హింసకు ప్రోత్సాహం.. ఇదేం రాజకీయం జగన్!?

Publish Date:Jan 10, 2026

Advertisement

జ‌గ‌న్ ది తొలి  నుంచీ హింసాత్మ‌క ప్ర‌వృత్తే. ఈ విష‌యం గతంలోనే పలుమార్లు రుజువైంది. తాజాగా మరోసారి వెల్లడైంది.  త‌న ఫ్లెక్సీల ముందు పొటేళ్ల‌ను అత్యంత హింసాత్మ‌కంగా న‌రికి.. ఆపై ఆ ర‌క్తాన్ని ఆయ‌న ఫ్లెక్సీల‌కు పూశారు. ఒక విధంగా చెప్పాలంటే రక్తాభిషేకం చేశారు  గ‌తంలో హోం మంత్రిగా  ప‌ని  చేసిన తానేటి వ‌నిత నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన గోపాల‌పురం బ్యాచ్. అయితే  వీరిని ఎలా ట్రీట్ చేయాలో అలా ట్రీట్ చేసింది ఏపీ  పోలీస్ డిపార్ట్ మెంట్.

వీరు విడుద‌ల‌య్యాక నేరుగా ఇళ్ల‌కు వెళ్లారో లేదో తెలీదు.  కానీ, స‌రాస‌రి జ‌గ‌న్ ద‌గ్గ‌ర‌ వాలిపోయారు. వారిని స్వయంగా జగన్ వద్దకు మాజీ హోం మంత్రి తానేటి వ‌నిత‌ తీసుకువెళ్లారు.   హోం మంత్రిగా  ప‌ని చేసిన వనితకు డూస్ ఏంటి?  డోంట్స్ ఏంట‌ి?  అన్న‌ది క్లియ‌ర్ క‌ట్ గా తెలిసి ఉంటుంది. త‌మ‌కు తెలిసింది ఇత‌రుల‌కు కూడా చెప్పాలి. కానీ, వ‌నిత ఆ ర‌క్త‌సిక్త నిందితుల‌ను  ఏదో పెద్ద ఘ‌న‌కార్యం చేసిన‌ట్టు నేరుగా జ‌గ‌న్ ద‌గ్గ‌ర‌కు తీసుకువచ్చి నిల‌బెట్టారు. దీంతో వారు కూడా తాము తిన్న పోలీసు లాఠీ దెబ్బ‌ల‌కు అక్క‌డ ఎక‌బికిన  ఏడ్చేశారు. ఇలా ఎప్పుడూ చేయ‌కండ‌ని వారించాల్సిన  జ‌గ‌న్..  మీకు నేను అండ‌దండ‌గా ఉన్నానంటూ.. భుజం త‌ట్టి  పంపించారు.

జగన్ ఇలా నేర ప్రవృత్తి ఉన్న వారిని ప్రోత్సహించడం, వారికి మద్దతుగా నిలవడం ఇదే తొలిసారి  కాదు. గ‌తంలో ఓ యువ‌కుడు ర‌ప్పా ర‌ప్పా అంటూ ఫ్లెక్సీలు క‌ట్టి త‌న ర్యాలీలో పాల్గొన్న‌పుడే జ‌గ‌న్ వారించాల్సింది. కానీ అలా చేయ‌లేదు స‌రిక‌దా?  ర‌ప్పా ర‌ప్పా అంటూ గంగ‌మ్మ జ‌త‌ర‌లో పొట్టేలు న‌రికిన‌ట్టు న‌రుకుతామ‌న‌డంలో త‌ప్పేంట‌ని మీడియానే ఎదురు ప్ర‌శ్నించారు.  దీంతో  వైసీపీయులు బ‌రితెగించేశారు. ఆయ‌న‌కేం ఎన్ని  కేసులున్నా వాయిదాల మీద వాయిదాలు కోరుతూ బెయిలు మీద బ‌య‌ట తిరగగలరు. ఆ స్థాయి ఇన్ ఫ్లుయెన్స్, ఆర్థిక దన్ను ఆయనకు ఉంది.  అవ‌స‌ర‌మైతే కోటాను కోట్లు కుమ్మ‌రించేయగలరు?  అదే ఈ  రప్పార్పా నిందితుల ప‌రిస్థితి  అలాక్కాదు. వీరిని నేరుగా తీసుకెళ్లి తమదైన స్టైల్ ట్రీట్ మెంట్ ఇచ్చి మరీ వదిలారు పోలీసులు.

