ముగ్గురు యాత్రికులు మూడు గమ్యాలు

Publish Date:Sep 1, 2013

Advertisement

 

చంద్రబాబు, హరికృష్ణ, షర్మిల ముగ్గురు మూడు వేర్వేరు ప్రాంతాల నుండి వేర్వేరు ఆలోచనలతో, వ్యూహాలతో బస్సుయాత్రలు మొదలుపెట్టబోతున్నారు.

 

ఈరోజు చంద్రబాబు అత్యంత ప్రతికూల పరిస్థితుల మధ్య ‘ఆత్మగౌరవ యాత్ర’ పేరిట గుంటూరు నుండి బస్సు యాత్రను ప్రారంభిస్తున్నారు. తెదేపా ఇచ్చిన లేఖ వలననే నేడు రాష్ట్ర విభజన జరుగుతోందనే కాంగ్రెస్ వైకాపాలు చేస్తున్నప్రచారం అడ్డుకొని, ఆ రెండు పార్టీలు మరియు తెరాసయే తమ స్వార్ధ రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్రాన్నిఈ దుస్థితికి తెచ్చాయని ప్రజలకు వివరించేందుకు ఆయన ఈ యాత్ర చేపడుతున్నారు. కానీ, సమైక్యాంధ్ర కోసం పోరాడుతున్న లగడపాటి వంటి వారికే ప్రజల మధ్య భంగపాటు ఎదురవుతున్న ఈ తరుణంలో, విభజనకు అంగీకరిస్తూ లేఖ ఇచ్చిన చంద్రబాబు సమైక్య రాష్ట్రం కోరుతున్న ప్రజలతో ఏవిధంగా నెగ్గుకొస్తారో చూడాల్సిందే. ఆయన రాష్ట్ర విభజనపై తన పార్టీ స్పందన, ఆశిస్తున్న పరిష్కారం గురించి ప్రజలకు వివరించి పార్టీని రక్షించుకోవాలని బయలుదేరుతున్నారు.

 

రేపటి నుండి షర్మిల చేపడుతున్న‘సమైక్య శంకారవం’ యాత్ర చంద్రబాబు స్వంత జిల్లా చిత్తూరులో తిరుపతి ప్రారంభించడం వ్యూహాత్మకమే. ఆమె సమన్యాయం లేదా సమైక్య రాష్ట్రం అనే నినాదంతో యాత్ర చేపడుతున్నారు. ఆమె ఈ విభజనకు కాంగ్రెస్ మరియు తెదేపాలే ప్రధాన కారణమని గట్టిగా ప్రజల మనస్సులో నాటి, తద్వారా కేవలం తమ పార్టీ మాత్రమే సమైక్యాంధ్ర కోసం పోరాడుతున్న ఖ్యాతిని పొందేందుకు ప్రయత్నిస్తారు. కాంగ్రెస్, తెదేపాలు ఓట్లు, సీట్లు రాజకీయాల కోసమే రాష్ట్రాన్ని విభజించాయని ఆరోపిస్తున్న వైకాపా, ఆ ఓట్లు సీట్ల కోసమే ఈ యాత్ర చేపడుతోంది.

 

సీమంధ్రలో పట్టు సాధించేందుకు రాజీనామాలు, నిరాహార దీక్షలు, బహిరంగ సభలు, డిల్లీ పర్యటనలు, బహిరంగ లేఖాస్త్రాలు ప్రయోగించిన తరువాత వైకాపా ఇప్పుడు తాజాగా బస్సు యాత్రలనే మరో సరికొత్త ఐడియాతో ప్రజల ముందుకు వస్తోంది. నిన్న మొన్నటివరకు తాము తెలంగాణకు వ్యతిరేఖం కాదని చెపుతూ వచ్చిన వైకాపా, ఇప్పుడు సీమంధ్రలో బలంగా ఉన్న తెదేపాను దెబ్బ తీయడానికి తెదేపా తెలంగాణకు అనుకూల పార్టీ, రాష్ట్ర విభజనకు లేఖ ఇచ్చిన పార్టీ అని ప్రచారం చేస్తూ సీమంద్రలో పైచేయి సాధించేదుకు ప్రయత్నిస్తోంది. అక్కడ తెలంగాణా ప్రజలను, తన పార్టీ నేతలను కూడా వంచించిన వైకాపా, నీతినిజాయితీలకు తానే మారుపేరన్నట్లు నిస్సిగ్గుగా చెప్పుకొంటూ, ప్రజలను మభ్యపెట్టాలని ప్రయత్నిస్తోంది.

 

ఇక హరికృష్ణ తన రాజ్యసభ సభ్యత్వం పూర్తయ్యేందుకు కేవలం మరో నాలుగయిదు నెలల కాలం మాత్రమే మిగిలి ఉన్నందున, రానున్న ఎన్నికలను, సీమంధ్రలో జోరుగా సాగుతున్న ఉద్యమాలను, చంద్రబాబుతో తన కున్నబేదాభిప్రాయలను అన్నిటిని దృష్టిలో పెట్టుకొని, ఒకే దెబ్బకు మూడు పిట్టలు కొట్టాలనే దురాశతో సమైక్యాంధ్ర కోసం అంటూ తన పదవికి రాజీనామా చేసి రేపటి నుండి చైతన్యయాత్ర చేపడుతున్నారు.

