Publish Date:Aug 11, 2022
ఇంట్లో అబ్బాయి పుట్టినా, అమ్మాయి పుట్టినా వెంటనే పంచాంగాలు తిరగేసి మంచిరోజు, నక్షత్రం వేటలో చాలామంది ఆ రోజు మంచిదా కాదా అన్నది ప్రకటిస్తారు. అది వారి నమ్మకం. ఈ రోజుల్లో నమ్మకాలకూ పెద్ద పీట వేస్తుండడమే చిత్రం. కాలం మారింది, కంప్యూటర్లు, మొబైల్ తప్ప లోకంతో ప్రత్యక్షంగా పెద్దగా పనిలేకుండా పోయింది. ఈ రోజుల్లోనూ కొందరు శనివారం పుట్టింది.. మంచిషే నంటావా? అని ఓ పెద్దా యన తన పక్కింటి మరో అడ్డబొట్టు జ్యోతిష్కుడిని వేధించి చంపుతాడు. అయ్యా అంతా బాగు బాగు.. అని తప్పించుకుంటాడు. ఈ చిత్రం ఇప్పటికీ గ్రామాల్లో నిత్యకృత్యం. కాగా ఇపుడు తెలంగాణా ప్రభుత్వం కూడా పాటించడానికి కంకణం కట్టుకుంది. కేంద్రం అజాదీ కా అమృ తోత్సవం సందర్భంగా కేంద్రం ప్రకటించిన కేంద్రానికి ధీటుగా తెలంగాణా ప్రభుత్వం కూడా సరికొత్త వ్యూహం అనుసరించి తెలంగాణా ఆకర్ష్ కి మరింత దన్ను ఇచ్చారు.
ఆగష్టు 15న జన్మించిన పిల్లలకు వారికి 12 ఏళ్లు వచ్చేవరకూ బస్సు ప్రయాణం ఉచితమని ప్రకటిం చారు. అందులో ఉచితం ఏమిటో ఎవరికీ అర్ధం కావడంలేదు. ఎలాగూ ఐదేళ్ల దాకా అమ్మతోనో, అమ్మ మ్మతోనో ప్రయాణిస్తారు. కిటికీదగ్గర కూచుంటే ఆనంద కేరింతల్లో ప్రయాణీకులను ఎంతో ఆకట్టుకుం టారు. అదో సరదా!
స్వాతంత్య్ర వజ్రోత్సవాల సందర్భంగా , 75 ఏళ్లు పైబడిన వృద్ధులు ఈ నెల 21 వరకు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చన్నారు. ఆర్టీసీ ప్రయాణికులకు పలు రాయితీలను ప్రకటించింది. సంస్థ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ బుధవారం ప్రకటించారు. 75 ఏళ్లు పై బడినవారికి ఆర్టీసీ తార్నాక దవాఖానలో ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి 75ు రాయితీపై మందులు అందించను న్నట్లు తెలిపారు.
ట్రావెల్ యాజ్ యూ లైక్(టీఏవైఎల్) టికెట్ చార్జీలను రూ.120 నుంచి రూ.75కు తగ్గించినట్లు పేర్కొన్నా రు. కేజీ లోపు కార్గో పార్సిళ్లపై ఆగస్టు 15న 75 కిలోమీటర్ల వరకు ఎలాంటి చార్జీ ఉండదని గోవర్ధన్ తెలి పా రు. ప్రతి రోజూ దూర ప్రాంతాలకు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే 75 మందిని గుర్తించి తర్వాత ట్రిప్‌కి ఫ్రీ టిక్కెట్ అందించనున్నట్లు ఆయన ప్రకటించారు. పుష్పక్ ఎయిర్‌పోర్టు సర్వీస్ బస్సుల్లో 75ు చార్జీతోనే ప్రయాణి కులను గమ్యస్థానాలకు చేర్చనున్నట్లు తెలిపారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/bus-journey-free-to-august-15-born--39-141744.html
తాడికొండ నియోజకవర్గంలో వైసీపీ తరఫున తాను పోటీ చేయడానికి దారితీసిన పరిస్థితులను గుర్తు చేసుకున్న ఉండవల్లి శ్రీదేవిరాజధాని ప్రాంత సీటును దక్కించుకుని, భారీ మెజారిటీతో విజయం సాధించానని చెప్పారు.
నిజాయితీగా పార్టీ కోసం జెండా పట్టి రోడ్లెక్కిన కార్యకర్త ఒకసారి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన తర్వాత ఏ అగ్రనేత కూడా వారిని కాపాడటానికి రావడం లేదని శ్రీధర్ చెప్పారు. నాయకులు కేవలం ఫోటోలకు ఫొటోలు దిగడానికి, మీడియాలో కనిపించడానికే ప్రాధాన్యత ఇస్తారు తప్ప, లోయర్ లేదా మిడిల్ క్లాస్ కార్యకర్త ఆసుపత్రి బిల్లు ఎంత అయింది? కోర్టు ఖర్చులు ఎలా కడుతున్నాడు? అని మానవత్వంతో ఆలోచించే పరిస్థితుల్లో నేటి నాయకత్వాలు లేవని చెప్పారు.
