మెట్టు దిగిన కేంద్రం.. అగ్నిపథ్ రిక్రూటీలకు రక్షణ శాఖ ఉద్యోగాల్లో రిజర్వేషన్

Publish Date:Jun 18, 2022

Advertisement

అగ్నిపథ్ కు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న వారికి అన్ని వర్గాల నుంచీ మద్దతు పెరుగుతోంది. నాలుగేళ్ల కాలపరిమితితో ఆర్మీలో రిక్రూట్ మెంట్ అన్న విధానంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  ఇప్పటికే బీజేపీయేతర పార్టీలన్నీ అగ్నిపథ్ ను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశాయి. కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు, సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీ అయితే వ్యవసాయ చట్టాలను ఎలాగైతే వెనక్కు తీసుకున్నారో అలాగే దేశంలోని యువతకు క్షమాపణ చెప్పి అగ్నిపథ్ ను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.

కోవిడ్ అనంతర సమస్యలతో ప్రస్తుతం ఢిల్లీలోని గంగారాం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సోనియా గాంధీ కూడా అగ్నిపథ్ ను వెంటనే వెనక్కు తీసుకోవాలన్నారు. దిశా దిశ లేని ఈ విధానం వల్ల దేశంలో యువత తీవ్రంగా ఆందోళన చెందుతున్నారన్నారు. ఈ మేరకు ఆమె విడుదల చేసిన ప్రకటనను కాంగ్రెస్ సీనియర్ నేత జై రాం రమేష్ ట్వీట్ చేశారు.  యువ‌త శాంతియుతంగా నిర‌స‌న‌లు తెల‌పాల‌ని, ఎలాంటి హింసాత్మ‌క ఘ‌ట‌న‌ల‌కు పాల్ప‌డ‌వ‌ద్ద‌ని సోనియా తన ప్రకటనలో సూచించారు.  ఇలా ఉండగా   అగ్నిపథ్ పథకాన్ని నిరసిస్తూ శనివారం భారత్ బంద్ కు   ఆర్మీ రిక్రూటీ ఆశావహులు ప్రకటించారు.  వెంటనే కేంద్రం అగ్నిపథ్ పథకాన్ని వెనక్కు తీసుకొవాలన్న డిమాండ్ తో ఆర్మీ ఉద్యోగార్థులు ఇచ్చిన ఈ బంద్ పిలుపునరకు   పలు రాజకీయ పార్టీలు మద్దతు తెలిపాయి.

అయితే ఈ బంద్ ప్రభావం దేశంలో ఎక్కడా పెద్దగా కనిపించలేదు. ఇలా ఉండగా అగ్నిపథ్ పై నిరసనల కారణంగా ప్రభుత్వం ఒక అడుగు వెనక్కు తగ్గింది. త్రివిథ దళాధిపతులతో కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఈ రోజు సమీక్ష నిర్వహించారు.  అగ్నిపథ్ పై యువతలో వ్యతిరేకత, ఆందోళన తగ్గించేందుకు కీలక  నిర్ణయం తీసుకున్నారు. అగ్నిపథ్ కింద ఆర్మీలో రిక్రూట్ అయిన వారికి సీఎపీఎఫ్, అస్పాం రైఫిల్స్ లో పది శాతం రిజర్వేషన్ కల్పించేందుకు రక్షణ శాఖ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు త్వరలో సవరణలు చేయనున్నట్లు తెలిపింది. 

 తగిన అర్హత ఉన్న అగ్నిపథ్ రిక్రూటీలకు రక్షణ శాఖ ఉద్యోగాల్లో 10శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్ ఆమోదం తెలిపారు. ఇండియన్‌ కోస్ట్‌ గార్డ్‌, డిఫెన్స్‌ సివిలియన్‌ పోస్ట్‌లతో పాటు 16 డిఫెన్స్‌ పబ్లిక్‌ సెక్టార్‌ విభాగాలకు ఈ రిజర్వేషన్‌ వర్తిస్తుందని రక్షణ శాఖ ట్విట్టర్ వేదికగగా తెలియజేసింది. అలాగే  ప్రస్తుతమున్న ఎక్స్‌ సర్వీస్‌మెన్‌ కోటాతో పాటు ఈ రిజర్వేషన్ అమలవుతుందని పేర్కొంది. 

By
en-us Political News

  
హైదరాబాద్‌లోని ప్రముఖ ఐటీ కారిడార్‌ అయిన మాదాపూర్‌లో ఇటీవల వెలుగుచూసిన ఓయో హోటల్ యువతి అనుమానాస్పద మృతి ఉదంతం అత్యంత నాటకీయ పరిణామాల మధ్య కొత్తలుపులు తెరుస్తోంది.
హైదరాబాద్ మహానగరంలో వినాయక చవితి నవరాత్రి వేడుకలు అత్యంత వైభవంగా ముగిశాయి.
దేశవ్యాప్తంగా ఎంతో అత్యాధునిక సౌకర్యాలు, అత్యున్నత భద్రతా ప్రమాణాలతో ప్రయాణాలకు మారుపేరుగా నిలిచిన వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ రైలులో అకస్మాత్తుగా చోటుచేసుకున్న ఒక ఘటన కలకలం రేపింది.
ప్యారడైజ్‌ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.. కానీ థియేటర్‌లో సినిమా చూసే ఆడియన్స్‌కు మరో సర్‌ప్రైజ్‌ సిద్ధమైంది.
వివిధ రాష్ట్రాలకు కొత్త ఇన్‌ఛార్జీలను ప్రకటించిన కాషాయ పార్టీ..!
బెంగళూరులోని కుమ్రం భీం కాదండోయ్ పరప్పన అగ్రహార సెంట్రల్ జైలులో ఉంటూ తీవ్ర మానసిక క్షోభ అనుభవిస్తున్న కన్నడ నటుడు దర్శన్ కేసులోని ప్రధాన నిందితురాలు పవిత్రా గౌడ కోర్టులో చేసిన వ్యాఖ్యలు
అక్టోబరా, నవంబరా, లేదా తరువాతా అన్న ఉత్కంఠకు తెరదించుతూ మంత్రి నారా లోకేష్ వచ్చే నెలలోనే అంటే అక్టోబర్ లోనే స్థానిక సమరం ఉంటుందన్న స్పష్టత ఇచ్చారు.
వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గమైన పులివెందుల పరిధిలోని లింగాల మండలం నుంచి  జెడ్పీటీసీ స్థానానికి పోటీ చేయాల్సిందిగా  వైఎస్ సునీతను లోకేష్ కోరినట్లు  ప్రచారం జరుగుతోంది. కేవలం పోటీ చేయడమే కాకుండా, ఆ ఎన్నికలో విజయం సాధిస్తే..  జిల్లా పరిషత్ చైర్ పర్సన్ పదవి  కట్టబెడతామని స్పష్టమైన హామీ ఇచ్చినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.
భారతీయ చలనచిత్ర పరిశ్రమ అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవం గుజరాత్‌లోని ఏక్తా నగర్‌లో అత్యంత వైభవంగా జరిగింది.
యువనేత లోకేష్ రాప్తాడు రావడం పార్టీ కేడర్‌కు పండుగ రోజు.
తన కుమార్తె వివాహాన్ని అడ్డుపెట్టుకుని జగన్ తో సయోధ్య కోసం తెరవెనుక ప్రయత్నాలు చేస్తున్నారంటూ తనపై వచ్చిన ఆరోపణలను ఆమె నిర్ద్వంద్వంగా ఖండించారు.  
సినిమా రంగంలో సరికొత్త చరిత్ర సృష్టిస్తూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.