బూట్ల ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం.. చైనాలో 28 మంది సజీవదహనం.!

Publish Date:Jul 10, 2026

Advertisement

చైనాలో గురువారం (జులై 9) రాత్రి జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో 28 మంది సజీవదహనం అయ్యారు. ఆగ్నేయ చైనాలోని ఫుజియాన్ ప్రావిన్స్‌లో  బూట్ల తయారీకి  ప్రసిద్ధి చెందిన జిన్‌జియాంగ్ నగరంలోని ఓ పాదరక్షల ఫ్యాక్టరీలో ఈ అగ్ని ప్రమాదం సంభవించింది.  నిత్యం వందలాది మంది కార్మికులు పని చేసే  ఆ బహుళ అంతస్తుల ఫ్యాక్టరీ భవనంలో.. గురువారం ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. ఎం జరుగుతోందో అర్థమయ్యేలోగానే 28 మంది కార్మికులు ఆ మంటల్లో సజీవదహనమయ్యారు.  పలువురు గాయపడ్డారు.  

 సమాచారం అందుకున్న స్థానిక యంత్రాంగం హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టింది.   200 మందికి పైగా అగ్నిమాపక సిబ్బంది 35  ఫైర్ ఇంజన్లతో  మంటలను అదుపు చేశారు. షూ తయారీలో ఉపయోగించే రబ్బరు, కెమికల్స్, జిగురు వంటి మండే స్వభావం కలిగిన ముడి పదార్థాలు అక్కడ పెద్ద మొత్తంలో నిల్వ ఉంచడం వల్లే మంటలు  వేగంగా, తీవ్రంగా వ్యాపించాయని ప్రాథమిక దర్యాప్తులో తేలింది.  

ఈ ఘోర దుర్ఘటనపై చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. భారీ సంఖ్యలో ప్రాణనష్టం జరగడంపై  ఆవేదన వ్యక్తం చేస్తూ, సహాయక చర్యలను  వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. బాధితుల కుటుంబాలకు అండగా నిలవాలని ఆదేశించారు.  

China fire accident, shoe factory blaze, Fujian province fire, Jinjiang factory tragedy, Xi Jinping order, Huiteng shoes factory

By
en-us Political News

  
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అమరావతి రాజధాని అంశం మళ్లీ తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో ఎవరూ ఊహించని ఒక అనూహ్యమైన ఘోర ఘటన చోటుచేసుకుంది.
డీఎస్పీ భీమ్ రెడ్డిపై అవినీతి ఆరోపణలు రావడంతో ఏసీబీ అధికారులు రంగంలోకి దిగి ఆయన నివాసంతో పాటు బంధువులు, స్నేహితుల ఇళ్లలో పలుచోట్ల సోదాలు నిర్వహించారు.
మహిళా హక్కుల పరిరక్షణ, సమాజంలో లింగ సమానత్వాన్ని పెంపొందించే దిశగా అస్సాం
ఖమ్మం జిల్లా చింతకానిలో నిర్వహించిన రైతు ఆశీర్వాద సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.
మాజీ మంత్రి కొడాలి నానిపై కేసు నమోదు చేయాలని కోరుతూ టీడీపీ నేతలు విజయవాడ వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు
తెలంగాణలో ఓటరు జాబితాలో ఉన్న డబుల్, డూప్లికేట్ ఓట్లను తొలగించి ఎన్నికల ప్రక్రియను మరింత పారదర్శకంగా నిర్వహించాలని బీఆర్ఎస్ పార్టీ కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరింది.
గగనతలంలో ప్రయాణిస్తున్న ఒక వాణిజ్య విమానంలో ఊహించని సాంకేతిక లోపం తలెత్తి తీవ్ర కలకలం రేపింది.
తెలంగాణ రాష్ట్రంలో హైడ్రా చేపడుతున్న కూల్చివేతల వ్యవహారం మరోసారి రాజకీయ వేడిని రాజేసింది.
1000 కి.మీ. ప్రయాణించి.. గూగుల్ మ్యాప్స్‌తో వెతికి.. అప్పు తీర్చిన కేరళ స్నేహితుడు..!
పోక్సో కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న బండి భగీరథ్‌కు హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో శుక్రవారం మధ్యాహ్నం చర్లపల్లి కేంద్ర కారాగారం నుంచి ఆయన విడుదలయ్యారు.
తెలంగాణలోని జనగామ జిల్లా కేంద్రంలో ఊహించని రీతిలో ఒక వింత ఘోరం జరిగింది.
ఓ యువకుడిని హీరోగా సినీ పరిశ్రమకు పరిచయం చేస్తానని నమ్మించి, అతని కుటుంబం నుంచి 3.5 కోట్లకు పైగా డబ్బులు తీసుకుని మోసం చేశారనే ఆరోపణలతో దర్శకుడు గుడ్లూరి అశోక్ బాబుపై కేసు నమోదైంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.