త్వరలో కవిత కొత్త పార్టీ ! తండ్రికి లేఖ వెనుక ఎత్తుగడ ఇదే !

Publish Date:May 23, 2025

Advertisement

 

క‌ల్వకుంట్ల క‌విత త‌న తండ్రిని  విబేధిస్తూ రాసిన లేఖ ఒక చిన్న లీడ్ మాత్ర‌మేన‌ట‌. వ‌చ్చే రోజుల్లో క‌విత నుంచి భారీ బ్లాస్టింగ్ ఉన్న‌ట్టు తెలుస్తోంది. కార‌ణం క‌విత పార్టీ బ‌య‌ట‌కొచ్చి కొత్త పార్టీ పెట్టేలా ఎత్తుగ‌డ వేస్తున్న‌ట్టు సమాచారం. ఇదంతా జ‌రిగే ప‌నేనా? అందుకా అవ‌కాశాలున్నాయా? అని ఆలోచిస్తే.. ఇదంతా నేరుగా కేసీఆర్ నుంచే వ‌చ్చిన ప్ర‌తిపాద‌న‌గా తెలుస్తోంది. గులాబీ బాస్ త‌న ఫ‌స్ట్ ప్ర‌యారిటీ అల్లుడు హ‌రీష్ రావ్ కి ఇస్తే ఆయ‌న స‌సేమిరా అన్నాడని స‌మాచారం. మామ‌కు ద్రోహం చేసిన రెండో చంద్ర‌బాబును అవుతాను. అది నాకిష్టం లేదు. ఆ ముద్ర నేను వేయించుకోలేన‌ని డైరెక్టుగా విలేఖ‌రులు అడిగిన ప్ర‌శ్న‌కు హ‌రీష్ రావు చెప్ప‌డం కూడా అంతే వాస్త‌వం. ఒక వేళ అలా జ‌రిగినా కూడా తాను త‌న మామ కేసీఆర్ బ‌తికుండ‌గా పార్టీని వీడే ప్ర‌స‌క్తే లేద‌ని తెగేసి చెప్పిన‌ట్టు తెలుస్తోంది. క‌ట్ చేస్తే పార్టీలో ప్ర‌స్తుతం కేసీఆర్ త‌ర్వాత అంత‌టి సుప్రిమో కేటీఆరే. త‌ర్వాత హిమాన్షు ప‌రం అవుతుందేమోగానీ మ‌రెవ‌రికీ ఇందులో భాగ‌స్వామ్యం లేదు. 

ఇక్క‌డ కేసీఆర్ అస‌లు ప్లానేంటంటే డీఎంకే, అన్నాడీఎంకేలాగా.. పార్టీ చీలినా పెద్ద స‌మ‌స్య‌లేద‌ని.. అధికారం మాత్రం మ‌న ఇంట్లోనే ఉండాల‌న్న‌ది చంద్ర‌శేఖ‌ర‌రావు అస‌లు ఎత్తుగ‌డ‌గా తెలుస్తోంది. అలా తొలుత హ‌రీష్ రావును ఆ దిశ‌గా ప్ర‌యోగించాల‌ని ప్ర‌య‌త్నిస్తే అది ఆదిలోనే హంస‌పాదులా మారిందట‌. అప్ప‌ట్లో అమిత్ షా కూడా హ‌రీష్ రావును గ‌ట్టిగానే ట్రై చేసిన‌ట్టు స‌మాచారం. హ‌రీష్ బీజేపీలోకి వెళ్తారేమోన‌ని కేసీఆర్ కూడా బాగానే ఎదురు చూశార‌ట‌. అలాగైనా మ‌న‌లో ఒక‌డు ఇత‌ర పార్టీలోకెళ్లి అక్క‌డి నుంచి అధికారంలో ఉండ‌టం కూడా క‌లిసొచ్చే అంశ‌మే అన్న‌ది కేసీఆర్ అస‌లు వ్యూహ‌మ‌ట‌. ఇప్పుడు.. చూడండీ ఎక్క‌డి నుంచో పొడుచుకొచ్చిన రేవంత్ సీఎం అయి కూర్చుని కాళేశ్వ‌రం గుంత‌లు మొత్తం త‌వ్వుతున్నాడు. ఏమో కాంగ్రెస్ వాళ్లే కాళేశ్వ‌రాన్ని పేల్చేశారేమో అని కేటీఆర్ ఎంత బ‌నాయిస్తున్న.. వ‌ర్క‌వుట్ కావ‌డం లేదు. రేవంత్ అయితే సీఎం ఐయిపోయాడు.. క‌ల్వ‌కుంట్ల కుటుంబం ముక్కు పిండుతున్నారు.

