ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జనసేన మధ్య సంబంధాలు పైకి కనిపించేంత సజావుగా లేవనే సంకేతాలు స్పష్టమవుతున్నాయి. ‘రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరు’ అనే సూత్రం ప్రకారం కూటమి ఏర్పడినప్పటికీ.. క్షేత్రస్థాయిలో స్థానిక పోరు, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు భాగస్వామ్య పార్టీల మధ్య కొత్త సవాళ్లను తెరపైకి తెస్తున్నాయి.ఇలాంటి అంశాలపై ‘వాస్తవ వేదిక’ కార్యక్రమంలో ‘జమీన్ రైతు’ ఎడిటర్ డోలేంద్ర ప్రసాద్, తెలుగువన్ ఎం.డీ. కంఠమనేని రవిశంకర్ మధ్య ఆసక్తికర చర్చ జరిగింది. ప్రస్తుత రాజకీయ పరిణామాలను పరిశీలిస్తే.. జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వైఖరి కూటమి ప్రభుత్వంపై ఆయనకున్న అసంతృప్తిని పరోక్షంగా తెలియజేస్తోందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. వరుసగా నాలుగు కేబినెట్ సమావేశాలకు హాజరుకాకపోవడం, అమరావతి సీడ్ యాక్సెస్ రోడ్డు వంటి ప్రతిష్టాత్మక కార్యక్రమాల సమయంలో నియోజకవర్గ పర్యటనలకు ప్రాధాన్యం ఇవ్వడం, అసెంబ్లీ ప్రాంగణంలో ఉన్నప్పటికీ సభకు హాజరుకాకపోవడం వంటి పరిణామాలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.మరోవైపు.. టీడీపీ, జనసేన మధ్య సమాచార వారధులుగా వ్యవహరించిన కీలక నాయకుల వ్యాపార, వ్యక్తిగత ప్రాధాన్యతలు పెరుగుతున్నాయనే భావనతో జనసేన రాజకీయ ప్రయోజనాలపై పార్టీ శ్రేణుల్లో ఆందోళన వ్యక్తమవుతున్నట్లు తెలుస్తోంది. పార్టీల వ్యూహాలు.. అంతర్లీన పరిణామాలు.. రాబోయే మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని టీడీపీ, జనసేన తమ తమ వ్యూహాలతో ముందుకు సాగుతున్నాయి. జనసేన వ్యూహం: నరసరావుపేట, భీమవరం, మచిలీపట్నం వంటి ప్రాంతాల్లో స్థానికంగా తమ రాజకీయ ఉనికిని కాపాడుకునేందుకు జనసేన నాయకులు స్వయంగా మేయర్, చైర్మన్ అభ్యర్థులను ప్రకటించుకుంటున్నారు. ఈ ప్రకటనలకు పార్టీ అధిష్ఠానం నుంచి స్పష్టమైన అభ్యంతరాలు వ్యక్తం కాకపోవడం.. టీడీపీపై ఒత్తిడి పెంచే వ్యూహంలో భాగంగానే రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. టీడీపీ వైఖరి.. కూటమి భాగస్వామ్యాన్ని కొనసాగిస్తూనే.. రాష్ట్రవ్యాప్తంగా తమ సొంత రాజకీయ బలాన్ని మరింత స్థిరీకరించుకోవడం టీడీపీ ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది. అయితే కీలక అంశాల్లో సీట్ల పంపకంపై తక్కువ వాటా ప్రతిపాదనలు, ఇరు పార్టీల మధ్య సమాచార లోపం వంటి అంశాలు జనసేనలో అభద్రతా భావాన్ని పెంచుతున్నాయనే చర్చ జరుగుతోంది.   భవిష్యత్ రాజకీయ ప్రభావం.. టీడీపీ–జనసేన మధ్య అంతర్గత విభేదాలు, స్పష్టమైన సమన్వయం లోపించడం రాబోయే మున్సిపల్, స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రత్యక్ష ప్రభావం చూపే అవకాశం ఉంది. క్షేత్రస్థాయిలో జనసేన శ్రేణులు టీడీపీ అభ్యర్థులకు పూర్తి స్థాయిలో సహకరించని పరిస్థితి ఏర్పడితే.. కూటమి ఎన్నికల ఫలితాలపరంగానే కాకుండా రాజకీయంగా కూడా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. అదే సమయంలో.. కూటమి భాగస్వామ్యాన్ని కొనసాగిస్తూనే తమ సొంత రాజకీయ గుర్తింపు, మైలేజీని కాపాడుకునేందుకు జనసేన చేస్తున్న ప్రయత్నాలు రాబోయే రోజుల్లో ఏపీ రాజకీయాలను మరింత ఆసక్తికర మలుపులు తిప్పే అవకాశం కనిపిస్తోంది.       ( Vasthava Vedika, Dolendra Prasad, Ravi Shankar, AP Politics, Pawan Kalyan, TDP-Janasena Alliance, CM Chandrababu Naidu, AP Municipal Elections, TDP, Janasena, Andhra Pradesh Politics, AP Government, Nara Lokesh, Amaravati Politics, Political Analysis)
తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది. రాష్ట్ర మంత్రివర్గం నుంచి మంత్రి కొండా సురేఖను తప్పించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించినట్లు సమాచారం అందుతోంది. ఈ మేరకే క్యాబినెట్ నుంచి ఆమెను బర్తరఫ్ చేయాలని కోరుతూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ద్వారా రాజ్‌భవన్‌కు అధికారిక లేఖ పంపించారు. తాజా సమాచారం ప్రకారం, ముఖ్యమంత్రి నుంచి వచ్చిన ఆదేశాల మేరకు సీఎస్ హుటాహుటిన గవర్నర్‌కు సమాచారం అందించారు. ఈ లేఖ ప్రస్తుతం గవర్నర్ పరిశీలనలో ఉంది. మంత్రి సురేఖ తొలగింపు ప్రతిపాదనపై గవర్నర్ అతి త్వరలోనే తుది నిర్ణయం తీసుకుని, ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు పాలనా యంత్రాంగంలోనూ, పలు కీలక పదవుల్లోనూ ప్రభుత్వం పెద్ద ఎత్తున మార్పులు చేర్పులు చేపట్టింది. అందులో భాగంగానే తెలంగాణ రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా ఉన్న జి. చిన్నారెడ్డిని ఆ బాధ్యతల నుంచి తప్పించారు. ఆయన స్థానంలో జీహెచ్‌ఎంసీ మాజీ మేయర్ గద్వాల విజయలక్ష్మిని నూతన వైస్ ఛైర్‌పర్సన్‌గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే రాష్ట్ర మహిళా కమిషన్ నూతన అధిపతిగా నేరెళ్ల శారదకు కీలక బాధ్యతలు అప్పగించారు. రాష్ట్రంలో మహిళల రక్షణ, వారి సంక్షేమ కార్యక్రమాలను మరింత సమర్థవంతంగా అమలు చేసేందుకు శారదను మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్‌గా ప్రభుత్వం ఎంపిక చేసింది. ఈ వరుస నియామకాలతో కాంగ్రెస్ వర్గాల్లో ఊహించని పరిణామాలు చోటుచేసుకున్నాయి. పాలనాపరమైన శైలిని వేగవంతం చేయడంతో పాటు, పార్టీలోని పలు కీలక సమీకరణాలను దృష్టిలో ఉంచుకునే సర్కార్ ఈ సంచలన నిర్ణయాలు తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. కొండా సురేఖ స్థానంలో ఎవరికి చోటు దక్కుతుందనే అంశంపై ఇప్పటికే కాంగ్రెస్ అంతర్గత వర్గాల్లో విపరీతమైన చర్చ మొదలైంది. కొద్ది రోజులుగా మంత్రుల తీరు మరియు పార్టీ అంతర్గత రాజకీయాలపై విస్తృత చర్చలు జరుగుతున్న నేపథ్యంలో, సీఎం తీసుకున్న ఈ నిర్ణయం రాబోయే రోజుల్లో ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ప్రధానంగా బీసీ నేతలపై ఈ నిర్ణయం ఎలాంటి ప్రభావం చూపుతుందనే విశ్లేషణలు సాగుతున్నాయి. రాజ్‌భవన్‌ నుంచి కొండా సురేఖ బర్తరఫ్ ఆమోదముద్ర పడిన వెంటనే కొత్త మంత్రి వర్గ విస్తరణపై ప్రకటన వెలువడే సూచనలు కనిపిస్తున్నాయి. రాబోయే గంటల్లో తెలంగాణ రాజకీయాల్లో మరిన్ని సంచలన పరిణామాలు చోటుచేసుకునే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.     (Konda Surekha Bartaraf, CM Revanth Reddy, Telangana Cabinet, Telangana Politics, Revanth's Sensational Decision)