చాలా మంది  వైసీపీ  వారు చేస్తున్న రివ‌ర్స్ ట్రోలింగ్ ఏంటంటే గ‌తంలో చంద్ర‌బాబు ఫ్లెక్సీల‌కు ర‌క్తాభిషేకం చేసిన ఫోటోలు, బాల‌కృష్ణ సినిమా విడుద‌ల  స‌మ‌యంలో పొటేళ్ల త‌ల‌లు అలంక‌రించిన  వీడియోల‌ను రీ పోస్ట్ చేస్తున్నారు. కానీ, వాట‌న్నిటిపైనా  చ‌ట్ట‌ప్ర‌కారం చర్యలు తీసుకున్న సంగతిని మాత్రం ఈ రివర్స్ ట్రోలింగ్ చేస్తున్న వారు బయటకు చెప్పడంలేదు. పైగా అప్పట్లో అలా రక్తాభిషేకం చేసిన వారిని చంద్రబాబు, బాలయ్య సమర్ధించలేదు. అటువంటి చర్యలు తగవని హితవు పలికారే తప్ప వారిని సమర్ధిస్తూ, ప్రోత్సహిస్తూ జగన్ లా ప్రకటనలు గుప్పించలేదు.  

ప్ర‌స్తుత ప‌రిస్థితికి వ‌స్తే.. ర‌క్త త‌ర్ప‌ణం జ‌గ‌న్ కి. బాధలు, కేసులు ఈ నిందితులకు అన్నట్లుగా ఉంది.  వీరిని వారించాల్సిన జ‌గ‌న్ వారించ‌కుండా రెచ్చిపోండి నేనున్నాననడమంటే..  అర్ధమేంటి? జగన్ ప్రోత్సాహం, మద్దతు చూసుకుని వీరింకెంత రెచ్చిపోతారో అన్న ఆందోళన వ్యక్తం అవుతోంది. 

ఇలాంటి హింసాత్మ‌క‌త గుర్తించిన జ‌నం వ‌చ్చే రోజుల్లో ఆ ప‌ద‌కొండు సీట్లు కూడా  ఇవ్వ‌కుండా పులివెందుల‌లో  కూడా  జ‌గ‌న్ని ఓడించి మూల కూర్చోబెడితే.. పార్టీకి కాస్తా  ఆయ‌న‌ పేక‌ప్ చెప్పేస్తారు. సంపాదించుకున్నదాంతో జ‌గ‌న్ కేం  తృప్తిగా  బ‌తికేస్తారు. కానీ ఇలాంటి నిందారోప‌ణ‌ల‌తో జీవితాంతం బ‌త‌కాల్సింది మాత్రం వీరే. కాబ‌ట్టి ఇలాంటి వారు ఒక సారి ఆలోచించాల్సిందిగా కోరుతున్నారు పోలీసులు.. మ‌రి  పోలీసుల మాట విని బుద్ధిగా మ‌స‌లుకుంటారో.. లేక ఇలాగే రెచ్చి పోయి కేసుల మీద కేసులు నెత్తికి వేసుకుంటారో అది వారి వారి ఇష్టం. మ‌రి  మీరేమంటారు?

