మెగా కుంభకోణం!.. జూబ్లీహిల్స్‌లో చిరంజీవి ల్యాండ్ గోల్‌మాల్!
Publish Date:Apr 27, 2022
Advertisement
జూబ్లీహిల్స్ కో ఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీలో ఏమి జరుగుతోందో ఎవరికీ తెలియదు. అదొక మాయాలోకం. ఇప్పుడు కాదు, 1964లో ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్రంసొలో సొసైటీ ఏర్పడిన నాటి నుంచి, సొసైటీ భూముల క్రయ విక్రయాలలో కొత్త కొత్త అక్రమాలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. అసెంబ్లీలో చర్చలు, కమిటీలు విచారణలు, నివేదికలు అన్నీ ఇన్నీకాదు, చాలానే ఉన్నాయి. ఈ నేపధ్యంలోనే, గత 20 ఏళ్లుగా సొసైటీలో జరుగుతున్న అక్రమాలపై దర్యాప్తు జరిపేందుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. అయితే, ఈ నిర్ణయం జరిగి పది రోజులు అయినా కాకముందే, మరో మెగా కుంభకోణం వెలుగు లోకి వచ్చింది. నిజానికి సొసైటీలోగత 20 సంవత్సరాలుగా సాగుతున్న అక్రమాలపై దర్యాప్తు జరిపించాలని సొసైటీ ప్రస్తుత చైర్మన్ రవీంద్రనాథ్ చేసిన విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం సెక్షన్ 51 కింద విచారణకు ఆదేశించింది. ఈ విషయాన్ని ఇటీవల జరిగిన సర్వసభ్య సమావేశం అనంతరం ఆయనే తెలిపారు. సొసైటీలో 20 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న వారు అనేక అక్రమాలకు పాల్పడ్డారని గుర్తించామని, ఆయా అక్రమాలపై సమగ్ర విచారణ చేయాలని తాము ప్రభుత్వాన్ని కోరామని తెలిపారు. తమ విజ్ఞప్తిని మన్నించిన ప్రభుత్వం సెక్షన్ 51 కింద విచారణకు ఆదేశించిందని రవీంద్రనాథ్ తెలిపారు. సొసైటీ తాజాగా చిరంజీవికి రిజిస్టర్ చేసిన 595 చదరపు గజాల భూమి, 303ఎన్’లో భాగం కాదు. అసలు అది సొసైటీ భూమే కాదు. సొసైటీ లేఅవుట్’లో ఆ భూమిలేదు. అయినా, సొసైటీ అమ్మేసింది, కారు చౌకగా వచ్చిందని చిరంజీవి కొనేశారని, సొసైటీ సభ్యులు ఆరోపిస్తునారు. నిజానికి ఈ భూమి అయితే ప్రభుత్వ భూమి కావాలి, కాదంటే, జీహెచ్ఎంసీ భూమి అయినా కావాలి, అయినా ప్రభుత్వానికి లేదా జీహెచ్ఎంసీ కనీసం సమాచారం అయిన లేకుండానే. సొసైటీ విక్రయించింది. చిరంజీవి కొనుకున్నారు. రిజిస్ట్రరార్’ సార్ రిజిస్టర్ చేసేశారు. ఇలా తమది కాని ప్రభుత్వ భూమిని ప్రభుత్వ అనుమతి లేకుండా విక్రయించడం సొసైటీ చేసిన నేరమైతే, చిరంజీవి తెలిసి కొన్నారో, తెలియకే కొన్నారో గానీ, సొసైటీ సభ్యులు చేస్తున్న ఆరోపణలు నిజం అయితే, అయన చేసింది కుడా నేరమే అవుతుందని అంటున్నారు. నిజంగా, సొసైటీ వారు నిజాయతీగానే ఆ భూమిని చిరంజీవికి విక్రయించాలని అనుకుంటే, ముందుగా జీహెచ్ఎంసీ అనుమతితో , నిబంధనల ప్రకారం సొసైటీ లేఅవుట్’లో చేర్చి,ఆతర్వాత చిరంజీవికి గానీ మరొకరికి గానీ బదిలీ చేయాలి, కానీ, సొసైటీ ఇదేమే లేకుండానే, అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్లుగా, నిబంధనలను ఉల్లంఘించి జీహెచ్ఎంసీ/ప్రభుత్వానికి చెందిన భూమిని చిరంజీవి పేరున రిజిస్టర్’ చేసిందని సొసైటీ సభ్యులు, న్యాయ నిపుణులు ఆరోపిస్తున్నారు. అలాగే, ఈ భూమి నిజం చిరంజీవి పేరున ఉండి ఉంటే, ఇటీవల ప్రభుత్వం జారీ చేసిన జీవో నెం. 