అవును, ఆ ఇద్దరి మధ్య గ్యాప్ నిజం!
Publish Date:Mar 29, 2022
Advertisement
ముఖ్యమంత్రి కేసీఆర్, చినజీయర్ స్వామి మధ్య దూరం పెరిగింది. దూరం పెరగడమే కాదు, అగాధమే ఏర్పడింది. ఇద్దరి మధ్య ఎంతో కాలంగా సాగుతున్న పవిత్ర బంధమే తెగిపోయింది. నిజానికి, గడచిన ఏడున్నర ఎనిమిది సంవత్సరాలలో ముఖ్యమంత్రి కేసీఆర్’ ఏ చిన్న కార్యక్రమం తలపెట్టినా, చిన జీయర్ నిర్ణయించిన ముహూర్తం ప్రకారమే అడుగు ముందు వేశారు. ఇప్పుడు యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి మహాకుంభ సంప్రోక్షణ కార్యక్రమం కూడా ఆయన ఎప్పుడో, సంబందాలు చక్కగా ఉన్నరోజుల్లో నిర్ణయించిన ముహూర్తం ప్రకారమే జరిగింది. కానీ, ఆయన లేకుండానే మహా సంప్రోక్షణ కార్యక్రమం జరిగిపోయింది. యాదాద్రి ఆలయ పునర్నిర్మాణంలో అన్నీ తానై వ్యవహరించిన చినజీయర్, ను పక్కన పెట్టి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలయాన్ని ప్రారంభించారు. దీంతో,ఆ ఇద్దరి మధ్య దూరం పెరగడమే కాదు, బంధమే తెగిపోయిందనే విషయం విస్పష్టంగా తేలిపోయింది. అయితే, ఇన్నేళ్ళుగా ఆ ఇద్దరి మధ్య పెనవేసుకున్న విడదీయ వీలులేని, ఆధ్యాత్మిక, రాజకీయ బంధం, ఎందుకు ఇలా పుటుక్కుమంది, ఎందుకు తెగిపోయింది? అంటే అందుకు అనేక కారణాలు చెపుతున్నారు. ముచ్చింతల్ ఆశ్రమంలో ఏర్పాటు చేసిన 216 అడుగుల సమతామూర్తి విగ్రహావిష్కరణ వేడుకల్లో ముఖ్యమంత్రి ఆశించిన విధంగా, ఆయనకు గౌరవం దక్కక పోవడం ఒక కారణం అయితే,12 రోజుల పాటు జరిగిన వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోడీ మొదలు క్యూ కట్టి విచ్చేసిన కేంద్ర మంత్రులు, బీజేపీ, ఆర్ఎస్ఎస్ అగ్రనేతలకు జరిగిన మర్యాదలు, అతిధి సత్కార్యాలు, మరో కారణం అంటున్నారు. అందుకే, ఇక అక్కడి నుంచి కేసీఆర్, చిన జీయర్’ను బ్లాక్ లిస్టులో పెట్టారని అంటున్నారు. అందుకే ఆ పన్నెండు రోజుల్లో ఒక్కరోజు కూడా ముఖ్యమంత్రి ముచ్చింతల్ వైపు కన్నెత్తి అయినా చూడలేదని, చివరకు ఆయన కోసంగా పూర్ణాహుతి కార్యక్రమాన్ని వాయిదా వేసినా, ముఖ్యమంతి కేసేఅర్ పట్టించుకోలేదని అంటున్నారు. ముఖ్యమంత్రి మాత్రమే కాదు, ఆయన కుటుంబ సభ్యులు, పార్టీ నాయకులు ఎవరూ ఆ కార్యక్రమానికి హజరు కాలేదు. అలాగే, ఇప్పుడు, యాదాద్రి మహా సంప్రోక్షణ కార్యక్రమానికి, చినజీయర్ స్వామినే కాదు, రాష్ట్ర గవర్నర్’తోసహ ఎవరినీ పిలవలేదు. కేంద్ర మంత్రులను, రాష్ట్రాల ముఖ్యమంత్రులనుమ చివరకు ప్రధానిని ఆహ్వానించే ఆలోచన కూడా ఉందని, యాదాద్రి ఆలయ పునః ప్రారంభ కార్యక్రమాన్ని అత్యంత వైభవోపేతంగా జరిపిస్తామని స్వయంగా చెప్పిన ముఖ్యమంత్రి, చివరకు