Publish Date:Sep 29, 2025
తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరో రోజైన సోమవారం శ్రీవారు బంగారు తేరులో విహరిస్తూ, భక్తుల్ని తన కృపాకటాక్షాలతో అనుగ్రహించారు. దాసభక్తుల నృత్యాలతోను, భజనబృందాల కోలాహలం, మంగళ వాయిద్యాల నడుమ తిరు మాడవీధులలో కడురమణీయంగా స్వర్ణరథోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని శ్రీవారి స్వర్ణ రథాన్ని లాగారు.
స్వర్ణరథోత్సవాన్ని దర్శించడంవల్ల- లక్ష్మీదేవి కరుణతో సంపదలు, భోగభాగ్యాలూ; భూదేవి కరుణతో, సమస్తధాన్యాలూ, శ్రీవారికరుణతో సర్వశుభాలూ, సుఖాలూ చేకూరుతాయని భక్తుల విశ్వాసం.
స్వర్ణ రథోత్సవంలో టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్, జేఈవో వీరబ్రహ్మం, సీవీఎస్వో మురళీకృష్ణ, సీఈ సత్యనారాయణ, ఇతర అధికారులు పాల్గొన్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/-tirumala-36-207113.html
ఇరాన్ మాజీ అత్యున్నత నాయకుడు (సుప్రీం లీడర్) అయతొల్లా అలీ ఖమేనీ అంత్యక్రియల క్రతువుకు సంబంధించి అంతర్జాతీయంగా కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
సోషల్ మీడియా దిగ్గజం మెటా యాజమాన్యంలోని ప్రముఖ ప్లాట్‌ఫారమ్ ఇన్‌స్టాగ్రామ్‌పై భారత ప్రభుత్వం అత్యంత తీవ్రమైన చర్యకు ఉపక్రమించింది.
రాష్ట్ర పోలీసు శాఖ పని తీరును మరింత ప్రజలకు చేరువ చేసే దిశగా డీజీపీ ఆనంద్ కీలక ఆదేశాలు జారీ చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రాజధాని అంశం మరోసారి తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
పారిశ్రామికాభివృద్ధి, ఉపాధి కల్పన, స్థానిక ఆర్థిక వ్యవస్థ బలోపేతం లక్ష్యంగా కుప్పం నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన పలు అభివృద్ధి కార్యక్రమాల
ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ జరిగి దశాబ్ద కాలం దాటినా, రాష్ట్రానికి ఒక శాశ్వతమైన, తిరుగులేని రాజధానిని నిర్మించుకోలేకపోవడం తెలుగు జాతి దురదృష్టం.
ఆంధ్రప్రదేశ్‌లోని మామిడి సాగుదారులకు కేంద్ర ప్రభుత్వం ఒక తీపి కబురు అందించింది.
కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనానంతరం భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో స్వీకరించే శ్రీవారి లడ్డూ ప్రసాదం విక్రయాలు ఈ ఏడాది జూన్ నెలలో రికార్డు స్థాయికి చేరుకున్నాయి.
ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ రాజకీయ దుమారం రేపుతోంది.
శ్రీ వకుళామాత సన్నిధిలో శాస్త్రోక్తంగా ప్రారంభమైన ‘అక్షర గోవిందం – అన్నప్రాశనం’..
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫాల్కన్ పోంజీ స్కామ్ కేసులో ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మరో కీలక ముందడుగు వేసింది.
దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన మేఘాలయ హనీమూన్ హత్య కేసులో ప్రధాన నిందితురాలు సోనమ్ రఘువంశీకి దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది.
లింగంపల్లి పసికందు కిడ్నాప్ కేసును చందానగర్ పోలీసులు ఛేదించారు.