తెలుగు రాష్ట్రాలకు కేంద్రం మొండిచేయి.. ఆఖరికి దక్కింది ఇవి..
Publish Date:Feb 25, 2016
Advertisement
రైల్వే మంత్రి సురేశ్ ప్రభు రైల్వే బడ్జెట్ ప్రవేశ పెట్టారు. అయితే ఈసారి కూడా కేంద్రం రెండు తెలుగు రాష్ట్రాలకు నిరాశే మిగిల్చినట్టు కనిపిస్తోంది. ఎన్నో ఆశలతో ఎదురు చూసిన ప్రజలకు కేంద్రం మొండిచేయి చూపించింది. రైళ్లలో ప్రజలకు కావాల్సిన సౌకర్యాల గురించి పెద్ద ఎత్తునే ప్రణాళికలు సిద్దం చేసినా.. కొత్తం రైళ్ల గురించి కాని.. కొత్త రైల్వే లైన్ల గురించి.. పాత ప్రాజెక్టులకు నిధుల మంజూరు వంటికేంద్రం మచ్చుకైనా ప్రస్తావించలేదు. అంతేకాదు ఈసారి టెక్నాలజీకి పెద్దపీట వేసినట్టు తెలుస్తోంది. విభజన నేపథ్యంలో కేంద్రం ఇచ్చిన హామీని కూడా మరిచిపోయింది. ఈ బడ్జెట్ లోనూ విశాఖ రైల్వే జోన్ ను కేంద్రం పట్టించుకోలేదు. యాదాద్రి వరకూ ఎంఎంటీఎస్ పొడిగింపునకూ.. కాజీపేటలో రైల్వే కోచ్ల విషయంలోనూ కేంద్రం మొండిచేయి చూపించినట్టు తెలుస్తోంది. ఇకపోతే ఏపీ తెలంగాణలకు దక్కింది ఇవే.. * విజయవాడ - ఖరగ్‌పూర్ మధ్య సరకు రవాణా మార్గం
* నాగపూర్-విజయవాడ ట్రేడ్ కారిడార్ -
* ఆధ్యాత్మిక స్టేషన్ల అభివృద్ధి, సుందరీకరణకు కొత్త పథకం. ఈ పథకంలో మొదటి దశలోనే తిరుపతికి చోటు.
* తెలంగాణ ప్రభుత్వం సహకారంతో హైదరాబాద్ సబర్బన్ నెట్ వర్క్ విస్తృతికి చర్యలు వంటివి బడ్జెట్‌లో కనిపించాయి.
* రెండు తెలుగు రాష్ట్రాల్లో పలు రైల్వే లైన్ల నిర్మాణానికి నిధులు కేటాయించారు.
* కోటిపల్లి - నర్సాపురం లైనుకు రూ.200 కోట్ల నిధులు.
* పిఠాపురం - కాకినాడ లైనుకు రూ.50 కోట్లు కేటాయింపు.
* కాజీపేట - విజయవాడ మూడో లైనుకు రూ.114 కోట్లు.
* పెద్దపల్లి - నిజామాబాద్ లైన్‌కు రూ.70 కోట్లు.
* మాచర్ల - నల్గొండ లైన్‌కు రూ.20 కోట్లు.
* మునిరాబాద్ - మహబూబ్ నగర్ లైన్‌కు రూ.180 కోట్లు.
* కాజీపేట - వరంగల్ మధ్య ఆర్వోబి నిర్మాణానికి రూ.5 కోట్లు.
* సికింద్రాబాద్ - మహబూబ్ నగర్ మధ్య డబ్లింగ్ పనులకు రూ.80 కోట్లు.
* పెద్దపల్లి - జగిత్యాల మధ్య సబ్ వే నిర్మాణానికి రూ.5 కోట్లు
* రాఘవాపురం - మందమర్రి లైన్‌కు రూ.15 కోట్లు
http://www.teluguone.com/news/content/budget-sessions-2016-45-56137.html





