రాయలసీమలో వైసీపీకి చెక్.. చంద్రబాబు వ్యూహం ఇదేనా?

Publish Date:Sep 5, 2025

Advertisement

తెలుగుదేశం అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు రాయలసీమపై ప్రత్యేక దృష్టి సారించారు. సీమలో పార్టీని బలోపేతం చేయడమే కాకుండా.. అక్కడ గట్టి పట్టు ఉన్నట్లుగా చెప్పుకుంటున్న వైసీపీకి గట్టి చెక్ పెట్టే వ్యూహంతో ముందుకు సాగుతున్నారు.  2024 ఎన్నికలకు ముందు వరకూ కూడా సీమ ప్రాంతంలో తెలుగుదేశం పట్టు, ప్రభావం అంతంత మాత్రంగానే అన్నట్లుగా ఉండేది. అయితే 2024 ఎన్నికలలో తెలుగుదేశం కూటమి గాలిలో సీమలో కూడా గణనీయమైన స్థానాలు గెలుచుకుని తెలుగుదేశం సత్తా చాటినప్పటీకీ ఆక్కడ ఇప్పటికీ వైసీపీకి చెప్పుకోదగ్గ  బలం ఉందనడంలో సందేహం లేదు. దీంతో సీమలో పార్టీ బలోపేతం కోసం చంద్రబాబునాయుడు ప్రత్యేక ప్రణాళికా వ్యూహరచనతో ముందుకు సాగుతున్నారు. మహానాడును కడప వేదకగా జరపడం నుంచి మొదలుపెడితే.. తాజాగా ప్రభుత్వం అమలు చేస్తున్న సూపర్ సిక్స్ పథకాలు విజయవంతం అయిన సందర్భాన్నిపురస్కరించుకుని నిర్వహించతలపెట్టిన  సూపర్ సిక్స్ సూపర్ హిట్ కార్యక్రమానికి కూడా చంద్రబాబు రాయలసీమనే వేదిక చేసుకున్నారు. సూపర్ సిక్స్ సూపర్ హిట్ కార్యక్రమం ఈ నెల 10న అనంతపురం వేదికగా ఘనంగా, అట్టహాసంగా జరగనుంది.  

ఇటీవల పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికలలో తిరుగులేని విజయాలను సొంతం చేసుకున్న తెలుగు దేశం.. ఆ జోరును కొనసాగించేందుకు సీమ వేదికగావరుస కార్యక్రమాలను నిర్వహించేందుకు సన్నద్ధమై సన్నాహాలు చేసుకుంటోందనడానికి సూపర్ సిక్స్ సూపర్ హిట్ కార్యక్రమానికి అనంతపురం ను వేదికగా ఎంచుకోవడాన్ని చెప్పుకోవచ్చు.

అలాగే పారిశ్రామికంగా, కరవును రూపుమాపడానికి నీటి వసతిని కల్పించడం వంటి కార్యక్రమాలతో  రాయలసీమ జనాలను ఆకట్టుకుని ఆక్కడ ఓటు బ్యాంకు పెంచుకునే దిశగా తెలుగుదేశం అడుగులు వేస్తున్నదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇప్పటికే సీమ ప్రాంతంలో వైసీపీ పునాదులు కదులుతున్న ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికలో వైసీపీ అభ్యర్థికి డిపాజిట్ కూడా దక్కకపోడం ఇందుకు నిదర్శనంగా చెప్పవచ్చు. ఈ నేపథ్యంలోనే సీమ వేదకగా ప్రభుత్వపరంగా, పార్టీ పరంగా వరుస కార్యక్రమాలు నిర్వహిస్తూ ముందుకు సాగడం ద్వారా వైసీపీకి చెక్ పెట్టాలన్నది చంద్రబాబు వ్యూహంగా పరిశీలకులు చెబుతున్నారు. 

