చంద్రబాబు కంటే తోపు కాదుగా..
Publish Date:Feb 21, 2022
Advertisement
దేశ రాజకీయాలతో ఏ కొద్దిపాటి పరిచయం ఉన్న ఎవరికైనా, జాతీయ స్థాయిలో ప్రాతీయ పార్టీల కూటమి ఏర్పాటు అయ్యే పనికాదని అర్థం అవుతుంది. అయినా, ఇంచుమించుగా నాలుగు పదులకు పై బడిన రాజకీయ అనుభవం ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి, తెరాస అధినేత కేసేఆర్’కు ఆ విషయంగా తెలియదా, అంటే తెలియకుండా ఉండే అవకాశమే లేదు. నిజానికి జాతీయ స్థాయిలో ప్రాంతీయ పార్టీల కూటమి, ఆ మాట కొస్తే జనతా ప్రయోగంతో మొదలిన జాతీయ, ప్రాంతీయ పార్టీల సంయుక్త మిశ్రమ కూటమి ప్రయత్నం మొదలు ఇంతవరకు జరిగిన ఏ ప్రయత్నం కూడా సక్సెస్ కాలేదు. ఇందుకు చరిత్రలో చాలా చాలా ఉదాహరణలే ఉన్నాయి.నిజానికి 2018 తెలంగాణ అసెంబ్లీ ముదస్తు ఎన్నికలకు ముందు స్వయంగా కేసీఆరే అలాంటి విఫల ప్రయత్నం ఒకటి చేశారు. ఇప్పుడు మళ్ళీ మరో ...ప్రయత్నం చేస్తున్నారు. అలాగే, కేసీఆర్ కంటే ముందు, 2018లోనే తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కుడా 2019 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ, మోడీని ఓడించడమే లక్ష్యంగా కలికి బలపం కట్టుకుని దేశమంతా తిరిగారు. ఇప్పుడు కేసీఆర్ కలిసిన కలవనున్నప్రాంతీయ పార్టీలనాయకులనే కాదు, జాతీయ శరద్ యాదవ్, ఫరూక్ అబ్దుల్లా, అరవింద్ కేజ్రివాల్, మాయావతి, ములాయం సింగ్ యాదవ్,మయావతి, మమతా బెనర్జీ, ఇంకు చాలా మంది నాయకులను కలిశారు. చర్చలు జరిపారు. ప్రాంతీయ పార్టీల కూటమి ఏర్పాటకు చాలా చాలా ప్రయత్నం చేశారు. అయినా ఆయన ప్రయత్నాలు ఫలించలేదు. నిజానికి, చంద్రబాబు నాయుడుపోలిస్తే కేసీఆర్’ కు జాతీయ స్థాయిలో ఉన్న గుర్తింపు, చాలా తక్కువ.తెలుగు దేశం పార్టీతో పోలిస్తే,తెరాసకు జాతీయ ఉన్న గుర్తింపు ఇంకా తక్కువ. చంద్రబాబు నాయుడు యునైటెడ్ ఫ్రంట్, నేషనల్ ఫ్రంట్, యూపీఎ, ఎన్డీఎ.. ఇలా ... 2014కు ముందు 30 ఏళ్ళపాటు జాతీయ రాజకీయాలలోఅవిశ్చరణంగా సాగిన సంకీర్ణ యుగంలో చక్రం తిప్పిన అనుభవం చంద్రబాబుకున్నాయి. అంటినీ మించి, చంద్రబాబుకున్న విశ్వసనీయత కేసీఆర్’ లో కాగడా పెట్టి వెతినకినా కనిపించదు. నిజానికి చంద్రబాబు మాత్రమే కాదు, 2019 లోక్ సభ ఎన్నికలకు సోనియా నుంచి సీతారామ్ ఏచూరి వరకు , మాయావతి నుంచి నుంచి మమతా బెనర్జీ వరకు రాహుల్ గాంధీ నుంచి రాజా (సిపిఐ) వరకు కేజ్రీవాల్ నుంచి ఇంకో మహా నాయకుని వరకు, ఇలా నేఅక్ మంది నాయకులను కూడా చంద్రబాబు కలిశారు. 2018లో బెంగుళూరులో జరిగిన జేడీఎస్ నేత కుమర్ స్వామి ప్రమాణ స్వీకార్యానికి హాజరైన నాయకులు అందరితోనూ, చంద్రబాబు చేతులు కలిపారు.చివరకు బీజేపీని ఓడించడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీతోనూ చేతులు కలిపారు. అయినా, ఏమైందో అందరికి తెలిసిన చరిత్ర. ఈ చరిత్ర నేపధ్యంగా కేసీఆర్ కంటున్న కలలు ఫలిస్తాయా? చంద్రాబాబు కంటే తోపు కాదుగా నే సమాధానమే వస్తోంది. ముఖ్యంగా కేసీఆర్’కు విశ్వసనీయత లేదని అంటున్నారు, రాజకీయ పరిశీలకులు. నిజానికి ఏమున్నా లేక పోయినా విశ్వసనీయత లేకపోతే లాభం లేదని అంటున్నారు. అంతే కాకుండా కాంగ్రెస్ లేకుండా, కేసీఆర్ ఒక్కరే కాదు, .. మమతా బెనర్జీ సహా ఏ ఒక్కరూ జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పలేరని, అంటున్నారు.
http://www.teluguone.com/news/content/chandrababu-more-success-than-kcr-in-national-politics-25-132074.html