అదే గ‌తంలో కేసీఆర్ ఆశించిన‌ట్టు హ‌రీష్ పార్టీ బ‌య‌ట‌కు వెళ్లి ఏ బీజేపీలోనో చేరి ఉంటే.. అప్ప‌టికి మంచి ఫామ్ లో ఉన్న బీజేపీ అధికారంలోకి వ‌చ్చి.. హ‌రీషే సీఎం అయి ఉంటే.. ప‌రిస్థితి మ‌రోలా ఉండేదిగా.. అన్న‌ది కేసీఆర్ మ‌న‌సులో మ‌రుగుతోన్న‌ట‌ ఆలోచ‌న‌ట‌.ఇదంతా ఇలా ఉంటే అల్లుడి వ‌ల్ల ఎలాగూ వ‌ర్కువుట్ కావ‌డం లేదు.. ఈయ‌న సంగ‌తి ఇలా ఉంచి.. త‌న కూతురి ద్వారా మ‌రో ప్ర‌యోగం చేసి చూద్దాం.. త‌ద్వారా ఏదైనా స‌క్సెస్ సాధించ‌వ‌చ్చేమో. పోతే వెంట్రుక వ‌స్తే కొండ‌.. అన్న కోణంలో ఇప్పుడు కూతురు క‌విత  నుంచి న‌రుక్కొస్తున్న‌ట్టుస‌మాచారం.క‌విత వ‌స్తే ఏం జ‌రుగుతుంద‌ని.. చూస్తే.. అట్ లీస్ట్ ఓట్ల‌ను చీల్చి.. బీఆర్ఎస్ కి స‌పోర్ట్ చేయ‌నైనా చేయ‌రా? అన్న‌దొక అంచ‌నా. ఆమె ఎవ‌రి ఓట్లు చీలుస్తారు? ఆమె వెన‌క దాగిన ఓటు బ్యాంకు ఎలాంటిద‌ని చూస్తే.. ఆమె తొలి నుంచి తెలంగాణ జాగృతి పేరిట తెలంగాణ ఆడ‌ప‌డుచుగా చేసిన బ‌తుక‌మ్మ‌లు మ‌హిళా లోకాన్ని ఆక‌ర్షించాయి. ఈ దిశ‌గా మ‌హిళా ఓటు బ్యాంకును కాస్త క‌వ‌ర్ చేయ‌వ‌చ్చు. ఇక పోతే బీసీ ఓటు బ్యాంకు. బీసీల వాణి వినిపించ‌డంలోనూ క‌విత ఒక ప్ర‌యార్టీగా తీసుకున్నారు. 

దానికి తోడు తెలంగాణ‌లో బీసీల గురించి భారీ ఎత్తున కొట్లాట న‌డుస్తోంది. ఇప్ప‌టికే కాంగ్రెస్ వ‌ర్సెస్ తీన్మార్ మ‌ల్ల‌న్న బీసీ పోరు షురూ  అయ్యింది. మ‌ల్ల‌న్న అయితే ఏకంగా బీసీల కోసం త‌న కాంగ్రెస్ పార్టీ స‌భ్య‌త్వాన్ని కూడా కోల్పోయాడు. రెడ్ల‌తో ఢీ అంటే ఢీ అన్నాడు. దానికి తోడు రేవంత్ రెడ్డే చివ‌రి రెడ్డి సీఎం కావాల‌ని అన్నాడు. ఈ బీసీ బ్యాగ్రౌండ్ లోకి క‌విత సైతం ప్ర‌వేశించి.. ఇక్క‌డ నాలుగు ఓట్లు చీలినా.. త‌న బీఆర్ఎస్ కి ఆమె మేలు చేసిన‌ట్టే లెక్క‌!ఇలా ప‌రి ప‌రివిధాలా ఆలోచించి క‌విత  ను ఒక బాణంగా ప్ర‌యోగించాల‌ని కేసీఆర్ చూస్తున్న‌ట్టు స‌మాచారం. ఇలా జ‌రిగే అవ‌కాశ‌ముందా? గ‌తంలో ఎవ‌రైనా ఇలా చేశారా? అని చూస్తే జ‌గ‌న్ త‌న సోద‌రి ష‌ర్మిళ‌ను కూడా స‌రిగ్గా ఇలాగే వినియోగించిన‌ట్టు ఒక టాకుండేది అప్ప‌ట్లో. ఆమె ఒక ఎమోష‌న‌ల్ డ్రామాను పండించి.. మొద‌ట ఇక్క‌డ త‌న పార్టీని తెలంగాణ‌లో తెరిచి తిరిగి అక్క‌డ ఏపీలోకి వెళ్లి.. త‌మ ఓటు బ్యాంకు చీలి కూట‌మి ప్ర‌భుత్వానికి ప‌డ‌కుండా ఒక కాపు కాచార‌న్న‌ది అప్ప‌ట్లో వినిపించిన మాట‌. 