58 & 59 ప్రకారం, రెగ్యులరైజేషన్’కు సొసైటీ, లేదా చిరంజీవి దరఖాస్తు చేసుకోవలసిందని, అది కూడా చేయలేందంటే, ఈ మొత్తం వ్యవహారంలో అక్రమాలు జరిగాయని అనుకోవచ్చని, సొసైటీ సభ్యులు, న్యాయ నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. అదొకటి అలా ఉంటే, సదరు భూమి మార్కెట్ ధర చదరపు గజానికి,రూ. 3,50,000 ఉంటే, సొసైటీ చిరంజీవి నుంచి ఉదారంగా రూ. 65000 వంతున వసూలు చేసింది. ఇక్కడే చిరంజీవి మీద సొసైటీకి ఇంత ప్రేమ ఎందుకు అనే ప్రశ్న తలెత్తుతోంది. అదుకే ఇందులో ఏదో గోల్ మాల్ ఉందనే ఆరోపణలు వస్తున్నాయి. గత సొసైటీ హయాంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కొత్త చైర్మన్, అదే దారిలో మరో ముందడుగు వేశారనే ఆరోపణలూ ఉన్నాయి. అలాగే, సొసైటీ మేనేజింగ్ కమిటీ లేదా జనరల్ బాడీకి తెలియ చేయకుండానే అధ్యక్ష, కోశాధికారులు దస్తావేజులు రిజిస్టర్ చేశారని, కాబట్టి ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని సేల్ డీడ్’ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. నిజానికి ఈ సొసైటీలో అక్రమాలు, అవకతవకలు జరుగుతున్నాయని , సొసైటీ సభ్యులు చేసిన ఫిర్యాదు మేరకు స్థానిక అధికార పార్టీ ఎమ్మెల్యే దానం నాగేందర్, ఎప్పుడో సంవత్సరం క్రితమే ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. మంత్రి గారికి వినతి పత్రం అందజేశారు. అయినా, చలనం లేదు.నిజానికి సొసైటీ చరిత్రలో ఇలాంటి అక్రమాలు అవకతవకలు కోకొల్లుగా జరిగాయి. అయితే, అందరూ అయితే రాజకీయ నాయకులు, కాదంటే చిరంజీవి వంటి పెద్ద మనుషులే కావడంతో, అంతా గప్ చిప్’గా సాగిపోతోందని అంటున్నారు.
అయితే, ఇంతలోనే మెగా కుంభకోణం మరొకటి వెలుగులోకి వచ్చింది. వివరాలోకి వెళితే ఈ మెగా కుంభకోణంలో మెగా స్టార్ చిరంజీవీ ,భూ దందా వెలుగు చూసింది. మెగా స్టార్ చిరంజీవి, 1999లో సొసైటీలో 3333 చదరపు గజాల విస్తీర్ణంగల ప్లాట్ నెంబర్ 303ఎన్’ను కొనుగోలు చేశారు.అంతవరకు అంతా బాగానే వుంది. అయితే, తాజాగా, ఆ ప్లాట్’కు అనుకుని ఉన్న మరో 595 చదరపు గజాల స్థలాన్ని కూడా సొసైటీ ఈ నెల 20న చిరంజీవి పేరున రిజిస్టర్ చేసింది. నిజానికి, ఇందుకు సంబందించిన సేల్ డీడ్, దస్తావేజులు చూస్తే, అంతా ఫెయిర్, నథింగ్ గోల్ మాల్’ అనిపిస్తుంది. కానీ, సొసైటీ భాగోతం తెలిసిన వారు, మాత్రం ఇదో మెగా కుంభకోణం అంటున్నారు.
http://www.teluguone.com/news/content/chiranjeevi-land-golmal-in-jubilee-hills-39-135078.html