 

ఆయన తన యాత్ర సమైక్యాంధ్ర కోసమని చెప్పుతున్నపటికీ, తనను, తన కుమారుడు జూ.యన్టీఆర్ ని పార్టీలో పక్కన బెట్టి, చంద్రబాబు తన కుమారుడు లోకేష్ ని తన వారసుడిగా ముందుకు తీసుకు వస్తున్నారనే అక్కసుతో, వారిని ఇబ్బందిపెట్టాలనే ఆలోచనతోనే ఈ యాత్ర చేపడుతున్నారు. హరికృష్ణ ఇన్నేళ్ళుగా ఎటువంటి పార్టీ కార్యక్రమాలలో పాల్గొనకపోయినప్పటికీ, కేవలం నందమూరి వంశానికి చెందిఉండటమే తన ఏకైక అర్హతగా భావిస్తూ పార్టీలో పదవులు ఆశించి భంగపడ్డారు. అందుకే ఇప్పుడు పార్టీని ఇబ్బంది పెట్టేందుకు బస్సు యాత్ర చేపడుతున్నారు.

By
en-us Political News

  
మావోయిస్టు ముక్త భారత్ లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టినఆపరేషన్ కగార్ సత్ఫలితాలనే ఇస్తోందని అంటున్నాయి భద్రతా బలగాలు. ఆపరేషన్ కగార్ కారణంగా పలువురు మావోయిస్టులు పలు ఎన్ కౌంటర్లలో హతమయ్యారు.
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. మంగళవారం (జులై 15) శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో కంపార్ట్ మెంట్లన్నీ నిండిపోయి క్యూలైన్ శిలాతోరణం వరకూ సాగింది.
అమెరికాలోని ఓ వృద్ధాశ్రమంలో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో తొమ్మది మంది మరణించారు. ఈ దుర్ఘటన అమెరికాలోని మసాచుసెట్ లోని ఫాల్ రివర్ గాబ్రియేల్ హౌస్ వృద్ధాశ్రమంలో జరిగింది.
హైదరాబాద్ లో కాల్పులు కలకలం సృష్టించాయి. మలక్ పేట శాలివాహన్ నగర్ పార్క్ వద్ద గుర్తు తెలియని వ్యక్తులు జరిపిన కాల్పుల్లో ఒకరు మరణించారు. మృతుడిని చందూ రాథోడ్ గా గుర్తించారు.
తెలంగాణ వ్యాప్తంగా ఐదు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ ఏడాది రుతుపవనాలు ముందుగానే రాష్ట్రంలోకి ప్రవేశించినప్పటికీ, వర్షాలు మాత్రం ఆశించిన విధంగా కురవలేదు.
తెలుగుదేశం సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజును గోవా గవర్నర్‌గా నియమిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే.
ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ బట్టు దేవానంద్ నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన మద్రాసు హైకోర్టు జడ్జిగా ఉన్నారు. సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సును రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆమోదించారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విదేశీ పర్యటన ముగించుకుని వచ్చిన వెంటనే, రాజకీయ నియామకాలపై దృష్టిని కేంద్రీకరించారు. అందులో భాగంగా, నిన్న (ఆదివారం) వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన నలుగురు ప్రముఖులను భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాజ్యసభకు నామినేట్ చేశారు.
లోకేష్ కి ప‌థ‌కాలు త‌యారు చేయ‌డం రాదా? మ‌రి స్టాన్ ఫ‌ర్డ్ లో ఏం నేర్చుకున్న‌ట్టు? అమ్మ‌కు వంద‌నం విష‌యంలో వైసీపీ చేస్తున్న ప్ర‌చారంలో అర్ధ‌మేంట‌ని చూస్తే.. ఫ‌స్ట్ మ‌న‌మంతా తెలుసుకోవ‌ల్సిన విష‌య‌మేంటంటే.. వాలంటీర్ వ్య‌వ‌స్థ‌, డైరెక్ట్ క్యాష్ బెనిఫిట్ స్కీముల ఆలోచ‌న‌లు లోకేష్ వే అని ఎంద‌రికి తెలుసు?
తెలంగాణ హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అపరేష్ కుమార్‌ సింగ్ నియమితులయ్యారు.ఈ మేరకు కొలీజియం సిఫార్సును రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు. కాగా, ఇంతకు ముందు త్రిపుర హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ అపరేష్ కుమార్ పనిచేశారు.
తెలుగు రాష్ట్రాల్లోని జల వివాదలను చర్చించేందుకు కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు ఆహ్వానం పంపించింది. ఈ భేటీ కేంద్ర జల్‌శక్తి మంత్రి సీఆర్ పాటిల్ నేతృత్వంలో జులై 16న జరగనుంది.
సినిమా షూటింగ్‌లో కార్ టాప్లింగ్ స్టంట్ చేస్తూ ప్రముఖ ఫైట్ మాస్టర్ రాజు ప్రమాదంలో మృతి చెందారు.. హీరో ఆర్య, డైరెక్టర్ పా. రంజిత్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్‌లో ఈ దుర్ఘటన జరిగింది.
ఇద్దరు యువ వైద్యుల మధ్య ఘర్షణ... చివరకు రీల్స్ అమ్మాయి యువ వైద్యుడి ప్రేమ తో మనస్థాపానికి గురై వైద్యుడు భార్య ఆత్మహత్య చేసుకున్న ఘటన హనుమకొండ జిల్లాలో చోటుచేసుకుంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.