Publish Date:Sep 29, 2025
బల్క్ డ్రగ్ పరిశ్రమ పనులు తాత్కాలికంగా నిలిపివేయాలని హోం మంత్రి అనిత ఆదేశించారు. 16 రోజులుగా మత్స్యకారులు పరిశ్రమ ఏర్పాటు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో అనకాపల్లి వచ్చిన హోం మంత్రి అనిత కాన్వాయ్‌ను మత్స్యకారులు అడ్డుకుని పరిశ్రమ పనులు ఆపేయాలని ఆందోళనలు చేయటంతో పార్క్ పనులు తాత్కాలికంగా నిలిపివేయాలని మంత్రి ఆదేశించారు. సమస్యను సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు.
అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజ్యపేటలో బల్క్ డ్రగ్ పరిశ్రమ నిర్మాణానికి ప్రభుత్వం ఇచ్చిన అనుమతులు తక్షణమే రద్దు చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. గత కొన్ని రోజులుగా నిరసనలో సేపడుతున్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోకపోవడం హాస్యాస్పదమని అన్నారు. ప్రమాదకర అతి కాలుష్యకరమైన బల్క్ డ్రగ్ పరిశ్రమ వల్ల మత్స్య సంపద హాని కలుగుతుందని, పరిశ్రమ వ్యర్ధాలు వల్ల మత్స్య సంపద నాశనం అయిపోద్దని, గాలి,నీళ్లు, సహజ సంపద కలుషితం అవుతుందని అన్నారు. పరిశ్రమ నిర్మాణాన్ని అనుమతులు రద్దు చేసే వరకు పోరాటం ఆగదని కూటమి ప్రభుత్వాన్ని వారు హెచ్చరించారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/bulk-drug-industry-36-207109.html
ఇరాన్ మాజీ అత్యున్నత నాయకుడు (సుప్రీం లీడర్) అయతొల్లా అలీ ఖమేనీ అంత్యక్రియల క్రతువుకు సంబంధించి అంతర్జాతీయంగా కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
సోషల్ మీడియా దిగ్గజం మెటా యాజమాన్యంలోని ప్రముఖ ప్లాట్‌ఫారమ్ ఇన్‌స్టాగ్రామ్‌పై భారత ప్రభుత్వం అత్యంత తీవ్రమైన చర్యకు ఉపక్రమించింది.
రాష్ట్ర పోలీసు శాఖ పని తీరును మరింత ప్రజలకు చేరువ చేసే దిశగా డీజీపీ ఆనంద్ కీలక ఆదేశాలు జారీ చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రాజధాని అంశం మరోసారి తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
పారిశ్రామికాభివృద్ధి, ఉపాధి కల్పన, స్థానిక ఆర్థిక వ్యవస్థ బలోపేతం లక్ష్యంగా కుప్పం నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన పలు అభివృద్ధి కార్యక్రమాల
ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ జరిగి దశాబ్ద కాలం దాటినా, రాష్ట్రానికి ఒక శాశ్వతమైన, తిరుగులేని రాజధానిని నిర్మించుకోలేకపోవడం తెలుగు జాతి దురదృష్టం.
ఆంధ్రప్రదేశ్‌లోని మామిడి సాగుదారులకు కేంద్ర ప్రభుత్వం ఒక తీపి కబురు అందించింది.
కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనానంతరం భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో స్వీకరించే శ్రీవారి లడ్డూ ప్రసాదం విక్రయాలు ఈ ఏడాది జూన్ నెలలో రికార్డు స్థాయికి చేరుకున్నాయి.
ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ రాజకీయ దుమారం రేపుతోంది.
శ్రీ వకుళామాత సన్నిధిలో శాస్త్రోక్తంగా ప్రారంభమైన ‘అక్షర గోవిందం – అన్నప్రాశనం’..
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫాల్కన్ పోంజీ స్కామ్ కేసులో ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మరో కీలక ముందడుగు వేసింది.
దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన మేఘాలయ హనీమూన్ హత్య కేసులో ప్రధాన నిందితురాలు సోనమ్ రఘువంశీకి దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది.
లింగంపల్లి పసికందు కిడ్నాప్ కేసును చందానగర్ పోలీసులు ఛేదించారు.