జనాభా ప్రాతిపదికన సీట్ల విభజన.. దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయమేనా..?
Publish Date:Sep 1, 2026
Advertisement
భారత రాజకీయాల్లో ఇప్పుడు పార్లమెంట్ సీట్ల పునర్విభజన (డీలిమిటేషన్), మహిళా రిజర్వేషన్ బిల్లుల చుట్టూ తీవ్రమైన ఉత్కంఠ నెలకొంది. కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలను ప్రొరోగ్ చేయకుండా కొనసాగించడం, రాబోయే రోజుల్లో ఏ విధమైన బిల్లులను ప్రవేశపెడుతుందనే దానిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవైపు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రధానికి లేఖ రాస్తూ, మహిళా రిజర్వేషన్ బిల్లుకు తమ మద్దతు ఉంటుందని, కానీ డీలిమిటేషన్ను రాబోయే 25 ఏళ్ల పాటు వాయిదా వేయాలని డిమాండ్ చేస్తున్నారు. జాతీయ స్థాయిలో ఈ రెండు అంశాలను ముడిపెట్టడం వెనుక ఉన్న రాజకీయ వ్యూహాలు దక్షిణాది రాష్ట్రాలపై దీని ప్రభావం చర్చనీయాంశంగా మారాయి. ఈ అంశంపై టోన్ న్యూస్ ప్రత్యేక చర్చ నిర్వహించారు. రాజ్యాంగ రీత్యా వ్యూహం రాజకీయ పరిణామాలు ప్రస్తుతం పార్లమెంట్ స్థానాల పెంపునకు సంబంధించి జనాభా ప్రాతిపదికన నిర్ణయం తీసుకుంటే, అది ఉత్తరాది రాష్ట్రాలకు తీవ్రమైన ప్రయోజనం చేకూరుస్తుందనే అభిప్రాయం బలపడుతోంది. జనాభా నియంత్రణను సమర్థవంతంగా అమలు చేసిన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు వంటి దక్షిణాది రాష్ట్రాలకు లోక్సభలో ప్రాతినిధ్యం తగ్గే ప్రమాదం ఉందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. సమీకరణాల మార్పు.. కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లుల ద్వారా ఉభయ సభల్లోనూ మెజారిటీ నిరూపించుకునే వ్యూహంతో అడుగులు వేస్తోంది. అయితే, ప్రాంతీయ పార్టీల వైఖరి, ముఖ్యంగా డిఎంకే తృణమూల్ కాంగ్రెస్ మూడ్ మారడం వంటి పరిణామాలు అధికార పక్షానికి సవాలుగా మారాయి. ప్రతిపక్షాల ప్రతివ్యూహం.. మహిళా రిజర్వేషన్ను డీలిమిటేషన్తో ముడిపెట్టడం ఒక విభాజక వ్యూహమని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. మహిళా బిల్లును తక్షణమే అమల్లోకి తెచ్చి, సీట్ల పెంపు ప్రక్రియను సగానికి సగం విభజించేలా (ఉత్తరాది మరియు దక్షిణాదికి సమంగా) మార్పులు చేయాలని కోరుతోంది. రాజకీయ భయాలు & సంకోచాలు.. రాబోయే ఉత్తర ప్రదేశ్, గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు జాతీయ రాజకీయాలపై చూపించే ప్రభావం దృష్ట్యా, మోదీ ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోకుండా అచితూచి అడుగులు వేస్తోంది. ప్రధాని మోదీపై వ్యతిరేక స్వారాలు పెరిగే అవకాశం ఉందన్న అంచనాలు కూడా కేంద్రంలో కొత్త భయాలను సృష్టిస్తున్నాయి. భవిష్యత్ రాజకీయ ప్రభావంరాబోయే రోజుల్లో డీలిమిటేషన్ ప్రక్రియ రాజకీయంగా అత్యంత సున్నితమైన అంశంగా మారనుంది. జనాభా ఆధారిత విభజన అమలైతే, కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులో ఉత్తరాది రాష్ట్రాల ఆధిపత్యం పెరిగి, దక్షిణాది రాష్ట్రాల గొంతు నొక్కబడుతుందనే భావన మరింత బలపడుతుంది. ఇది సమఖ్య వ్యవస్థకే పెద్ద సవాలుగా మారే ప్రమాదం ఉంది.ఈ రాజకీయ సందిగ్ధత మరింత తీవ్రమైతే, జాతీయ స్థాయిలో ప్రతిపక్షాల ఐక్యతకు డీలిమిటేషన్ ప్రధాన అస్త్రంగా మారుతుంది. రాబోయే సార్వత్రిక ఎన్నికల నాటికి దక్షిణాది రాష్ట్రాలు తమ రాజకీయ ప్రాతినిధ్యాన్ని కాపాడుకోవడానికి ఏకతాటిపైకి వస్తే, కేంద్ర ప్రభుత్వానికి చట్టసభల్లో నిర్ణయాలు తీసుకోవడం సంక్లిష్టంగా మారనుంది. Delimitation Commission, South India Lok Sabha Seats, Women Reservation Bill, Mallikarjun Kharge Letter, Narendra Modi, North vs South Politics, Parliament Seats Expansion, Indian Political Analysis, Delimitation Impact Telugu, Indian Federation Issues, Telugu One, Telugu news
http://www.teluguone.com/news/content/delimitation-commission-39-230430.html