By
en-us Political News

  
గతంలో వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ముందే.. ఇచ్చిన హామీని కాంగ్రెస్ హైకమాండ్ ఇప్పుడు గా నిలబెట్టుకుంది. అయితే, ఈ కొత్త పదవి, అదనపు బాధ్యతలు వైఎస్ షర్మిలకు ఒక వైపు సంతోషాన్ని కలిగిస్తున్నప్పటికీ, మరోవైపు ఆమె ముందు అనేక సవాళ్లను ఉంచబోతున్నాయి.
సుపు రంగు అనేది భూమి పుట్టినప్పటి నుండి ఉనికిలో ఉందనీ.. ఆ రంగు కేవలం తెలుగుదేశం పార్టీకి మాత్రమే సొంతం కాదని తేల్చి చెప్పారు.
తెలుగుజాతి మనుగడ ఉన్నంతకాలం తెలుగుప్రజల హృదయాల్లో అన్న ఎన్టీఆర్ చిరస్థాయిగా నిలచిపోతారని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు.
కర్ణాటక రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా నడుస్తున్న హైడ్రామా ఎట్టకేలకు ఒక కొలిక్కి వచ్చింది.
గాంధీభవన్‌లో జరిగిన ప్రత్యేక సమగ్ర ఓటర్ల సవరణ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.
కర్ణాటక రాజకీయాల్లో అత్యంత ప్రభావవంతమైన నాయకుడిగా గుర్తింపు పొందారు.
ప్రపంచాన్ని తీవ్ర సంక్షోభంలోకి నెట్టేలా ఉందని ప్రముఖ సామాజిక, రాజకీయ విశ్లేషకుడు కిలారు నాగార్జున అన్నారు. తెలుగువన్ తో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన.. ఇరాన్ తో ఉద్రిక్తతలు, యుద్ధ వాతావరణం ప్రపంచ దేశాలను భయపెడుతోందన్నారు.
రాబోయే రోజుల్లో స్కిల్ యూనివర్సిటీ ద్వారా యువతను కేవలం ఉద్యోగాలు వెతుక్కునే వారిగా కాకుండా, ఉద్యోగాలు సృష్టించే వారిగా మార్చడమే ఈ ప్రభుత్వ లక్ష్యమని దర్శిత్ వెల్లడించారు. ఉత్తరాంధ్రను డిజిటల్ గేట్‌వేగా మారుస్తూ గూగుల్, టిసిఎస్, కాగ్నిజెంట్, డెలాయిట్ వంటి దిగ్గజ ఐటీ కంపెనీలను విశాఖకు తీసుకొస్తున్న యువ నాయకుడు నారా లోకేష్ శైలిని అభినందించారు.
కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన సమయంలో కుదిరిన ముందస్తు ఒప్పందంలో భాగంగా ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గురువారం (మే 28) తన పదవికి రాజీనామా చేశారు. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (కేపీసీసీ) అధ్యక్షుడు, ప్రస్తుత ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం ఖరారైంది.
తెలుగువన్ ఎండీ కంఠంనేని రవిశంకర్ సారథ్యంలో నిర్వహించిన వాస్తవ వేదికలో దేశ రాజకీయ పరిస్థితుల
ఏమిటీ కాక్రోచ్ జనతా పార్టీ? దీని వెనుక ఉన్న అసలు ఉద్దేశం ఏంటి? దీనివల్ల ఇండియాలో కూడా శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్ దేశాల్లో వచ్చినట్లు ప్రజా విప్లవాలు వస్తాయా అనే చర్చలు దేశవ్యాప్తంగా మొదలయ్యాయి. ఈ తీవ్రమైన రాజకీయ పరిణామాలపై ప్రముఖ థింక్ ట్యాంక్ సెంటర్ ఫర్ లిబర్టీ అధినేత నలమోతు చక్రవర్తి తెలుగువన్ ఇంటర్వ్యూలో అనేక లోతైన విశ్లేషణ చేశారు.
ఇక తెలుగుదేశం పార్టీ వార్షిక పండుగ మహానాడు 2026 విషయానికి వస్తే.. ఈ సారి మహానాడు సరికొత్త రాజకీయ ఒరవడికి వేదికైంది. నెల్లూరులో భారీ ఎత్తున ఏర్పాటు చేయాలనుకున్న ఈ వేదికను, మోడీ ఇచ్చిన పొదుపు పిలుపు నేపథ్యంలో మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయం వేదికగా హైబ్రిడ్ మోడల్‌లోకి మార్చారు.
వైసీపీ అధినేత జగన్ తో తాడేపల్లి ప్యాలెస్ లో భేటీ అనంతరం బుధవారం మీడియాతో మాట్లాడిన ఆయన యథాప్రకారం ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ లపై పరుష పదజాలంతో విమర్శలు గుప్పించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.