Publish Date:Jun 18, 2022
అగ్నిపథ్ కు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న వారికి అన్ని వర్గాల నుంచీ మద్దతు పెరుగుతోంది. నాలుగేళ్ల కాలపరిమితితో ఆర్మీలో రిక్రూట్ మెంట్ అన్న విధానంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే బీజేపీయేతర పార్టీలన్నీ అగ్నిపథ్ ను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశాయి. కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు, సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీ అయితే వ్యవసాయ చట్టాలను ఎలాగైతే వెనక్కు తీసుకున్నారో అలాగే దేశంలోని యువతకు క్షమాపణ చెప్పి అగ్నిపథ్ ను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
కోవిడ్ అనంతర సమస్యలతో ప్రస్తుతం ఢిల్లీలోని గంగారాం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సోనియా గాంధీ కూడా అగ్నిపథ్ ను వెంటనే వెనక్కు తీసుకోవాలన్నారు. దిశా దిశ లేని ఈ విధానం వల్ల దేశంలో యువత తీవ్రంగా ఆందోళన చెందుతున్నారన్నారు. ఈ మేరకు ఆమె విడుదల చేసిన ప్రకటనను కాంగ్రెస్ సీనియర్ నేత జై రాం రమేష్ ట్వీట్ చేశారు. యువత శాంతియుతంగా నిరసనలు తెలపాలని, ఎలాంటి హింసాత్మక ఘటనలకు పాల్పడవద్దని సోనియా తన ప్రకటనలో సూచించారు. ఇలా ఉండగా అగ్నిపథ్ పథకాన్ని నిరసిస్తూ శనివారం భారత్ బంద్ కు ఆర్మీ రిక్రూటీ ఆశావహులు ప్రకటించారు. వెంటనే కేంద్రం అగ్నిపథ్ పథకాన్ని వెనక్కు తీసుకొవాలన్న డిమాండ్ తో ఆర్మీ ఉద్యోగార్థులు ఇచ్చిన ఈ బంద్ పిలుపునరకు పలు రాజకీయ పార్టీలు మద్దతు తెలిపాయి.
అయితే ఈ బంద్ ప్రభావం దేశంలో ఎక్కడా పెద్దగా కనిపించలేదు. ఇలా ఉండగా అగ్నిపథ్ పై నిరసనల కారణంగా ప్రభుత్వం ఒక అడుగు వెనక్కు తగ్గింది. త్రివిథ దళాధిపతులతో కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఈ రోజు సమీక్ష నిర్వహించారు. అగ్నిపథ్ పై యువతలో వ్యతిరేకత, ఆందోళన తగ్గించేందుకు కీలక నిర్ణయం తీసుకున్నారు. అగ్నిపథ్ కింద ఆర్మీలో రిక్రూట్ అయిన వారికి సీఎపీఎఫ్, అస్పాం రైఫిల్స్ లో పది శాతం రిజర్వేషన్ కల్పించేందుకు రక్షణ శాఖ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు త్వరలో సవరణలు చేయనున్నట్లు తెలిపింది.
తగిన అర్హత ఉన్న అగ్నిపథ్ రిక్రూటీలకు రక్షణ శాఖ ఉద్యోగాల్లో 10శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆమోదం తెలిపారు. ఇండియన్ కోస్ట్ గార్డ్, డిఫెన్స్ సివిలియన్ పోస్ట్‌లతో పాటు 16 డిఫెన్స్ పబ్లిక్ సెక్టార్ విభాగాలకు ఈ రిజర్వేషన్ వర్తిస్తుందని రక్షణ శాఖ ట్విట్టర్ వేదికగగా తెలియజేసింది. అలాగే ప్రస్తుతమున్న ఎక్స్ సర్వీస్‌మెన్ కోటాతో పాటు ఈ రిజర్వేషన్ అమలవుతుందని పేర్కొంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/center-agrees-to-give-reservation-to-agnipath-recruties-in-defence-sectot-jobs-39-137942.html
ఉత్తర్ ప్రదేశ్ రాజకీయం మళ్లీ ఒక్కసారిగా తీవ్రస్థాయిలో వేడెక్కింది.
టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌లో యూనిట్ ఇంఛార్జ్‌లకు నిర్వహించిన శిక్షణా తరగతులకు ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరయ్యారు
2024 ఎన్నికల్లో రాష్ట్రంలో వైసీపీ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుని కనీసం ప్రతిపక్ష హోదాకు కూడా నోచుకోకుండా కేవలం 11 స్థానాలకే పరిమితమైన సంగతి తెలిసిందే. అయితే ఇదే విషయంలో తాజాగా తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడిన అంబటి రాంబాబు ఆ ఎన్నికల్లో వైసీపీ 11 స్థానాలకు మాత్రమే పరిమితమైనా 40 శాతం ఓటు షేర్ దక్కించుకుందని చెప్పారు.
దశాబ్దాలుగా పార్టీని నమ్ముకుని ఉన్న సీనియర్ నాయకులను పక్కనపెట్టి, కొత్తగా వచ్చిన వారికి ప్రాధాన్యం ఇవ్వడంపై తమ్ముళ్లలో అసంతృప్తి జ్వాలలు రేగుతున్నాయి. ఈ పరిణామాలు నారా లోకేష్ నాయకత్వ తీరుపై, కూటమి ప్రభుత్వ నిర్ణయాలపై పార్టీలోనే అసంతృప్తి వ్యక్తమౌతోంది.
ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీని అడ్డుకునేందుకు వైసీపీ నేతలు హైకోర్టులో ఏకంగా 300 కోర్టు కేసులు వేయించారని, అయితే ధర్మాసనం వారికి తీవ్రంగా మొట్టికాయలు వేసి బుద్ధి చెప్పిందని గుర్తుచేశారు. నిరుద్యోగుల జీవితాలతో ఆడుకోవడమే వైకాపా నైజమని మండిపడ్డారు.
మ్మెల్సీ రామసుబ్బారెడ్డి తన సతీమణి ఇందిరమ్మతో కలిసి దీక్షా శిబిరానికి చేరుకున్నారు. అయితే పోలీసులు అనుమతి లేదంటూ వారిని అడ్డుకున్నారు. ఈ దశలో వైపీపీ శ్రేణులు, పోలీసుల మధ్య వాగ్వాదం జరిగింది. పరిస్థితి అదుపుతప్పుతుండటంతో పోలీసులు ఎమ్మెల్సీ దంపతులను, పలువురు కార్యకర్తలను అదుపులోనికి తీసుకుని అక్కడ నుంచి తరలించారు.
విజయ్ రాజకీయ ప్రత్యర్థుల విమర్శలకు స్పందించలేదు. తన భార్యపై గానీ, కోర్టులో ఉన్న విడాకుల ప్రక్రియపై గానీ విజయ్ పన్నెత్తు మాట మాట్లాడలేదు. వ్యక్తిగత విషయాలకూ, రాజకీయాలకూ సంబంధం లేదని ఒక్క ముక్కలో తేల్చేశారు.
తెలంగాణలో త్వరలో జరగనున్న స్థానిక ఎన్నికల్లో బీజేపీకి ఏ పార్టీతోనూ పొత్తులు పెట్టుకునే ఆలోచన లేదని స్పష్టం చేశారు. జనసేన పార్టీతో తమకు ఉన్న మిత్రబంధం కేవలం కేంద్ర స్థాయికి , ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మాత్రమే పరిమితమని, తెలంగాణలో ఆ పొత్తును పొడిగించే ప్రసక్తే లేదని కుండబద్దలు కొట్టేశారు.
వైసీపీ అధినేత జగన్ మాత్రం బాధితుల వేదనను, కష్టాలను ఇసుమంతైనా పట్టించుకోకుండా, అక్రమాలకు పాల్పడిన నిందితుల వద్దకు వెళ్లి వారిని పరామర్శిస్తూ, ఓదార్చడం వింతగా విడ్డూరంగా ఉందన్నారు. అక్రమాలకు పాల్పడండి అండగా ఉంటానంటూ జగన్ నిందితులకు భరోసా ఇస్తున్నట్లుగా ఆయన తీరు ఉందన్నారు.
దశాబ్దాలుగా తెలుగుదేశం పార్టీలో క్రియాశీలంగా పనిచేస్తున్న సీనియర్ నేత చలసానికి సొంత పార్టీ నుంచే ఈ స్థాయి ఒత్తిడి రావడం వెనుక కృష్ణా జిల్లా పార్టీలో ఉన్న అంతర్గత విభేదాలే కారణమని పరిశీలకులు అంటున్నారు. ఎన్టీఆర్ తెచ్చిన మాక్స్ చట్టం కింద స్వతంత్రంగా నడుస్తున్న ఈ డెయిరీలో ప్రభుత్వ జోక్యానికి తావు లేకపోయినా. . చలసానిపై ఈ స్థాయిలో రాజీనామాకు ఒత్తడి రావడం పట్ల పాడి రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వైసీపీలోని కాపు సామాజికవర్గానికి చెందిన నేతలు అంబటి రాంబాబు, పేర్ని నాని మీడియా ముందుకొచ్చి బోండా ఉమా మద్దతుగా గళమెత్తారు. అయితే.. తాజాగా వైసీపీ నిరసనలను ప్రశ్నిస్తూ ఆ పార్టీ నేతలను బోండా ఉమా గట్టిగా నిలదీయడంతో వైసీపీ ఆశలు నీరుగారిపోయాయి.
న్నికల ఖర్చుల విషయానికి వస్తే వైసీపీ దేశంలోనే అత్యధికంగా వ్యయం చేసిన ప్రాంతీయ పార్టీగా నిలిచింది. ఆ ఆర్థిక సంవత్సరంలో వైసీపీ ఆదాయం 140.4 కోట్ల రూపాయలు కాగా, చేసిన వ్యయం 340.2 కోట్ల రూపాయలు. తమ వార్షిక రాబడి కంటే 142 శాతం అదనంగా, అంటే దాదాపు 199.8 కోట్ల మేర ఎక్కువ వ్యయం చేసింది.
దేశవ్యాప్తంగా విద్యా వ్యవస్థను వేధిస్తున్న ప్రశ్నాపత్రాల లీకేజీలు, నిరుద్యోగం, యువత భవిష్యత్తుపై రాహుల్ గాంధీ ప్రత్యక్షంగా విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించేందుకు ఉద్దేశించిన ఈ సదస్సు ఈనెల 8న. ప్రయాగ్‌రాజ్‌లోని ప్రసిద్ధ కేపీ కాలేజీ మైదానంలో నిర్వహించేందుకు కాంగ్రెస్ భారీ ఏర్పాట్లు చేసింది.