ప్రపంచానికి క్రీస్తు శాంతి సందేశాన్ని అందించారు : సీఎం రేవంత్‌రెడ్డి
Publish Date:Dec 20, 2025
Advertisement
ప్రపంచానికి శాంతి సందేశాన్ని అందించడానికి ఏసు ప్రభువు జన్మించారని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. క్రిస్మస్‌ను పురస్కరించుకొని హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన వేడుకలకు ముఖ్యమంత్రి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని మతాలను సమానంగా చూస్తుందని తెలిపారు. ఇతర మతాలను కించపరిస్తే కఠిన చర్యలు తీసునేలా వచ్చే అసెంబ్లీ సమావేశంలో చట్టం తెస్తామన్నారు. వచ్చే అసెంబ్లీ సమావేశంలో చట్టం తెస్తామన్నారు. తెలంగాణలో శాంతిని కాపాడుతూ సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారు. డిసెంబరులో ప్రజా ప్రభుత్వం ఏర్పడింది. సోనియాగాంధీ కూడా ఇదే నెలలోనే జన్మించారు. ఏసు ప్రభువు బోధనల స్ఫూర్తితో మా ప్రభుత్వం పనిచేస్తోంది. శాంతిని కాపాడుతూనే సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని రేవంత్ అన్నారు. పేదవాడి ఆకలి తీర్చాలని ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఆహార భద్రత చట్టం తెచ్చింది. ప్రతి పేదవాడికి నెలకు 6 కిలోల సన్న బియ్యం అందిస్తున్నాం. ఉచిత విద్యుత్ పథకం ద్వారా 50లక్షల మంది పేదల ఇళ్లలో వెలుగులు నింపాం. రెండేళ్లలో వ్యవసాయంపై రూ.1.04లక్షల కోట్లు ఖర్చు పెట్టాం.ద్వేషించే వారిని కూడా ప్రేమించేలా ఏసు ప్రభువు చేశారని ముఖ్యమంత్రి అన్నారు. రాష్ట్రంలో 7వేల చర్చిలకు రూ.30వేల చొప్పున క్రిస్మస్ వేడుకల కోసం రూ.33 కోట్లు కేటాయించామని మైనార్టీ కార్పొరేషన్ ఛైర్మన్ దీపక్ జాన్ తెలిపారు. ఈ క్రిస్మస్ వేడుకల్లో మంత్రులు పొంగులేటి, పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి, అజారుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.
http://www.teluguone.com/news/content/christmas-celebrations-36-211340.html