తెలంగాణలో ముఖ్యమంత్రి పదవి ఖాళీగా ఉందా? లేక ఖాళీ అవ్వబోతోందా? అన్న అనుమానాలు రేకెత్తేలా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మునుగోడు ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు ఉన్నాయి. ఆయన తాజాగా తాను తెలంగాణ సీఎం కావడం ఖాయం, దానిని ఎవరూ అడ్డుకోలేరంటూ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారాయి. అంతే కాకుండా ఆయన వ్యాఖ్యలు తెలంగాణ అధికార కాంగ్రెస్ లో  అంతర్గత విభేదాలు ఏ స్థాయిలో ఉన్నాయన్న విషయాన్నీ బహిర్గతం చేశాయి.  దివంగత సీఎం  వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా బుధవారం (సెప్టెంబర్ 2) నిర్వహించిన ఒక  ర్యక్రమంలో పాల్గొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి..   తాము ఏనాడు కూడా పదవుల కోసం సిద్ధాంతాలను తాకట్టు పెట్టలేదంటూ..  వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాల బాటలో నడిచేందుకు రాజకీయాల్లోకి ప్రవేశించామన్నారు.  తమ కుటుంబం ఎల్లప్పుడూ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకే కట్టుబడి ఉందనీ,  పార్టీ కోసం కష్టపడిన అసలు సిసలైన నాయకులకు  గుర్తింపు దక్కాల్సిన అవసరం ఉందన్నారు.  అంతే కాకుండా  తాను   రాష్ట్రానికి ముఖ్యమంత్రి స్థాయికి ఎదుగుతానని, ఆ పదవిని తాను కచ్చితంగా చేపడతానని విస్పష్టంగా చెప్పారు.  ప్రజా సేవలో  శ్రమిస్తున్న తమ లాంటి నాయకులకు ప్రజల మద్దతు ఉన్నంతవరకు  పదవులు దక్కకుండా ఎవరూ అడ్డుకోలేరన్న కోమటిరెడ్డి..  తెలంగాణలో కొందరు నేతలు పార్టీని తమ గుప్పిట్లోకి తీసుకోవాలని చూస్తున్నారని, అలాంటి ప్రయత్నాలను సహించేది లేదని హెచ్చరించారు.  గత కొంతకాలంగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు, సీఎం మార్పు చర్చల నేపథ్యంలో  రాజగోపాల్ రెడ్డి  వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.  పార్టీలో తొలి నుంచీ ఉన్న నాయకులు, మధ్యలో ఇతర పార్టీల నుంచి వచ్చి చేరి కీలక స్థానాలలో కొనసాగుతున్న నాయకుల మధ్య ఆధిపత్య పోరు అంటూ జరుగుతున్న ప్రచారానికి కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి వ్యాఖ్యలు బలం చేకూర్చేలా ఉన్నాయి.  సొంత పార్టీ నాయకత్వ శైలిని ప్రశ్నిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు  రాష్ట్రంలో పొలిటికల్ హీట్ ను ఒక్కసారిగా పెంచేశాయి. ఓ వైపు కొండా సురేఖ వ్యవహారం హాట్ టాపిక్ గా కొనసాగుతున్న తరుణంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు అధికార కాంగ్రెస్ లో అంతర్గత విభేదాలు ఏ స్థాయిలో ఉన్నాయో తేటతెల్లం చేశాయి.  రానున్నరోజులలో కాంగ్రెస్ లో అంతర్గత విభేదాలు మరింత పెచ్చరిల్లే అవకాశాలున్నాయని పరిశీలకులు రాష్ట్ర పార్టీలో ఇటీవలి కాలంలో వరుసగా చోటు చేసుకుంటున్న పరిణామాలను ఉటంకిస్తూ విశ్లేషిస్తున్నారు.   [Sensation in Telangana Politics, Komatireddy, CM Comments, Telangana CM, Telugu One]
ALSO ON TELUGUONE N E W S
వెండితెరపై వెలిగిపోయిన ఎంతోమంది తారల నిజ జీవితాలు బయటకు కనిపించేంత గ్లామరస్‌గా ఉండవు. 90ల కాలంలో సౌత్ ఇండియాలో హీరోయిన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న సీనియర్ నటి చ‌ర్మిల మ‌నోహ‌ర‌న్ జీవితం కూడా అలాంటిదే. ఒకప్పుడు వరుస విజయాలతో కథానాయకిగా అలరించిన ఆమె, వ్యక్తిగత జీవితంలో ఎదురైన చేదు అనుభవాల వల్ల తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టివేయబడింది. చ‌ర్మిల తమిళం, మలయాళం, కన్నడతో పాటు తెలుగులోనూ పలు సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించింది. ముఖ్యంగా మలయాళ సినీ రంగంలో ఆమె నటించిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద విజయం సాధించి, ఆమెకు స్టార్ డమ్ అందించాయి. అయితే కెరీర్ ఊపందుకుంటున్న సమయంలోనే ఆమె తీసుకున్న కొన్ని తొందరపాటు నిర్ణయాలు ఆమె వ్యక్తిగత జీవితాన్ని దెబ్బతీశాయి. ప్రేమ, పెళ్లి విషయంలో చ‌ర్మిలకు వరుసగా ఎదురుదెబ్బలు తగిలాయి. నటుడు కిషోర్ సత్యతో జరిగిన మొదటి వివాహం కొద్ది కాలానికే విడాకులకు దారితీసింది. ఆ తర్వాత వ్యాపారవేత్త రాజేష్‌ను రెండవ వివాహం చేసుకున్నప్పటికీ, మనస్పర్థల కారణంగా ఆ బంధం కూడా ఎక్కువ కాలం నిలవలేదు. వీరికి ఒక కుమారుడు ఉన్నాడు. అంతకుముందు ఒక ప్రముఖ నటుడితో నడిచిన ప్రేమాయణం కూడా బ్రేకప్‌తో ముగిసింది. వ్యక్తిగత జీవితంలో వరుస వైఫల్యాలు ఎదురవ్వడంతో చ‌ర్మిల మానసికంగా తీవ్ర ఒత్తిడికి లోనయ్యారు. అదే సమయంలో సినిమాల్లో అవకాశాలు క్రమంగా తగ్గిపోవడం, సరైన ఆదాయ మార్గాలు లేకపోవడంతో ఆమె తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయారు. కొడుకు బాధ్యతలు, అనారోగ్య సమస్యలు, ఇంటి అద్దెలు చెల్లించలేని పరిస్థితులను కూడా ఆమె ఎదుర్కోవాల్సి వచ్చింది. గతంలో ఇచ్చిన కొన్ని ఇంటర్వ్యూలలో చ‌ర్మిల తన కష్టాలను పంచుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు. సినిమా ఇండస్ట్రీలో ఉన్నప్పుడు ఎంతోమంది ఆప్యాయంగా పలకరించారని, కానీ కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరూ సహాయం చేయడానికి ముందుకు రాలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కొందరు తోటి నటులు మాత్రమే తనకు అంతోఇంతో సహాయం అందించారని గుర్తుచేసుకున్నారు. చ‌ర్మిల విషాదకర పరిస్థితిని తెలుసుకున్న సినీ అభిమానులు, నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. రీల్ లైఫ్‌లో ఎంతో సంతోషంగా కనిపించే నటీనటులు రియల్ లైఫ్‌లో ఇలాంటి కష్టాలు పడటం విచారకరమని కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం షర్మిల చిన్న చిన్న పాత్రలు, బుల్లితెర షోల ద్వారా మళ్లీ కంబ్యాక్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇండస్ట్రీ వర్గాలు ఆమెకు తగిన అవకాశాలు ఇచ్చి ఆదుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.
భారతీయ చిత్ర పరిశ్రమలో 'నేషనల్ క్రష్'గా పేరు తెచ్చుకున్న అందాల భామ రష్మిక మందన్న సరికొత్త ఘనతను సాధించింది. పాన్ ఇండియా స్థాయిలో వరుస అవకాశాలతో దూసుకుపోతున్న ఈ క్రేజీ హీరోయిన్, ప్రముఖ బాలీవుడ్ నటి దీపికా పదుకొణెను కూడా దాటేసి భారతదేశంలోనే అత్యంత పాపులర్ సెలబ్రిటీగా మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంది. ఐఎమ్‌డిబి (IMDb) విడుదల చేసిన అత్యంత ప్రాచుర్యం పొందిన భారతీయ తారల తాజా జాబితాలో రష్మిక మందన్న ప్రథమ స్థానంలో నిలిచింది. దేశవ్యాప్తంగా సినీ అభిమానుల నుంచి లభించిన ఆదరణ, సోషల్ మీడియా ట్రెండ్స్ మరియు ఆమె నటిస్తున్న సినిమాల క్రేజ్ ప్రాతిపదికన ఈ ర్యాంకింగ్స్‌ను ప్రకటించారు. ఈ రేసులో రష్మిక అగ్రస్థానాన్ని కైవసం చేసుకోగా, దీపికా పదుకొణె రెండవ స్థానానికి పరిమితమైంది. అంతేకాకుండా, సౌత్ లేడీ పవర్ హౌస్ సాయి పల్లవి ఈ జాబితాలో నాలుగో స్థానాన్ని దక్కించుకోవడం విశేషం. సౌత్ నటీమణులు జాతీయ స్థాయిలో ఈ స్థాయిలో హవా చాటడంపై సినీ వర్గాలు మరియు అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 'ఛలో' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన రష్మిక, తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. ఆ తర్వాత 'పుష్ప: ది రైజ్' మరియు 'పుష్ప: ది రూల్' సినిమాలతో గ్లోబల్ వైడ్‌గా గుర్తింపు తెచ్చుకుంది. బాలీవుడ్‌లో 'యానిమల్' వంటి భారీ బ్లాక్‌బస్టర్‌తో మరింత క్రేజ్ సంపాదించి, పాన్ ఇండియా రేంజ్‌లో తనదైన ముద్ర వేసింది. ప్రస్తుతం రష్మిక లైనప్ చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ సరసన నటిస్తూనే, వరుసగా బాలీవుడ్ మరియు సౌత్ బిగ్ ప్రాజెక్టులలో నటిస్తోంది. మరోవైపు సాయి పల్లవి కూడా పాన్ ఇండియా లెవల్లో నటిస్తున్న 'రామాయణ్' వంటి క్రేజీ చిత్రాలతో విశేషమైన క్రేజ్‌ను సొంతం చేసుకుంటోంది. సోషల్ మీడియా వేదికగా రష్మిక అభిమానులు ఈ అరుదైన మైలురాయిని విశేషంగా వేడుక చేసుకుంటున్నారు. "రియల్ నేషనల్ స్టార్ రష్మిక" అంటూ ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లలో హ్యాష్ ట్యాగ్‌లతో పోస్టులు పెడుతూ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. వరుస హిట్లు, పాన్ ఇండియా ప్రాజెక్టులతో దండయాత్ర చేస్తున్న రష్మిక మందన్న రాబోయే రోజుల్లో మరిన్ని రికార్డులను తిరగరాస్తుందని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇండియన్ సినీ హిస్టరీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సుస్థిరం చేసుకునే దిశగా ఈ నేషనల్ క్రష్ వేగంగా అడుగులు వేస్తోంది.       [Rashmika Mandanna IMDb Ranking, Rashmika Mandanna No 1 National Star, Sai Pallavi Top 4 IMDb, Deepika Padukone vs Rashmika, Telugu Cinema Popular Actresses]
The conversation around Toxic has largely been about the film itself, with audience reactions and criticism dominating social media. Just as that discussion has intensified, old videos of Allu Aravind have suddenly resurfaced, triggering a fresh round of debate. Interestingly, the statements being circulated are not new. They were made years ago and were originally discussed in the context of KGF and Yash’s growing pan-India popularity. Yet, the way they are being presented now creates an entirely different impression, with sections of social media attempting to turn them into an issue involving Yash and Kannada cinema. That raises the obvious question: why revive an old statement at this particular point? Allu Aravind’s comments were about the scale of KGF’s impact and how the film transformed Yash’s visibility beyond Karnataka. There is hardly anything controversial in acknowledging that KGF played a major role in establishing Yash as a pan-India star. Yash himself has repeatedly spoken about how dramatically the film changed his career. Bringing those comments back into the spotlight now inevitably shifts the discussion away from Toxic. Instead of debating the film, its content or its reception, social media is once again being pushed towards the familiar territory of fan wars, language pride and Telugu-Kannada comparisons. The narrative also becomes difficult to justify when viewed against Allu Aravind garu’s own association with Kannada cinema. Through distribution and other industry initiatives, he has supported the reach of Kannada films in Telugu markets, with Kantara being one of the most prominent examples of a Kannada film finding a strong audience in the Telugu states. There was never a genuine Telugu-versus-Kannada issue here. Turning an old statement into a fresh controversy, precisely when Toxic is facing scrutiny, only changes the subject of the conversation. Whether that shift is intentional or not, the effect is the same: the debate moves from the film to a manufactured industry and fan-war narrative. Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
  కళకి, కులం, మతం, ప్రాంతం ఉండదు. ఉందని అనుకునే వాళ్ళని చూసి సినిమాతో పాటు నటుల అభిమానులు, సినీ లవర్స్, ప్రేక్షకులు నవ్వుకుంటూ అవేమి ఉండవని  ఎంతో మంది నటుల్ని ఉదాహరణగా చూపిస్తూ ఉంటారు. అలాంటి ఒక నటుడు ప్రకాష్ రాజ్.నటనలో ఎన్ని రకాల కోణాలు ఉన్నాయో, కొత్తగా ఎన్ని కోణాలు పుడతాయో వాటన్నిటిలో లబ్ధప్రతిష్టుడు. కొంత గ్యాప్ తర్వాత తెలుగు ప్రేక్షకులని తన నటనతో  అలరించేందుకు ‘జగమే సంగీతం’ అనే అద్భుతమైన మ్యూజికల్ వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.  అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా సెప్టెంబర్ 4, 2026 నుండి ప్రసారం కానున్న ఈ సిరీస్‌లో ప్రకాష్ రాజ్ ‘శాస్త్రి’ అనే అత్యంత కీలకమైన, క్రమశిక్షణ కలిగిన సంగీత విద్వాంసుడి రోల్ లో కనిపించబోతున్నాడు. అయితే ఇదే సమయంలో ప్రకాష్ రాజ్ అభిమానులు, ప్రేక్షకులు, మూవీ లవర్స్  సోషల్ మీడియా వేదికగా ప్రకాష్ రాజ్ కి  ఒక ప్రత్యేకమైన మనవి చేస్తున్నారు. 'సార్ మీరు చాలా అద్భుతమైన యాక్టర్. మీరు సెల్యులాయిడ్ పై నటిస్తుంటే మేము పొందే ఆనందం అంతా ఇంతా కాదు. కానీ గత కొన్నాళ్లుగా మీరు రాజకీయపరమైన ,సామాజిక అంశాలపై వ్యాఖ్యలు చేస్తూ అనవసర వివాదాల్లో చిక్కుకుంటున్నారు. ఈ వివాదాలు మీ  అద్భుతమైన నటనని , సినిమాలని  కొంతవరకు పక్కకు నెట్టివేస్తున్నాయి. దయచేసి ఎలాంటి వివాదాల జోలికీ వెళ్లకుండా,  పొలిటికల్ కాంట్రవర్సీలకు దూరంగా ఉంటూ కేవలం సినిమాలపైనే దృష్టి పెట్టండి" అని సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.      Also Read: ఫేక్ కాస్టింగ్ కాల్స్: హెచ్చరించిన నిర్మాణ సంస్థ 'జగమే సంగీతం’ విషయానికి వస్తే  సుప్రసిద్ధ ‘బండిష్ బండిట్స్’ ఆత్మతో తెరకెక్కిన ఈ సిరీస్‌ను దర్శకుడు పల్నాటి సూర్యప్రతాప్ రూపొందించగా, సుష్మిత కొణిదెల గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నిర్మించారు. తరతరాల సంగీత వారసత్వాన్ని కాపాడుకోవాలనే తపన, కుటుంబ బాధ్యతలు, మనుషుల మధ్య భావోద్వేగాల చుట్టూ సాగే ఈ కథలో ప్రకాష్ రాజ్ నటన ప్రధాన ఆకర్షణగా నిలవబోతోంది.      [ Prakash Raj, jagame sangeetham, Prakash Raj Fans Request, Telugu Cinema, Telugu Cinema  News, Tollywood, Tollywoodnews ]    