ఈ నేపథ్యంలో ప్రస్తుత చట్టపరమైన పరిణామాలు, ఉపా చట్టం తీవ్రత, రావణ్‌కు కోర్టుల్లో ఎదురుకాబోయే సవాళ్లపై మాజీ న్యాయమూర్తి రామకృష్ణ తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సంచలన విశ్లేషణ చేశారు.
ఆ ఎన్నికలలో జనసురాజ్ పార్టీ ఒక్కటంటే ఒక్క స్థానంలో విజయం సాధించలేదు సరికదా.. ఆ పార్టీ అభ్యర్థులెవరికీ కనీసం డిపాజిట్లు కూడా దక్కలేదు. తెరవెనుక ఉండి ఎందరో దిగ్గజాలను సీఎం గద్దెపై కూర్చోబెట్టిన పీకే.. రాజకీయ వ్యూహాలు తన సొంత పార్టీకి ఇసుమంతైనా ఉపయోగపడలేదు. దీంతో ఇక లాభం లేదనుకుని తానే స్వయంగా ఎన్నికల బరిలో నిలబడి సత్తా చాటాలని నిర్ణయించుకున్నారు.
కోల్‌కతాలోని కాళీఘాట్‌లోని మమతా బెనర్జీ అధికారిక నివాసం వద్ద భారీగా పోలీసులు, కేంద్ర బలగాలను మోహరించడం ఈ ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తోంది. మమత నివాసానికి వెళ్లే అన్ని ప్రధాన మార్గాలను పోలీసులు తమ అధీనంలోకి తీసుకుని, భారీ పోలీసు వాహనాలతో పూర్తిగా దిగ్బంధించారు.
అనంతపురం జిల్లాకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది.
సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న ఆమంచి కృష్ణమోహన్.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి విజయం సాధించారు. ఈ తరువాత ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. అయితే.. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని వీడి, వైసీపీ పంచన చేరారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రజా జీవితంలో అరుదైన మైలురాయిని చేరుకున్నారు.
ఈసీ ఆదేశాల మేరకు
కవిత తన టీఆర్ఎస్ పార్టీ పేరుకు ప్రత్యామ్నాయంగా మూడు పేర్లను ఈసీకి పక్షం రోజుల్లోగా సమర్పించాల్సి ఉంటుంది. నిర్దేశిత గడువులోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను సూచించకుంటే దరఖాస్తున్న మూసేస్తామని హెచ్చరించింది. అంతే కాకుండా టీఆర్ఎస్ పేరును కొనసాగించేందుకు అనుమతి ఉండదని విస్పష్టంగా పేర్కొంది.
ఆ పార్టీ ప్రధాన ఆరోపణ ఏంటంటే.. క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ అనుకూల సిబ్బందితో అర్హులైన వైసీపీ మద్దతుదారుల ఓట్లను ఉద్దేశపూర్వకంగా తొలగించేందుకు కుట్ర జరుగుతోందని. గతంలో అంటే.. 2014 నుండి 2019 మధ్య కాలంలో కూడా ఇలాగే పెద్ద ఎత్తున దొంగ ఓట్లను చేర్చారని, ఇప్పుడు తమ పార్టీకి అండగా నిలిచే ఓటర్లను లక్ష్యంగా చేసుకుని జాబితా నుండి తొలగిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తున్నది.
పైకి వైసీపీతోనూ, జగన్ కోటరీతోనూ విసిగిపోయానని, అందుకే బయటకు వచ్చేశాననీ విజయసాయి చెబుతున్నా.. ఆయన మాటలూ చేతలూ అన్ని జగన్ కు ప్రయోజనం చేకూర్చడానికే అన్నట్లుగా ఉంటాయి. ఉంటున్నాయి.
విశాఖపట్నం పరిపాలన రాజధాని అన్న జగన్ విధానాన్ని ధర్మాన బలంగా ప్రజలలోకి తీసుకువెళ్లడానికి శతధా ప్రయత్నించారు. ఉత్తరాంధ్ర సెంటిమెంట్‌ను రగిలిస్తూ, గ్రామగ్రామాన సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి ప్రచారం చేశారు. అదేమీ ఫలించలేదని 2024 ఎన్నికల ఫలితాలు తేల్చేశాయి.
వైసీపీ కోసం ఎంతగానో పరితపించిన ముద్రగడ.. కాపు రిజర్వేషన్ కోసం, కాపుల కోసం పోరాటం చేసి సంపాదించుకున్న ప్రాముఖ్యతనూ, ప్రతిష్టనూ..జగన్ కోసం ఔను కేవలం జగన్ కోసం వదులుకున్నారు. అటువంటి ముద్రగడ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ వెంటిలేటర్ పై చికిత్స పొందుతుంటే…జగన్ ఆయనను కనీసం పరామర్శించను కూడా పరామర్శించలేదు.