చిలుకూరు బాలాజీ ప్రధానార్చకుడు సౌందర్ రాజన్ కన్నుమూత

Publish Date:Feb 27, 2026

Advertisement

తెలంగాణలో ప్రసిద్ధి చెందిన చిలుకూరు బాలాజీ దేవాలయం ప్రధాన అర్చకుడు సౌందర్ రాజన్  శుక్రవారం (ఫిబ్రవరి 27) కన్నుమూశారు. ఆయన వయస్సు 90 ఏళ్లు. వృద్ధాప్య సమస్యలతో గత కొంత కాలంగా ఆనారోగ్యంతో తీసుకుంటున్న సౌందర్ రాజన్ శుక్రవారం (ఫిబ్రవరి 27) ఉదయం తన నివాసంలో తుది శ్వాస విడిచారు.

అర్చక సంప్రదాయాన్ని కొనసాగిస్తూనే ఉన్నత విద్యను అభ్యసించిన ఆయన ఉస్మానియా విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ స్థాయికి ఎదుగారు. ఆయన కుమారులలో రెండో వారైన రంగరాజన్ ప్రస్తుతం ఆలయ ప్రధాన అర్చకుడిగా కొనసాగుతున్నారు.  సౌందర్‌రాజన్ మరణం పట్ల పలువురు ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేవారు. ఆయన కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. 

దశాబ్దాల పాటు చిలుకూరు బాలాజీ స్వామివారి సేవలో అంకితభావంతో పనిచేసిన సౌందర్ రాజన్ గారు భక్తుల విశ్వాసాన్ని నిలబెట్టిన గొప్ప ఆధ్యాత్మిక వేత్తగా గుర్తింపు పొందారని పేర్కొన్నారు. 

By
en-us Political News

  
తెలుగు ఫోక్ సింగర్ మంగ్లీపై ఇటీవల వెలువడుతున్న స్కాం ఆరోపణల నేపథ్యంలో ఆమె పోలీసులను ఆశ్రయించారు.
కృత్రిమ మేధ (AI) దుర్వినియోగం, ముఖ్యంగా డీప్‌ఫేక్ వీడియోల సృష్టి మరియు వ్యాప్తిపై గుజరాత్ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
కూట‌మి ప్ర‌భుత్వం కృషితో క్రీడావికాసం సాధ్య‌మ‌వుతోంద‌ని మంత్రి నారా లోకేష్ అన్నారు.
రాజ్యాంగం అమలులోకి వచ్చిన సమయంలో ఉన్న సామాజిక పరిస్థితులు వేరు, ప్రస్తుత ఆర్థిక పరిస్థితులు వేరని వారు వాదిస్తున్నారు. కులాన్ని మాత్రమే ప్రాతిపదికగా తీసుకోవడం వల్ల, అగ్రవర్ణాల్లోని నిరుపేదలకు అన్యాయం జరుగుతోందన్న ఆవేదన వారి వాదనలో వ్యక్తమవుతోంది. ఆర్థిక అసమానతల అంశంపై చర్చ తీవ్రమవుతున్న తరుణంలో.. కులం కంటే ఆర్థిక స్థితే ముఖ్యం అనే నినాదం బలంగా వినిపిస్తోంది.
ఐపీఎల్ 2026 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ వరుస విజయాలతో ఫామ్‌లోకి వచ్చినప్పటికీ, జట్టు ఫీల్డింగ్ ప్రమాణాలు మాత్రం ఆందోళన కలిగిస్తున్నాయి.
మీసేవ కార్యాలయాల్లో అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఏసీబీ అధికారులు ఆకస్మిక సోదాలు చేపట్టారు.
అథ్లెటిక్స్ ప్రపంచంలో పరుగు అంటేనే గుర్తొచ్చే పేరు ఉసేన్ బోల్ట్. ఆయన సృష్టించిన రికార్డులు దశాబ్ద కాలంగా ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నాయి.
ఇరాన్ తో అమెరికా యుద్ధం అన్నది ఒక పెద్ద వ్యూహంలో చిన్న ఆటవిడుపు మాత్రమే అంటున్నారు అంతర్జాతీయ వ్యూహకర్తలు. ప్రస్తుతం జరుగుతున్నవన్నీ, ఒక భారీ వ్యూహంలో భాగమైన చిన్న చిన్న ఘర్షణలు మాత్రమేనని విశ్లేషిస్తున్నారు. అసలు సిసలు యుద్ధం అగ్రరాజ్యం అమెరికాకు, వేగంగా పురోగమిస్తూ.. అమెరికా ఆధిపత్యానికి గండి కొడుతున్న చైనాకు మధ్య జరుగుతోంది.
రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి 90రోజుల కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు.
వెనిజులాలో రాజకీయ మార్పులు అక్కడి నుంచి చమురు సరఫరా అంతరాయం. ఇరాన్ లో ఘర్షణలు, చమురు ఎగుమతులు దెబ్బతినడం. రష్యాపై ఆంక్షలు, సరఫరా పరిమితి, సౌదీ ఉత్పత్తి తగ్గుదల, ధరలు పెరుగుదల. వీటి ఫలితంగా.. చైనా రోజువారీ చమురు దిగుమతుల్లో 20 శాతం తగ్గుదల. ఇది చైనా ఆర్థిక ఇంజిన్ కు పెద్ద దెబ్బ.
కాకినాడ పోలీసులు ప్రత్యేక బృందాలతో అతని ఫోన్ లొకేషన్‌ను ట్రేస్ చేసి మంగళవారం తన తండ్రితో కలిసి ఒక పార్కులో ఉన్న సమయంలో అతడిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం విచారణ కోసం కాకినాడకు తరలించినట్టు తెలుస్తోంది.
రోహిత్ , రితేష్ బ్యాంక్ ఖాతా నుంచి కేదార్‌కు రూ.25 లక్షలు బదిలీ అయినట్టు గుర్తించారు. ఈ భారీ లావాదేవీపై విచారణ జరిపినప్పుడు.. కేదార్‌తో ఉన్న సంబంధాలపై రోహిత్ రెడ్డి, రితేష్ ఇచ్చిన సమాధానాలు ఒకదాని కొకటి పొంతన లేకుండా ఉన్నాయని పోలీసులు చెబుతున్నారు.
ఈ కేసులో కీలక వ్యక్తిగా ఉన్న మధు అప్రూవర్‌గా మారి వెల్లడించిన విషయాలు సంచలనంగా మారాయి. మంగ్లీకి ఈ వ్యవహా రంతో ఎలాంటి సంబంధం లేదని మధు స్పష్టంగా పేర్కొన్నాడు. అసలు మోసం చేసిన వ్యక్తి హిమాకాంత్ రెడ్డి అని మధు ఆరోపించారు. కంపెనీలో పెట్టిన దాదాపు రూ.20 కోట్లు హిమాకాంత్ రెడ్డి తీసుకున్నాడని మధు ఆరోపించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.