స్వశక్తిని నమ్మే చంద్రబాబుకి స్వామీజీలతో పనేంటి?

Publish Date:Jul 14, 2014

Advertisement

 

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదివారం నాడు ఎవరూ ఊహించని, కనీవినీ ఎరుగని పని పనిచేశారు. చంద్రబాబు నాయుడేంటి.. ఈ పని చేయడమేంటని అందరూ ఆశ్చర్యపోయారు. ఇంతకీ అందర్నీ ఆశ్చర్యపోయేలా చేసిన పని ఏమిటంటే, ఆయన ఒక స్వామీజీ హైదరాబాద్‌లో నిర్వహించిన ఒక కార్యక్రమానికి వెళ్ళారు. అక్కడ చంద్రబాబు ఆయన ఆశీస్సులు తీసుకున్నారు. సదరు స్వామీజీ చంద్రబాబు చేత ప్రత్యేక పూజలు చేయించారు. ఆ స్వామీజీ మరెవరో కాదు.. ప్రకాశం జిల్లాకు చెందిన వివాదాస్పద స్వామీజీ రామదూత స్వామి. రామదూత స్వామీజీ మీద భూ కబ్జాలకు సంబంధించిన ఎన్నో ఆరోపణలున్నాయి. అలాంటి స్వామీజీ నిర్వహించిన కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు వెళ్ళడం వింతల్లోకెల్లా వింత!


రాజకీయ నాయకులు స్వామీజీల దగ్గరకి వెళ్ళడం, వాళ్ళ ఆశీస్సులు తీసుకోవడం మామూలే. అయితే చంద్రబాబు నాయుడు లాంటి ప్రాక్టికల్ వ్యక్తి ఇలా స్వామీజీ దగ్గరకి వెళ్ళడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. తెలుగు ప్రజలకు చంద్రబాబు నాయుడి మీద కొన్ని నిశ్చితాభిప్రాయాలు వున్నాయి. చంద్రబాబు నాయుడు స్వశక్తిని నమ్ముకుంటారు. ఏ పనినైనా శ్రమశక్తి ద్వారానే సాధిస్తారు. స్వామీజీలు, బాబాల దగ్గరకి ఆయన వెళ్ళరు.. వారిని ఆయన దగ్గరకి రానివ్వరు. కానీ, ఆదివారం జరిగిన సంఘటన ప్రజల నమ్మకానికి విరుద్ధంగా వుంది. తొమ్మిదేళ్ళపాటు ముఖ్యమంత్రిగా పనిచేసి రాష్ట్రాన్ని అభివృద్ధి దిశలో నడిపినప్పటికీ ప్రజలు ఆయన్ని పదేళ్ళపాటు ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు. అయినప్పటికీ ఆయన నిరాశపడకుండా తన శక్తిని తాను నమ్మకున్నారు. ప్రజల్లో తనమీద వున్న నమ్మకాన్ని నమ్మకున్నారు. మళ్ళీ అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు మళ్ళీ ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చున్నారంటే దానికి కారణం ప్రజలకు ఆయన మీద వున్న నమ్మకం, తెలుగుదేశం కార్యకర్తల శ్రమే తప్ప స్వామీజీలు కాదు. భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించాల్సింది చంద్రబాబు నాయుడి శ్రమే తప్ప స్వామీజీల ఆశీస్సులు కాదు.

 

