దావూద్ పట్టుకోండి రూ.25 లక్షలు అందుకోండి .. ఎన్ ఐఏ
Publish Date:Sep 1, 2022
Advertisement
భారత్‌లో మళ్లీ కల్లోలం సృష్టించడానికి, ఉగ్రదాడులకుపాల్పడేందుకు పాక్ ప్రేరేపిత ఉగ్రసంస్థలతో చేతులు కలిపి రెచ్చిపోయేందుకు ప్రయత్నిస్తున్న అంతర్జాతీయ తీవ్రవాది దావూద్‌ను పట్టించినవారికి రూ.25 లక్షలు, అతని అనుచరుడు ఛోటా షకీల్‌ను పట్టించినవారికి రూ.20 లక్షలు ఇస్తామని జాతీయ ఇన్ వెస్టిగేటింగ్ ఏజెన్సీ (ఎన్ ఐ ఏ) నజరానా ప్రకటించింది. దేశంలోకి డి కంపెనీ ఇప్పటికే మారణా యుధాలు, డ్రగ్స్, దొంగనోట్లు వారికి సంబంధించిన సంస్థల ద్వారా తెచ్చారని ఎన్ ఐఏ గ్రహించింది. వారిద్దరే కాకుండా, దావూద్ సోదరుడు అనీస్ ఇబ్రహీం అలియాస్ హాజీ అనీస్, సన్నిహితుడు జావెద్ పటేల్ అలియాస్ జావెద్ చిక్నా,షకీల్ షేక్ అలియాస్ ఛోటా షకీల్, ఇబ్రహీం ముష్తాక్ మెమన్ అలి యాస్ టైగర్ మెమన్ ల విషయంలోనూ ఎన్ ఐఏ ప్రకటన విడుదల చేసింది. వీరంతా పాకిస్థాన్ కరాచీలోనే తిష్టవేసి భారత్‌లో దాడులకు పాల్పడుతున్నారు. 1993 ముంబై పేలుడు సంఘటన సంబంధించి ఇబ్రహీంపై ఐక్యరాజ్యసమితి సెక్యూరిటీ కౌన్సిల్ 2003లోనే రూ.25 లక్షలు ప్రక టించింది. అనేక దారుణ సంఘటనల్లో కీలకపాత్ర ఉన్న లష్కరే తోయిబ ఛీప్ హఫీజ్ సయీద్, జైషె మొహమ్మద్ ఛీఫ్ మౌలానా మసూద్ అజర్, హిజబుల్ ముజహిద్దీన్ స్థాపించిన సయీద్ సలా ఉద్దీన్, అత ని సన్నిహితుడు అబ్దుల్ రవూప్ అస్ఝగర్లను కూడా భారత్‌తో పాటు అనేక దేశాలు ప్రపంచ ప్రమాద కర వ్యక్తులు, సంస్థలుగా ప్రకటించాయి. దీనికి ఐక్యరాజ్యసమితి మద్దతు కూడా లభించింది. పాకిస్థాన్ రహస్యసంస్థలతో, ఐఎస్ ఐతో కలిసి డి కంపెనీ మళ్లీ దాడులకు పాల్పడేందుకు సిద్ధపడిం దన్న సమాచారా న్ని ఈ ఏడాది ఫిబ్రవరిలోనే ఎన్ ఐఏ అందుకుని దేశంలో అనేక ప్రాంతాల్లో అనేక నగరాల్లో అధికారులను, పోలీస్ యంత్రాంగాన్ని హెచ్చరించింది. అంతేగాక, ఈ ఏడాది మే నెలలో ఎన్ ఐఏ 29 కీలక ప్రాంతాల్లో ప్రత్యేక బృందాలతో తనిఖీలు నిర్వహిం చింది. ఈ సందర్భంగానే 1993 ముంబై పేలుళ్ల తో సంబంధం ఉన్న హాజీఅలీ దర్గా, మహీ మ్ దర్గా ట్రస్టీ సుశీల్ ఖాంద్వానీని, మరికొంతమంది కీలక వ్యక్తులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. మొత్తానికి ఎన్ ఐఏ అప్రమత్తం కావడం, డి గ్యాంగ్ లీడర్ ని, అతని సహచరుడు ఛోటా షకీల్ పైనా నజ రానా ప్రకటించడంతో దేశంలో అనేక ప్రాంతాల్లో, ముఖ్య నగరాల్లో ప్రజలతో పాటు పోలీస్ యంత్రాంగం మరింత అప్రమత్తమయిందని చెప్పవచ్చు.
http://www.teluguone.com/news/content/catch-dawood-25-143025.html





