్మద్ది, మేడిపల్లి గ్రామాల్లో బుధవారం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
భారతదేశ గ్రామీణ ప్రాంతాల్లో వలసల నివారణకు, పేదరిక నిర్మూలనకు అత్యంత కీలకమైన సాధనంగా నిలిచిన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ
రౌడీషీటర్ కేసు చుట్టూ తిరుగుతున్న ప్రస్తుత పరిణామాలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెను సంచలనంగా మారాయి.
యాదగిరిగుట్ట ఆలయ కమిటీ ఏర్పాటుకు సంబంధించి తమకు కనీస సమాచారం కూడా లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్న స్థానిక ప్రజాప్రతినిధులను, ముఖ్య నాయకులను సంప్రదించకుండానే ఈ నిర్ణయం తీసుకోవడంపై ఆయన బాహాటంగా తన నిరసన వ్యక్తం చేశారు.
లారీలు ఢీకొన్న వేగానికి వెంటనే మంటలు చెలరేగాయి. ఈ దుర్ఘటనలో రెండు లారీల డ్రైవర్లు, క్లీనర్లు సజీవదహనమయ్యారు.
నెట్‌వర్క్ ఆసుపత్రుల నుండి క్యాష్‌లెస్ సౌకర్యాన్ని పూర్తిగా ఉపసంహరించుకున్నారు. అయితే, జూన్ 30, అంతకంటే ముందు ఆసుపత్రులలో చేరిన పాత రోగులకు మాత్రం వారు డిశ్చార్జ్ అయ్యే వరకు ఈ పథకం కింద చికిత్స కొనసాగించేందుకు అనుమతి ఇచ్చారు. జూలై 1 నుండి కొత్తగా ఎలాంటి అడ్మిషన్లను అనుమతించవద్దని అన్ని అనుబంధ ఆసుపత్రులకు, యూనిట్ అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.