సిరియాపై బాంబులు సిరియా సంక్షేమం కోసమేనట

Publish Date:Sep 1, 2013

Advertisement

 

నిత్యం ఏదో ఒక దేశంతో యుద్ధం చేయకపోతే అమెరికాకు ఊపిరాడనట్లుటుంది. టీవీ సీరియల్స్ లాగ ఒకటి ముగియకముందే మరొకటి మొదలుపెడుతూ తను తయారు చేసుకొన్న అత్యాధునిక ఆయుధాలను పరీక్షించుకొనేందుకు దేశాలను, అందుకు అవసరమయిన కారణాలను వెతుకొంటుంది అమెరికా. ఇరాక్ రసాయన ఆయుధాలు తయారు చేస్తోందని సాకు చూపి, ఆదేశాన్ని సర్వనాశనం చేసిన తరువాత అమెరికా దృష్టి ఆఫ్ఘానిస్తాన్ పై పడింది. ఇరాక్ తరువాత అక్కడ కూడా బహు చక్కగా శాంతి స్థాపన చేసేసి చేతులు దులుపుకొన్న అమెరికా దృష్టి ఇప్పుడు సిరియాపై పడింది.

 

ఆదేశంలో ప్రజాస్వామ్యం కోరుతూ జరుగుతున్న ఉద్యమాలను అణచివేసేందుకు అక్కడి బషార్-అల్-అస్సాద్ ప్రభుత్వం రసాయన ఆయుధాలు ప్రయోగించడంతో 426 మంది పసిపిల్లలతో సహా మొత్తం 1429 మంది ప్రజలు చనిపోయారు. దానితో ప్రజలు తమ ఉద్యమాలను మరింత తీవ్రతరం చేసారు. అమెరికా యుద్ధం మొదలుపెట్టడానికి ఈ మాత్రం సాకు చాలు గనుక అమెరికా అధ్యక్షడు బారక్ ఒబామా సిరియాపై పరిమిత దాడి చేయడానికి సిద్దంకమ్మని ఆదేశాలు జారీ చేయడంతో, అత్యాధునిక ఆయుధాలను మోసుకొని అమెరికా నావికా దళం సిరియా తీరం చట్టూ మోహరించింది.

 

ప్రపంచ దేశాలు అమెరికా ఆలోచనను ఎంతగా ఖండిస్తున్నపటికీ అమెరికా యుద్దానికే తయారవుతోంది. బుష్ ప్రభుత్వం అమెరికా దేశ ప్రజల మీద అనవసరమయిన యుద్దాలు చాలా రుద్దారని, తను యుద్దాలను వ్యతిరేఖిస్తున్నానని చెప్పి ఎన్నికలలో గెలిచిన బరాక్ ఒబామా కూడా ఇప్పుడు యుద్ధం చేయకుండా ఉండలేకపోతున్నాడు.

 

ఆయన కను సైగ చేయగానే అమెరికా నావికా దళం 1429 మంది ప్రజలను చంపినందుకు శిక్షగా సిరియా మీద సరికొత్త రకాల బాంబుల వర్షం కురిపించి, కొన్ని వందలో వేలమందిని చంపి అక్కడ కూడా శాంతి నెలకొల్పుతుంది.

 

ఇంతవరకు సిరియా ప్రజలు కేవలం తమ ప్రభుత్వాన్నే ద్వేషిస్తున్నారు. కానీ, వారిప్పుడు అమెరికాను అంతకంటే ఎక్కువగా ద్వేషించడం మొదలుపెట్టారు. తాము అమితంగా ద్వేషిస్తున్నబషార్-అల్-అస్సాద్ ప్రభుత్వంపై అమెరికా చేయబోతున్నదాడిని తమ దేశంపై దాడిగా భావించడం సహజమే. అయితే వారి అభిమతంతో, అభిప్రాయాలతో అమెరికాకు పనిలేదు. అమెరికాకు కావలసిన సాకు దొరికింది ఇక యుద్ధం మొదలుపెట్టక తప్పదు.

 

కానీ అడుసు తొక్క నేల? కాలు కడుగ నేల? అని సామెత చెప్పినట్లు సిరియాపై యుద్దానికి కాలుదువ్వడంతో తన దేశంలో నివసిస్తున్నసిరియా ప్రజలను చూసి అమెరికా అప్పుడే ఉలికులికి పడుతోంది. అందుకే అమెరికా తన దేశంలో ఉన్న సిరియా దేశస్థులపై అప్పుడే నిఘా మొదలుపెట్టింది.

 

ఇక నేడోరేపో ఆకాశం నుండి కురిసే బాంబుల వర్షంలో ప్రాణాలు అర్పించేందుకు సిరియా ప్రజలు సిద్దంగా ఉండక తప్పదు. అమెరికా చేపడుతున్న ప్రపంచ శాంతి కోసం దాని కన్నుపడిన ఏ దేశానికయినా ఆమాత్రం మూల్యం చెల్లించుకోక తప్పదు, ఆ మాత్రం త్యాగాలు చేయక తప్పదు. మొన్నఇరాక్, నిన్న ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, నేడు సిరియా, రేపు మరెవరి వంతో?

