వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డికి క్యాబినెట్ బెర్త్?

Publish Date:Jul 14, 2025

Advertisement

కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిపై ఇటీవల అదే నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, వైసీపీ సీనియర్ నాయకుడు నల్లపరెడ్డి ప్రశన్నకుమార్ రెడ్డి చేసిన దారుణ వ్యాఖ్యలు సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డిపై ఈ విషయంలో కేసు కూడా నమోదైంది. అయితే ఇప్పటి వరకూ ఎటువంటి చర్యలూ లేవు. అయితే.. రాజకీయాలతో సంబంధం లేకుండా సర్వత్రా నల్లపరెడ్డి ప్రసన్నకుమారరెడ్డి వ్యాఖ్యలపై ఖండనలు వెల్లువెత్తాయి. మహిళా నేతపై అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని సామాన్యజనం కూడా గర్హించారు. సరే ఈ వ్యాఖ్యల తరువాత ప్రసన్నకుమార్ రెడ్డి నివాసంపై దాడి జరిగిందనుకోండి అది వేరే విషయం.  నెల్లూరు జిల్లాపై వేమిరెడ్డి కుటుంబానికి మంచి పట్టుంది. అన్నిటికీ మించి ఎమ్మెల్యేగా ప్రశాంతి రెడ్డి ప్రజలలో మమేకమై సమస్యల పరిష్కారంలో, నియోజకవర్గ అభివృద్ధిలో దూసుకుపోతున్నారు. 

 కోవూరు నియోజకవర్గంలో వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డికి మంచి పేరుంది. ఎమ్మెల్యేగా ఆమె ప్రజా సమస్యల పరిష్కారంలో చురుకుగా వ్యవహరిస్తూ ప్రజల మన్ననలు పొందుతున్నారు. ప్రభుత్వ సహకారం కోసం వేచి చూడకుండా నియోజకవర్గంలో తన సొంత ఫౌండేషన్ నిధుల ద్వారా నియోజకవర్గ సమస్యలను పరిష్కరించడం ద్వారా ఆమె ప్రజలలో మరీ ముఖ్యంగా మహిళలకు బాగా చేరువయ్యారు.  ఈ పరిస్థితుల్లో ఆమెకు ప్రజలలో పెరుగుతున్న పలుకుబడిని జీర్ణించుకోలేక, ఆమె ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసేందుకే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారని జనం కూడా నమ్ముతున్నారు. ఈ పరిస్థితుల్లో తెలుగుదేశం కూటమి పార్టీల నేతలంతా వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డికి సంఘీభావం ప్రకటించారు. ఆమెకు బాసటగా నిలిచారు. ఇప్పుడు ఆమెను తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కేబినెట్ లోకి తీసుకోవాలని నిర్ణయించినట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. త్వరలో చంద్రబాబు తన కేబినెట్ ను విస్తరించనున్నారు. ఈ విస్తరణలో వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డికి కేబినెట్ లో చోటు కల్పించడం ద్వారా తెలుగుదేశం మహిళలకు అండగా, బాసటగా నిలుస్తుందన్న సందేశం ఇచ్చినట్లుగా ఉంటుందని తెలుగుదేశం అధినాయకత్వం భావిస్తున్నట్లు చెబుతున్నారు. 

అలాగే వేమిరెడ్డి కుటుంబానికి ఉమ్మడి నెల్లూరు జిల్లాలో మంచి పట్టు ఉంది. ఆమె భర్త, నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకరరెడ్డికి కూడా బలమైన నేత. ప్రజలలో మంచి పట్టున్న నాయకుడు.   వాస్తవానికి గత ఏడాది ఎన్నికలలో తెలుగుదేశం కూటమి విజయం సాధించి చంద్రబాబు ప్రభుత్వం కొలువుదీరిన సమయంలోనే తన భార్య వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డికి మంత్రి పదవి వస్తుందని ఆయన ఆశించారు. అయితే అప్పుడు అది జరగలేదు.   అయితే ఇప్పుడు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిని క్యాబినెట్ లోకి తీసుకోవడం ద్వారా వైసీపీకి గట్టి పట్టున్న కోవూరు నియోజరకవర్గంలో  తెలుగుదేశం పార్టీని పటిష్టం చేయడానికి దోహదం చేస్తుందని తెలుగుదేశం అధినాయకత్వం భావిస్తున్నట్లు చెబుతున్నారు.   

రాష్ట్ర విభజన తరువాత 2014లో జరిగిన ఎన్నికలలో రాష్ట్రంలో తెలుగుదేశం విజయం సాధించి అధికారంలోకి వచ్చినప్పటికీ నెల్లూరు జిల్లాలో మాత్రం మొత్తం పది స్థానాలలో సైకిల్ పార్టీ కేవలం మూడు స్థానాలలో మాత్రమే విజయం సాధించింది. ఇక 2019 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ నెల్లూరు జిల్లాలో కనీసం ఒక్కటంటే ఒక్క స్థానం కూడా గెలవ లేకపోయింది. అయితే 2024 ఎన్నికలలో వైసీపీని కూటమి హవా జీరో స్థానాలకు పరిమితం కావడంలో వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి పాత్ర కీలకమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. వాస్తవానికి గత ఎన్నికలలో వైసీపీ వేమిరెడ్డి ప్రభాకరరెడ్డిని నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా ప్రకటించినప్పటికీ,  ఆ నియోజకవర్గ పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లలో అభ్యర్థుల విషయంతో తనను జగన్ విశ్వాసంలోకి  తీసుకోకపోవడంపై తీవ్ర అసంతృప్తికి గురైన వేమిరెడ్డి వైసీపీకి గుడ్ బై చెప్పి తెలుగుదేశం గూటికి చేరారు. ఈ చేరిక జిల్లా రాజకీయాలపై ప్రభావం చూపిందనీ, జిల్లాలో జగన్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగలడానికి కారణమైందని అంటున్నారు.  ఈ నేపథ్యంలోనే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిని తెలుగుదేశం కూటమి కేబినెట్ లోకి తీసుకోవడం  జిల్లాలో వైసీపీ కోలుకోలేని విధంగా  దెబ్బకొట్టినట్లు అవుతుందని భావిస్తున్నారు. 