తూ తూ మంత్రంగా కానిచ్చారు. నేనే అందరికంటే పెద్ద హిందువును, నేను చేసినన్ని, యజ్ఞాలు, యాగాలు ఇంకెవరు చేశారు, అని హిందుత్వ వాదులనే ప్రశ్నించిన కేసీర్ ఎందుకు ఇలా, ‘హిందూ వ్యతిరేక సెక్యులర్’ ప్రతినిధిగా మారిపోయారు? అదే ఇప్పుడు రాజకీయ వర్గాల్లో వినవస్తున్న ప్రశ్న. అయితే, సమతామూర్తి విగ్రహావిష్కరణ వేడుకల్లో తమకు అవమానం జరిగిందనే ఆగ్రహంతోనే, ముఖ్యమంత్రి కేసేఆర్ యదాద్రి మహా సంప్రోక్షణ కార్యక్రమానికి చినజీయర్ సహ ఎవరినీ పిలవలేదా? ఈ విధంగా ముఖ్యమంత్రి ప్రతీకారం తీర్చుకున్నారా? కేవలం ఆ ఒక్క కారణంగానే, ముఖ్యమంత్రి ఎంతో ఘనంగా జరగవలసిన, జరుపుతామని ప్రకటించిన ఆలయ పునః ప్రారంభ వేడుకలను, సాదాసీదాగా, కానిచ్చేశారా,అంటే కాదనిపిస్తోందని, దీని వెనక ఇంకా ఏదో ఉందని అంటున్నారు. ముఖ్యంగా మహా సంప్రోక్షణ కార్యక్రమాన్ని కేవలం కుటుంబ, పార్టీ వ్యవహారంగా నిర్వహించడం వెనక రాజకీయ వ్యూహం ఉందని అంటున్నారు. రాజకీయ వ్యూహంలో భాగంగానే చిన జీయర్ స్వామి ఎప్పుడో 20 ఏళ్ల క్రితం సమ్మక్క, సారలమ్మల దైవత్వానికి సంబందించి చేసిన వ్యాఖ్యలను వెతికి తీసి, వైరల్ చేశారు. అదే సమయంలో చిన జీయర్’ను ‘ఆంద్రా స్వామి’ అనే ప్రచారం కూడా జరిగింది. ఒక విధంగా దేవుళ్ళ మధ్య సెంటిమెంట్ మంటలు రేపెందుకే, ముఖ్యమంత్రి కేసేఆర్, ఒక వ్యూహం ప్రకారమే అడుగులువేస్తున్నారని అంటున్నారు. ఓ వంక చిన జీయర్’ను ఆంధ్రా సామిని చేయడంతో పాటుగా యాదాద్రిని తెలంగాణ/తెరాస దేవునిగా ఎస్టాబ్లిష్ చేసేందుకే, మహా సంప్రోక్షణ కార్యక్రమాన్ని తెరాస కార్యక్రంగా నిర్వహించచారని అంటున్నారు. అలాగే,ఆ ఇద్దరి మధ్య దూరం పెరగడానికి ముఖ్యమంత్రి కేసేఆర్, పాత కొత్త మిత్రులు, వ్యూహకర్తలు కూడా కొంత వరకు కారణమని అంటున్నారు. ముఖ్యమంత్రి కేసీఅర్’ బీజేపీతో యుద్ధం ప్రకటించిన నేపద్యంలో, బీజేపీ హిందుత్వ అనుకూల విధానాలను కూడా విమర్శిస్తున్నారు. ఈనేపధ్యంలోనే, సమతా మూర్తి విగ్రహ ఆవిష్కరణను బీజేపీ యూపీ ఎన్నికల ప్రచారంలో వాడుకుంటోందని ముందు అసదుద్దీన్ ఒవైసీ, ఆ తర్వాత కేసీఆర్ విమర్శించారు. అలాగే, ముఖ్యమంత్రి ముందెన్నడూ లేని విధంగా లౌకిక వాదం గురించి కూడా ఎక్కువగా మాట్లాడుతున్నారు. సో .. హిందూ భావజాలానికి దూరంగా ఉండే ఉద్దేశంతోనూ కేసీఆర్, చిన జీయర్’కు దూరమయ్యారనే అనుమానాలు కూడా వినిపిస్తున్నాయి. అలాగే, ఆర్థిక పరమైన వ్యవహారాలు, రాజకీయ ఎత్తుగడలు, కూడా ఆ ఇద్దరి మధ్య చిచ్చు పెట్టిందని అంటున్నారు.
http://www.teluguone.com/news/content/china-jeeyar-and-kcr-parted-ways-25-133648.html





