రాజకీయాలకు చిరంజీవి మాత్రమే దూరం.. ఆయనకు రాజకీయాలు కాదు!

Publish Date:Feb 12, 2025

Advertisement

చిరంజీవి ఇటీవలి కాలంలో ఏం మాట్లాడినా అది రాజకీయ చర్చకు దారి తీస్తున్నది. తాను రాజకీయాలకు పూర్తిగా దూరమయ్యారు. ఆ విషయాన్ని ఆయనే స్వయంగా ప్రకటించారు. కానీ రాజకీయాలు మాత్రం ఆయనకు దూరం కాలేదు. ఆయన ఏం మాట్లాడినా, ఎవరిని కలిసినా అది రాజకీయ రంగు పులుముకుంటోంది.  ఇటీవల లైలా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో తన ప్రజారాజ్యమే ఇప్పుడు జనసేనగా రూపాంతరం చెందిందని చిరంజీవి అన్న మాటలు, జై జనసేన అంటూ చేసిన నినాదం రాజకీయ చర్చకు దారి తీసిన సంగతి తెలిసిందే. తాను జనసేనకు పూర్తి మద్దతు ఇస్తున్నట్లు చిరంజీవి విస్పష్టంగా చెప్పేశారని పరిశీలకులు విశ్లేషించారు.   ఇటీవలి కాలంలో ఆయన బీజేపీకి చేరువ అవుతున్నారనీ, ఆయన బీజేపీ తరఫున రాజ్యసభకు వెళ్లే అవకాశాలు మెండుగా ఉన్నాయనీ రాజకీయవర్గాలలో జోరుగా చర్చ జరిగింది.

అది కొంచం సద్దుమణిగే సరికి లైలా సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ లో ఆయన జనసేనకు అనుకూలంగా మాట్లాడిన మాటలు మరోసారి చిరంజీవి రాజకీయాలలో యాక్టివ్ కానున్నారన్న సంకేతాలు ఇచ్చాయి. ఈ నేపథ్యంలోనే ఆయన మరోసారి తన రాజకీయాలపై మనసులో మాట చెప్పారు. బ్రహ్మానందం నటించిన బ్రహ్మా ఆనందం సినిమా ఫంక్షన్లో ఆయన మాట్లాడుతూ.. తాను రాజకీయాలకు పూర్తిగా దూరం అని కుండబద్దలు కొట్టడమే కాకుండా, రాజకీయంగా తాను సాధించాలనుకున్నవన్నీ తన తమ్ముడు, జనసేన అధినేత పవర్ కల్యాణ్ సాధిస్తారని చెప్పారు. తాను పూర్తిగా సినిమాలకు పరిమితం అని చెప్పేశారు. అలా చెబుతూనే తాన ఆకాంక్షలు, ఆశయాలు పవన్ కల్యాణ్ నెరవేరుస్తారనడం ద్వారా తన అభిమానులకు మాససికంగా తాను జనసేనవైపు ఉన్నానన్న సంకేతాలు ఇచ్చారు. ఇక రాజకీయంగా తాను సాధించాలనుకున్నవన్నీ పవన్ సాధిస్తారు అనడం వెనుక ఉద్దేశమేమిటన్న చర్చ మొదలైంది. 

దీంతో చిరంజీవి స్వయంగా తాను రాజకీయాలకు దూరం అని ప్రకటించినా, రాజకీయం మాత్రం ఆయన చుట్టూనే తిరుగుతోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. దీంతో చిరంజీవి గతంలో నటించిన గాడ్ ఫాదర్ సినిమా ప్రమేషన్లలో భాగంగా చెప్పిన ఓ డైలాగ్ ‘నేను రాజకీయాలకు దూరమైనా.. రాజకీయం నా నుంచి దూరం కాలేదు’ ప్రస్తుత పరిస్థితికి అద్దం పడుతోందని పరిశీలకులు అంటున్నారు. మొత్తం మీద చిరంజీవి పొలిటికల్ రీఎంట్రీతో సంబంధం లేకుండా ఆయన చుట్టూ రాజకీయాలు ప్రదక్షణం చుస్తున్నాయా అన్న అనుమానాలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి.  