ఒకవేళ చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ క్షేమం కోరుకుని రామదూత స్వామీజీ ఆశీస్సుల కోసం వెళ్ళారని కాసేపు అనుకుందాం. ఆ కోణంలో చూసినా రామదూత స్వామీజీకి అంత సీను లేదు. ఎందుకంటే గతంలో ఆయన్ని సందర్శించుకుని ఆశీస్సులు తీసుకున్న చాలామంది రాజకీయ నాయకులు, సినిమావాళ్ళు బావుకుందేమీ లేదు. వాళ్ళెవరిమీదా సదరు స్వామీజీ ఆశీస్సులు ఫలించలేదు. వాళ్ళంతా ఫెయిల్యూర్స్ బాటలోనే నడిచారు. ఉదాహరణకి గాలి జనార్దన‌రెడ్డిని తీసుకుందాం. ఆయన గతంలో చాలాసార్లు రామదూత స్వామీజీని సందర్శించడానికి ఆయన ఆశ్రమానికి హెలికాప్టర్లో వెళ్ళేవారు. హెలికాప్టర్లో పెట్రోలు అయిపోయేలా ఎన్నిసార్లు స్వామీజీ చుట్టూ తిరిగినా గాలి జనార్దనరెడ్డికి, ఆయన తమ్ముడికి జైల్లోపడే రాత తప్పలేదు. ఇంకా మాజీ మంత్రి గీతారెడ్డి, మాజీ డీజీపీ దినేష్‌రెడ్డి, కాంగ్రెస్ నాయకుడు డి.శ్రీనివాస్, టి.సుబ్బరామిరెడ్డి, జయప్రద, అమర్‌సింగ్, మురళీ మనోహర్ జోషి, కేంద్ర మాజీ మంత్రి మునియప్ప... ఇలాంటి రాజకీయ నాయకులందరూ రామదూత స్వామీజీ ఆశ్రమాన్ని సందర్శించుకుని ఆశీస్సులు అందుకున్నవారే. స్వామీజీ అశీస్సులు అందుకోకముందు అందరూ బాగానే వున్నారు. ఆశీస్సులు అందుకున్న తర్వాత అదేం చిత్రమోగానీ ఎవరూ బాగాలేరు. కర్నాటక మాజీ ముఖ్యమంత్రి ఎడ్యూరప్ప నాలుగైదుసార్లు స్వామీజీ ఆశ్రమానికి వచ్చి ఆశీస్సులు తీసుకున్నారు. ఆ ఆశీస్సుల పుణ్యమా అని ఆ తర్వాత ఎడ్యూరప్ప ముఖ్యమంత్రి పదవి ఊడిపోయింది. ఆయన ఇంతవరకూ రాజకీయంగా నిలదొక్కుకోలేక అల్లాడుతున్నారు. ప్రముఖ నిర్మాత అశ్వనీదత్ జూనియర్ ఎన్టీఆర్‌తో ‘శక్తి’ సినిమా తీసే సమయంలో చీటికి మాటికి రామదూత స్వామీజీ ఆశ్రమానికి వెళ్ళి ఆశీస్సులు అందుకునేవారు. ఆయన ఎన్ని ఆశీస్సులు అందుకున్నా ‘శక్తి’ సినిమా అట్టర్ ఫ్లాప్ అయింది. ఇలాంటి ఉదాహరణలన్నీ చూస్తే రామదూత స్వామీజీ ఆశీస్సులకు అంత పవర్ లేదని అర్థమవుతోంది. పవర్ లేని సంగతి అలా వుంచితే, సదరు స్వామీజీ ఆశీస్సులు అందుకున్న అందరి కెరీర్లూ రివర్స్ గేర్‌లో నడిచాయి. చదివిస్తే ఉన్నమతి పోయిందన్నట్టు, ఈ స్వామీజీ ఆశీస్సులు తీసుకున్న తర్వాతే కింగుల్లాంటి వాళ్ళు కూడా డంగైపోయారు.

 

అందువల్ల మేమెంతో గౌరవించే చంద్రబాబు నాయుడు గారూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు మీమీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. మీరు మీ స్వశక్తితో ఒక సైనికుడిలా పనిచేసి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తారని ఎదురుచూస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మీరు స్వామీజీల సందర్శనానికి వెళ్ళడాన్ని ప్రజలు ఎంతమాత్రం జీర్ణించుకోలేదు. కాబట్టి మీరు ఇలాంటి స్వామీజీల చుట్టూ తిరగడం మానేయండి. ఆ తిరిగేదేదో ప్రజల చుట్టూ తిరగండి. ప్రజల్ని, తెలుగుదేశం విజయానికి తోడ్పడిన కార్యకర్తల్ని ఆదుకోండి. ఒక్కమాటలో చెప్పాలంటే.. తెలుగు ప్రజల ఆశీస్సులు ఎప్పుడూ మీతోనే వుంటాయి.. మీకు ఏ స్వామీజీలు.. బాబాజీల ఆశీస్సులు అవసరం లేదు.