తమిళంలో క్రైమ్ మరియు సస్పెన్స్ కథాంశాలకు ఎప్పుడూ మంచి ఆదరణ ఉంటుంది. అదే బాటలో ఇవానా, వెంకట్ సెంగుట్టువన్ ముఖ్య పాత్రల్లో నటించిన చిత్రం 'మథి మారన్'. మంత్ర వీరపాండియన్ దర్శకత్వంలో రూపొందిన ఈ ఇన్వెస్టిగేటివ్ డ్రామా ప్రస్తుతం ప్రముఖ డిజిటల్ ప్లాట్‌ఫామ్ 'అమెజాన్ ప్రైమ్'లో అందుబాటులోకి వచ్చింది. ఈ చిత్రం ఓటీటీ వీక్షకులను ఏ మేర మెప్పించిందో ఇప్పుడు చూద్దాం. కథ విషయానికి వస్తే.. సుందరం అనే పోస్ట్‌మ్యాన్‌కు మథి (ఇవానా), నెడుమారన్ (వెంకట్) అనే కవల పిల్లలు ఉంటారు. అయితే నెడుమారన్ శారీరక ఎదుగుదల లేక పొట్టిగా ఉండిపోతాడు. సమాజంలో ఎదురయ్యే అవహేళనలను తట్టుకుంటూ అక్క మథి మద్దతుతో అతను పెరుగుతాడు. అయితే అనుకోని పరిస్థితుల్లో మథి ప్రేమించిన వ్యక్తితో వెళ్లిపోవడం, తల్లిదండ్రులు మనస్తాపంతో చనిపోవడంతో కథ మలుపు తిరుగుతుంది. తన అక్కను వెతుక్కుంటూ చెన్నై నగరానికి చేరుకున్న నెడుమారన్‌కు అక్కడ వరుసగా జరుగుతున్న దారుణ హత్యల గురించిన నిజాలు తెలుస్తాయి. ఓవైపు అక్క జాడ కనుక్కోవడం, మరోవైపు పోలీస్ వ్యవస్థతో కలిసి ఆ హంతకుడిని పట్టుకోవడానికి నెడుమారన్ ఏం చేశాడు? తన తెలివితేటలతో ఆ మిస్టరీని ఎలా చేధించాడు అనేది మిగతా కథాంశం. మనిషి ప్రతిభకు రూపం లేదా ఎత్తు ప్రమాణం కాదని, కేవలం తెలివితేటలే ముఖ్యమనే ఆసక్తికరమైన లైన్‌తో దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. నటుడిగా వెంకట్ తన పాత్రలో ఒదిగిపోగా, ఇవానా గ్లామర్ మరియు నటనతో అలరించింది. సాంకేతికంగా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మరియు ఛాయాగ్రహణం పర్వాలేదనిపిస్తాయి. అయితే, సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాల్లో ఉండాల్సిన ఉత్కంఠత ఈ చిత్రంలో కాస్త కొరవడింది. సాధారణ పౌరుడైన కథానాయకుడు పోలీస్ ఇన్వెస్టిగేషన్ నిర్వహించడం వంటి సన్నివేశాలు సహజత్వానికి దూరంగా అనిపిస్తాయి. స్క్రీన్‌ప్లేలో మెరుపులు లేకపోవడం, నెమ్మదించిన కథనం సినిమా గ్రాఫ్‌ను తగ్గిస్తాయి. ఓటీటీ వేదికలపై సరికొత్త కథలను చూడాలనుకునే ప్రేక్షకులు, తమిళ క్రైమ్ డ్రామాలను ఇష్టపడేవారు ఒకసారి ప్రయత్నించవచ్చు. అయితే కమర్షియల్ హంగులు, రొటీన్ మాస్ ఎలిమెంట్స్ ఆశించేవారికి ఇది అంతగా కనెక్ట్ కాకపోవచ్చు. మొత్తానికి 'మథి మారన్' ఒక మంచి ఆశయంతో తీసిన ప్రయత్నం అయినప్పటికీ, లీడ్ సీన్లు మరియు బలహీనమైన కథనం వల్ల సగటు క్రైమ్ డ్రామాగానే మిగిలిపోయింది. వీకెండ్‌లో ఓటీటీలో ఏదైనా భిన్నమైన లైన్ ఉన్న సినిమా చూడాలనుకుంటే ఒకసారి వీక్షించవచ్చు.     [Mathi Maran Movie Review, Mathi Maran Amazon Prime, Ivana Mathi Maran Telugu Review, Mathi Maran OTT Release, Venkat Senguttuvan Mathi Maran]
Allari Naresh’s upcoming fantasy comedy Ramba Oorvasi Menaka has completed its censor formalities ahead of its theatrical release. The film has been awarded a U/A certificate by the censor board and has locked a runtime of 2 hours and 20 minutes. Directed by Chandra Mohan, the film combines fantasy and comedy with a mother sentiment track. While Allari Naresh leads the narrative, the film also features senior actor Naresh VK, with their combination scenes reportedly forming an important part of the comedy. The fantasy portions revolve around Rashi Singh as Ramba and Vennela Kishore as Lord Indra. Their track is said to feature several comedy sequences and one-liners. Vishnu Priya and Trisha Singh play Oorvasi and Menaka respectively, while Surbhi is the female lead. Produced by Annapurna Studios and Hasya Movies, Ramba Oorvasi Menaka also relies heavily on fantasy elements and VFX. The film is scheduled to release worldwide tomorrow, with the makers looking to position it as a family-oriented comedy entertainer. Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
కన్నడ చిత్ర పరిశ్రమలో స్టార్ నటుడిగా గుర్తింపు పొంది, తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడైన దునియా విజయ్ వైవాహిక జీవితం ముగిసింది. గత కొంతకాలంగా సాగుతున్న విజయ్ మరియు ఆయన భార్య నాగరత్న వివాదానికి న్యాయస్థానం ఎండ్ కార్డ్ వేసింది. వీరికి విడాకులు మంజూరు చేస్తూ కర్ణాటక హైకోర్టు తాజాగా సంచలన తీర్పును వెలువరించింది. ఈ విడాకుల పిటిషన్‌పై సమగ్ర విచారణ జరిపిన న్యాయస్థానం నాగరత్నకు ఏకమొత్తంగా రూ.2 కోట్ల భరణం చెల్లించాలని దునియా విజయ్‌ని ఆదేశించింది. రెండు నెలల వ్యవధిలో ఈ మొత్తాన్ని అందించాలని, ఒకవేళ ఆలస్యమైతే ఏటా 6 శాతం వడ్డీతో చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. జస్టిస్ డి.కె. సింగ్, జస్టిస్ హెచ్. శాంతి భూషణ్‌లతో కూడిన ధర్మాసనం ఈ తీర్పును ప్రకటించింది. పిల్లల భవిష్యత్తు, నాగరత్న పరిస్థితులు మరియు నటుడిగా విజయ్ ఆర్థిక స్థితిగతులను పరిగణనలోకి తీసుకుని కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. గతంలో ఫ్యామిలీ కోర్టు విజయ్ విడాకుల అభ్యర్థనను తోసిపుచ్చినప్పటికీ, దంపతుల నడుమ సత్సంబంధాలు దెబ్బతిని తిరిగి కలిసే అవకాశం లేకపోవడంతో హైకోర్టు ఈ కేసును పరిష్కరించింది. ఈ సందర్భంగా రీల్ లైఫ్‌లోనే కాకుండా రియల్ లైఫ్‌లోనూ ప్రముఖులు మంచి విలువలు పాటించాలని కోర్టు వ్యాఖ్యానించింది. సొంతంగా నటుడిగా ఎదిగిన దునియా విజయ్ 2007లో వచ్చిన 'దునియా' సినిమాతో కన్నడలో తిరుగులేని ఇమేజ్ సాధించారు. ఆ తర్వాత వైవిధ్యమైన పాత్రలు, యాక్షన్ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా వచ్చిన బ్లాక్‌బస్టర్ మూవీ 'వీరసింహారెడ్డి'లో ప్రతినాయకుడిగా ముసలిమడుగు ప్రతాప్ రెడ్డి పాత్రలో నటించి తెలుగు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నారు. ప్రస్తుతం ఆయన నటనతో పాటు దర్శకత్వ బాధ్యతలు కూడా నిర్వర్తిస్తూ బిజీగా ఉన్నారు. అంతేకాకుండా, ఆయన స్వీయ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న 'సిటీ లైట్స్' అనే ప్రాజెక్ట్ ద్వారా విజయ్ కుమార్తె మోనిషా కథానాయికగా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెడుతోంది. దునియా విజయ్ విడాకుల వ్యవధి తీర్పు వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలోనూ, కన్నడ సినీ వర్గాల్లోనూ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అభిమానులు ఈ పరిణామంపై భిన్న రకాలుగా స్పందిస్తూ ఆయనకు మద్దతు తెలుపుతున్నారు. వ్యక్తిగత జీవితంలో ఎన్ని ఒడిదొడుకులు ఎదురైనప్పటికీ, విజయ్ తన రాబోయే చిత్రాల ద్వారా ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు. త్వరలోనే ఆయన కుమార్తె మోనిషా ప్రాజెక్ట్‌కి సంబంధించిన మరిన్ని విశేషాలు వెలువడనున్నాయి.
  నిర్మాణ సంస్థలకి డై హర్డ్ ఫ్యాన్స్ ఉంటారని నిరూపించిన సంస్థ 'వైజయంతీ మూవీస్’. హీరోల అభిమానులకైతే తమ హీరో  'వైజయంతీ మూవీస్’ లో సినిమా చేస్తున్నాడని అనౌన్స్ మెంట్ రావడం ఆలస్యం అభిమానులు రోమాలు నిక్కబొడుచుకుంటాయి. అంతటి ప్రెస్టేజియస్ట్ నిర్మాణ సంస్థ. ప్రస్తుతం ప్రభాస్ తో కల్కి 2 తెరకెక్కిస్తుంది.  ఇప్పుడు  ఈ సంస్థ  పేరు ఉపయోగించి  నటీనటులుగా మారాలనుకునే అమాయక యువతని కొంత మంది మోసం చేస్తున్నారు. దీంతో  'వైజయంతీ' నుంచి ఒక నోట్ రిలీజయ్యింది.  ఆ నోట్ లో 'తమ బ్యానర్ నిర్మిస్తున్న ఏ సినిమాకూ ఎలాంటి మూడో వ్యక్తి, ఏజెన్సీ లేదా థర్డ్ పార్టీ కాస్టింగ్ ఏజెంట్లను నియమించలేదు. మా నిర్మాణ సంస్థ పేరుతో ఎవరైనా మిమ్మల్ని సంప్రదించి, ఆడిషన్స్ ఇప్పిస్తామని, అవకాశాలు ఇప్పిస్తామని నమ్మబలికినా, డబ్బులు లేదా ఇతర రుసుములు డిమాండ్ చేసినా  నమ్మకండి. సినిమా రంగంలో అవకాశాల కోసం ప్రయత్నించే క్రమంలో 100 శాతం అధికారిక సమాచారాన్ని మాత్రమే ప్రామాణికంగా తీసుకోవాలి. వైజయంతీ మూవీస్ చేపట్టే ప్రతి ఒక్క అధికారిక ఆడిషన్, కాస్టింగ్ కాల్ ప్రకటన కేవలం తమ అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్స్, వెరిఫైడ్ ఖాతాల ద్వారా మాత్రమే వెలువడుతుంది. కాబట్టి సామాజిక మాధ్యమాల్లో వచ్చే అన్  వెరిఫైడ్ పోస్టులు, ఈమెయిళ్లు, ఫోన్ కాల్స్ నమ్మి ఎవరూ మోసపోవద్దని, తమ వ్యక్తిగత సమాచారాన్ని లేదా సొమ్మును ఎవరికీ అందజేయవద్దని గట్టిగా హెచ్చరించింది.     