కుప్పం ఇక ఇండస్ట్రియల్ హబ్..చంద్రబాబు విజన్‌కు మరో అడుగు..!

Publish Date:Jul 3, 2026

Advertisement

 

పారిశ్రామికాభివృద్ధి, ఉపాధి కల్పన, స్థానిక ఆర్థిక వ్యవస్థ బలోపేతం లక్ష్యంగా కుప్పం నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన పలు అభివృద్ధి కార్యక్రమాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుక్రవారం ప్రారంభించారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా జమ్మలమడుగులో స్టీల్ ప్లాంట్ పనులకు శ్రీకారం చుట్టిన అనంతరం ఆయన నేరుగా కుప్పం చేరుకుని గుడుపల్లె మండలం పొగురుపల్లెలో అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

రూ.200 కోట్ల పెట్టుబడితో నిర్మించిన ఏబీఐఎస్ ప్రోటీన్స్ ప్రైవేట్ లిమిటెడ్ గ్రీన్‌ఫీల్డ్ చికెన్ ప్రాసెసింగ్ యూనిట్‌తో పాటు APIIC ఆధ్వర్యంలో అభివృద్ధి చేసిన ఎంఎస్‌ఎంఈ పార్క్‌ను ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ రెండు ప్రాజెక్టులు స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే కాకుండా రైతులకు స్థిరమైన మార్కెట్‌ను అందించనున్నాయి.

30.75 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన ఏబీఐఎస్ ప్రోటీన్స్ యూనిట్‌ను సందర్శించిన సీఎం ప్లాంట్ కార్యకలాపాలను పరిశీలించారు. వివిధ విభాగాల పనితీరును సంస్థ ప్రతినిధులు ఆయనకు వివరించారు. సంస్థ నిర్వహించిన జాబ్ ఫెయిర్‌లో ఎంపికైన యువతకు ముఖ్యమంత్రి నియామక పత్రాలు అందజేశారు. ఈ నెల నుంచే వాణిజ్య ఉత్పత్తి ప్రారంభం కానున్న ఈ యూనిట్ ద్వారా మొత్తం 1,400 మందికి ఉపాధి లభించనుండగా, అందులో 700 ప్రత్యక్ష, 700 పరోక్ష ఉద్యోగాలు ఉన్నాయి. తొలి దశలోనే 300 నుంచి 400 మంది యువతకు ఆఫర్ లెటర్లు అందజేశారు.

ఈ పరిశ్రమ ద్వారా స్థానిక పౌల్ట్రీ రైతులకు గిట్టుబాటు ధరలతో మార్కెట్ లభించడంతో పాటు ఒప్పంద పద్ధతిలో కోళ్ల పెంపకానికి అవకాశాలు విస్తరించనున్నాయి. ఫీడ్ సరఫరా, రవాణా, అనుబంధ రంగాలకు కూడా ఈ యూనిట్ ఊతమివ్వనుంది.

అనంతరం 44.58 ఎకరాల విస్తీర్ణంలో అభివృద్ధి చేసిన APIIC ఎంఎస్‌ఎంఈ పార్క్‌ను సీఎం ప్రారంభించారు. ఈ పార్కులో ఏర్పాటు చేసిన 167 పారిశ్రామిక ప్లాట్ల కేటాయింపు ప్రక్రియను జూలై నెల నుంచే ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన మౌలిక వసతులు ఒకేచోట అందుబాటులో ఉండటం వల్ల కొత్త పెట్టుబడులు ఆకర్షితమై, స్థానిక యువతకు మరిన్ని ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. కుప్పాన్ని పారిశ్రామిక హబ్‌గా తీర్చిదిద్దడంలో ఈ పార్క్ కీలక పాత్ర పోషించనుంది.