అలా క‌విత కూడా ఒక రాజ‌కీయ ప్ర‌యోగంగా తాను సైతం త‌న బీఆర్ఎస్ కి ఒక బీ టీంని ఎందుకు ఏర్పాటు చేసుకోవ‌ద్దు? మ‌న‌కి బీజేపీకి లింకు అంట‌గ‌ట్టి ఈ బీటీ మ్ ప్రాప‌గాండా చేయించుకోవ‌డం కంటే ఇదే మేలు. అదే మ‌న ద‌గ్గ‌ర ఒక సైడు దుకాణం ఉంటే.. దానితోనే లింకు పెట్టి మాట్లాడ‌తారు. దీంతో డ్యామేజీని భారీగా మేనేజ్ చేయొచ్చుగా అన్న‌ది క‌విత త్రూ కేసీఆర్ ఆడుతున్న మ‌రో రాజ‌కీయ డ్రామాగా దీన్ని అభివ‌ర్ణిస్తున్నారు ఆర్కే రేంజ్ సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టులు.కేసీఆర్ కి తొలి నుంచి ఇలాంటి ప్ర‌యోగాలు ముక్కుతో పెట్టిన విద్య‌. ముక్కాయ‌న ఇప్ప‌టి వ‌ర‌కూ ఎన్నో ప్ర‌యోగాలు చేశారు. విజ‌య‌వంత‌మైన టీఆర్ఎస్ పేరు కూడా బీఆర్ఎస్ అంటూ పేరు మార్చిన ఆయ‌న‌కు క‌విత ద్వారా మ‌రో తెలంగాణ శ‌బ్ధంతో కూడిన పార్టీ పెట్టించ‌డం ఒక లెక్క కాదు. ఇప్ప‌టికే ఈ దిశ‌గా పలు పార్టీ పేర్లు కూడా వినిపిస్తున్నాయ్. ఇక నేడో రేపో క‌విత నుంచి ఈ సౌండ్ మ‌నం విన్నా వినొచ్చ‌ని రాజ‌కీయ అభిజ్ఞాన వ‌ర్గాల భోగ‌ట్టా.