Also read: చిరంజీవి రుద్రవీణ గుర్తుకొచ్చింది: సోషల్ మీడియాని షేక్ చేస్తున్న న్యూస్  అంతేకాకుండా తమ సంస్థ పేరుని  అక్రమంగా వాడుకుంటూ ఫేక్ కాస్టింగ్ కాల్స్ నిర్వహిస్తున్న వారిపై, ప్రజలను మభ్యపెడుతున్న సైబర్ క్రిమినల్స్‌పై కఠినమైన చట్టపరమైన, క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఇప్పటికే బాధ్యులపై ఐటీ చట్టాల ప్రకారం ఫిర్యాదు చేయడానికి చర్యలు సిద్ధం చేశామని వైజయంతి సంస్థ పేర్కొనడం సంచలనం సృష్టిస్తుంది.  [ Vyjayanthi Movies, Prabhas, Ashwinidutt, Fake Casting Calls, Telugu Cinema, Telugu Cinema  News, Tollywood, Tollywoodnews ]  
నటీనటులు: దుల్కర్ సల్మాన్, కాయదు లోహర్, మిస్కిన్, సంయుక్త విశ్వనాథన్, ఆంటోనీ వర్గీస్, కదిర్ సాంకేతిక బృందం: స్క్రీన్ ప్లే: ఇస్మాయిల్ అబూబకర్, సంజీర్ బాబా, బిలాల్ మొయిదు సంగీతం: జేక్స్ బిజోయ్ సినిమాటోగ్రఫీ: జిమ్షీ ఖలీద్ ఎడిటింగ్: చమన్ చాకో దర్శకత్వం: నహాస్ హిదాయత్ నిర్మాతలు: దుల్కర్ సల్మాన్, జోమ్ వర్గీస్ తెలుగు రాష్ట్రాల్లో దుల్కర్ సల్మాన్‌ (Dulquer Salmaan) కు మంచి క్రేజ్ ఉంది. 'కింగ్ ఆఫ్ కోత' తర్వాత మూడేళ్ల గ్యాప్ తీసుకున్న ఆయన, ఎట్టకేలకు ఐ యామ్ గేమ్ (I'M Game)తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. పలు వాయిదాల తర్వాత ఈరోజు విడుదలైన ఈ చిత్రానికి 'RDX' ఫేమ్ నహాస్ హిదాయత్ (Nahas Hidayath) దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలో చూద్దాం. కథ: డాన్ జాన్ (దుల్కర్ సల్మాన్) గ్యాంబ్లింగ్‌కు బానిస. అందరూ అతన్ని 'లూజర్' అని పిలుస్తుంటారు, అతని తండ్రి కూడా అలాగే ట్రీట్ చేస్తాడు. అప్పుల నుంచి బయటపడేయడానికి అతని తల్లి (Jayasudha) తన జీవితకాలపు పొదుపు మొత్తాన్ని ఇస్తుంది. కానీ అతను ఆ డబ్బును కూడా సీపీఎల్ ఫైనల్ మ్యాచ్‌పై పందెం కాసి, ఏకంగా రూ. 2 కోట్ల అప్పుల్లో కూరుకుపోతాడు. ఆ బెట్టింగ్ గ్యాంగ్స్టర్‌ను బెదిరించబోయి, ఒక ప్రమాదంలో తన కుడి చేతిని కోల్పోతాడు. దాత విక్కీ (Anthony Varghese) చేతిని డాన్‌కు అమరుస్తారు. అయితే ఆ కొత్త చేయి తనకంటూ ఒక వ్యక్తిత్వం ఉన్నట్లుగా ప్రవర్తిస్తూ, డాన్ జీవనశైలిని మార్చేలా చేస్తుంది. దాని ప్రభావం నుంచి డాన్ బయటపడలేకపోతాడు. ఆ చేతి ప్రభావంతోనే డాన్, డేవిడ్ (Mysskin) అనే గ్యాంగ్స్టర్‌ను వెంటాడతాడు. అసలు విక్కీకి, డేవిడ్‌కి మధ్య ఉన్న సంబంధం ఏంటి? పూర్తి నిజం తెలుసుకున్న తర్వాత డాన్ ఏం చేశాడు? అనేది మిగతా కథ. విశ్లేషణ: యాక్షన్ సన్నివేశాల్లో దుల్కర్ సల్మాన్ నటన బాగుంది. తెరపై అతని ప్రెజెన్స్ వల్ల సీన్స్ అన్నీ సహజంగా అనిపిస్తాయి. చాలా సన్నివేశాల్లో అతని ఛార్మ్ ఆకట్టుకున్నా, కొన్నిచోట్ల యాక్షన్ సీన్స్ మరీ సాగదీసినట్లు అనిపిస్తాయి. కాయదు లోహర్, సంయుక్త విశ్వనాథన్, కదిర్, మిస్కిన్, ఆంటోనీ వర్గీస్ తమ పాత్రల పరిధి మేర నటించారు, కానీ ఎవరూ అంతగా ఇంపాక్ట్ చూపించలేకపోయారు. కదిర్ పాత్రను ఇంకాస్త మెరుగ్గా రాసుకోవాల్సింది. దర్శకుడు నహాస్ హిదాయత్ మంచి పాయింట్ ఎంచుకున్నప్పటికీ, రొటీన్ సన్నివేశాలతో దాన్ని కేవలం యాక్షన్ కోసమే వాడుకున్నట్లు అనిపిస్తుంది. క్రికెట్ బెట్టింగ్ ట్రాక్, ఆ తర్వాత వచ్చే ఫైట్ బాగా డిజైన్ చేసినా... ఆ తర్వాత స్క్రీన్ ప్లే సాధారణంగానే సాగుతుంది. క్లైమాక్స్ వైపు వెళ్తున్నప్పుడు కథ బాగా సాగదీసిన ఫీలింగ్ కలుగుతుంది. దుల్కర్ తన నటనతో సినిమాను నిలబెట్టడానికి ప్రయత్నించినప్పటికీ, ఫస్ట్ హాఫ్ ఇచ్చిన మంచి కిక్ సెకండ్ హాఫ్‌లో మిస్ అవుతుంది. యాక్షన్ ఎక్కువున్న ద్వితీయార్థం ఒక రెగ్యులర్ కమర్షియల్ సినిమా లాగా మారిపోయింది. టెక్నికల్ గా జేక్స్ బిజోయ్ సంగీతం, సినిమాటోగ్రఫీ, వీఎఫ్ఎక్స్ బాగున్నాయి. కానీ ఎడిటింగ్ కొన్ని చోట్ల అతుకులు అతికించినట్లుగా ఉంటుంది. మొత్తంగా చెప్పాలంటే, మంచి కథాంశం ఉన్నప్పటికీ రొటీన్ స్క్రీన్ ప్లే సినిమా స్థాయిని తగ్గించేసింది. ప్లస్ పాయింట్స్: దుల్కర్ సల్మాన్ నటన కాయదు లోహర్ సన్నివేశాలు ఆంటోనీ వర్గీస్ ఫ్లాష్ బ్యాక్ సంగీతం కొన్ని యాక్షన్ సన్నివేశాలు మైనస్ పాయింట్స్: రొటీన్ స్క్రీన్ ప్లే సెకండ్ హాఫ్ సాగదీత కొన్ని రొటీన్ సన్నివేశాలు ఎడిటింగ్ లోపాలు కథాంశం పక్కదారి పట్టడం బాటమ్ లైన్: దుల్కర్ సల్మాన్ నటన బాగున్నప్పటికీ, రొటీన్ కథనం వల్ల కాస్త నిరాశే మిగులుతుంది. యాక్షన్ సినిమాలు ఇష్టపడేవారు ఒకసారి చూడొచ్చు. రేటింగ్:  2.5/5   డిస్క్లైమర్: ఈ రివ్యూలో వ్యక్తపరిచిన అభిప్రాయాలు రచయిత వ్యక్తిగతమైనవి. దీనికి సంస్థకు ఎలాంటి బాధ్యత లేదు. పాఠకులు తమ సొంత విచక్షణతో నిర్ణయం తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము.
    రుద్రవీణ.. నటనకి, పాటలకి, సాహిత్యానికి, దర్శకత్వానికి మరణం ఉండదని నిరూపించిన ఆణిముత్యం లాంటి సినిమా.. తెలుగు సినిమా గర్వంగా చెప్పుకునే సినీ శిఖరం కూడా. మెగాస్టార్ చిరంజీవితో పాటు ఆయన అభిమానులకి ఫేవరేట్ మూవీతో పాటు సాంగ్స్ అయితే నిత్యం ఎక్కడో ఒక చోట వినిపిస్తుండంతో పాటు ఎంతో మందిలో దైర్యం, కరుణ, ప్రేమ, సమాజంపట్ల బాధ్యతగా ఉండేలా చేసింది.  'డెడ్ పిక్సెల్స్', 'కుమారి శ్రీమతి', 'హాస్టల్ డేస్' వంటి హిట్ సిరీస్‌లలో తన నటనతో అలరించిన  అక్షయ్ లగుసాని  'ఇప్పుడు ప్రైమ్ వీడియోలో రాబోతున్న 'జగమే సంగీతం' అనే మ్యూజికల్ డ్రామా వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సందర్భంగా అక్షయ్ మాట్లాడుతూ 'నాకు ఈ కథ ఆఫర్ రాగానే మొదటగా గుర్తుకు వచ్చింది మెగాస్టార్ చిరంజీవి  క్లాసిక్ మూవీ  'రుద్రవీణ' . సంగీతం నేపథ్యంగా సాగే కుటుంబ బంధాలు, సాంప్రదాయాలు, తరాల మధ్య ఘర్షణ అనేవి తెలుగు ప్రేక్షకులకు ఎప్పుడూ గుండెకు హత్తుకునే అంశాలు. 'జగమే సంగీతం'లో నటించడం నా కెరీర్‌లోనే అత్యంత భావోద్వేగాలతో కూడిన ప్రయాణం. వైకుంఠపురం అనే పుణ్యక్షేత్రం నేపథ్యంలో సాగే ఈ కథలో సంగీత వారసత్వాన్ని కాపాడుకోవడం, సొంత గుర్తింపును వెతుక్కోవడం వంటి కీలకమైన అంశాలను దర్శకుడు పల్నాటి సూర్యప్రతాప్ చాలా అద్భుతంగా తెరకెక్కించారని అక్షయ్ చెప్పుకొచ్చాడు.     Also Read: ఇక నుంచి థియేటర్స్ లో సరికొత్త వెర్షన్: ఈ సారి రొమాన్స్ అంతకు మించి  ఈ సిరీస్‌ను గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై సుస్మిత కొణిదెల నిర్మించగా, ప్రముఖ నటులు ప్రకాష్ రాజ్,  శ్రీకాంత్, మధుబాల, సుస్మిత శెట్టి కీ రోల్స్ . సంగీత దర్శకుడు విశాల్ చంద్రశేఖర్ అందించిన వీనులవిందైన స్వరాలు  ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. ఒక శతాబ్ద కాలపు సంగీత సాంప్రదాయాన్ని, పాప్ సంగీత ప్రపంచాన్ని జతచేస్తూ రూపొందించిన ఈ వెబ్ సిరీస్, ఓటీటీ వేదికపై ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటుందని చిత్రబృందం కూడా ప్రచార కార్యక్రమాల్లో  ధీమా వ్యక్తం చేస్తోంది. సెప్టెంబర్ 4 నుండి ఏమినిది  ఎపిసోడ్ల వెబ్ సిరీస్ గా రానుంది.      [ Chiranjeevi, Prakash Raj, Palnati Surya Pratap, Jagamae Sangeetham, Telugu Cinema, Telugu Cinema  News, Tollywood, Tollywoodnews]      