By
en-us Political News

  
భారత రాజకీయాల్లో ఇప్పుడు పార్లమెంట్ సీట్ల పునర్విభజన (డీలిమిటేషన్), మహిళా రిజర్వేషన్ బిల్లుల చుట్టూ తీవ్రమైన ఉత్కంఠ నెలకొంది.
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి కాంగ్రెస్ అంతర్గత వ్యవహారాలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
వైసిపి సీనియర్ నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి.. రాజ్యసభ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి చొక్కా పట్టుకుని దాడి చేసి కొట్టారని.. ఇదే విషయాన్ని ఇటీవల విజయసాయి ఓ బహిరంగ లేఖ ద్వారా వెల్లడించిన విషయాన్ని కన్ ఫర్మ్ చేశారు.
ఇండియా కూటమి తరఫున రాహుల్ గాంధీనే ప్రధానమంత్రి అభ్యర్థి అని కుండబద్దలు కొట్టారు. ఆ విషయాన్నే తమిళనాడు కాంగ్రెస్ శాసనసభాపక్ష  నాయకురాలు తారాహై కత్‌బర్ట్  మరింత క్లారిటీ ఇస్తూ.. విజయ్ ప్రధాని అవుతారంటూ కొందరు ప్రచారం చేయడం కేవలం టీవీకే శ్రేణుల ఉత్సాహం వల్ల జరుగుతున్న ప్రచారమే తప్ప, అది ఆ పార్టీ అధికారిక వైఖరి కాదన్నారు.
రాజకీయ క్షేత్రంలో ముందస్తు ఊహాగానాలు, భవిష్యత్ ఎన్నికల అంచనాలు ఎప్పుడూ ఆసక్తికరంగానే సాగుతుంటాయి. ఈ నేపథ్యంలో సపోజ్ ఫర్ సపోజ్  ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే పరిస్థితి ఎలా ఉంటుందన్న చర్చ జోరందుకుంది. రానున్న  రాజకీయ సమీకరణాలపై   చర్చోపచర్చలు మొదలయ్యాయి.
కొండా సురేఖపై వేటు తప్పదనీ, ఆమెకు క్యాబినెట్ నుంచి ఉద్వాసన తప్పదన్న ప్రచారం జోరుగా సాధింది. ఒక దశలో రేవంత్ కేబినెట్ లోకి సురేఖ స్థానంలో మరో ఫైర్ బ్రాండ్ నాయకురాలు విజయశాంతిని తీసుకోనున్నట్లు కూడా వార్తలు వినిపించాయి. 
 ప్రభుత్వ మద్దతుతో జరిగే ఏకగ్రీవ ఎన్నికలు ఉంటాయన్న ఆయన రాజకీయ పార్టీ కోణంలో ఏకగ్రీవాలు ఉండకూడదని జగన్ అన్నారంటూ బొత్స  వివరణపై వైసీపీ నేతలు పెదవి విరుస్తున్నారు.
బహదూర్‌పురా నియోజకవర్గ ఎమ్మెల్యే మహ్మద్ ముబీన్‌ను రాజేంద్రనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా ఆల్ ఇండియా మజ్లిస్-ఎ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (AIMIM) నియమించింది.
ఇండియా టుడే-సి ఓటర్ సర్వే అంచనాల ప్రకారం.. మొత్తం 25 లోక్‌సభ స్థానాలు ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి  20 పార్లమెంట్ స్థానాలను దక్కించుకుంటుంది.
 దువ్వాడ కుటుంబ వ్యవహారం రచ్చకెక్కి పార్టీ ప్రతిష్ఠ మసకబారే పరిస్థితి రావడంతో వైసీపీ అధినేత జగన్ తప్పని సరిపరిస్థితుల్లో  దువ్వాడ శ్రీనివాస్ పై సస్పెన్షన్ వేటు వేశారు.   అయితే పేరుకే సస్పెన్షన్ తప్ప ఆయన ఇప్పటికీ వైసీపీ ఎమ్మెల్సీగానే చెలామణి అవుతున్నారు.
తెలుగుదేశం కూటమి సునాయాసంగా 20 స్థానాలను కైవసం చేసుకుంటుంది.   2024 ఎన్నికల ఫలితాలు పునరావృతమౌతాయిని ఇండియా టుడే సర్వే పేర్కొంది.
సొంత పార్టీ శాసనమండలి సభ్యుడిపై  మహిళల పట్ల అసభ్యకర ప్రవర్తన మరియు వేధింపుల ఆరోపణలు వెల్లువెత్తడంతో, ఎమ్మెల్సీ రహమత్ బేగ్‌పై వేటు వేశారు.
మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్  రాజకీయ సన్యాసం స్వీకరించబోతున్నారా? అంటే ఔనన్న సమాధానమే వస్తున్నది.   ప్రత్యర్థులపై విమర్శలతో విరుచుకుపడే అనిల్ కుమార్ యాదవ్, తాజాగా చేసిన వ్యాఖ్యలను బట్టి రాజకీయవర్గాలలో ఆయన పొలిటికల్ రిటైర్మెంట్ ప్రకటించబోతున్నారా అన్న చర్చ జోరందుకుంది.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.