By
en-us Political News

  
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయాలని నిర్ణయించింది.
2026 లో రాజ్యసభ నుంచి ఈ ఏడాదిలో ఏకంగా 73 మంది రిటైర్డ్ కానున్నారు.
అమరావతి విషయంలో జగన్ దృక్ఫథంలో ఇసుమంతైనా మార్పు లేదు. ప్రపంచ స్థాయి రాజధాని నిర్మాణం జరిగితే చంద్రబాబు పేరు చిరస్థాయిగా చరిత్రలో నిలిచిపోతుందన్న దుగ్ధతోనే ఆయన అమరావతిపై ఇప్పటికీ కుట్రలు చేస్తున్నారన్నది రాజకీయవర్గాల టాక్.
పశ్చిమబెంగాల్ అసెంబ్లీకి ఈ ఏడాది ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బీజేపీ ప్రత్యర్థులను అణచివేయడానికి ఈడీ వంటి దర్యాప్తు సంస్థలను ఆయుధాలుగా ప్రయోగిస్తోందని ధ్వజమెత్తారు.
జగన్ ఇలా నేర ప్రవృత్తి ఉన్న వారిని ప్రోత్సహించడం, వారికి మద్దతుగా నిలవడం ఇదే తొలిసారి కాదు. గ‌తంలో ఓ యువ‌కుడు ర‌ప్పా ర‌ప్పా అంటూ ఫ్లెక్సీలు క‌ట్టి త‌న ర్యాలీలో పాల్గొన్న‌పుడే జ‌గ‌న్ వారించాల్సింది. కానీ అలా చేయ‌లేదు స‌రిక‌దా? ర‌ప్పా ర‌ప్పా అంటూ గంగ‌మ్మ జ‌త‌ర‌లో పొట్టేలు న‌రికిన‌ట్టు న‌రుకుతామ‌న‌డంలో త‌ప్పేంట‌ని మీడియానే ఎదురు ప్ర‌శ్నించారు. దీంతో వైసీపీయులు బ‌రితెగించేశారు. ఆయ‌న‌కేం ఎన్ని కేసులున్నా వాయిదాల మీద వాయిదాలు కోరుతూ బెయిలు మీద బ‌య‌ట తిరగగలరు. ఆ స్థాయి ఇన్ ఫ్లుయెన్స్, ఆర్థిక దన్ను ఆయనకు ఉంది.
ఇక్కడే కవిత రాజకీయ అడుగులు బీఆర్ఎస్ ఉనికిని ప్రశ్నార్ధకం చేసేలా ఉన్నాయన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి. ఎందుకంటే.. ఆమె ఇటీవల ఏర్పాటు చేసిన కమిటీల లక్ష్యమేంటంటే.. తెలంగాణ ఆవిర్భావం తరువాత పదేళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాల అధ్యయనం.
పోలవరం-నల్లమల సాగర్ ప్రాజెక్టుపై తెలంగాణ అభ్యంతరాలు, రాయలసీమ ఎత్తిపోతల పథకంపై జరుగుతున్న వివాదాలను ప్రస్తావించారు. కొందరు వివాదాలు సృష్టించడమే లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.
ఇరు రాష్ట్రాల మధ్యా జలవివాదాలు ఉండకూడదన్న లక్ష్యంతోనే నాడు కాంగ్రెస్ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి పచ్చ జెండా ఊపిందన్న రేవంత్ రెడ్డి, రాజకీయాలకు అతీతంగా నీటి వివాదాలను ఇరు రాష్ట్రాలూ పరిష్కరించుకోవాలన్నారు.
వాస్తవాలకు ఎలాంటి ముసుగులూ తగిలించకుండా ఉన్నది ఉన్నట్లు, కుండబద్దలు కొట్టినట్లుగా సమాజం తీరు తెన్నులను, రాజకీయ నాయకుల మధ్య నెక్సస్ ను, అధికారులు బాధ్యతారాహిత్యం, జవాబుదారీతనం లేని తనాన్ని కళ్లకు కట్టిన వాస్తవ ‘వేదిక’ తెలుగువన్ యూట్యూబ్ చానెల్ లో గురువారం ప్రసారమైంది.
ఇటీవల అసెంబ్లీ శీతాకాల సమావేశాలకు హాజరైన ప్రతిపక్ష నేత కేసీఆర్ వద్దకు సీఎం స్వయంగా వెళ్లి అభివాదం చేయడం, క్షేమ సమాచారాలు తెలుసుకోవడం రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.
ఇక ఎన్టీఆర్ రాజకీయ రంగప్రవేశం ఒక సంచలనం, ఒక ప్రభంజనం. తెలుగుదేశం పార్టీని స్థాపించి కేవలం 9 నెలలలో అధికారంలోకి వచ్చి నభూతో నభవిష్యత్ అన్న రికార్డు సృష్ఠించారు. అప్పటికి మూడున్నర దశాబ్దాలకు పైగా ఆంధ్రప్రదేశ్ లో సాగుతున్న కాంగ్రెస్ ఏకచ్ఛత్రాధిపత్యానికి తెరదించారు.
ప్రజాధనం దుబారాను నియంత్రించాల్సిన బ్యూరోకాట్లు, అఖిల భారత సర్వీసు అధికారులైన ఐఏఎస్ లు ఆ దిశగా ఎటువంటి ప్రయత్నం చేయకుండా కేవలం ప్రేక్షక పాత్ర వహిస్తూ.. ఏలిన వారు అంటే అధికారంలో ఉన్న వారి అడుగులకు మడుగులొత్తుతూ.. ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెట్టేయడం అధికార దుర్వినియోగమే ఔతుందన్నారు.
మెజారిటీ ఉందికదా అని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తామంటే అంగీకరించేది లేదన్నారు. మోడీ సర్కార్ పేదల పట్ల కక్ష సాధింపుధోరణితో వ్యవహరిస్తోందనీ, అందుకే మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని నీరుగారుస్తోందనీ విమర్శించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.