ఇక 7,489 మంది ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు లబ్ధి చేకూర్చేలా రూ.28 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన రూఫ్‌టాప్ సోలార్ ప్రాజెక్టును కూడా ముఖ్యమంత్రి ప్రారంభించారు. అదేవిధంగా కనమానపల్లి, గంగాపురం, టీ సముద్రం, కృష్ణానగర్, బళ్ల గ్రామాల్లో రూ.25 కోట్లతో నిర్మించిన రెస్కో సంస్థకు చెందిన ఐదు సబ్‌స్టేషన్లను ప్రజలకు అంకితం చేశారు. కుప్పం చేరుకున్న ముఖ్యమంత్రికి ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు, ప్రజలు ఘన స్వాగతం పలికారు. పొగురుపల్లెకు వెళ్తున్న మార్గమంతా గ్రామస్తులు హర్షధ్వానాలతో స్వాగతించారు.

ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ, “కుప్పం నియోజకవర్గ చరిత్రలో ఇవాళ ప్రత్యేకమైన రోజు. ఏబీఐఎస్ ప్రోటీన్స్ సంస్థ ఇప్పటికే వందలాది మందికి ఉపాధి కల్పించింది. అత్యాధునిక సాంకేతికతతో దేశంలోనే అతిపెద్ద చికెన్ ప్రాసెసింగ్ యూనిట్లలో ఒకటిని ఏర్పాటు చేయడం సంతోషకరం. దీనివల్ల స్థానిక రైతులకు, కోళ్ల పెంపకందారులకు, యువతకు ప్రయోజనం చేకూరుతుంది. తక్కువ సమయంలో ఈ ప్రాజెక్టును పూర్తి చేసిన సంస్థ యాజమాన్యాన్ని అభినందిస్తున్నాను” అని అన్నారు.

“కుప్పానికి రైలు, రోడ్డు, విమాన అనుసంధానాన్ని మరింత బలోపేతం చేస్తున్నాం. ప్రజల జీవన ప్రమాణాలు పెంచేందుకు పరిశ్రమలను తీసుకొస్తున్నాం. అయితే వస్తున్న పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా నైపుణ్యాలు కలిగిన వర్క్‌ఫోర్స్ కూడా సిద్ధం కావాలి. స్కిల్ డెవలప్‌మెంట్‌పై ప్రత్యేక దృష్టి పెట్టాలి. పరిశ్రమలు తీసుకురావడం నా బాధ్యత అయితే, వాటిని సద్వినియోగం చేసుకుని అభివృద్ధి సాధించడం ప్రజల బాధ్యత” అని సీఎం పేర్కొన్నారు.

“పరిశ్రమలు, సేవారంగం, వ్యవసాయ రంగాల అభివృద్ధితో కుప్పాన్ని సమగ్ర అభివృద్ధి దిశగా తీసుకెళ్తున్నాం. యువత ఉద్యోగాల కోసం ఎదురుచూడకుండా ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగాలి. నైపుణ్యాలను పెంపొందించుకుని వినూత్న ఆలోచనలతో ముందుకు సాగితే అపార అవకాశాలు సృష్టించుకోవచ్చు” అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, అధికారులు, పారిశ్రామికవేత్తలు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

