త్వరలో బిఆర్ఎస్ అభ్యర్థుల జాబితా

Publish Date:May 17, 2023

Advertisement

బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు త్వరలోనే తమ పార్టీ అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. అంతకంటే ముందు ఆయన బిఆర్ఎస్ తో పొత్తు పెట్టుకునే వామపక్ష పార్టీలతో సీట్ల సర్దుబాటు చేసుకునే అవకాశం ఉంది. బిఆర్ఎస్ ఎంఎల్ఏ, ఎంఎల్సి, ఎంపీలతో పాటు పార్టీ ఎగ్జిక్యూటివ్ మెంబర్స్, స్టేట్ కార్పోరేషన్ చైర్ పర్సన్స్ తో   ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. ఈ సమావేశంలో పార్టీ అభ్యర్థులను త్వరలో ప్రకటించే అవకాశం ఉందని విస్పష్టంగా చెప్పారు.  కాంగ్రెస్ పార్టీకి బిజెపి ప్రధాన ప్రత్యర్థి అయినప్పటికీ బిజెపికి అభ్యర్థుల కొరత ఉంది. కాంగ్రెస్ పార్టీకి ఆ సమస్య లేదు. ఈ ఎన్నికల్లో బిజెపిని ఓడించే పార్టీలతో కెసీఆర్ ఆపన్న హస్తం అందించే అవకాశం ఉంది. వచ్చే శాసనసభ ఎన్నికల నేపథ్యంలో కెసిఆర్ మూడు నెలల ముందు అంటే సెప్టెంబర్ లో బిఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. 
కర్ణాటక ఎన్నికల  ఫలితాలు బిఆర్ఎస్ మీద చూపే ప్రభావం మీద కూడా  కెసిఆర్ చర్చించారు. 
2018 అసెంబ్లీ ఎన్నికలలో అనుసరించిన వ్యూహాన్నే అమలు చేయాలని కెసీఆర్ చూస్తున్నారు. వాస్తవానికి 2019 ఏప్రిల్, మే లో ఎన్నికలు నిర్వహించాలి. కానీ జరుగలేదు. 2018 సెప్టెంబర్ 6న కెసీఆర్ అసెంబ్లీని రద్దు చేశారు.  2018 డిసెంబర్ లో ఎన్నికల్లో వెళ్లారు కెసిఆర్. ఇది వర్కవుట్ అయ్యింది కాబట్టి అప్పట్లో మొత్తం 119 సీట్లకు గానూ  88 సీట్లతో మళ్లీ అధికారంలో రాగలిగింది బిఆర్ఎస్. 


 

By
en-us Political News

  
తమ కుటుంబ వివాహ వేడుకకు తండ్రిసమానులైన ఒక సీనియర్ రాజకీయ నాయకుడిని ఆహ్వానించడంలో తప్పేముందని ప్రశ్నించిన షర్మిల.. దీనికి అనవసరమైన, అభ్యంతరకరమైన అర్థాలు ఆపాదించి ప్రచారం చేయడం జగన్ దిగజారుడుతనానికి నీచ మసస్థత్వానికి నిదర్శనమన్నారు.
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తెచ్చిన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం వివరాలు. రూ. 5 లక్షల ఉచిత బీమా కవరేజ్, అర్హతలు, వయస్సు పరిమితి మరియు దరఖాస్తు విధానం గురించిన పూర్తి సమాచారం.
విజయవాడలో ప్రతిష్ఠాత్మక రామోజీ ఎక్స్‌లెన్స్ అవార్డుల ప్రదానోత్సవం ఘనంగా నిర్వహించారు.
ఆన్‌లైన్ పరిచయం.. చాటింగ్‌తో స్నేహం.. వీడియో కాల్స్‌తో నమ్మకం.. ఆ తర్వాత ఇంటికి ఆహ్వానం. అంతా సజావుగా సాగుతున్నట్లే కనిపిస్తుంది. కానీ ఆ పరిచయాల వెనుక ఉన్నది స్నేహం కాదు
హైదరాబాద్ వేదికగా ఇటీవల జరిగిన భారత్ సమ్మిట్‌ 2026లో చోటుచేసుకున్న పరిణామాలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి.
సినిమాను తలపించిన నగల దొంగతనం..పట్టించిన పచ్చబొట్టు.!
హైదరాబాద్ నగరవాసులకు, ముఖ్యంగా బిర్యానీ ప్రియులకు భారీ షాక్ తగిలింది.
ప్రియుడి హత్యకు 19 ఏళ్ల యువతి సుపారీ.. షాకింగ్ ట్విస్ట్.!
దీపావళి పండుగను కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడపడానికి స్వస్థలానికి వచ్చిన ఓ యువతికి మృత్యువు అనూహ్య రీతిలో ఎదురైంది.
హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైనదిగా భావించే కార్తీక మాసం ప్రారంభం కావడంతో తెలుగు రాష్ట్రాల్లోని శైవక్షేత్రాలన్నీ ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి.
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మరో విషాద ఛాయలు అలుముకున్నాయి.
తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ వర్గాల్లో గత కొంతకాలంగా నెలకొన్న ఉత్కంఠకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) అధికారికంగా తెరదించింది.
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.