బనకచర్ల ప్రాజెక్టుపై నిపుణుల కమిటీ ఏర్పాటుకు కేంద్రం నిర్ణయం
Publish Date:Aug 8, 2025
Advertisement
బనకచర్ల ప్రాజెక్టుపై 12 మంది సభ్యుల నిపుణుల కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు కేంద్రం ప్రకటించింది. సముద్రంలో వృధాగా కలిసే నీటిని బనకచర్ల ద్వారా రాయలసీమ అవసరాలకు వాడుకోవాలని ఏపీ సర్కార్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రాజెక్టుపై తెలంగాణ నుంచీ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం కావడంతో కేంద్రం రంగంలోకి దిగింది. అయితే ఈ ప్రాజెక్టుపై తెలంగాణ నుంచీ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం కావడంతో కేంద్రం రంగంలోకి దిగింది. ఇరు రాష్ట్రాల మధ్యా నీటి వినియోగానికి సంబంధించిన తగాదాపు పరిష్కరించేందుకు నిపుణులతో ఒక కమిటీని ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఈ నిపుణుల కమిటీలో తెలంగాణ నుంచి ఐదుగురు, ఆంధ్రప్రదేశ్ నుంచి ఐదుగురు సభ్యులు ఉంటారు. అలాగే కేంద్రం ఇద్దరు నిపుణులను నామినేట్ చేస్తుంది. ఈ కమిటీ కోసం సభ్యుల పేర్లను పంపాలని కేంద్రం ఉభయ తెలుగు రాష్ట్రాలను కేంద్ర జలనవరుల శాఖ కోరింది. బనకచర్లపై జూన్ 16న తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అధికారులతో హస్తినలో కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ సమక్షంలో జరిగిన సమావేశంలో ప్రాజెక్టుపై విభేదాల పరిష్కారంపై చర్చ జరిగిన సంగతి తెలిసిందే. సముద్రంలోకి వృధాగా పోయే నీటిని మాత్రమే ఆంధ్రప్రదేశ్ ఉపయోగించుకుంటోందని ఏపీ వాదించింది. అయితే తెలంగాణ మాత్రం తమ రాష్ట్రం నీటి వనరు లను కోల్పోతుందని గట్టిగా వాదించింది. బనకచర్ల విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన మాజీ రాజకీయ గురువు చంద్రబాబు నాయుడుకు మద్దతు ఇస్తున్నారని తెలంగాణలో ప్రతిపక్ష బీఆర్ఎస్ ఆరోపణలు గుప్పించడంతో బనకచర్లపై పీటముడి పడే పరిస్థితులు నెలకొన్నాయి. రాజకీయ ఉద్రిక్తతలూ పెరిగాయి. వాస్తవానికి బనకచర్ల రాయలసీమలో కరవును పరిష్కారానికి దోహద పడుతుందనీ, తెలంగాణ ప్రయోజనాలకు ఇసుమంతైనా నష్టం వాటిల్లదని ఏపీ గట్టిగా చెబుతోంది. ఈ నేపథ్యంలో బనకచర్లపై ప్రతిష్ఠంభన తొలగించే ఉద్దేశంతో కేంద్రం నిపుణుల కమిటీని ఏర్పాటు చేసి అధ్యయనం చేయాలని నిర్ణయించింది.
http://www.teluguone.com/news/content/center-to-appoint-experts-committee-on-banakacharla-39-203769.html