By
en-us Political News

  
బీఆర్ఎస్   బయటకు వచ్చిన తర్వాత కల్వకుంట్ల కవిత   తెలంగాణ రక్షణ పేన పేరుతో  కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. భౌగోళిక తెలంగాణ సిద్ధించినప్పటికీ ప్రజలు ఆశించిన ఆశయాలు నెరవేరలేదని.. సామాజిక తెలంగాణ సాధన ద్వారా మాత్రమే ప్రత్యేక రాష్ట్ర సాకారానికి సార్థకత లభిస్తుందని కవిత పదేపదే చెబుతున్నారు.
స్థానిక ప్రజా సమస్యలను తనదైన శైలిలో పరిష్కరిస్తూ జనాల గుండెల్లో కొలువయ్యారు. అన్నిటికీ మించి మంగళగిరిలో నెలకొన్న అతి కీలకమైన, ప్రధానమైన   గృహ నిర్మాణ హక్కుల (హౌసింగ్ డాక్యుమెంటేషన్) పత్రాల సమస్యకు దశలవారీగా శాశ్వతంగా పరిష్కరిస్తున్నారు.
సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామాకు డిమాండ్..!
ఒకవైపు ఎన్నికల్లో భారీగా అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూనే, మరోవైపు అదే ఎన్నికల్లో ప్రతిపక్షాలు పాల్గొనడం వల్ల ఆ తప్పులకూ, లోపాలకు చట్టబద్ధత కల్పించినట్లవుతోందన్న ఆయన ఎన్నికలను బహిష్కరించాలని పిలుపునిచ్చారు.
ఉత్తరాంధ్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది.
ఆ సమయంలో తాను కేరళ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తుండగా, గ్యానేష్ కుమార్ కేంద్ర హోంమంత్రిత్వ శాఖలో ఉన్నతాధికారిగా సేవలందిస్తున్నారని గుర్తుచేశారు. ప్రయాణ సమయంలో తన రిటైర్మెంట్ అనంతర ప్రణాళికల గురించి  ఆరా తీసిన జ్ణానేష్ కుమార్‌.. ఆ సందర్భంలోనే బీజేపీ తరఫున పతనం తిట్ట లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయాలని సూచించారన్నారు. 
ఈ నియోజకవర్గంలో గత ఎన్నికల ఫలితాలు,  ప్రస్తుత రాజకీయ వాతావరణం దృష్ట్యా బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు విజయంపై ధీమాతో ఉన్నాయి. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ బరిలోకి దిగడంతో సమీకరణాలు ఏ విధంగా మారతాయన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. 
ప్పటి వరకూ మోడీ సర్కార్ ఘనంగా చెప్పుకుంటూ వచ్చిన పారదర్శకత ప్రశ్నార్థకమైంది.  రాజ్యాంగ వ్యవస్థలు బలహీనపడ్డాయన్న వాదనకు బలం చేకూరింది. అంత వరకూ విపక్షాలు చేసే విమర్శలను సునాయాసంగా తిప్పికొట్టి పై చేయి సాధించిన మోడీ సర్కార్ నీటి విషయంలో సమాధానం చెప్పుకోలేక తడబడింది. వెనకడుగు వేసింది. 
ఎంతటి సంక్షోభాన్నైనా సంయమనం కోల్పోకుండా అధిగమించడం, ఆ సంక్షోభాన్నే అవకాశంగా మలచుకుని ముందుకు సాగడం ఆయన నైజం. ఎంతటి క్షిష్టమైన సమస్యనైనా  పరిష్కరించగలిగే నేర్పు, ఎంతటి సంక్షోభాన్నైనా తట్టుకునిముందుకు సాగే సామర్ధ్యం కారణంగానే ఆయనకు పొలిటికల్ సర్కిల్స్ లొ  క్రైసిస్ మ్యాన్ అన్న గుర్తింపు వచ్చింది. 
వ్యవసాయ రంగానికి పెద్దపీఠ వేసేలా చంద్రబాబు  35 వేలకోట్ల రూపాయల అంచనాతో  సాగునీటి రోడ్‌మ్యాప్‌ను ప్రకటించారు. దీని ద్వారా రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న 36 సాగునీటి ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అంతేకాకుండా..  దేశంలోనే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్‌లో  ఇరిగేషన్ అండ్ వాటర్ క్యాలెండర్ ను అందుబాటులోకి తెచ్చారు.
ఎన్నికలు రిగ్గింగ్ అవుతున్నాయని తెలిసినా, ప్రతిపక్షాలు మళ్లీ అవే ఎన్నికల్లో పాల్గొంటూ ఆ పద్ధతికి చట్టబద్ధత ఎందుకు కల్పిస్తున్నాయని ప్రశ్నించి సంచలనం సృష్టించారు.  ఓట్లు చోరీకి గురవుతున్నా, ఎమ్మెల్యేలు, ఎంపీలు కొనుగోలుకు గురవుతున్నా, పార్టీలు చీలిపోతున్నా కేవలం ఉనికి కోసమే పోరాడుతున్నారా అని నిలదీశారు.
వైసీపీకి చెందిన పలువురు నాయకులు జనసేన పార్టీలో చేరారు.
ప్రజాస్వామ్య వ్యవస్థలో   నైతికత, విలువలు పలుచన అయిపోతున్నాయి.   ఏ పార్టీ నుంచి గెలిచామనే అంశంతో సంబంధం లేకుండా, వ్యక్తిగత ప్రయోజనాలు, అధికార కాంక్ష,  రాజకీయ లబ్ధికి మాత్రమే పెద్ద పీట వేస్తున్న నేతలే ఎక్కువగా కనిపిస్తున్నారు
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.