జగన్ విదేశీ పర్యటనకు సీబీఐ కోర్టు ఓకే
Publish Date:Apr 17, 2026
Advertisement
అక్రమాస్తుల కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ విదేశీ పర్యటనకు వెళ్లేం దుకు అనుమతి కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌పై సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. కుటుంబ సభ్యులతో కలిసి యూరప్, యూకే పర్యటనకు వెళ్లేందుకు కోర్టు అనుమతి మంజూరు చేసింది. జగన్ పిటిషన్ ను విచారించిన కోర్టు ఈ నెల 20 నుంచి వచ్చే నెల 15 వరకు మొత్తం 25 రోజుల పాటు విదేశీ పర్యటనకు వెళ్లేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.. అయితే.. ఇందుకు పలు షరతులు విధించింది. కోర్టు ఆదేశాల ప్రకారం, విదేశీ పర్యటనకు వెళ్లే ముందు తన కాంటాక్ట్ నంబర్, ఈమెయిల్ ఐడీతో పాటు అవసరమైన ష్యూరిటీ వివరాలను సిబిఐ అధికారులకు సమర్పించాలని జగన్‌ను ఆదేశించింది. అక్రమాస్తుల కేసు విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో, దేశం విడిచి వెళ్లాలంటే తప్పనిసరిగా సీబీఐ కోర్టు అనుమతి తీసుకోవాల్సిన నిబంధన ఉంది. ఈ నేపథ్యంలోనే కోర్టు అనుమతి కోసం జగన్ పిటిషన్ దాఖలు చేశారు.
http://www.teluguone.com/news/content/cbi-court-approves-jagan-foreign-tour-36-217577.html





