తెలుగు రాష్ట్రాలకు కేంద్రం శుభవార్త

Publish Date:Oct 1, 2025

Advertisement

 

తెలుగు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. తెలంగాణకు మరో నాలుగు కేంద్రీయ విద్యాలయాలను మంజూరు చేసింది.  ఇప్పటికే ఉన్న 35 కేంద్రీయ విద్యాలయాలకు తోడుగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రం (యాస్పిరేషనల్ డిస్ట్రిక్ట్), ములుగు జిల్లా కేంద్రం (గిరిజన ప్రాంతం), జగిత్యాల జిల్లా -  జగిత్యాల రూరల్ మండలం చెల్గల, వనపర్తి జిల్లా - నాగవరం శివారులో ఏర్పాటు చేయనున్నదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ( తెలిపారు. గత రెండేళ్లలోనే కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో నాణ్యమైన సెకండరీ విద్యను అందించేందుకు రూ.400 కోట్లతో 832 పీఎం-శ్రీ స్కూల్స్‌ను మంజూరు చేసిందని కిషన్ రెడ్డి తెలిపారు. 

దేశవ్యాప్తంగా పీఎం శ్రీ స్కూల్స్ కోసం ఎక్కువ కేటాయింపులు అందుకున్న రాష్ట్రం తెలంగాణనే కావడం విశేషమన్నారు. మరోవైపు ఏపీకి కూడ కేంద్ర ప్రభుత్వం నాలుగు కేంద్రీయ విద్యాలయాలను కేటాయించింది.  శ్రీకాకుళం జిల్లా మంగసముద్రం (చిత్తూరు), బైరుగానిపల్లె (కుప్పం), పలాస (శ్రీకాకుళం), శాఖమూరు (అమరావతి)లో వీటిని ఏర్పాటు చేయనుంది.  దీంతో ప్రధాని మోదీ, కేంద్రమంత్రి ధర్మేంద్రప్రధాన్‌కు సీఎం చంద్రబాబు ధన్యవాదలు తెలిపారు. 
 

By
en-us Political News

  
మహిళా రిజర్వేషన్ బిల్లుపై కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తోందని ఆరోపిస్తూ, మహిళలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసం చేసిందని బండి సంజయ్ మండిపడ్డారు.
తమిళనాడు మరియు పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ సాయంత్రంతో ముగిసింది.
రాష్ట్రంలో అత్యంత చర్చనీయాంశంగా మారిన పీసీ ఘోష్ కమిషన్ నివేదిక వ్యవహారం మరో మలుపు తిరిగింది.
చాయ్ అంటే ప్రాణం పెట్టే నగరం హైదరాబాద్. ఉదయం కప్పు నుంచి అర్ధరాత్రి స్టాల్ వరకూ చాయ్ లేకుండా రోజే కదలదు.
అధికారంలో ఉన్నప్పుడు ఒకలా.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరోలా వద్దు జగ్గారెడ్డి సంచలన పోస్ట్
ఇరాన్‌పై అగ్రదేశం అమెరికాతో కలిసి దాడి చేయాలని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెనత్యాహూ ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తున్నారంట
ఒక మత చిహ్నానికి ప్రాధాన్యతనిచ్చి, మరో మత సంప్రదాయాలను కించపరచడం సెలెక్టివ్ టార్గెటింగ్ అని నెటిజన్లు విమర్శలు గుప్పించారు. సోషల్ మీడియా వేదికగా లెన్స్ ‌కార్ట్ పట్ల వ్యతిరేకత పెచ్చరిల్లడంతో.. బ్రాండ్ ఇమేజ్ దెబ్బతినే సూచనలు కనిపించడంతో.. సంస్థ సీఈఓ పేయుష్ బన్సల్ రంగంలోకి దిగారు.
తెలంగాణలోని వరంగల్ జిల్లా నర్సంపేటలో తీవ్ర విషాదకర సంఘటన చోటు చేసుకుంది.
ఒకటి.. హిజాబ్, టర్బన్ అనుమతి.. అంటే నల్లరంగు హిజాబ్, నల్ల టర్బన్ ధరించవచ్చు. హిజాబ్ ఛాతీ వరకు కవరేజ్ ఉండాలి, కంపెనీ లోగో కనిపించేలా ఉండాలి. అయితే బుర్ఖా మాత్రం స్టోర్లో అనుమతించబడదని గైడ్లో ఉంది. రెండు..బొట్టు, తిలకం చేతితాడుపై నిషేధం.. ఆ డాక్యమెంట్ లో మత చిహ్నం అయిన తిలకం, బింది, స్టిక్కర్ లకు అనుమతి లేదని స్పష్టంగా ఉంది. అలాగే మతపరంగా చేతికి కట్టుకుని తాడు కూడా నిషేధం అని విస్పష్టంగా ఉంది.
ఢిల్లీ హత్యాచార నిందితుడు క్రిమినల్ బ్యాక్ గ్రౌండ్ చూసి పోలీసులే నోరెళ్ల పెడుతున్నారు
ఒంటిమిట్ట అర్చకులకు టీటీడీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది
ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. దేశ జనాభా పెరుగుదల రేటు కంటే విద్యార్థుల ఆత్మహత్యల రేటు వేగంగా పెరుగుతోంది. 15 నుండి 20 ఏళ్ల లోపు యువతలో ఈ ధోరణి ఎక్కువగా కనిపిస్తోంది.
ర్యాంకు ఒక లక్ష్యం కాదు.. గుర్తింపుగా సమస్యగా మారుతుంది. పదమూడు ఏళ్ల వయసులోనే జేఈఈ చేయాలి అనే సందేశం బాల్యాన్ని ముందుగానే ముగిస్తుంది. దాని తరువాత వస్తున్న జీవితాన్ని ఎలా జీవించాలో మాత్రం ఎవ్వరూ నేర్పరు. ఫలితంగా, అడ్మిషన్ తర్వాత కలిగే శూన్యత, అపరాధ భావం, వెనుకబడిపోతానేమోనన్న భయం ఇవన్నీ కలిసి కలిసి మానసిక కృంగుబాటుగా మారతాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.