వైసీపీపై చంద్ర నిప్పులు: ఆ పార్టీ ప్రాభవం పూర్తిగా క్షీణించాలన్న చంద్రబాబు.!

Publish Date:Oct 28, 2026

Advertisement

ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ధి సాధించాలంటే వైపీపీ ఓటు బ్యాంకు భారీగా తగ్గాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అన్నారు.  రాష్ట్రంలో రాజకీయ ప్రక్షాళన జరిగి, సుపరిపాలన మరింత బలోపేతం కావాలంటే ఆ పార్టీ ప్రాభవం పూర్తిగా క్షీణించాల్సిన అవసరం ఉందన్నారు.   స్థానిక  ఎన్నికల నేపథ్యంలో తెలుగుదేశం, జనసేన,  బీజేపీ శ్రేణులకు ఆయన టెలీకాన్ఫరెన్స్ ద్వారా దిశా నిర్దేశం చేశారు. 

స్థానిక  సన్నాహాలపై తెలుగుదేశం కూటమికి చెందిన దాదాపు 45 వేల మంది ముఖ్య నేతలు, ప్రజాప్రతినిధులు,  కార్యకర్తలతో  సీఎం చంద్రబాబు ఈ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన వైసీపీపై చంద్ర నిప్పులు చెరిగారు.  రాష్ట్రంలో ప్రజా సంక్షేమం, అభివృద్ధి వేగంగా ముందుకు సాగుతున్నాయన్న ఆయన, రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవడానికి వైసీపీ తప్పుడు ప్రచారాలు చేస్తోందని దుయ్యబట్టారు. గతంలో అంటే వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో అనుసరించిన విధానాల వల్లే రాష్ట్ర అనేక ఇబ్బందులను ఎదుర్కొంటోందనీ, వాటిని కూటమి ప్రభుత్వం అధిగమిస్తూ ముందుకు సాగుతోందనీ అన్నారు.  

వ్యవసాయం, మౌలిక వసతుల కల్పన, నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు వంటి అనేక అంశాలపై తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్న ఆయన సంక్షేమ పథకాలను పారదర్శకంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామన్నారు.  

ఈ సందర్భంగా కూటమి పార్టీల మధ్య సమన్వయంపై విస్పష్ట మార్గదర్శకాలు జారీ చేశారు.  చిన్నచిన్న అభిప్రాయ భేదాలను పక్కనపెట్టి, రాష్ట్ర భవిష్యత్తు కోసం మూడు పార్టీల శ్రేణులూ ఏకతాటిపై నిలవాలని పిలుపునిచ్చారు. అనధికారికంగా లేదా రెబల్స్‌గా పోటీ చేసే ధోరణులను ఇసుమంతైనా సహించేది లేదని విస్పష్టంగా హెచ్చరించారు.  కూటమి ధర్మాన్ని ప్రతి ఒక్కరూ తూచా తప్పకుండా పాటించాలన్నారు.  

ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న వర్షాకాల విపత్తులు, సహాయక చర్యలపై కూడా ఈ సందర్భంగా సమీక్ష నిర్వహించారు. తుపాను ప్రభావం ఉన్న జిల్లాల్లో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండేలా చూస్తూనే, మరోవైపు ఎన్నికల వ్యూహాలపై దృష్టి సారించాలని నాయకులకు సూచించారు.  

[Chandrababu Fires YCP, Teleconference, Y CP Vote Bank, Local Body Elections, AP NDA Alliance, Telugu One]

By
en-us Political News

  
నిన్నటి వరకూ జగన్ కు పెట్టని కోటలా నిలిచిన పులివెందులలో ఇప్పుడు తెలుగుదేశం జెండా ఘనంగా ఎగురుతోంది.  సుదీర్ఘకాలంగా వైసీపీకి తిరుగులేని కంచుకోటగా ఉన్ పులివెందుల పరిధిలో తెలుగుదేశం పార్టీ తన ఉనికిని బలంగా చాటుకుంటోంది.
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో  తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది.  25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు. 
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు.  ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు. 
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది. 
ఈ వేడుకలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కేటీఆర్,   విజయ్ ఒకే దగ్గర చేరి సరదాగా ముచ్చటించుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.  
 నామినేషన్ల ఉపసంహరణ గడువు  ముగిసే నాటికి  రాష్ట్ర వ్యాప్తంగా  77 జడ్పీటీసీలు, 2051 ఎంపీటీసీలు ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు.  ఇక మిగిలిన స్థానాలకు పోటీ పడుతున్న 21 వేల 012 మంది అభ్యర్థుల భవితవ్యం తేల్చేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు.
వైసీపీపై అధికార కూటమి ఒత్తిడి, అక్రమాలు ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో ప్రజలు వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నారని పరోక్షంగా వ్యాఖ్యానించి, ప్రజా క్షేత్రంలో వైసీపీ బలహీనంగా ఉందని చెప్పకనే చెప్పారు.  గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు వ్యవహరించిన తీరు కారణంగానే నేడు వైసీపీకి ఈ గతి పట్టిందంటూ అంబటి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
పాడిందే పాటరా అన్న సామెత చందంగా ఉంది జగన్ తీరు. ఆంధ్రప్రదేశ్‌లో   మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర నిరాశను మిగిల్చాయి. గతంలో 2024 సార్వత్రిక ఎన్నికల ఓటమి తర్వాత ఏ విధంగానైతే ఈవీఎంలు, ఎన్నికల సంఘాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి తప్పుపట్టారో, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల ఫలితాల విషయంలోనూ అదే పాతరాగాన్ని అందుకున్నారు.
2024 ఎన్నికలలో విశాఖ జనం జగన్ విశాఖ రాజధాని ప్రతిపాదనను తిరస్కరించారు. ఇప్పుడు జగన్ మావిగన్ ప్రతిపాదనను మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు జనం ఓటుతో తోసి రాజన్నారు. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.