By
en-us Political News

  
ఐదేళ్లు అధికారంలో ఉన్న జగన్ ఐదు డీఎస్సీలు నిర్వహించాల్సిన ఆయన ప్రభుత్వం ఒక్క డీఎస్సీ ఎందుకు నిర్వహించలేకపోయిందో చెప్పాలన్నారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకూ ఇప్పుడు వైసీపీ లోకేష్ రాజీనామా చేయాలన్న డిమాండ్ కూ పొంతన లేదన్నారు.
ఈ కొత్త పాలకమండలిలో వివిధ రాష్ట్రాల నుంచి కీలక నాయకులకు చోటు కల్పించారు.  కాగా బిజెపి జాతీయ ఉపాధ్యక్ష పదవుల్లో మొత్తం 13 మంది నాయకులకు అవకాశం దక్కింది. వీరిలో  పురందేశ్వరి ఒకరు. 
వనపర్తి కాంగ్రెస్‌లో టికెట్ వివాదం..నేను కూడా జీవన్ రెడ్డిలా తిరగబడతా..!
ప్రజాసమస్యలపై చర్చ జరగాల్సిన మండలిలో ఇరు పార్టీలకు చెందిన నేతలూ.. వ్యక్తిగత దూషణలతో సభలో మాటల యుద్ధానికి దిగారు.  ముఖ్యంగా  మండలిలో విపక్ష నాయకుడు, వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ, మంత్రి అచ్చెన్నాయుడుల మధ్య మాటల మంటలు రేగాయి. పరస్పరం విమర్శలు, ఆరోపణలు గుప్పించుకున్నారు.
సెంబ్లీ ఎన్నికలలో తన జన సురాజ్ పార్టీ ఘోర పరాజయం పాలైనప్పటికీ... ఇటీవల బంకీపూర్ నియోజకవర్గ ఉప ఎన్నికలో ప్రశాంత్ కిశోర్ బీజేపీ కంచు కోటను బద్దలు కొట్టి మరీ విజయం సాధించారు.
భారత ప్రధాన న్యాయమూర్తి ఒక కేసు విచారణ సందర్భంగా చేసిన కాక్రోచ్ అన్నపదం ఎంతటి సంచలనానికి దారి తీసిందో.. ప్రధాని తన పంద్రగస్టు ప్రసంగంలో ఉపయోచించిన దిమాగీ నక్సల్ పదం కూడా అంతకు మించి సంచలనం సృష్టించింది. 
 ఏపీ గ్రీన్ కార్యనిర్వాహక కమిటీ చైర్మన్‌గా నాగబాబును నియమిస్తూ..  ఆయనకు కేబినెట్ హోదాను కల్పించింది. ఈ మేరకు రాష్ట్ర పర్యావరణ, అటవీ శాఖ  సోమవారం ఉత్తర్వులు ారీ చేసింది.  
గత కొంతకాలంగా పార్టీలో తనను ఏ విధంగా పక్కన పెట్టారో  వివరించారు. ముఖ్యంగా సింగరేణి కార్మిక సంఘం గౌరవ అధ్యక్షురాలిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న సమయంలో, తన కుమారుడి విద్యాభ్యాసానికి సంబంధించిన గ్రాడ్యుయేషన్ వేడుకల కోసం అమెరికా వెళ్లిన  సమయంలోనే కనీసం ముందస్తు సమాచారం,  షోకాజ్ నోటీసు కూడా ఇవ్వకుండా  తనను ఆ పదవి నుంచి తొలగించారని గుర్తు చేశారు.
వందే మాతరం గేయానికి ఆమె చేసిన అపచారాన్ని 140 కోట్ల మంది భారతీయులు ఆమెను ఎన్నటికీ క్షమించరన్నారు.  వందేమాతరం గేయానికి చేసిన అపచారానికి ఆ  గేయ రచయిత బంకించంద్ర ఛటోపాధ్యాయతో పాటు  40 కోట్ల దేశ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ బేషరతుగా క్షమాపణ చెప్పాలని అమిత్ షా డిమాండ్ చేశారు.  
ఆంధ్రప్రదేశ్ లో జగన్ పార్టీకి అదేనండీ వైసీపీకి జనం కనీసం ప్రతిపక్ష హోదాకు కూడా అర్హత లేదని 2024 ఎన్నికలలో విస్పష్ట తీర్పు ఇచ్చేశారు. అయినా నిస్సిగ్గుగా జగన్ కోర్టును విపక్ష హోదా కోసం ఆశ్రయించారు.
ఎవరైనా సరే పార్టీ గీత దాటి మాట్లాడితే సహించేది లేదు..మహేష్ కుమార్ గౌడ్..!
ధనవంతులు, పలుకుబడి ఉన్న వ్యక్తుల భూములు, ఆస్తులను భూసేకరణ నుండి కాపాడేందుకే యాక్సెస్ రోడ్డును నిబంధలకు విరుద్ధంగా నిర్మించారనీ, ప్రధాన రహదారిలో ఎస్ కర్వ్ ఎందుకు వచ్చిందంటూ ప్రశ్నలు సంధిస్తూ సందేహాలను ప్రేరేపించే ప్రయత్నం వైసీపీ సోషల్ మీడియా ఓ రేంజ్ లో చేసింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.