పరువు కోసం గర్బిణీ అని కూడా చూడకుండా..కూతుర్నే
Publish Date:Apr 18, 2017
Advertisement
దేశం అభివృద్ధిలో దూసుకువెళుతున్నా..శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతున్నా పరువు హత్యలు ఏ మాత్రం తగ్గడం లేదు. కులం తక్కువ వాళ్లని చేసుకుందనో..వేరే కులానికి చెందిన అబ్బాయిని ప్రేమించిందనో కారణం ఏదైనా తల్లిదండ్రులే పిల్లలను అత్యంత దారుణంగా హత్య చేస్తున్నారు. కుల, మత, ప్రాంత, ధనిక, పేద తేడాలతో తమ సంతానాన్నే ద్వేషించే దుర్మార్గానికి కొత్త పేరు పరువు హత్య. ఇందులో పరువు ఏమీ లేదు, హత్య మాత్రం ఉంది. తమ కులాన్ని, వంశాన్ని, ఇష్టాన్ని కాదన్నారన్న ఒకే కారణంతో తమ కూతురిని, ఆమెను ప్రేమించిన వ్యక్తిని హత్య చేయడానికి ఆమె కుటుంబం వెనుకాడటం లేదు. తాజాగా చెన్నైలోని అరియలూరు జిల్లా సెందురైలో ఇలాంటి ఘటనే జరిగింది. కులాంతర వివాహం చేసుకున్న అమ్మాయిని వెతికి పట్టుకుని మరీ హత్య చేశారు. సెందురై సమీపంలోని పొన్ పరప్పి గ్రామానికి చెందిన తంగరాజ్, భవానీల కుమార్తె షర్మిల సమీప గ్రామానికి చెందిన కలై రాజన్‌ను ప్రేమించింది. వీరి ప్రేమను పెద్దలు ఒప్పుకోకపోవడంతో 2008లో ఇంటి నుంచి పారిపోయి వివాహం చేసుకున్నారు. అయితే షర్మిల కుటుంబీకులు ఆమెను వెతికి పట్టుకొచ్చి..సమీప బంధువుతో బలవంతపు వివాహం చేశారు..ఆమెకు ఓ ఆడపిల్ల జన్మించింది..బలవంతపు కాపురం ఇక తన వల్ల కాదంటూ 2013లో షర్మిల మరోసారి ఇంట్లోంచి పారిపోయింది. తన మాజీ ప్రియుడు కలైరాజన్‌తో ఓ ఊరిలో సహజీవనం చేస్తోంది..ఈ క్రమంలో షర్మిల మరోసారి గర్భం దాల్చింది..షర్మిల ఆచూకీని మళ్లీ కనుగొన్న ఆమె కుటుంబసభ్యులు..మాయ మాటలతో ఇంటికి తీసుకువచ్చారు. ఊరి పెద్దల సమక్షంలో పంచాయతీ పెట్టి కలైరాజన్‌ను అల్లుడిగా స్వీకరించేందుకు అంగీకరించారు..అనంతరం షర్మిలను ఇంటికి తీసుకువెళ్లారు..ఇది జరిగిన రోజు రాత్రి షర్మిల శవమై కనిపించింది..మొదట దీనిని అంతా ఆత్మహత్య అనుకున్నారు. కానీ పోలీసులు తమదైన స్టైల్లో విచారించే సరికి నిజం బయటపడింది. షర్మిలను ఇంటికి తీసుకువెళ్లిన తల్లిదండ్రులు గర్భం తొలగించుకోవాల్సిందిగా ఆమెపై తీవ్రంగా ఒత్తిడి చేశారు. అందుకు ఆమె ససేమిరా అనడంతో..ఆగ్రహంతో తీవ్రంగా కొట్టారు.. తీవ్ర గాయాల కారణంగా షర్మిల మరణించింది. అయితే నిజం బయటపడకుండా ఉండేందుకు ఆమె మరణాన్ని ఆత్మహత్యగా చిత్రీకరించారు.
http://www.teluguone.com/news/content/caste-murder-45-74061.html