  మనదేశంలో చాలామందికి ఉదయాన్నే లేవగానే వేడివేడిగా ఒక కప్పు టీ పడాల్సిందే. అలసటను పారద్రోలి శరీరానికి, మనస్సుకు తక్షణ ఉత్సాహాన్ని ఇవ్వడంలో టీ కీలక పాత్ర పోషిస్తుంది. రోజుకు ఒకటి రెండు కప్పుల టీ తాగడం సాధారణ అలవాటు అయినప్పటికీ, చాలామంది రోజులో పదే పదే టీ తాగుతుంటారు. అయితే, ఇలా పరిమితికి మించి ఎక్కువ మొత్తంలో టీ తాగడం వల్ల ఎముకలు బలహీనపడతాయని, శరీరంలో కాల్షియం స్థాయిలు గణనీయంగా పడిపోతాయని సోషల్ మీడియాలో నిరంతరం వార్తలు ప్రచారమవుతుంటాయి. ఈ ప్రచారం వినగానే టీ ప్రేమికుల్లో తీవ్ర ఆందోళన మొదలవుతుంది. అసలు టీ తాగడానికి, ఎముకల ఆరోగ్యానికి మధ్య ఉన్న అసలు సంబంధం ఏమిటి? అతిగా టీ తాగడం వల్ల ఎముకల సాంద్రత తగ్గి ఆస్టియోపోరోసిస్ వంటి ప్రమాదకర సమస్యలు వస్తాయా? ఈ విషయాలపై వైద్య నిపుణులు మరియు పరిశోధకులు వెల్లడించిన శాస్త్రీయ నిజాలను వివరంగా తెలుసుకోవడం ఆరోగ్య స్పృహ ఉన్న ప్రతి ఒక్కరికీ ఎంతో అవసరం. పరిశోధనల ప్రకారం టీలో  కెఫిన్  అనే సమ్మేళనం ప్రతి ఒక్కరికీ తెలిసిందే. ప్రతి కప్పు టీలో దాదాపు 30 నుండి 50 మిల్లీగ్రాముల వరకు కెఫిన్ ఉంటుంది. మనం అధిక మొత్తంలో కెఫిన్ తీసుకున్నప్పుడు, అది మూత్రపిండాల (కిడ్నీల) ద్వారా శరీరంలోని కాల్షియం మూత్రం రూపంలో బయటకు విసర్జించబడేలా చేస్తుంది. సాధారణంగా మనం ప్రతి 60 మిల్లీగ్రాముల కెఫిన్ తీసుకున్నప్పుడు, శరీరం నుండి సుమారు 1 నుండి 2 మిల్లీగ్రాముల కాల్షియం నష్టపోతామని వైద్య అధ్యయనాలు సూచిస్తున్నాయి. అంటే రోజుకు 4 నుండి 5 కప్పుల కంటే ఎక్కువ మోతాదులో టీ తాగే వారిలో కాల్షియం లోపం ఏర్పడే అవకాశాలు స్వల్పంగా పెరుగుతాయి. ముఖ్యంగా, మనం తీసుకునే రోజువారీ ఆహారంలో కాల్షియం శాతం తక్కువగా ఉన్నప్పుడు, ఈ కెఫిన్ ప్రభావం ఎముకల ఆరోగ్యంపై స్పష్టంగా కనిపిస్తుంది. ఎముకల నుండి కాల్షియం కరిగిపోవడం వల్ల వయసు పెరిగే కొద్దీ ఎముకలు లొసుగుబారి, త్వరగా విరిగిపోయే ప్రమాదం ఏర్పడుతుంది. అయితే ఇక్కడే మరొక ఆసక్తికరమైన సైంటిఫిక్ కోణం దాగి ఉంది. టీలో కేవలం కెఫిన్ మాత్రమే కాకుండా  ఫ్లేవనాయిడ్లు  (Flavonoids) మరియు  ఫైటోఈస్ట్రోజెన్లు  అనే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎముకల క్షీణతను అడ్డుకోవడంలో మరియు ఎముకల సాంద్రతను (Bone Mineral Density) మెరుగుపరచడంలో ఎంతో సాయపడతాయి. ముఖ్యంగా గ్రీన్ టీ మరియు బ్లాక్ టీలలో ఉండే పాలిఫెనాల్స్ అనే కాంపౌండ్లు ఎముకలను పునర్నిర్మించే  ఆస్టియోబ్లాస్ట్  కణాల పనితీరును వేగవంతం చేస్తాయని, అదే సమయంలో ఎముకలను కరిగించే  ఆస్టియోక్లాస్ట్  కణాల చర్యలను అదుపు చేస్తాయని రీసెర్చ్‌లో తేలింది. కాబట్టి మిితంగా అంటే రోజుకు 2 నుండి 3 కప్పుల టీ తాగే వారిలో ఎముకలు బలహీనపడటం అటుంచి, పైగా ఎముకల ఆరోగ్యం మరింత బలపడుతుందని బహుళ అధ్యయనాలు నిరూపించాయి. మరి టీ తాగే అలవాటు ఉన్నవారు ఎముకల బలాన్ని కాపాడుకోవడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మొదటిది టీ తాగే పరిమాణాన్ని రోజుకు 2 లేదా 3 కప్పులకు పరిమితం చేసుకోవడం చాలా మంచిది. రెండవది, టీ చేసేటప్పుడు అందులో తగినంత పాలు ఉపయోగించడం వల్ల, టీ ద్వారా కోల్పోయే స్వల్ప కాల్షియంను పాలలోని ఉత్కృష్టమైన కాల్షియం భర్తీ చేస్తుంది. భోజనం చేసిన వెంటనే లేదా ఐరన్, కాల్షియం సప్లిమెంట్లు తీసుకునే సమయంలో టీ తాగకపోవడం ఉత్తమం, ఎందుకంటే టీలోని టాన్సిన్లు పోషకాల శోషణను అడ్డుకుంటాయి. మీ రోజువారీ ఆహారంలో పాలు, పెరుగు, ఆకుకూరలు, రాగులు మరియు విటమిన్ డి లభించే పదార్థాలను సమృద్ధిగా చేర్చుకుంటే టీ వల్ల ఎముకలకు ఎలాంటి నష్టం జరగదు. కాబట్టి టీని పరిమితంగా, సరైన పద్ధతిలో ఆస్వాదిస్తే ఆరోగ్యానికి ఎలాంటి భయం లేదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. How much tea is safe for bones,tea and bone health myths vs reality.
  మన శరీరం మన ఆరోగ్య స్థితికి సంబంధించి నిరంతరం అనేక రకాల సంకేతాలను ఇస్తూనే ఉంటుంది. అందులోనూ ముఖ్యంగా శ్వాసకోశ వ్యవస్థలో ఉత్పత్తయ్యే శ్లేష్మం లేదా తెమడ (Phlegm) రంగును బట్టి మన ఊపిరితిత్తులు మరియు గొంతు ఎంత ఆరోగ్యంగా ఉన్నాయో చాలా సులభంగా అంచనా వేయవచ్చు. వర్షాకాలం, చలికాలం లేదా వాతావరణంలో మార్పులు వచ్చినప్పుడు దగ్గుతో పాటు తెమడ రావడం సర్వసాధారణం. అయితే చాలామంది ఈ తెమడ రంగును ఏమాత్రం పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తుంటారు. సైంటిఫిక్ అధ్యయనాల ప్రకారం శ్లేష్మం రంగు మన శరీరంలో ఏ రకమైన ఇన్ఫెక్షన్ లేదా వ్యాధి ముదిరిందో స్పష్టంగా తెలియజేస్తుంది. కాబట్టి తెమడ వేర్వేరు రంగుల్లోకి మారడం వెనుక ఉన్న ఆరోగ్య రహస్యాలను, వైద్య సంకేతాలను ప్రతీ ఒక్కరూ అవగాహన చేసుకోవడం ఎంతైనా అవసరం. సాధారణంగా ఆరోగ్యకరమైన మనుషుల్లో తెమడ స్పష్టంగా, పారదర్శకంగా (Clear Phlegm) లేదా స్వల్పమైన తెలుపు రంగులో ఉంటుంది. నీరు, ప్రొటీన్లు, యాంటిబాడీలు మరియు లవణాలతో కూడిన ఈ పారదర్శక తెమడ శ్వాసకోశ మార్గాలను తేమగా ఉంచడానికి, బయటి నుండి వచ్చే దుమ్ము ధూళిని అడ్డుకోవడానికి సహజ రక్షణ కవచంలా పనిచేస్తుంది. అయితే ఒకవేళ ఈ తెమడ విపరీతంగా పెరిగితే అలర్జీలు లేదా ఎలర్జిక్ రినిటిస్ వంటి సమస్యలు ఉన్నాయని అర్థం చేసుకోవాలి. ఇక తెమడ కాస్త చిక్కగా మారి తెల్లటి రంగులోకి (White Phlegm) మారితే, శ్వాసనాళాల్లో వాపు లేదా వైరల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయని సూచిస్తుంది. ముఖ్యంగా ఆస్తమా, బ్రోన్కైటిస్ లేదా నెమ్ము (Congestion) చేసినప్పుడు పిండం లాంటి చిక్కటి తెల్ల తెమడ రావడం కనిపిస్తుంది. అత్యంత సాధారణంగా చాలామందిలో కనిపిచేది పసుపు లేదా ఆకుపచ్చ రంగు తెమడ (Yellow or Green Phlegm). తెమడ పసుపు రంగులోకి మారడం అనేది మన నిరోధక వ్యవస్థ ఇన్ఫెక్షన్‌తో పోరాడటం ప్రారంభించిందనడానికి స్పష్టమైన సంకేతం. శరీరంలో వైట్ బ్లడ్ సెల్స్ (తెల్ల రక్త కణాలు) బాక్టీరియాతో పోరాడి చనిపోయినప్పుడు అందులోని మైలోపెరాక్సిడేస్ అనే ఎంజైమ్ వల్ల శ్లేష్మం పసుపు నుంచి క్రమంగా ముదురు ఆకుపచ్చ రంగులోకి మారుతుంది. ఇది తీవ్రమైన బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్, సైనసైటిస్, నిమోనియా లేదా సిస్టిక్ ఫైబ్రోసిస్ వంటి తీవ్రమైన శ్వాసకోశ వ్యాధులకు నిదర్శనం. కాబట్టి తెమడ ఆకుపచ్చగా మారి కొన్ని రోజులకు పైగా ఉంటే వెంటనే యాంటీబయోటిక్ చికిత్స కోసం డాక్టర్‌ను సంప్రదించాలి.       Blood in phlegm symptoms and lung health, phlegm color meaning and infection signs.
