ఎన్నికలు ఆపాలంటూ హైకోర్టులో పిటిషన్
Publish Date:Mar 6, 2021
Advertisement
చిత్తూరు మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికలను నిలిపివేయాలని హైకోర్టులో హౌస్‌మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. 18 డివిజన్లలో టీడీపీ అభ్యర్థుల నామినేషన్లు ఫోర్జరీతో విత్ డ్రా చేశారని పిటిషన్ వేశారు. హౌస్‌మోషన్ పిటిషన్‌ను 18 మంది టీడీపీ అభ్యర్థులు దాఖలు చేశారు. టీడీపీ అభ్యర్థుల తరఫున న్యాయవాది కృష్ణారెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్‌పై వాదనలు మాజీ అడ్వొకేట్ జనరల్, సీనియర్ న్యాయవాది తమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపించనున్నారు. తిరుపతిలో కార్పొరేషన్ లో టీటీడీ ఉద్యోగులు బరి తెగిస్తున్నారు. వినాయక్ నగర్ క్వార్టర్స్‌లో వైసీపీకి అనుకూలంగా ప్రచారంలో టీటీడీ ఉద్యోగులు పాల్గొన్నారు. ప్రచారానికి వచ్చిన 41వ డివిజన్ వైసీపీ అభ్యర్థి స్రవంతితో పాటు టీటీడీ ఉద్యోగులు ప్రచారం చేయటంపై సహోద్యోగుల నుంచి అభ్యంతరం వ్యక్తమైంది. టీటీడీ ఉద్యోగులు మీడియాకు సమాచారమిచ్చారు. దాంతో ప్రచారం జరుగుతున్న వినాయకనగర్‌కు మీడియా ప్రతినిధులు చేరుకున్నారు. మీడియాను చూసి వైసీపీ అభ్యర్థి స్రవంతి, టీటీడీ ఉద్యోగులు వెళ్లిపోయారు. ఎన్నికల కమిషన్‌కు కోడ్ ఉల్లంఘనలపై ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఎన్నికల ప్రచారంలో నగదు పంపిణీ, మద్యం సరఫరాపై ఈ ఫిర్యాదులు ఎక్కువగా వచ్చాయి. కోడ్ ఉల్లంఘనల విషయమై ప్రత్యేక టీంలు పనిచేస్తున్నట్టు ఎస్‌ఈసీ వెల్లడించింది. విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, తిరుపతిలపై కమిషన్ ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి నుంచే ఎక్కువగా ఫిర్యాదులు అందడంతో ఎస్‌ఈసీ అప్రమత్తమైంది. ఈ ఫిర్యాదులకు సంబంధించి నేటి ఉదయం 11 గంటలకు ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ సంబంధిత అధికారులతో టెలికాన్ఫరెన్సు నిర్వహించనున్నారు. ఈ ఫిర్యాదులపై ఆదాయపు పన్నుశాఖ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా ప్రత్యేక దృష్టి సారించాలని ఇప్పటికే ఎస్‌ఈసీ విజ్ఞప్తి చేసింది.
http://www.teluguone.com/news/content/chittor-corporation-tdp-candidates-petition-on-high-court-25-111319.html