By
en-us Political News

  
ఇటు జగన్ కు, ఆయన పార్టీ వైసీపీకీ, అలాగే అటు కేటీఆర్ కు, బీఆర్ఎస్ కు కేంద్రంలోని బీజేపీ కూటమి ప్రభుత్వ నిర్ణయాలను సమర్ధించడం, మద్దతు పలకడం అత్యావశ్యకం. ఇక్కడ బీఆర్ఎస్ అయితే ఏకంగా బీజేపీలో కలిసిపోవడం ఖాయం అన్న మాట వినిపిస్తోంది. మిగిలేది టీఆర్ఎస్ ప్రతిరూపంగా తెలంగాణ జాగృతి ఒక్కటేనని గత కొంత కాలంగా ఒక ప్రచారం అయితే జోరుగా నడుస్తోంది.
వైసీపీలో ఇప్పుడు పేర్ని నాని పాటి నోరున్న నేతలు వేళ్ల మీద లెక్కపెట్టగలిగేంత మందే ఉన్నారు. దీంతో పేర్ని నాని అనివార్యంగా రాజకీయాలలో క్రియాశీలంగా ఉండడమన్నది.. ఆయనకు తన కుమారుడి రాజకీయ భవిష్యత్ దృష్ట్యా మాత్రమే కాకుండా, రాష్ట్రంలో వైసీపీ ఉనికికి కూడా ఒక అవసరంగా మారిపోయింది.
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి దేవ్‌జీ అలియాస్ తిప్పిరి తిరుపతి, మరో కీలక నేత రాజిరెడ్డితో కలిసి లొంగిపోవడం సంచలనంగా మారింది.
గాంధీల కుటంబానికి మ‌న‌మంతా ఒక చేయి వేసి వెయ్యి కోట్ల రూపాయ‌లు విరాళంగా ఇద్దాం. ఇదీ ఇటీవ‌ల రేవంత్ చేసిన కామెంట్.
కనీసం తండ్రిని నాన్నా అని కూడా సంబోధించకుండా, బీఆర్ఎస్ అధినేత అన్న ప్రస్తావన కూడా చేయకుండా కేవలం పొడి మాటలతో కవిత చెప్పిన శుభాకాంక్షలపై రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
వాస్తవానికి వైసీపీ ఆరోపణలు, విమర్శల స్థాయి రోజురోజుకూ పతనం నుంచి పతనానికి అన్నట్లుగా దిగజారుతోంది. జగన్ సొంత మీడియాలో లోకేష్ శ్రీలంక రాజధాని కొలంబోలో జరిగిన పాకిస్థాన్, ఇండియా మ్యాచ్ చూడడానికి వెళ్లిన ప్రైవేట్ పర్యటనపై చేసిన ఆరోపణలు అవాస్తవంగా తేలడంతో ఆ పార్టీ ప్రతిష్ఠ మరింత దిగజారింది.
అప్పట్లో బీఆర్ఎస్ ప్రభుత్వ పథకాలు, పని తీరు, ప్రజా సంక్షేమం చూసి వారంతట వారే స్వచ్ఛందంగా పార్టీలో చేరారని ఘనంగా ప్రకటించుకుంది. ఇప్పుడు అదే పరిస్థితి రివర్స్ లో కనిపిస్తుంటే మాత్రం.. ప్రజాస్వామ్యం ఖూనీ, మా పార్టీ వారికి కాంగ్రెస్ గేలం అంటూ గుండెలు బాదుకుంటోంది. పైగా ఆ ఆరోపణలను స్వయంగా పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుకు కల్వకుంట్ల తారకరామారావు నుంచే రావడంతో తెలంగాణ సమాజం ముక్కున వేలేసుకుంటోంది.
పార్టీ నుంచి సస్పెండైన ఇద్దరు ఎమ్మెల్సీలు కలిశారు. జగన్ వారితో ఆప్యాయంగా మాట్లాడారు. పార్టీ గొంతు బలంగా వినిపించాలని వారికి దిశానిర్దేశం చేశారు.
ఇక అది పక్కన పెడితే ప్రతిపక్ష హోదా డిమాండ్ నుంచి వెనక్కు తగ్గి కేవలం హాజరు కోసం బుధవారం సభకు హాజరైన జగన్ కు, ఆయన పార్టీ ఎమ్మెల్యేలకూ వ్రతమూ చెడింది, ఫలమూ దక్కలేదని అంటున్నారు. ఎందుకంటే బడ్జెట్ సమావేశాల తొలి రోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం ఉంటుంది.
రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న ఉండవల్లిని పరామర్శించిన ఉండవల్లి అరుణ్ కుమార్ ఆ తరువాత మీడియాతో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలపై నెటిజనులు పెద్ద ఎత్తున విరుచుకుపడుతున్నారు.
ఇప్పటి వరకూ వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీని బాయ్ కాట్ చేసినా.. సభలో చర్చించిన అంశాలు, ఆమోదించిన బిల్లులపై తాడేపల్లి ప్యాలెస్‌లో కూర్చొని ఆ పార్టీ అధినేత, పులివెందుల ఎమ్మెల్యే జగన్ ప్రెస్‌మీట్లు పెట్టి మాట్లాడుతూ వచ్చారు. శాసనసభకు రాకపోయినా ఆ విధంగా తన అభిప్రాయాలు ప్రజలకు తెలియజేస్తే సరిపోతుందని జగన్ స్వయంగా ప్రకటించారు కూడా.
కేంద్ర ఎన్నికల సంఘం టీవీకే పార్టీకి విజిల్ గుర్తు కేటాయించింది. ఈ నేపథ్యంలో చెన్నైలోని చెపాక్ స్టేడియంలో విజిల్ సౌండ్ పై ప్రభుత్వం నిషేధం విధించింది. ఎన్నికల కోడ్ అమలులోకి రాకుండానే విజల్ పై బ్యాన్ విధించడంతో విజయ్ టీవీకే పార్టీ అంటే అధికార డీఎంకే భయపడుతోందా అన్న చర్చ మొదలైంది.
ప‌రామార్శ పేర బలప్రదర్శనలకు దిగడం జగన్ కు రివాజుగా మారిపోయిందంటున్నారు. బలప్రదర్శన పేర జరిగే ఈ నాటకాన్ని రక్తికట్టించేందుకు పేర్ని నాని వంటివారు జగన్ కు ఇతోధికంగా సహాయపడుతుంటారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.