By
en-us Political News

  
సోషల్ మీడియాలో ఓ మహిళా ప్రజాప్రతినిధిని ఉద్దేశించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన ఆర్మ్డ్ రిజర్వ్ పోలీస్ కానిస్టేబుల్‌పై సైబరాబాద్ సీపీ డా. ఎం. రమేష్ సస్పెన్షన్ వేటు వేశారు.
కృష్ణాష్టమి 2026 సందర్భంగా భారతదేశంలో తప్పక సందర్శించాల్సిన మథుర, బృందావనం, ద్వారక, గురువాయూర్ మరియు పూరీ జగన్నాథ ఆలయాల విశేషాలు మరియు ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను ఇక్కడ తెలుసుకోండి.
తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు 2026 అక్టోబర్ 12 నుండి 21 వరకు జరగనున్నాయి. గరుడ సేవ, రథోత్సవం, చక్రస్నానం మరియు వాహన సేవల సంపూర్ణ షెడ్యూల్ ఇక్కడ తెలుసుకోండి.
అయోధ్య శ్రీ రామ్ జన్మభూమి మందిర్ సీఈఓ ఎంపిక కోసం ప్రతిపాదించిన ముగ్గురి పేర్ల జాబితాను కమిటీ ఈరోజు ట్రస్ట్‌కు సమర్పించనుంది. తిరుమల తరహాలో ఆలయ నిర్వహణ కోసం తీసుకున్న ఈ కీలక నిర్ణయ వివరాలు ఇక్కడ చదవండి.
పాకిస్థాన్‌లోని నారోవాల్‌లో 125 ఏళ్ల నాటి చారిత్రక హిందూ దేవాలయాన్ని రాత్రికి రాత్రే కూల్చివేశారు. ఈ ఘోరంపై స్థానిక హిందూ సంఘాల ఆగ్రహం, ఆందోళనల వివరాలు ఇక్కడ చదవండి.
టీటీడీ వేదపారాయణదారుల ఎంపిక ప్రక్రియ తీవ్ర వివాదాస్పదంగా మారింది. తెలంగాణ అభ్యర్థులకు స్థానికత అడ్డంకిగా మారడం, అర్హత మార్కులను 85 నుండి 40కి తగ్గించడంపై వేదపండితులు ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఈ నియామకాల వెనుక ఉన్న పూర్తి వివరాలు, వివాద కారణాలు ఇక్కడ చూడండి.
2026 ఆగస్టు 29 రాశి ఫలాలు, టారో కార్డుల విశ్లేషణ మరియు వాస్తు చిట్కాలు ఇక్కడ తెలుసుకోండి. మేషం నుండి మీనం వరకు ద్వాదశ రాశుల ఉద్యోగం, ఆరోగ్యం, ఆర్థిక పరిస్థితి మరియు సరైన వాస్తు నివారణల సమగ్ర వివరాలు!
పశ్చిమ బెంగాల్ దుర్గాపూజ పండళ్ల లోపల మాంసాహారం నిషేధించాలని విశ్వహిందూ పరిషత్ డిమాండ్ చేసింది. 5 రోజుల ఉత్సవాల్లో సనాతన సంప్రదాయాలు పాటించాలని 600 పూజా కమిటీలకు వీహెచ్‌పీ చేసిన ప్రతిపాదనల వివరాలు.
రక్షాబంధన్ రోజున రాఖీ దారం తెగిపోవడం అశుభమా కాదా అనే సందేహాలకు వేద పండితుల సమాధానం తెలుసుకోండి. తెగిపోయిన రాఖీ వల్ల కలిగే ప్రయోజనాలు, పాటించాల్సిన నియమాలు మరియు 2026 రాఖీ శుభ ముహూర్తాల వివరాలు.
తిరుమలలో పౌర్ణమి మరియు గరుడ సేవ సందర్భంగా భక్తులు పోటెత్తారు. శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతుండగా, ఒక్కరోజే 66,437 మంది దర్శించుకోగా రూ. 4.45 కోట్ల హుండీ ఆదాయం లభించింది.
తిరుపతి ఫారెస్ట్ డివిజన్ అధికారులు అత్యంత అరుదైన 3 రోజ్-రింగ్డ్ ప్యారాకీట్స్ (రామచిలుకలను) సమర్థవంతంగా రక్షించారు. ప్రాథమిక చికిత్స అనంతరం వాటిని తిరిగి అడవిలోకి విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పూర్తి వివరాలు చదవండి.
శ్రావణ పౌర్ణమి నాడు జరుపుకునే హయగ్రీవ జయంతి విశిష్టత, శ్రీమహావిష్ణువు హయగ్రీవ అవతారం ఎత్తడానికి గల ఆధ్యాత్మిక కథ మరియు విద్యార్థులకు జ్ఞానాన్ని ప్రసాదించే హయగ్రీవ పూజా విధానం గురించి వివరంగా తెలుసుకోండి.
చంద్ర గ్రహణ సమయంలో ఆధ్యాత్మిక రక్షణ మరియు మానసిక ప్రశాంతత పొందేందుకు పాటించాల్సిన సూతక కాల నియమాలు, మంత్ర జపం, గర్భవతుల జాగ్రత్తలు మరియు గ్రహణానంతర శుద్ధి, దానాల విశిష్టతలను వివరంగా తెలుసుకోండి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.