  నేటి ఆధునిక జీవనశైలిలో వేగంగా బరువు తగ్గడానికి మరియు పొట్ట వద్ద పేరుకుపోయిన కొవ్వును కరిగించుకోవడానికి అనేకమంది ఆశ్రయిస్తున్న ప్రసిద్ధ పద్ధతుల్లో  డిటాక్స్ వాటర్  ఒకటి. నీళ్లలో నిమ్మకాయ ముక్కలు, దోసకాయ, అల్లం, పుదీనా, లేదా రకరకాల పండ్ల ముక్కలు వేసి నానబెట్టి, ఆ నీటిని రోజంతా తాగడం వల్ల శరీరంలోని వ్యర్థాలు బయటకు పోయి బరువు తగ్గుతారనే ప్రచారం సోషల్ మీడియాలో విపరీతంగా సాగుతోంది. అయితే డిటాక్స్ వాటర్ నిజంగానే బరువు తగ్గిస్తుందా లేక ఇదొక సాధారణ మార్కెటింగ్ భ్రమ మాత్రమేనా అనే అంశంపై ఆరోగ్య నిపుణులు, పోషకాహార నిపుణులు స్పష్టమైన సైంటిఫిక్ నిజాలను వెల్లడిస్తున్నారు. ఎలాంటి నిజాలు దాగి ఉన్నాయో శాస్త్రీయంగా తెలుసుకోవడం ఆరోగ్య స్పృహ ఉన్న ప్రతి ఒక్కరికీ ఎంతో అవసరం. ముందుగా డిటాక్స్ వాటర్ తాగడం వల్ల శరీరంలోని విషపదార్థాలు లేదా టాక్సిన్లు దానంతట అవే బయటకు వెళ్తాయని అనుకోవడం ఒక పెద్ద పొరపాటు. మన మానవ శరీరంలో కాలేయం (లివర్) మరియు మూత్రపిండాలు (కిడ్నీలు) నిరంతరం పనిచేస్తూ వ్యర్థాలను బయటకు పంపే అద్భుతమైన సహజ సిద్ధమైన వ్యవస్థను కలిగి ఉన్నాయి. దీనికోసం ప్రత్యేకంగా ఎలాంటి డిటాక్స్ పానీయాలు తాగాల్సిన అవసరం లేదు. అయినప్పటికీ, క్రమం తప్పకుండా డిటాక్స్ వాటర్ తీసుకోవడం వల్ల శరీరానికి ఒక ప్రధానమైన మేలు జరుగుతుంది. అది నీటి శాతాన్ని పెంచడం లేదా హైడ్రేషన్‌గా ఉంచడం. సాధారణ నీటిని సరిగా తాగలేని వారు, పండ్లు మరియు మూలికల సువాసన ఉన్న ఈ నీటిని రుచికరంగా భావించి ఎక్కువ మొత్తంలో తాగుతారు. శరీరం సరిగ్గా హైడ్రేట్ అయినప్పుడు మెటబాలిజం అంటే జీవక్రియ రేటు స్వల్పంగా మెరుగుపడుతుంది, ఇది పరోక్షంగా కేలరీలను వేగంగా ఖర్చు చేయడానికి తోడ్పడుతుంది. డిటాక్స్ వాటర్‌లో వేసే నిమ్మకాయ, పుదీనా, అల్లం వంటి పదార్థాల వల్ల నీటికి విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు మరియు శోథ నిరోధక (యాంటీ ఇన్‌ఫ్లమేటరీ) గుణాలు లభిస్తాయి. ఇవి జీర్ణ వ్యవస్థను మెరుగుపరచడానికి, కడుపు ఉబ్బరం తగ్గించడానికి మరియు రోగనిరోధక శక్తిని పెంచడానికి కొంతవరకు సహాయపడతాయి. ముఖ్యంగా భోజనానికి ముందు తగినంత నీరు తాగడం వల్ల పొట్ట నిండిన భావన కలిగి, ఆహారం తక్కువగా తింటారు. దీనివల్ల క్యాలరీల గ్రహంపు తగ్గి బరువు నియంత్రణలో ఉంటుంది. అంతే తప్ప, కేవలం ఈ నీరు తాగడం వల్లే పొట్టలోని కొవ్వు కరిగిపోతుందని భావించడం శాస్త్రీయంగా నిరూపించబడలేదు. నిలకడైన బరువు తగ్గుదల అనేది సరైన పోషకాహారం, శారీరక వ్యాయామంపై ఆధారపడి ఉంటుంది.       Detox drinks benefits and side effects guide, scientific truth about belly fat detox water.
థైరాయిడ్ సమస్యలు ఉన్నవారు ఆహారం, జీవనశైలిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. ఈ వీడియోలో డాక్టర్ చిట్టిబొట్ల మధుసూదన్ శర్మ సూచించిన ఆయుర్వేద చిట్కా గురించి వివరంగా తెలుసుకుందాం. ట్రికట చూర్ణం, ధనియాల పొడి, పసుపు పొడి వంటి మూడు పదార్థాలను సరైన మోతాదులో ఎలా కలపాలి? ఎంత మోతాదులో తీసుకోవాలి? రోజులో ఏ సమయంలో తీసుకుంటే మంచిది? వంటి విషయాలను ఈ వీడియోలో సులభంగా వివరించారు. థైరాయిడ్‌కు సంబంధించిన సమస్యల్లో ఇంటి చిట్కాలను పాటించే ముందు వైద్యుల సలహా తీసుకోవడం ముఖ్యం. ఇప్పటికే థైరాయిడ్ మందులు వాడుతున్నవారు వైద్యుల సూచన లేకుండా మందులను ఆపకండి లేదా మార్చకండి. థైరాయిడ్ ఆరోగ్యం, ఆయుర్వేద చిట్కాలు, ఆరోగ్యకరమైన జీవనశైలికి సంబంధించిన మరిన్ని ఉపయోగకరమైన వీడియోల కోసం TeluguOne Health‌ను ఫాలో అవ్వండి. Disclaimer: ఈ వీడియోలోని సమాచారం సాధారణ అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య సలహాకు ప్రత్యామ్నాయం కాదు.  
అన్ని జీవరాశులకు ఆహారమే శక్తినవనరు. అయితే మనిషికి మాత్రం ఆహారంలో ఎన్నో ఛాయిస్ లు ఉన్నాయి. కానీ  ఏది పడితే అది, ఎలా పడితే అలా తినడం వల్ల ఆరోగ్యం పాడవుతుంది. కొందరు అనారోగ్యం చేసినప్పుడు లేదా కొన్ని రకాల ట్రీట్మెంట్ లలో ఉన్నప్పుడు పత్యం చేయమని చెబుతారు.   పత్యం ఆహారంలో ఉన్నప్పుడు వంకాయను తినకూడదని చెబుతూ ఉంటారు.  సాధారణంగా  సాంప్రదాయ ఆయుర్వేదం, నాటు వైద్యంలో కొన్నిరకాల అనారోగ్య సమస్యలతో ఉన్నవారికి వంకాయ తినకూడదని సిఫారసు చేస్తారు.  సాధారణ రోజుల్లో వంకాయ రుచికరమైన, పోషకాలున్న కూరగాయ అయినప్పటికీ, పత్యం వేళల్లో దీనిని మినహాయించడానికి అనేక కారణాలు ఉన్నాయి. వంకాయను పత్యం ఉన్నప్పుడు ఎందుకు తీసుకోకూడదో వివరంగా తెలుసుకుంటే.. వంకాయ.. వంకాయను ఆయుర్వేదంలో వాత, పిత్త దోషాలను పెంచే ఆహారంగా పరిగణిస్తారు. శరీరంలో వ్యాధి నిరోధక శక్తి తగ్గి ఉన్నప్పుడు లేదా రోగ నివారణకు పత్యం ఉంటున్నప్పుడు వంకాయ తింటే వాత దోషం పెరిగి నొప్పులు, జాయింట్లలో ఇబ్బందులు వస్తాయి. వంకాయ విత్తనాల్లో , తోలులో కొన్ని రకాల సహజ కాంపౌండ్లు ఉంటాయి. ఇవి సున్నితమైన చర్మం ఉన్నవారిలో, లేదా ఇప్పటికే దద్దుర్లు, దురదలు, అలర్జీలతో బాధపడుతున్న వారిలో సమస్యను మరింత తీవ్రం చేస్తాయి. ఔషధాల ప్రభావం సరిగ్గా పనిచేయాలన్నా చర్మ సంబంధిత పత్యంలో వంకాయకు దూరంగా ఉండాలి. వంకాయ అరుగుదలకు కాస్త సమయం తీసుకుంటుంది. శరీరంలో అనారోగ్యం ఉన్నప్పుడు జీర్ణక్రియ మందగిస్తుంది. అటువంటి సమయంలో సులభంగా అరగని వంకాయను తీసుకోవడం వల్ల గ్యాస్, కడుపు ఉబ్బరం, అజీర్తి వంటి సమస్యలు తలెత్తుతాయి. శరీరంలో ఎక్కడైనా గాయాలు, పుండ్లు ఉన్నప్పుడు లేదా శస్త్రచికిత్సలు జరిగినప్పుడు నాటు వైద్యంలో ప్రత్యేక పత్యం సూచిస్తారు. వంకాయ శరీరంలో వేడిని,   దురదను పెంచి పుండ్లు త్వరగా మానకుండా అడ్డుకుంటుందని చెప్తారు. వంకాయ సోలనేసి కుటుంబానికి చెందిన కూరగాయ. ఇందులో సోలనైన్ అనే కాంపౌండ్ ఉంటుంది. సాధారణ ఆరోగ్యంతో ఉన్నవారికి ఇది పెద్దగా ఇబ్బంది కలిగించకపోయినా, పత్యం చేసేవారిలో , మందులు వాడేవారిలో ఇది జీర్ణ వ్యవస్థపై , నాడీ వ్యవస్థపై స్వల్ప ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. ఈ కారణాల వల్లనే పత్యం సమయంలో శరీరం త్వరగా కోలుకోవడానికి, ఔషధాలు ఎలాంటి సమస్య లేకుండా పనిచేయడానికి వంకాయకు దూరంగా ఉండాలని పెద్దలు , ఆయుర్వేద వైద్యులు సలహా ఇస్తారు. పత్యం పూర్తయి శరీరం పూర్తి ఆరోగ్యాన్ని పుంజుకున్న తర్వాతే వంకాయను ఆహారంలో తిరిగి చేర్చుకోవడం మంచిది.                          *రూపశ్రీ.
