అవినాష్ రెడ్డి అంత క్రిమినల్ బుర్ర నాకు లేదు : బీటెక్ రవి
Publish Date:Jan 6, 2026
Advertisement
వివేకా హత్యను గుండెపోటు, బ్లడ్ వాంతులుగా చిత్రీకరించి సాక్ష్యాలను మాయం చేయడంలో ఎంపీ అవినాష్ రెడ్డి చూపించిన తెలివి సామాన్యమైనది కాదని, అంత క్రిమినల్ బుర్ర తనకు లేదని పులివెందుల టీడీపీ ఇన్‌చార్జి బీటెక్ రవి విమర్శించారు. మంగళవారం కడపలోని టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో బీటెక్ రవి హాట్ కామెంట్స్ చేశారు. తాను ఒక్క రూపాయి కూడా అవినీతి చేశానని నిరూపిస్తే రాజకీయాల నుంచే తప్పుకుంటానని సవాల్ విసిరారు. వైఎస్ వివేకాని మీరే హత్య చేసి మాపై నిందలు వేయాలనుకోవడంలో అవినాష్ రెడ్డికి ఉన్నంత తెలివి తమకు లేదన్నారు. సీబీఐ అధికారులు అరెస్ట్ చేసేందుకు వస్తే తల్లిని అడ్డుపెట్టుకుని ఆస్పత్రిలో నాటకాలు ఆడిన స్థాయి బుద్ధి తమకు లేదని ఎద్దేవా చేశారు.తాను ఏదో మాట్లాడితే సంబంధం లేని విషయాలు అవినాష్ రెడ్డి మాట్లాడుతున్నారని విమర్శించారు. హౌసింగ్ విషయంలో తనకు బుర్ర ఉందా లేదా అని ప్రశ్నిస్తున్న అవినాష్ రెడ్డి, నిజంగా బుర్ర ఉంటే మాట్లాడుతున్నాడా అని కౌంటర్ ఇచ్చారు. పులివెందుల హౌసింగ్ ప్రాజెక్టుల్లో 10 శాతం అదనంగా డబ్బులు డ్రా చేశామని వాళ్లే ఒప్పుకున్నారని పేర్కొన్నారు. హౌసింగ్ లబ్ధిదారులు కట్టిన డబ్బులు ఎవరు తిరిగి ఇస్తారు? తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి ఇస్తాడా లేక అవినాష్ రెడ్డే ఇస్తాడా అని ప్రశ్నించారు.ప్రభుత్వ నిబంధనల ప్రకారమే ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయని, మట్కా విషయంలో మీ పాలనలో పులివెందుల రెండో తాడిపత్రిగా మారిందన్నది నిజం కాదా అని నిలదీశారు.అవినాష్ రెడ్డి వాస్తవాలు తెలుసుకొని మాట్లాడితే మంచిదని బీటెక్ రవి సూచించారు.
http://www.teluguone.com/news/content/btech-ravi-36-212121.html