By
en-us Political News

  
తెలుగువన్ వాస్తవ వేదికలో ప్రస్తుత జాతీయ, ప్రాంతీయ రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆ రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనాన్ని సృష్టించాయి.
టీవీకే అధినేత విజయ్‌తో భేటీ అనంతరం రాజ్ భవన్ ఒక అధికారిక ప్రెస్ నోట్ విడుదల చేసింది. అసెంబ్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే ఉండాల్సిన సంఖ్యాబలంపై గవర్నర్.. విజయ్‌కు మార్గనిర్దేశం చేశారు. కేవలం అతిపెద్ద పార్టీగా ఉండటమే కాకుండా, సభలో తగినంత మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నట్లు ఆధారాలు చూపాలని సూచించారు.
పిఠాపురంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో చంద్ర‌బాబు ఫొటోలేద‌ని ఆరోపిస్తూ.. మాజీ ఎమ్మెల్యే వ‌ర్మ అధికారుల‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఈ క్ర‌మంలో జ‌న‌సేన నేత‌, మాజీ ఎమ్మెల్యే దొర‌బాబు జోక్యం చేసుకోవ‌డంతో వాగ్వాదం చోటు చేసుకుంది. వ‌ర్మ దురుసు వ్యాఖ్య‌ల‌పై పార్టీలో అంత‌ర్గ‌తంగా చ‌ర్చించిన అధిష్టానం.. వ‌ర్మ వ్య‌వ‌హారాన్ని త‌ప్పుబ‌ట్టింది. ఇంతలోనే వర్మను ఇంచార్జ్ పదవి నుంచి తొలగించడం చర్చనీయాంశంగా మారింది.
రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు డీఎంకే ఏ విధంగానూ అడ్డుపడబోదన్నారు. రాష్ట్రంలో మరోసారి ఎన్నికలు రావాలని గానీ, రాజ్యాంగ సంక్షోభం తలెత్తాలనీ కానీ తాము కోరుకోవడం లేదన్నఆయన.. ప్రజాతీర్పునకు అనుగుణంగానే డీఎంకే నడుచుకుంటున్నదన్నారు.
గతంలో విజయ్‌కు ఉన్న ప్రాణహాని హెచ్చరికలు.. ఆయన పాపులారిటీని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం సాయుధ పోలీసులతో కూడిన భద్రతను ఏర్పాటు చేసింది. అయితే.. తాజాగా నిర్వహించిన భద్రతా సమీక్షలో భాగంగా ఆయనకు ఇకపై అదనపు సెక్యూరిటీ అవసరం లేదని అధికారులు భావించినట్లు తెలుస్తోంది.
తాజా ఎన్నికల ఫలితాల్లో నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) 108 స్థానాలతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన సంగతి తెలిసిందే. అయితే.. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 మంది ఎమ్మెల్యేల మద్దతు ఆ పార్టీకి ఇంకా లభించలేదు. కాంగ్రెస్‌తో కలిపి విజయ్ బలం ప్రస్తుతం 112కు చేరినప్పటికీ.. మేజిక్ ఫిగర్‌కు ఇంకా ఆరు అడుగుల దూరంలో ఉంది.
తమిళనాడు రాజకీయాల్లో పెను మార్పులు చోటుచేసుకుంటున్న వేళ
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంలో సువేందు కీ రోల్ పోషించారు. ఆ పార్టీ 206 స్థానాల్లో గెలిచి బెంగాల్‌లో తొలిసారిగా అధికారం చేపట్టబోతోంది. బీజేపీ తరఫున రెండు స్ధానాల నుంచి బరిలోకి దిగిన సువేందు అధికారి.. మరోసారి మమతా బెనర్జీని ఓడించారు. భవానిపూర్‌లో దీదీపై గెలిచిన ఆయన.. తన సొంత నియోజకవర్గమైన నందిగ్రామ్‌లోనూ గెలిచి పట్టు నిలుపుకున్నారు.
ముఖ్యంగా అస్సాం, పశ్చిమబెంగాల్ లో బీజేపీ ఎన్నికల సంఘం సహకారంతో ఫలితాలను చోరీ చేసిందన్నారు.
పశ్చిమబెంగాల్‌లో మూడున్నర దశాబ్దాల ఏళ్ల సీపీఎం పాలనకు బ్రేక్ వేసి 2011లో అధికార పగ్గాలు చేపట్టిన తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్టీ.. 2026 వరకు వరుస విజయాలతో ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆమె 15 ఏళ్ల ఆధిపత్యానికి ఎన్డీఏ తెర దించింది. మమతా సైతం కాంగ్రెస్‌లో కేంద్రమంత్రిగా, పలు కీలక పదవులు నిర్వహించి, తర్వాత సొంత కుంపటి పెట్టుకున్న నాయకురాలే కావడం గమనార్హం.
ప్రజా సమస్యలపై స్పష్టమైన అజెండాతో ఎన్నికల బరిలోకి దిగిన విజయ్‌ను తమిళ ప్రజలు ఆదరించడం శుభపరిణామమన్నారు.
తన పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు ఆయన సాగించిన ప్రయాణం ఒక అద్భుతమైన రాజకీయ థ్రిల్లర్‌ను తలపిస్తుంది. ఎన్నికల ప్రచార సమయంలో విజయ్ అనేక ఆటంకాలను ఎదుర్కొన్నారు. ప్రత్యర్థి పార్టీల నుండి వచ్చిన తీవ్ర విమర్శలు, అధికార యంత్రాంగం విధించిన ఆంక్షలు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేశాయి. వ్యక్తిగత జీవితంపై జరిగిన దుష్ప్రచారం విజయ్ ఇమేజ్‌ను దెబ్బతీస్తుందని అందరూ భావించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.