నేటి డిజిటల్ యుగంలో ఆరోగ్య స్పృహ, ఫిట్‌నెస్ పట్ల శ్రద్ద పెరిగాయి. జిమ్‌లకు వెళ్లేవారు, బరువు తగ్గాలనుకునేవారు లేదా కండరాల పుష్టి కోసం ప్రయత్నం చేసేవారు ప్రోటీన్ షేక్స్, హెల్త్ సప్లిమెంట్లు, డిజైనర్ ప్రోటీన్ బార్ల వైపే ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. కానీ, మన తాతల తండ్రుల కాలంలో ఎలాంటి ప్రొటీన్ పౌడర్లు ఉండేవి కావు. అయినా వారు ఎంతో బలంగా, శక్తివంతంగా, దీర్ఘకాలిక ఆరోగ్యంతో జీవించారు. దానికి కారణం వారు రోజూ తీసుకునే సంప్రదాయ భారతీయ ఆహారమే! మన ప్రాంతీయ వాతావరణం, రుతుపవనాలు , పాతకాలపు వంట పద్ధతుల ఆధారంగా మన పళ్లెంలో చేరే రోజూవారీ ఆహారంలో ప్రోటీన్లు పుష్కలంగా లభించేవి. ఆధునిక ఆహార అలవాట్ల వల్ల కాలక్రమేణా మనం మరచిపోయిన, కానీ మన తాతల కాలంలో క్రమం తప్పకుండా తిన్న 10 శక్తివంతమైన ప్రోటీన్ ఆహారాలు ఉన్నాయి.  నిజానికి ఇవన్నీ ప్రోటీన్ సూపర్ ఫుడ్స్.. అవేంటో తెలుసుకుంటే..  ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం:  ఉలవలు.. ఒకప్పుడు పల్లెల్లో ప్రతి ఇంట్లో క్రమం తప్పకుండా వాడే ధాన్యాల్లో ఉలవలు ముఖ్యమైనవి. శాకాహారంలో ప్రోటీన్ అత్యధికంగా లభించే ఆహారాల్లో ఇది ఒకటి. మన తాతలు రోజంతా కష్టపడి పనిచేయడానికి అవసరమైన శక్తిని ఈ ఉలవలే ఇచ్చేవి. ఉలవ చారు, ఉలవ పప్పు, చట్నీలు లేదా గుగ్గిళ్ల  రూపంలో వీటిని తీసుకునేవారు. ప్రోటీన్‌తో పాటు ఇందులో ఐరన్, పీచు పదార్థం , యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి కిడ్నీ రాళ్లను నివారించడంలోనూ, శరీరంలో కొవ్వును తగ్గించడంలోనూ అద్భుతంగా పనిచేస్తాయి. సత్తు పిండి.. ఇది శనగలను వేయించి, మెత్తగా పొడి చేసి తయారుచేసే సంప్రదాయ ఆహారం. ప్రోటీన్ షేక్స్‌కు ఇది పూర్వీకుల కాలం నాటి దేశీ వెర్షన్ అని చెప్పవచ్చు. వేసవికాలంలో సత్తు పిండిని నీళ్లు, నిమ్మరసం, మసాలాలతో కలిపి  తాగేందుకు వాడేవారు. ఇది శరీరానికి తక్షణ శక్తిని ఇవ్వడమే కాకుండా, కడుపు నిండిన భావనను కలిగిస్తుంది. నాణ్యమైన ప్రోటీన్ , ఫైబర్ ఉన్న సత్తు రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది. నల్ల శనగలు.. ఈ రోజుల్లో తెల్ల శనగలు వాడకం పెరిగినప్పటికీ, పూర్వకాలంలో నల్ల శనగలదే హవా రాత్రంతా నానబెట్టి, ఉదయాన్నే గుడాలుగా  తినడం లేదా కూరల్లో వాడటం చేసేవారు. ప్రయాణాలు చేసేటప్పుడు కూడా వేయించిన నల్ల శనగలను తీసుకెళ్లేవారు. ఇవి త్వరగా పాడవవు, తింటే కడుపు నిండుగా ఉంటుంది. ఇవి ప్లాంట్ బేస్డ్   ప్రోటీన్‌తో పాటు ఐరన్‌ను సమృద్ధిగా అందిస్తాయి.  బొబ్బర్లు / అలసందలు.. బొబ్బర్లు లేదా అలసందలు ఒకప్పుడు ప్రతీ ఇంట్లోనూ రెగ్యులర్‌గా వండే కూర ధాన్యం. వీటిలో అత్యధిక మోతాదులో ప్రోటీన్, ఫైబర్, ఫోలేట్ , ఐరన్ ఉంటాయి. నాటు దినుసులు , మసాలాలతో నెమ్మదిగా ఉడికించి చేసే బొబ్బర్ల కూర లేదా గుడాలు శరీరానికి మంచి బలాన్ని ఇస్తాయి. జీర్ణక్రియను మెరుగుపరచడానికి ఇవి ఎంతగానో తోడ్పడతాయి. మట్కీ / మోత్ బీన్స్.. రాజస్థాన్ వంటి పొడి వాతావరణం కలిగిన ప్రాంతాలలో ఎక్కువగా పండే మట్కీ లేదా మోత్ బీన్స్ చిన్నగా ఉన్నప్పటికీ పోషకాల గని. ఇవి చూడటానికి పెసల సైజ్ లో ఉంటాయి. కానీ వీటి రంగు మాత్రం భిన్నంగా ఉంటుంది.  తక్కువ నీటితో పండే ఈ పంట రైతులకు, ప్రజలకు ప్రధాన ప్రోటీన్ మూలంగా ఉండేది. వీటిని మొలకలెత్తించి తినడం లేదా కారంగా కూర వండుకోవడం చేసేవారు. ధాన్యాలను మొలకెత్తించడం వల్ల వాటిలోని ప్రోటీన్ , ఇతర పోషకాలను శరీరం సులభంగా గ్రహిస్తుందని మన పూర్వీకులకు ముందే తెలుసు. మినపప్పు.. నేడు మినపప్పును కేవలం ఇడ్లీ, దోస పిండి లేదా పోపులకే పరిమితం చేశాం. కానీ, పూర్వకాలంలో మినపప్పుతో వడలు, మినప రొట్టెలు, మినప సున్నుండలు వంటి బలమైన పదార్థాలు తయారుచేసి తినేవారు. మినపప్పులో ప్రోటీన్‌తో పాటు క్యాల్షియం, పొటాషియం, ఐరన్ మెండుగా ఉంటాయి. బియ్యం లేదా తృణధాన్యాలతో కలిపి మినపప్పును తిన్నప్పుడు అది శరీరానికి పూర్తిస్థాయి ప్రోటీన్‌ను అందిస్తుంది.  ఇంట్లోనే తయారుచేసిన తాజా పనీర్.. పాకెట్లలో లభించే ప్యాక్ చేసిన పనీర్ కాకుండా, మన అమ్మమ్మలు గేదె లేదా ఆవు పాల నుంచి తాజా నిమ్మరసం పిండి పనీర్ తయారు చేసేవారు. ఈ తాజా పనీర్‌లో ఎలాంటి రసాయనాలు ఉండవు. ఇది నాణ్యమైన ప్రోటీన్ , క్యాల్షియంను ఉచితంగా శరీరానికి అందిస్తుంది. ఎముకల గట్టితనానికి, కండరాల పునరుద్ధరణకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది.  వేయించిన వేరుశనగలు..   నట్స్ అనగానే ఈ రోజుల్లో బాదం, జీడిపప్పు, పిస్తా గుర్తుకొస్తాయి. కానీ పేదవాడి బాదం పప్పు అయిన వేరుశనగలు పోషకాల్లో దేనికీ తీసిపోవు. సాయంత్రం పూట తినుబండారంగా, లేదా బెల్లంతో కలిపి పల్లీ పట్టీ రూపంలో పూర్వీకులు వీటిని రోజూ తినేవారు. వేరుశనగల్లో ప్రోటీన్‌తో పాటు ఆరోగ్యకరమైన కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. రాజగిరా / అమరాంత్ గింజలు.. రాజగిరాను  ఉపవాసాల సమయంలో ఎక్కువగా తింటుంటారు. కానీ పూర్వకాలంలో దీన్ని రోజూ ఆహారంలో భాగం చేసుకునేవారు. రాజగిరా గింజల్లో శరీరం స్వయంగా తయారుచేసుకోలేని 9 రకాల అమైనో ఆమ్లాలు ఉంటాయి. ఇది సంపూర్ణ ప్రోటీన్ కలిగిన అతికొద్ది వృక్షాహారాలలో ఒకటి. రాజగిరా లాడ్డు, జావ, రొట్టెల రూపంలో  తీసుకోవడం వల్ల ఎముకలు గట్టిపడతాయి. నువ్వులు .. పరిమాణంలో చిన్నవిగా ఉన్నప్పటికీ నువ్వులలో ఉండే పోషకాలు అపారం. నువ్వుల పొడి, నువ్వుల చట్నీ, నువ్వుల ఉండలు మన సంప్రదాయ ఆహారంలో భాగం. నువ్వులలో కేవలం క్యాల్షియం, మంచి కొవ్వులే కాకుండా విలువైన ప్రోటీన్ కూడా ఉంటుంది. నువ్వులను రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం వల్ల కండరాలు బలంగా మారడమే కాకుండా చర్మం, జుట్టు ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఫిట్‌నెస్ అంటే విదేశీ ఆహార అలవాట్లను లేదా ప్యాక్ చేసిన హెల్త్ పౌడర్లను గ్రైండ్ చేయడం కాదు. మన ఇంట్లోనే, మన పూర్వీకులు తిన్న సంప్రదాయ ధాన్యాలు , పప్పు దినుసులలోనే శరీరానికి అవసరమైన అసలైన బలం దాగి ఉంది.  దైనందిన ఆహారంలో మళ్లీ ఈ పాతకాలపు ఆహారాలను భాగం చేసుకుంటే ఆరోగ్యకరమైన శరీరం లభిస్తుంది.