కోడి గుడ్లు, చికెన్ ధరలకు రెక్కలు
Publish Date:Dec 22, 2025
Advertisement
రాష్ట్రవ్యాప్తంగా కోడి గుడ్లు, చికెన్ ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. కొద్ది నెలల క్రితం బహిరంగ మార్కెట్‌లో రూ.5 నుంచి రూ.6 మధ్య లభించిన కోడి గుడ్డు ధర ప్రస్తుతం రూ.8 నుంచి రూ.9 వరకు చేరింది. హోల్‌సేల్ మార్కెట్‌లోనే ఒక్కో కోడి గుడ్డు రూ.7.30కు విక్రయమవుతుండటం గమనార్హం. పౌల్ట్రీ రంగ చరిత్రలోనే ఇదే అత్యధిక ధర అని రైతులు, వ్యాపా రులు పేర్కొంటున్నారు. ఇక చికెన్ ధర కూడా సామాన్య వినియోగదా రుడికి భారంగా మారింది. మార్కెట్‌లో చికెన్ కిలో ధర రూ.300కు చేరడంతో వినియోగం తగ్గుతున్నట్లు వ్యాపారులు చెబుతున్నారు. గతంలో అందుబాటులో ఉన్న చికెన్, గుడ్లు ఇప్పుడు ఖరీదైన ఆహార పదార్థాలుగా మారుతున్నాయి. ధరలు ఇలా పెరగడానికి ప్రధాన కారణంగా ఉత్పత్తి తగ్గుదలనేనని పౌల్ట్రీ నిపుణులు సూచిస్తున్నారు. వేసవి ప్రభావం, మేత ఖర్చులు పెరగడం, కోళ్ల పెంపకంలో నష్టాలు వంటి అంశాల వల్ల గుడ్ల ఉత్పత్తి గణనీయంగా తగ్గిందని వారు చెబుతున్నారు. అదే సమయంలో డిమాండ్ తగ్గకపోవడంతో ధరలు ఒక్కసారిగా పెరిగినట్లు వివరిస్తున్నారు.ధరల పెరుగుదలతో మధ్యతరగతి, పేద కుటుంబాలపై తీవ్ర ప్రభావం పడుతోంది. ముఖ్యంగా గుడ్లను ప్రధాన పోషకాహారంగా వినియో గించే పిల్లలు, వృద్ధుల కుటుంబాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. రాబోయే రోజుల్లో ఉత్పత్తి పెరిగితే తప్ప ధరలు తగ్గే అవకాశం లేదని వ్యాపారులు అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనప్పటికీ గుడ్లు, చికెన్ ధరలు పెరిగిపో వడంతో సామాన్యులు వాటిని కొనేందుకు ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది..
http://www.teluguone.com/news/content/chicken-eggs-rates-36-211426.html





